ఈ నెల 25 వరకు దరఖాస్తుకు గడువు
గుంటూరు ఎడ్యుకేషన్: దేశంలోని ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు అర్హత కోసం ఉద్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2025 రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ ఒకటి నుంచి ఎనిమిదో తేదీ వరకు జరగనున్నాయి. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు షిఫ్ట్‌లలో పరీక్షలు నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్ సెషన్–1 పరీక్షలు గత నెల 30న ముగిశాయి. దీంతో ఏప్రిల్‌లో రెండో సెషన్ పరీక్షల నిర్వహణ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంటర్మీడియెట్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు బీ.టెక్, బీఈ, బీ.ఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు ఫిబ్రవరి 25లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. జేఈఈ మెయిన్ సెషన్–1కు ఎన్‌టీఏ సైట్‌లో రిజి్రస్టేషన్ చేసుకున్న విద్యార్థులు రెండో సెషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు రిజి్రస్టేషన్ నంబరు, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావచ్చు. కోర్సు పేపర్ వివరాలు, ప్రశ్నాపత్రం మీడియం, ఎగ్జామినేషన్ సెంటర్‌ను ఎంపిక చేసుకుని ఫీజు చెల్లించాలి. మొదటి సెషన్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో రిజి్రస్టేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని, ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు ఫారం పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment