hanumantharao
-
నటస్థానం
బాపట్ల అమెరికన్ మిషనరీ వారి ఉపాధ్యాయ శిక్షణ సంస్థకి ఆ పెద్దాయన సైకిల్ మీద వచ్చాడు, ఓ విద్యార్థిని వెతుక్కుంటూ. పేరు– చోరగుడి హనుమంతరావు. ఆనాడు ప్లీడరు గుమస్తాలంతా కలసి నిర్వహిస్తున్న నాటక సంస్థలో హరిశ్చంద్రుడి పాత్ర ధరించేవాడు. మొత్తానికి చిత్రలేఖనం తరగతిలో ఉన్న ఆ అబ్బాయిని పట్టుకుని బయటకు తీసుకొచ్చి ఆ రాత్రి ప్రదర్శించబోయే ‘సత్యహరిశ్చంద్ర’ నాటకం పాసులు నాలుగు చేతిలో పెట్టాడు. ఆపై చావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్పాడు, కొన్ని గంటలలో ప్రదర్శించబోయే ఆ నాటకంలో ఒక వేషం కూడా వెయ్యాలని! ‘ఏ పాత్ర? మాతంగ కన్యా?’ అన్నాడా కుర్రాడు. అదో చిన్న పాత్ర. ‘కాదు, చంద్రమతి’ అన్నాడు హనుమంతరావు. హడలిపోయాడా కుర్రాడు. ఒక్కసారి కూడా ముఖానికి రంగు పూసుకోలేదు. పోర్షన్ కూడా రాదు. ఎలా? వణికిపోయాడు.‘ఏం ఫర్వాలేదు. నీకు పద్యాలన్నీ వచ్చు, అది నాకు తెలుసు. అదే చాలు. మిగతా నేను చూసుకుంటా!’ అని చేతులు పట్టుకున్నంత పని చేశాడాయన. సరేననక తప్పలేదు. వెళ్లిపోతూ ఇంకోమాట కూడా చెప్పారు హనుమంతరావు, ‘ఒరేయ్ నాయనా! నువ్వు రాకపోతే ఊరి పరువుపోతుంది. ఇంక మేం తలెత్తుకోలేం. పైగా ముఖ్యఅతిథులు ఎవరో తెలుసు కదా! తిరుపతి వేంకటకవులు. వారు ప్రతి కళాకారుడినీ ఆశుకవిత్వంతో దీవిస్తారు!’ భయం భయంగా చంద్రమతి పాత్ర వేయడానికి కృత్యాద్యవస్థ మీద ఒప్పుకున్న ఆ కుర్రాడు స్థానం నరసింహారావు. అత్యంత నాటకీయంగా రంగస్థల ప్రవేశం చేసిన స్థానం నరసింహారావు (23.9.1902–21.2.1971) తరువాత మహా నటుడయ్యారు. పద్మశ్రీ బిరుదు అందుకున్నారు. ఆయనకు అందమైన ఆకారం గాని, అవయవ సౌష్టవం గాని లేవు. అలా అని అందవికారి మాత్రం కాదు. సన్నగా పొడుగ్గా ఉండేవారు. పెద్ద పెద్ద చెవులు. పొడుగు ముక్కు. కోలముఖం. కానీ మంచి పలువరస. చామనచాయ శరీరం. తనకూ అందం ఉందని తృప్తి పడేవారు, అద్దంలో చూసుకుని. ఆకాలంలో ఫిట్స్ (చిన్నబిడ్డ గుణం అనేవారు) వచ్చిన పిల్లలకి పొగచుట్టతో నుదిటి మీద వాత పెట్టేవారు. అలాంటి మచ్చ జీవితాంతం ఉండిపోయేది. అది కూడా ఉండేది. అలాగే చెవికి పోగు. అది వంశ పారంపర్యంగా వచ్చింది. తాత తగిలించుకున్నదే తరువాత తండ్రి ఇంకొంత బంగారం వేయించి, బాగు చేయించి నరసింహారావుగారి చెవికి పెట్టారట. దీనికి తోడు ‘ముక్కునాదం’. అంటే మాట్లాడితే ముక్కుతో మాట్లాడినట్టు ఉంటుంది. కురచగా కత్తిరించిన జుట్టు, వెనకాల పిలకతో ఉండే ఆ పిల్లవాడిని తోటి పిల్లలు ఆటపట్టించేవారు. అలాంటి ఒక కుర్రవాడు స్త్రీ పాత్ర పోషణకి విఖ్యాతి గాంచాడు. తన ఆకృతితో పాటు ప్రవృత్తితో కూడా పొసగే ఒక బృందం కోసం ఆయన అన్వేషించారు. స్థానం వారికి చిన్నతనం నుంచీ భక్తి మెండు. ఆ క్రమంలో దొరికింది ఒక భజన బృందం. నరాలశెట్టి వెంకయ్య అని ఒక తోటమాలి కొడుకు అందులో ఉండేవాడు. ఊరికి దూరంగా వారి పూలతోటలు ఉండేవి. అందులో కూలిపోతున్న ఓ పాక ఉండేది. ఈ భజన బృందం వెళ్లి ఆ పాకలో భజన చేసుకునే అవకాశం ఇవ్వాలని ఆ తోటమాలిని కోరారు. అంతా కలసి బాగు చేశారు. ప్రతి శనివారం జరిగే ఆ భజనకే సీతారాం బావాజీ అనే ఒక సాధువు తంబురాతో వచ్చేవాడు. అతడి సమక్షంలోనే మొదట రాగయుక్తంగా పాడడానికి, శాస్త్రీయంగా పాడడానికి స్థానం వారి జీవితంలో బీజం పడింది. స్త్రీ పాత్ర విషయంలోనూ అలాగే జరిగింది. ఆయన చిన్నతనంలో కూచిపూడి భాగవతులు వచ్చి బాపట్లలో ప్రదర్శనలు ఇచ్చేవారు. అందులో వెంపటి వెంకటనారాయణ అనే ఆయన భామ వేషం అద్భుతంగా కట్టేవారట. ఆ స్త్రీ వేషం తన మనసులో ఎంతో ఆదరంతో మనసులో నిలిచి పోయి ఉండేదని చెప్పారు. ఈ దృశ్యాలన్నీ అంతిమంగా హఠాత్తుగా రంగస్థల ప్రవేశం చేయడానికి దోహదం చేశాయి. 1921లో బాపట్లలోనే తిరుపతి వేంకటకవులకీ, కొప్పరపు కవులకీ శతావధానం పోటీ జరిగింది. నెగ్గిన తిరుపతి వేంకటకవులని సత్కరించాలని భావించారు. ఆ సందర్భంగా ప్లీడరు గుమస్తాల బృందం చేత సత్య హరిశ్చంద్ర నాటకం వేయించాలని నిర్ణయించారు. ఆహ్వానాలు వెళ్లిపోయాయి. కానీ చంద్రమతి వేషధారి అస్వస్థుడై రాలేకపోతున్నట్టు చివరి నిమిషంలో తెలిసింది. ప్రత్యామ్నాయం ఏదీ సా«ధ్యం కాలేదు. చంద్రమతి పాత్రధారి మరొకరు దొరకలేదు. మరో నాటకం వేద్దామంటే పాత్రధారులంతా లేరు. గుండెల్లో రాయి పడింది. అప్పుడే ఆపద్బాంధవుడిలా స్థానం దొరికాడు చోరగుడి హనుమంతరావుకి. వారి నాటకం రిహార్సల్స్ జరుగుతున్నప్పుడు వెళ్లి కూర్చోవడంతో పద్యాలన్నీ వచ్చేశాయి. ఒకసారి ఎవరూ లేనప్పుడు పాడుకుంటూ ఉంటే హనుమంతరావుగారు విన్నారు. ఆ ధైర్యంతోనే చంద్రమతి వేషం వేయించారు. స్థానం వారికి చిన్నతనంలోనే చిత్రలేఖనం కూడా అబ్బింది. ఆ కళతోనే, వేరే ఒకరి ఇంట రహస్యంగా తన వేషం తనే వేసుకున్నారాయన. చిన్న చిన్న లోపాలు ఉన్నా అరంగేట్రంలోనే తిరుపతి కవుల ఆశీస్సులు అందుకున్నారు స్థానం. కానీ ఇవేమీ తెలియని తల్లి, తండ్రిపోయాకా (తల్లి ఆదెమ్మ, తండ్రి హనుమంతరావు) ఇవేమి ‘అపరబుద్ధులు’ అంటూ కొడుకుని చీదరించుకుంది. చెవులు వెనుక మిగిలిపోయిన రంగు మరింత ఆగ్రహం తెప్పించిందామెకు. దానితో ఇంకెప్పుడూ ముఖానికి రంగు పూసుకోనని హామీ కూడా ఇచ్చేశారాయన. కానీ, ఆ విష్కంభం స్వాతంత్య్రోద్యమ ఘట్టంతో తొలగిపోయింది. దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారి రామదండుకు ఆర్థికసాయం అందించాలనీ, అందుకు మళ్లీ సత్యహరిశ్చంద్ర ప్రదర్శించాలనీ అంతా నిర్ణయించారు. ప్రదర్శన చీరాలలో. కానీ స్థానం వారి తల్లి కొడుకు వేషం వేయడానికి ససేమిరా అన్నారు. చివరికి పెద్ద వకీలును రాయబారిగా పంపించి ఒప్పించారు. ఈసారి పోర్షన్ అంతా చదివి నటించారు. వెయ్యి రూపాయలు వచ్చాయి. గోపాలకృష్ణయ్యగారు కూడా ఎంతో మెచ్చుకున్నారు. కొన్ని మెలకువలు కూడా చెప్పారు. ఈ పరిణామంతో కాబోలు ఇంకొన్ని ప్రదర్శనలు ఇవ్వడానికి స్థానం వారి మాతృమూర్తి కూడా అంగీకరించారు. కొద్దినెలలకే తెలుగు ప్రాంతమంతా తిరిగి నాటకాలు వేయడం మొదలైంది. వరంగల్‌లో ‘కృష్ణలీల’ నాటకంలో యశోద వేషం వేసినందుకు బంగారు పతకం వచ్చింది. ఆయన జీవితంలో పొందిన తొలి స్వర్ణ పతకం ఇదే. అనతికాలంలోనే ఆయన పేరు మారుమోగిపోయింది. కాపురం బాపట్ల నుంచి తెనాలికి మారింది. శ్రీరామవిలాస సభ అనే నాటక సమాజాన్ని స్థాపించి నటననే జీవికగా చేసుకున్నారు. రోషనార (రోషనార నాటకం), తామీనా (రుస్తుం సొహరాబ్ నాటకంలో), సంయుక్త (రాణీ సంయుక్త), శకుంతల (అభిజ్ఞాన శాకుంతలం), సత్యభామ (శ్రీకృష్ణ తులాభారం), చిత్రాంగి (సారంగధర), దేవదేవి (విప్రనారాయణ), కోకిల (కోకిల నాటకం), మల్లమ్మ (బొబ్బిలి), మధురవాణి (కన్యాశుల్కం), అనసూయ (అనసూయ నాటకం), మురాదేవి (చంద్రగుప్త), చింతామణి (చింతామణి), సుభద్ర (వీరాభిమన్య), సరళ (ఛత్రపతి శివాజీ), విద్యాధరి (కాళిదాసు), చండిక (చండిక నాటకం) వంటి పాత్రలు వేశారు. కానీ స్థానం వారంటే రంగస్థలం మీద సత్యభామకు మారురూపమయ్యారు. స్థానం నరసింహారావుగారు నటనను ఒక తపస్సులా భావించారు. ఇదంతా ఆయన స్వీయచరిత్ర ‘నటస్థానం’లో అద్భుతంగా ఆవిష్కరించారు (స్థానం వారి అల్లుడు నేలకంటి వేంకటరమణమూర్తి 1974లో ఈ పుస్తకం ప్రచురించారు). నటులకు ఉండవలసిన లక్షణాలు, దర్శకునికి ఉండవలసిన ప్రత్యేకతలు, రంగస్థల కళాకారులకు ఉండవలసిన నిబద్ధత గురించి ఎన్నో విషయాలు ఆ పుస్తకంలో అద్భుతంగా ఆవిష్కరించారు. అలాగే స్త్రీపాత్రతో ఆయనకు ఎదురైన నమ్మశక్యం కానట్టు ఉండే అనుభవాలు, కొన్ని చేదు అనుభవాలను కూడా ఆయన నమోదు చేశారు. ఇవే కాకుండా తన జీవితంలో తారసిల్లిన అనేక మంది కళాకారుల గురించి స్థానం వివరించారు. ఒకరకంగా 1920వ దశకం నాటి తెలుగు నాటక రంగ చరిత్ర ఆ పుస్తకంలో కనిపిస్తుంది. ముత్తరాజు వెంకటసుబ్బారావుగారు రాసిన శ్రీకృష్ణ తులాభారం నాటకం స్థానం వారి కీర్తిని అజరామరం చేసింది. మాధవపెద్ది వెంకటరామయ్య (కృష్ణుడు), పిల్లలమర్రి సుందరరామయ్య (నారదుడు), వంగర వెంకటసుబ్బయ్య (వసంతకుడు) పాత్రలు వేసేవారు. కృష్ణుడు తన స్వాధీనుడేనని చెప్పే ఒక సందర్భాన్నీ, అందుకు తగిన పాటనీ సత్యభామకు కూర్చడానికి స్థానం చేసిన ఆలోచన ఒక అద్భుతం. మొత్తానికి ఒక పాట ఆయన మనసుకు తట్టింది. ఒకసారి కడప దగ్గర ఈ నాటక బృందం చిన్న ఏరు దాటుతూ ఉండగా, ఒక ఎద్దుల బండి ఇసకలో కూరుకుపోయింది. నటులంతా గెంటుతున్నారు. ఒకరు మాత్రం బద్ధకంగా కూర్చున్నారు. మరొక నటుడు దీనిని స్థానం వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఆ క్షణంలోనే ఆయన సరదాగా ‘మిరజాల గలడా నా యానతి’ అన్నారట. అదే గొప్ప పాటకు ప్రాణం పోసింది. ‘మిరజాలగలడా నా యానతి, వ్రతవిధాన మహిమన్ సత్యాపతి!’ అన్నదే ఆ పాట. విశాఖజిల్లా మాడుగలలో ఒకసారి నాటకం వేశారు– శ్రీకృష్ణ తులాభారం. స్థానం వారు స్టార్ నటులు కాబట్టి ఒక ధనికుల ఇంట వేరే గది ఇచ్చి, అక్కడే వేషధారణ చేసుకుని రావడానికి ఏర్పాట్లు జరిగాయి. వేషం పూర్తయ్యాక ఇక బయలుదేరదామని అనుకుంటూ ఉండగా కరెంటు పోయింది. లోపల ఫ్యాను ఆగిపోయింది. గాలి కోసం అక్కడే ఉన్న పెరట్లో కుర్చీ వేయించుకుని కూర్చున్నారు స్థానం. అప్పుడే కొందరు ముత్తయిదువలు పేరంటం పిలుపుకోసం వచ్చారు. ఇల్లాలికి బొట్టు పెట్టి, అక్కడే కుర్చీలో కూర్చున్న సత్యభామకు కూడా బొట్టు పెట్టి పేరంటానికి పిలిచారు. ఎంతో హాస్యాన్ని పండించే వాస్తవాలను కూడా ఆయన రాశారు. ఒకసారి సురభి వారి బృందంలో సత్యభామ పాత్రధారిణికి ఇబ్బంది రావడంతో స్థానం వారిని తీసుకుని వెళ్లారు. ప్రదర్శన మొదలైంది. సత్యభామ వెళ్లి కృష్ణుడిని కౌగిలించుకోబోతే, కృష్ణుడు అమాంతం తప్పుకుంటున్నాడు. ఇందుకు కారణం ఒక్కటే– ఆ కృష్ణ పాత్రధారి స్త్రీ. కాబట్టి స్థానం వారు వెళ్లి కౌగిలించుకున్నా బెదిరిపొయింది. అలాగే, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో రోషనార నాటక ప్రదర్శనకు కలెక్టర్ అనుమతి నిరాకరించాడు. అందుకు కారణం– ఆ నాటక ప్రదర్శనకు కొందరు ముస్లింలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీనితో గోదావరి దాటి తూర్పుగోదావరిలోని లంకలలో ఆ నాటకం ప్రదర్శించారు. స్థానం వారికి జరిగిన సత్కారాలకు లెక్కలేదు. 1956లో ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదు ఇచ్చింది. రంగూన్లో బంగారు కిరీటంతో అలంకరించారు. ఆనాటి మహా కవులు, రచయితలు అంతా ఆయనను అక్షరాలతో సత్కరించారు. స్థానం వారి ప్రత్యేకతను చరిత్ర విస్మరించలేదు. కన్నతల్లి ఆయనకు పురుష జన్మనిచ్చింది. కళామతల్లి స్త్రీ జన్మనిచ్చింది. - డా. గోపరాజు నారాయణరావు -
ప్రతిపక్షాన్ని ఎందుకు పిలవలేదు: వీహెచ్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రతిపక్ష పార్టీల నేతలను ఎందుకు ఆహ్వానించలేదని ప్రభుత్వాన్ని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ప్రశ్నించారు. ఆదివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగు మహాసభలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఇంటి మహాసభలుగా మార్చేశారని మండిపడ్డారు. తెలంగాణలో ఉన్న ప్రతిపక్షానికి, పక్కరాష్ట్ర ముఖ్యమంత్రికి గౌరవమివ్వని కేసీఆర్ వైఖరి సరికాదన్నారు. అదే పక్కరాష్ట్ర సీఎం పిలిస్తే అమరావతి శంకుస్థాపనకు, మంత్రి పరిటాల సునీత కుమారుడి వివాహానికి వెళ్తారని ఎద్దేవా చేశారు. అందరూ ఆహ్వానితులే అనడం సరికాదని, ప్రతిపక్ష పార్టీలకు ప్రత్యేక ఆహ్వానం పంపడం సమంజసం అని పేర్కొన్నారు. -
