ఫిజిక్స్.... ప్రతి అంశమూ ప్రధానమే
ఈ విభాగంలో 6-10 తరగతుల సామాన్య శాస్త్రం నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో జీవ శాస్త్రం, వృక్ష శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయనశాస్త్రం.. ఇలా నాలుగు భాగాల నుంచి ప్రశ్నలు అడగొచ్చు. పైన సూచించిన అంశాల నుంచి నిత్య జీవిత వినియోగానికి అన్వయించే ఆధారంగా ప్రశ్నలు అడగొచ్చు.
1. ఇంట్లో ఉపయోగించే సాధారణ ఉప్పు రసాయన నామం?
1) సోడియం కార్బోనేట్
2) సోడియం బైకార్బోనేట్
3) సోడియం క్లోరైడ్
4) సోడియం హైడ్రాక్సైడ్
సమాధానం: 3
2. ఇళ్లలోని విద్యుత్ పరికరాలను ఏ సంధానంలో కలుపుతారు?
1) శ్రేణి సంధానం 2) సమాంతరం సంధానం
3) లూప్ 4) విడివిడిగా
సమాధానం: 1
3. రోడ్డుపై ఎండమావి కనిపించటంలో దాగి ఉన్న దృగ్విషయం?
1) వక్రీభవనం 2) పరావర్తనం
3) సంపూర్ణాంతర పరావర్తనం
4) సందిగ్ధ కోణం
సమాధానం: 3
4. చింతపండు రసం, మిథైల్ ఆరెంజ్ సూచికలో ఏర్పడే రంగు?
1) పసుపు 2) పింక్
3) ఎరుపు 4) రంగు మారదు
సమాధానం: 3
5. గాలిలో ధ్వని తరంగాలు ----- తరంగాలు?
1) అనుధైర్ఘ్య 2) తిర్యక్
3) స్థిర 4) తిరోగామి
సమాధానం: 1
ఏ మేరకు చదవాలంటే..
సిలబస్‌లోని అంశాలను మొత్తంగా కాకుండా వాటి ప్రాధాన్యత మేరకు ప్రిపరేషన్ సాగించడం ప్రయోజనకరం. తద్వారా ఈ విభాగంలో మెరుగైన స్కోర్ సాధించవచ్చు. ఈ క్రమంలో అంశాల వారీగా దృష్టి సారించాల్సిన ముఖ్యాంశాలు..
ధ్వని:
ధ్వని ఉత్పాదన, ధ్వని ప్రసరణ, అనుదైర్ఘ్య తరంగాలు, తిర్యక్ తరంగాలు, గాలిలో ధ్వని వేగం, సోనార్, ధ్వని లక్షణాలు (పిచ్, తరచు దనం, కీచు దనం), ధ్వని పరావర్తనం.
కాంతి:
కాంతి స్వభావాన్ని వివరించే సిద్ధాంతాలు (న్యూటన్ సిద్ధాంతం, హైగెన్ సిద్ధాంతం), కాంతి పరావర్తనం, పరావర్తన నియమాలు, దర్పణాల్లో పరావర్తనం, దర్పణంలో ప్రతిబింబం ఏర్పడే విధానం (సమతల గోళాకార దర్పణాలు), వక్రీభవనం, కటకాలు, కటకాలలో ప్రతిబింబం ఏర్పడే విధానం, దృష్ట్టి దోషాలు- వాటి సవరణ, కాంతి విక్షేపణం, కాంతి పరిక్షేపణం, లేజర్- ప్రత్యేక లక్షణాలు, లేజర్ ఉత్పత్తిలోని దశలు, లేజర్ ఉపయోగాలు.
విద్యుత్:
విద్యుత్ వలయం, ఓమ్ నియమం, నిరోధ నియమాలు, నిరోధాల శ్రేణి, సమాంతర సంధానాలు, సాధారణ విద్యుత్ వలయాలు, విద్యుత్ సామర్థ్యం, ఇళ్లలో విద్యుత్‌ను కొలవడం. విద్యుదయస్కాంతత్వం, ఫారడే నియమాలు, విద్యుత్ మోటారు, జనరేటర్.
