బాధ్యత మరిచి బరి తెగించిన ఓ ఉపాధ్యాయుడిని గ్రామస్తులు, విద్యార్థులు కలసి చితకబాదారు.
పెడన(కృష్ణా): బాధ్యత మరిచి బరితెగించిన ఓ ఉపాధ్యాయుడిని గ్రామస్తులు, విద్యార్థులు కలసి చితకబాదారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెడన మండలం నందమూరు గ్రామంలో చోటుచేసుకుంది. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాలీవీ.. పెడన భట్ట జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో ఫిజిక్స్ బోధించే హనుమంతరావు వర్క్‌ఎడ్జస్ట్‌మెంట్‌పై నెల రోజులుగా నందమూరు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో పనిచేస్తునానడు. పాఠశాలలో కొంతమంది బాలికలపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ... అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వారిని కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు.
ఈ వ్యవహారం శృతిమించడంతో శనివారం 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులు విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు వివరించారు. కోపోద్రిక్తులైన బాలికల తలిదండ్రులు గ్రామస్తులతో కలిసి హనుమంతరావును హైస్కూల్ నుంచి బయటకు ఈడ్చుకుంటూ తీసుకొచ్చి దేహశుద్ధి చేశారు. పోలీసులు హనుమంతరావును అదుపులో తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతంపై డీవైఈవో ఎం.గిరికుమారి విచారణ నిర్వహించారు.