వేలానికి జగ్గారెడ్డి బంగారు బ్రాస్ లెట్
హైదరాబాద్ : ఎంపీ హనుమంతరావు బహుకరించిన బంగారు బ్రాస్ లెట్‌ను మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వేలం వేయనున్నారు. వేలం డబ్బులు ఖమ్మం మిర్చి రైతులకు విరాళంగా ఇవ్వనున్నారు. సంగారెడ్డిలో జూన్ 1వ తేదీన జరిగిన తెలంగాణ ప్రజా గర్జన విజయవంతం ఆయిన సందర్బంగా సమావేశ నిర్వాహకులు జగ్గారెడ్డికి, ఎంపీ హనుమంతరావు బంగారు బ్రాస్ లెట్‌ను బహుకరించిన విషయం తెలిసిందే. ఈ బ్రాస్ లెట్‌ను శుక్రవారం సోమాజిగూడా ప్రెస్ క్లబ్లో వేలం వేయనున్నారు. వేలంలో వచ్చిన డబ్బులు ఖమ్మం లో అరెస్ట్ అయిన మిర్చి రైతులకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. -
సాగునీటిరంగ నిపుణుడు హనుమంతరావు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సాగునీటి రంగ నిపుణుడు, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ టి.హనుమంతరావు ఆదివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. పది రోజుల కిందట తీవ్ర జ్వరంతో ఆయన బేగంపేటలోని వివేకానంద ఆస్పత్రిలో చేరారు. చికిత్స జరుగుతున్న సమయంలో గుండెపోటు రావడంతో కన్నుమూశారు. రాష్ట్ర సాగునీటి రంగానికి విశేష సేవలందించడంతో పాటు రాజస్తాన్ సహా వివిధ దేశాల్లోనూ సాగు, తాగునీటి సమస్యలకు హనుమంతరావు పరిష్కారాలు చూపారు. -
అక్షర యోధుడు హనుమంతరావు
-
అక్షర యోధుడు హనుమంతరావు
పంజగుట్ట: అక్షరాన్నే నమ్ముకున్న అత్యుత్తమ పాత్రికేయుడు హనుమంతరావును నవతరం జర్నలిస్టులు ఆదర్శంగా తీసుకోవాలని పలువురు వక్తలు కొనియాడారు. శనివారం సోమాజిగూడలో ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో వయోధిక పాత్రికేయుల సంఘం అధ్యక్షుడు వరదాచారి అధ్యక్షతన సీనియర్ జర్నలిస్టు హనుమంతరావు సంస్మరణ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. హనుమంతరావు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పిం చారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నా రు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ.. హనుమంతరావు ఒక తపస్వి అని కొనియాడారు. సమాజాన్ని ప్రభావితం చేసే ఆర్థికపరమైన విషయాలు నిశితంగా పరిశీలించేవారన్నారు. ఆయన పేరుతో యేటా స్మారకోపన్యాసం ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. నిబద్ధతకు అసలైన గురువు హనుమంతరావు అని పేర్కొన్నారు. అక్రిడిటేషన్ కమిటీలో డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు అందులోనూ మహిళలకు 33 శాతం కోటా ఇచ్చామంటే అది ఆయన స్ఫూర్తితోనే అని, ఆయన మహిళా జర్నలిస్టులకు సొంత ఖర్చుతో అవార్డులు ఇచ్చేవారని గుర్తుచేశారు. ‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ .. రెండు తరాల జర్నలిస్టులకు ఆదర్శప్రాయుడు హనుమంతరావు అని కొనియాడారు. ప్రభుత్వానికి దూరంగా ఉంటూ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపేవారన్నారు. వర్తమాన పరిణామాల నేపథ్యంలో కథనాలు రాసేవారని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఆర్థిక పోకడలు, వైద్యం, ఆరోగ్యంపై ఎన్నో కథనాలు రాశారని గుర్తుచేసుకున్నారు. సమాజాన్ని అన్ని రకాలుగా పరిశీలించి రాసేవారని, కేవలం