అయస్కాంతత్వం:
అయస్కాంతాల్లోని రకాలు, అయస్కాంత బలరేఖలు, అయస్కాంత క్షేత్రం, డయా, పారా, ఫెర్రో అయస్కాంతత్వం.
రేడియో ధార్మికత:
రేడియో ధార్మిక వికిరణం, ఆల్ఫా, బీటా, గామా వికిరణాల లక్షణాలు, కృత్రిమ రేడియో ధార్మికత, కృత్రిమ రేడియో ధార్మిక మూలకాలు ఉపయోగాలు.
ఎలక్ట్రానిక్స్:
విద్యుత్ అర్ధ వాహకాలు, స్వభావజ, అస్వభావజ అర్థ వాహకాలు, ఞృ జంక్షన్, జంక్షన్ డయోడ్ ధర్మాలు, ఉపయోగాలు, ట్రాన్సిస్టర్ - ధర్మాలు- ఉపయోగాలు
కంప్యూటర్:
కంప్యూటర్ చరిత్ర, ఇన్‌పుట్, అవుట్‌పుట్, ఉన్నత స్థాయి భాషలు, కంప్యూటర్ పనితీరు - ఉపయోగాలు.
పరమాణు నిర్మాణం:
రూదర్ ఫర్‌డ నమూనా, బోర్ నమూనా, ఆధునిక క్వాంటమ్ సిద్ధాంతం ఆధారంగా పరమాణు నిర్మాణం, ఆర్బిట్, ఆర్బిటాల్, క్వాంటమ్ సంఖ్యలు, ఎలక్ట్రాన్ విన్యాసం.
మూలకాల వర్గీకరణ:
త్రిక సిద్ధాంతం, అష్టక సిద్ధాంతం, మెండలీఫ్ వర్గీకరణ, ఆధునిక ఆవర్తన పట్టిక, పీరియడ్, గ్రూపులలో పరమాణు ధర్మాల ఆవర్తనం.
రసాయన బంధం:
అయానిక బంధం, సమయోజనీయ బంధం, వివిధ అణువుల ఆకృతులు, సంకరీకరణం.
ఆమ్లాలు - క్షారాలు:
ఆమ్లాలు, క్షారాల పరీక్షలు, లోహాలు, అలోహాలతో చర్యలు, తటస్థీకరణం, ్కఏ విలువలు
ద్రావణాలు:
ద్రావణాల్లో రకాలు, గాఢత, మొలారిటీ.
కర్బన రసాయన శాస్త్రం:
కార్బన్ ప్రత్యేక ధర్మాలు, హైడ్రోకార్బన్‌ల వర్గీకరణ - ధర్మాలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, నూనెలు, సబ్బు.
కొన్ని మూలకాల ఖనిజాలు - ఉపయోగాలు
ముఖ్యమైన మూలకాలు, వాటి ఖనిజాలు, లోహ సంగ్రహణ లోని ముఖ్యమైన దశలు - విశ్లేషణ
సన్నద్ధమిలా
ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ కొనసాగించాలంటే ముందుగా 6-10 తరగతుల సామాన్యశాస్త్ర పుస్తకాలు (పాతవి, కొత్తవి) సేకరించాలి. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి గత ప్రశ్నా పత్రాల్లోని బిట్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. ముందుగానే బిట్‌బ్యాంక్స్ పై ఆధారపడకుండా పాఠ్యపుస్తకాలను చదవి సొంతంగా నోట్స్ రాసుకుంటే ఉపయుక్తంగా ఉంటుంది. ఎక్కువ తికమకగా ఉండే అంశాలను కొన్ని విలక్షణ పట్టికల ద్వారా గుర్తుంచుకోవాలి.
భౌతిక, రసాయన శాస్త్రంలో
ముఖ్యమైన టాపిక్స్