మ్యాథ్స్ మూడోరోజూ కష్టంగానే..
ముగిసిన జేఈఈ మెయిన్ తొలిదఫా షెడ్యూల్
వెబ్‌సైట్‌లో తదుపరి పరీక్షల అడ్మిట్ కార్డులు
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవాలంటున్న నిపుణులు
సాక్షి, ఎడ్యుకేషన్ : జేఈఈ–మెయిన్ తొలి దఫా షెడ్యూల్ శుక్రవారం ముగిసింది. మూడోరోజు పేపర్ల సరళిని పరిశీలిస్తే.. మొదటి షిఫ్ట్‌లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ క్లిష్టంగా ఉండడమే కాకుండా ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నాయి. ఫిజిక్స్‌లో ఫార్ములా ఆధారిత ప్రశ్నలు అడిగినప్పటికీ.. మొత్తం సులువుగా ఉండడంతో విద్యార్థులు కాసింత ఉపశమనం చెందారు.
కెమిస్ట్రీ కూడా సులభంగానే ఉంది. మ్యాథమెటిక్స్‌లో 3డి, వెక్టార్స్, ఏరియాస్, సీక్వెన్స్, సిరీస్, కానిక్స్, ఇంటిగ్రల్ కాలిక్యులస్‌ల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ అంశాలకు ప్రాధాన్యం లభించింది.
ఎందులోంచి ఎన్ని ప్రశ్నలు..
తొలి సెషన్‌లో ఫిజిక్స్‌లో మోడ్రన్ ఫిజిక్స్ నుంచి 3 ప్రశ్నలు, రే, వేవ్ ఆప్టిక్స్ నుంచి 2 ప్రశ్నలు.. హీట్ అండ్ థర్మో డైనమిక్స్ నుంచి 2 ప్రశ్నలు, ఎలక్ట్రిసిటీ నుంచి 2 ప్రశ్నలు అడిగారు. మిగతా టాపిక్స్ నుంచి ఒక్కో ప్రశ్న అడిగారు. మ్యాథమెటిక్స్‌లో వెక్టార్స్, 3డి, సిరీస్, ఏరియా, మాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, సెట్స్ రిలేషన్, కానిక్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్, డెఫినిట్ ఇన్‌డెఫినిట్ ఇంటిగ్రేషన్‌ల నుంచి 2 ప్రశ్నలు చొప్పున అడిగారు.
కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్; పిరియాడిక్ క్లాసిఫికేషన్; డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, పి బ్లాక్ ఎలిమెంట్స్, ఆల్డిహైడ్స్ – ఫినాల్–కార్బాక్సిలిక్ యాసిడ్; కోఆరి్డనేట్ కాంపౌండ్‌ల నుంచి 2 ప్రశ్నలు చొప్పున, బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 3 ప్రశ్నలు అడిగారు.
ఉదయంతో పోల్చితే రెండో షిఫ్ట్ క్లిష్టంగా..
ఉదయం షిఫ్ట్‌తో పోల్చితే రెండో షిఫ్ట్ క్లిష్టంగా ఉంది. మ్యాథమెటిక్స్ ఓ మోస్తరు క్లిష్టతతో సుదీర్ఘ ప్రశ్నలతో ఉండగా, ఫిజిక్స్ కూడా క్లిష్టంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. కెమిస్ట్రీ ఓ మాదిరి క్లిష్టతతో ఉంది. కెమిస్ట్రీలో అత్యధిక ప్రశ్నలు ఆర్గానిక్ కెమిస్ట్రీ, కెమికల్ బాండింగ్, కోఆరి్డనేట్ కాంపౌండ్స్, బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, పి–బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి అడిగారు.
మ్యాథమెటిక్స్‌లో ఉదయం మాదిరిగానే టాపిక్స్ ఉన్నాయి. మొత్తం మీద 22 నుంచి 24వ తేదీ వరకు ఆరు షిఫ్ట్‌లలో నిర్వహించిన పరీక్షల్లో ఆరో షిఫ్ట్ ప్రశ్నపత్రం కష్టంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. మొత్తం ఆరు షిఫ్ట్‌లలో మూడు సబ్జెక్ట్‌లలోనూ సిలబస్ పరిధిలో లేనివి మూడు ప్రశ్నల చొప్పున అడిగారు.
వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులు
ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న పరీక్షలు, అదే విధంగా 30వ తేదీన నిర్వహించనున్న పేపర్–2ఎ (బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్); పేపర్–2బి (బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్) పరీక్షల అడ్మిట్ కార్డులను ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను అధ్యయనం చేయాలి
ఈ నెల 28, 29 తేదీల్లో పరీక్షలకు హాజరవనున్న విద్యార్థులు.. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని బేసిక్ కాన్సెప్ట్సŠ, ఫార్ములాలను అధ్యయనం చేయాలి. అలాగే గత ప్రశ్న పత్రాలు ముఖ్యంగా గత నాలుగేళ్ల ప్రశ్న పత్రాలను సాధన చేయాలి. ఇప్పటివరకు వచ్చిన ప్రశ్నలు చూస్తే..యావరేజ్ స్టూడెంట్స్ 40, 45 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే విధంగా ఉన్నాయి.
దీంతో ఎన్‌ఐటీ లేదా ట్రిపుల్ ఐటీల్లో సీటు పొందే అవకాశం ఉంది. 100 నుంచి 105 మార్కులు పొందితే అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. గత ఏడాది జనరల్ కటాఫ్ 93 శాతంగా ఉంది. అంటే క్లిష్టమైన, సులభమైన పేపర్ల మధ్య 40 నుంచి 60 మార్కుల వ్యత్యాసం ఉంటుందని గుర్తించాలి. – ఎంఎన్ రావు (జేఈఈ–మెయిన్, అడ్వాన్స్‌డ్ ఫ్యాకల్టీ)
Comments
Please login to add a commentAdd a comment