అక్షరాన్నే నమ్ముకుని జీవితం గడిపిన వ్యక్తి అని కొనియాడారు. హనుమంతరావును కొత్త జర్నలిస్టులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ‘సాక్షి’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ .. జర్నలిస్టు సమాజం గురించి మాట్లాడాలంటే ముందుగా హనుమంతరావు గురించే మాట్లాడాలన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుంటే జాతి, సమాజ హితానికి ఎంతో మంచిదన్నారు. ప్రస్తుతం నోట్ల రద్దుతో ఎంతో నిష్ణాతులైన ఆర్థిక నిపుణులు కూడా రెండు పాయలుగా చీలారని, అదే ఆర్థిక పరిస్థితులపై హనుమంతరావు వ్యాసాలు ఎంతో సరళంగా ఉండేవన్నారు. సమాజహితం కోసం పనిచేసిన వ్యక్తి హనుమంతరావు అని పేర్కొన్నారు. సీనియర్ పాత్రికేయుడు మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ .. హనుమంతరావు వర్ధంతి రోజు ప్రెస్‌క్లబ్‌లో సభ నిర్వహించాలని సూచించారు. నవ తెలంగాణ సంపాదకుడు వీరయ్య మాట్లాడుతూ.. పాత్రికేయ విలువలకే కాదు సమాజ విలువలకు కూడా కట్టుబడిన వ్యక్తి హనుమంతరావు అని చెప్పారు. ఆయన చనిపోయే ముందు కూడా నవతెలంగాణలో వ్యాసం రాశారని గుర్తుచేసుకున్నారు. హన్మంతరావు కుమారుడు, సీనియర్ జర్నలిస్టు సతీష్ మాట్లాడుతూ .. నాన్న బతికున్న సమయంలో అంత్యక్రియలు నిర్వహించవద్దని చెప్పేవారని, గాంధీ మెడికల్ కాలేజీకి తన భౌతికకాయాన్ని ఇవ్వాలని కోరేవారని, ఆయన అభిప్రాయాన్ని గౌరవించామన్నారు. ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తామని తెలిపారు. ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ .. ప్రెస్‌క్లబ్ వ్యవస్థాపక సభ్యుడైన హనుమంతరావు ఆశయాలను ముందు కు తీసుకువెళతామని, ప్రతీ సంవత్సరం ఆయన మెమోరియల్ స్పీచ్‌ను ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హనుమంతరావు అర్ధాంగి సరళ, కొడుకు చలపతిరావు, సతీష్‌బాబు, కోడళ్లు రమ, మాధురి, కూతురు పద్మ, సీనియర్ జర్నలిస్టులు జ్వాలా నర్సింహారావు, తెలకపల్లి రవి, పాశం యాదగిరి, నగేశ్ కుమార్, లక్ష్మి, బండారి శ్రీనివాస్, రాధాకృష్ణ, వేణుగోపాల్, గాయత్రి, రాజమౌళి చారి తదితరులు పాల్గొన్నారు. -
గాంధీ, నెహ్రూలను కించపర్చొద్దు: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ను తక్కువ చేసి మాట్లాడటం ప్రధాని మోదీకి సరికాదని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు అన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గుజరాత్‌కు చెంది న వ్యక్తి కావడం వల్లనే పటేల్‌ను ప్రధాని కానివ్వలేదని మోదీ ఆరోపించడం సరికాదన్నారు. నెహ్రూ అనుభవాన్ని, దార్శనికతను గమనించిన తర్వాతనే ప్రధానిగా చేయడానికి గాంధీ సిద్ధపడ్డారన్నారు. -
అందుబాటు ధరల్లో ఆర్ట్
సాక్షి, వీకెండ్ ప్రతినిధి: ఆర్ట్‌పీస్ అనగానే అత్యంత ఖరీదైనవి మాత్రమేనని నిరాశపడే కళాభిమానులకు కొదవలేదు. ఈ నేపథ్యంలో చిత్రాలను అందరికీ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో బంజారాహిల్స్‌లోని గ్యాలరీ స్పేస్‌లో శనివారం ‘అఫర్డబుల్ ఆర్ట్’ షో ప్రారంభించారు. ప్రసిద్ధ చిత్రకారులు లక్ష్మాగౌడ్, ఏలె లక్ష్మణ్, జేఎంఎస్ మణి, రమేశ్ గుర్జాల, ఆనంద్ పంచాల్ తదితరుల చిత్రాలను అందుబాటులో ఉంచిన్నట్లు గ్యాలరీ స్పేస్ డైరెక్టర్ టి.హనుమంతరావు తెలిపారు. ప్రదర్శన ఈ నెలాఖరు వరకు కొనసాగుతుంది. -
పవన్‌కల్యాణ్ మద్దతుతోనే చంద్రబాబు సీఎం
సాక్షి, తిరుమల: సినీనటుడు పవన్‌కల్యాణ్ మద్దతుతోనే చంద్రబాబు మరోసారి సీఎం అయ్యారని కాంగ్రెస్‌పార్టీ రాజ్యసభ సభ్యుడు వీ. హనుమంతరావు అన్నారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో 28శాతం జనాభా ఉన్న కాపులకు అధికారం ఎందుకు రాకూడదు? అని అన్నారు. ఇప్పటికే రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు రాష్ట్రాన్ని పాలించాయని, కాపులు కూడా ఎందుకు అధికార పగ్గాలు చేపట్టకూడదు? అని జనంలో ఉందన్నారు. బ్రిటీషు హయాంలో బీసీలుగా ఉండే కాపులను, ఇచ్చిన హామీ మేరకు టీటీడీ ప్రభుత్వం తిరిగి బీసీలు గుర్తించేందుకు చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు. 2019లో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్‌పార్టీ ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తోందని, పార్టీని వీడిన నేతలు, జనాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటంతోపాటు విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను నెరవేర్చేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కషి చేయాలన్నారు. -
‘కాపు రిజర్వేషన్లపై పవన్ నోరు విప్పాలి’
సాక్షి, హైదరాబాద్: కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఉద్యమంలో పవన్ కల్యాణ్ పాల్గొనాలని కాంగ్రెస్ రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీకి సన్నిహితుడైన పవన్ కల్యాణ్ కాపుల రిజర్వేషన్లపై తక్షణం స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కాపునాడు బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీహెచ్‌తోపాటు పలువురు కాపు నేతలు మాట్లాడారు. కాపు ఉద్యమకారులపై కేసులు ఎత్తేయాలని, ముద్రగడకు ఏదైనా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అద్దేపల్లి శ్రీధర్, గాళ్ల సుబ్రహ్మణ్యం నాయుడు, రామిశెట్టి సుబ్బారావు, కఠారి అప్పారావు, పెదకాపు తదితరులు హెచ్చరించారు. -
కీచక టీచర్ వీపు విమానం మోత మోగింది..
పెడన(కృష్ణా): బాధ్యత మరిచి బరితెగించిన ఓ ఉపాధ్యాయుడిని గ్రామస్తులు, విద్యార్థులు కలసి చితకబాదారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెడన మండలం నందమూరు గ్రామంలో చోటుచేసుకుంది. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాలీవీ.. పెడన భట్ట జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో ఫిజిక్స్ బోధించే హనుమంతరావు వర్క్ఎడ్జస్ట్మెంట్పై నెల రోజులుగా నందమూరు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో పనిచేస్తునానడు. పాఠశాలలో కొంతమంది బాలికలపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ... అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వారిని కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. ఈ వ్యవహారం శృతిమించడంతో శనివారం 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులు విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు వివరించారు. కోపోద్రిక్తులైన బాలికల తలిదండ్రులు గ్రామస్తులతో కలిసి హనుమంతరావును హైస్కూల్ నుంచి బయటకు ఈడ్చుకుంటూ తీసుకొచ్చి దేహశుద్ధి చేశారు. పోలీసులు హనుమంతరావును అదుపులో తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతంపై డీవైఈవో ఎం.గిరికుమారి విచారణ నిర్వహించారు. -
హెచ్సీయూకు నేడు మల్లికార్జున ఖర్గే
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం హెచ్సీయూకు రానున్నారు. రోహిత్ కుటుంబాన్ని పరామర్శించడానికి, సస్పెన్షన్‌కు గురైన విద్యార్థులకు మద్దతు తెలపడానికి ఖర్గే వస్తున్నట్టుగా రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారని, విద్యార్థులతో మాట్లాడిన తర్వాత బెంగ ళూరు వెళ్తారని వివరించారు. -
‘మురుగు’ నీటి బొట్టుని.. ఒడిసిపట్టు!
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న నీటి అవసరాలు.. తగ్గుతున్న వనరుల కారణంగా భవిష్యత్తులో పొంచిఉన్న నీటి ఎద్దడి ముప్పును ఎదుర్కొనేందుకు ‘మురుగు నీటి శుద్ధి’కి అత్యంత ప్రాధాన్యమివ్వాల్సి ఉందని నీటి పారుదల రంగ నిపుణుడు, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ టి.హనుమంతరావు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. వ్యక్తిగత వినియోగం, ఉత్పాదక, ఇంధన రంగాల్లో పెరిగిన డిమాండ్, సాగు అవసరాలకు ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యం దృష్ట్యా నీటి వినియోగంలో గణనీయ మార్పులు అవసరమన్నారు. ఇందులో భాగంగా మురుగు నీటి లభ్యతను వినియోగంలోకి తేవాలని స్పష్టం చేస్తున్నారు. పట్టణాలకు మంచి నీటి సరఫరాలో ఇస్తున్న ప్రాధాన్యతనే మురుగునీటి శుద్ధికి ఇవ్వాలని, ఈ నీటి వినియోగా న్ని సాగునీటి రంగానికి ముడిపెడితే మెరుగైన ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ప్రస్తు తం ప్రపంచవ్యాప్తంగా పెరిగిన భూతాపం, భూగర్భ జలాల తగ్గుదల తీవ్రమవుతున్న నేపథ్యంలో మురుగు జల శుద్ధిపై హనుమంతరావు ప్రభుత్వాలకు పలు కీలక సూచనలు చేస్తున్నారు. అవి ఆయన మాటల్లోనే.. మురుగు నీరు అమూల్యమే.. పట్టణాలకు మంచినీటి సరఫరా చేసినప్పుడు అందులో 80 శాతం మురుగు నీటి లభ్యత ఉంటోంది. ఈ నీరు అమూల్యమే. ఈ మురుగు జలాన్ని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి ఆ నీటిని నీటిపారుదల ప్రాజెక్టులుగా మలుచుకుని వ్యవసాయం చేయవచ్చు. హైదరాబాద్‌నే తీసుకుంటే ప్రస్తుత ం తాగునీటి అవసరాల కోసం తరలిస్తున్న నీటిలో 18 టీఎంసీల మేర మురుగు ద్వారా లభిస్తోంది. దీనికి కొత్తగా కృష్ణా ఫేజ్-3(5 టీఎంసీలు), గోదావరి ఫేజ్-1(10 టీఎంసీ) ద్వారా మొత్తంగా 15 టీఎంసీల నీటిని తరలించే ప్రక్రియ జరుగుతోంది. ఈ నీటిలో 80 శాతం అంటే 12 టీఎంసీలు మురుగు నీటిగా లభ్యమయ్యే అవకాశం ఉంది. అంటే ఒక్క హైదరాబాద్‌లోనే 30 టీఎంసీల మురుగు నీటి లభ్యత ఉంది. దీనికి అదనంగా గోదావరి ఫేజ్-2, ఫేజ్-3 పూర్తయితే మరో 20 టీఎంసీల మంచినీటి సరఫరా జరిగితే అందులోనూ 16 టీఎంసీల మురుగు జలాల లభ్యత ఉంటుంది. అంటే భవిష్యత్తులో మొత్తంగా 46 టీఎంసీల మురుగు లభ్యత ఉంటుంది. అయితే ఇప్పటి వరకు లభ్యత ఉన్న 30 టీఎంసీల మురుగు నీటిలో కేవలం 8 టీఎంసీలనే రాష్ట్ర ప్రభుత్వం శుద్ధి చేస్తోంది. మరో 22 టీఎంసీల నీటి శుద్ధికి ప్రాధాన్యతనిచ్చి శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రజారోగ్యానికి భంగమే.. మురుగు నీటి శుద్ధికి కేంద్రాన్ని, జైకాని ప్రభుత్వం నిధులు కోరినా ఆశించిన స్పందన లేదు. దీంతో శుద్ధి చేయకుండానే నీరు వెళ్లిపోతోంది. ఈ నీటిని వాడుకుంటూ అక్కడక్కడ గడ్డి, ఇతర కూరగాయల సాగు జరుగుతోంది. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ దృష్ట్యా మురుగు నీటి శుద్ధిని సాగునీటి ప్రాజెక్టుల్లో భాగంగా చేసి నీటిపారుదలకు వినియోగించుకోవాలి. మొత్తంగా 30 టీఎంసీల నీటిని వినియోగంలోకి తేగలిగితే నల్లగొండ జిల్లాలో గ్రావిటీ ద్వారా 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ప్రస్తుతం నీటి సరఫరా చేస్తున్న ప్రక్రియలో ఎక్కడా డ్యామ్, రిజర్వాయర్ వంటి హెడ్‌వర్క్స్ లేవు. అంతా పైప్‌లై న్ ద్వారానే జరుగుతోంది. కావున నీటి పారుదల రంగానికి ఈ నీటిని మళ్లించే క్రమంలో నీటి శుద్ధి ప్లాంట్‌నే హెడ్వర్క్స్గా మలుచుకోవాలి. దానికి కావాల్సిన కాల్వలను నీటిపారుదల రంగంలో భాగంగానే నిర్మించాలి. అప్పుడు నిధుల విడుదలకు ఆర్థిక శాఖ కొర్రీలు పెట్టదు. మొత్తంగా శుద్ధి ప్లాంట్లకు రూ. 2,773 కోట్లు, కాల్వలకు రూ. 1,227 కోట్లు కలిపి మొత్తంగా రూ. 4 వేల కోట్లు వ్యయమవుతుంది. ఈ నిధుల ద్వారా 3 లక్షల ఎకరాలకు నీరివ్వగలిగితే ఎకరాకు రూ.1.3 లక్షలు ఖర్చు చేసినట్లవుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టుల కింద ఎకరాకు రూ. 3 లక్షలు ఖర్చుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ విధానానికి సీడబ్ల్యూసీ, పర్యావరణ, అటవీ అనుమతులు అక్కర్లేదు. మురుగు జలాల లభ్యత ఎక్కువగా ఉన్న వరంగల్, నిజామాబాద్‌తో పాటు ఏపీలోని విశాఖ, ఏలూరు, రాజమండ్రి, విజయవాడ, తెనాలి, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి పట్టణాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేసి సాగునీటికి ఊతం ఇవ్వవచ్చు. -
నీరు పారాలంటే ‘టెస్ట్’ నెగ్గాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: నీటి సరఫరా పనుల్లో పైప్‌లైన్ కీలకం. పైప్లైన్లలో పగుళ్లు రాకుండా పరీక్షలు చేపట్టాలి. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులపై చేపడుతున్న ప్రాజెక్టుల పనుల్లో ఇటీవల పైప్‌లైన్ పగలడం నిత్యకృత్యమైంది. హైదరాబాద్‌లో కృష్ణా ఫేజ్-2లో పనులు పూర్తయిన తర్వాత పైప్‌లైన్ పగిలి తీవ్ర నష్టాన్ని కలిగించిన ఘటన మరవకముందే వరంగల్ జిల్లాలో దేవాదుల పైప్‌లైన్ పగిలి పంట నష్టం సృష్టించింది. 5 టీఎంసీల కృష్ణా నీటిని జంట నగరాల తాగునీటికి పంపింగ్ చేస్తున్న తరుణంలో 2.5 కి.మీ. దూరంలో 47 చోట్ల లీకేజీలను అధికారులు ఇటీవల గుర్తించారు. పైప్లైన్లు బద్ధలైనప్పుడల్లా సస్యశ్యామలైన భూమి మరుభూమిగా మారుతోంది. పలిగిన పైప్‌లైన్‌ను సరిచేసి నీటిని పంపింగ్ చేయడానికి సమయం పడుతుండటంతో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రస్తుతం తెలంగాణ, ఏపీల్లో పూర్తిగా ఎత్తిపోతల పథకాలే చేపడుతుండటం, వాటిల్లో ఎక్కువగాపైప్లైన్ నిర్మాణాలే ఉండటంతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నీటిపారుదల రంగ నిపుణుడు, రిటైర్డ్ ఈఎన్సీ టి.హనుమంతరావు సూచిస్తున్నారు. వాటిని కచ్చితంగా పాటిస్తేనే ఫలితాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. వీటితోపాటే పరీక్షలన్నీ జరుగుతున్నవి నిజమైతే పగుళ్లు ఎందుకు జరుగుతున్నాయో కారణాలను ప్రభుత్వం విశ్లేషించాలని అంటున్నారు. పైప్‌లైన్ నిర్మాణం, పరీక్షలపై ఇంకా ఆయన ఏం చెప్పారంటే... హైడ్రాలిక్ పరీక్ష తప్పనిసరి ప్రాజెక్టుల్లో వాడే పైపులను ముందుగా పరీక్షించాల్సి ఉన్నా అది జరగట్లేదు. సాధారణంగా పైపుల తయారీలో 3 మీటర్ల వ్యాసం ఉన్న స్టీలు ప్లేటును తెచ్చి పైపు రూపంలోకి మారుస్తారు. దాన్ని వెల్డింగ్ చేసిన తర్వాత రేడియోగ్రఫీ పరీక్ష చేస్తారు. అతుకులు సరిగా ఉన్నాయా? లేదా? అన్నది ఈ పరీక్షలో తేలుతుంది. ఇబ్బందులుంటే రీ వెల్డింగ్ చేయాలి. పైపు తయారీ తర్వాత ‘హైడ్రాలిక్ ప్రెషర్ పరీక్ష’ జరపాలి. పైపును పూర్తిగా నీటితో నింపి ప్రెషర్ పెట్టాలి. ఇలా 2 గంటల పాటు పైపులో లీకేజీలు లేకుండా ఉండాలి. వాస్తవంగా పైప్‌లైన్ పనిచేస్తున్నప్పుడు ఉండే వర్కింగ్ హెడ్‌కు రెట్టింపు ఒత్తిడితో దీన్ని పరీక్షించాలి. దీన్ని క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది పరిశీలించాలి. రెట్టింపు ఫ్రెషర్ పరీక్షే ముఖ్యం నిర్మాణం చేసే ప్రాంతానికి పైపులు తెచ్చి జాయింట్ చేసే సమయంలోనూ ప్రతి అర కిలోమీటర్‌కు జాయింటింగ్ పరీక్ష చేయాలి. పైప్‌లైను ఇరువైపులా మూసివేసి నీళ్లతో నింపి ప్రెషర్ పరీక్ష చేయాలి. నిర్ధారిత ప్రెషర్కన్నా ఎక్కువ ప్రెషర్‌తో పరీక్షించాలి. రెండు గంటల పాటు ఎలాంటి లీకేజీలు లేకుండా ఉండాలి. ఇక ఇండియన్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్ 3114 మేరకు.. కరెంట్ పోయినప్పుడు మోటార్లు నిలిచిపోవడంతో వాటర్ హమ్మర్ ప్రెషర్ ఉంటుంది. దీన్ని సైతం వర్కింగ్ హెడ్లో కలిపి తీసుకోవాలి. వర్కింగ్ హెడ్లో స్టాటిక్ హెడ్, ప్రిక్షనల్ హెడ్ కలసి ఉంటాయి. దీనికి అదనంగా వాటర్ హమ్మర్ హెడ్ కలిపితే వచ్చేది గరిష్ట వర్కింగ్ హెడ్. దీనికన్నా ఫ్రెషర్ టెస్ట్ రెండింతలుగా ఉండాలి (ఉదాహరణకు 50 మీటర్ల స్టాటిక్ హెడ్, 50 మీటర్ల ప్రిక్షనల్ హెడ్, 100 మీటర్ల హమ్మర్ హెడ్ ఉన్నట్లయితే వీటికి రెట్టింపుగా అంటే 200 మీటర్ల గరిష్ట వర్కింగ్ హెడ్ ఉంటుంది. అలాంటప్పుడు ప్రెషర్ టెస్ట్ 400 మీటర్లకు చేయాలి). దీంతోపాటే ట్రయల్న్‌ల్రో భాగంగా పంపింగ్ మిషన్, మోటార్ సామర్థాన్ని పరిశీలించాలి. పవర్ ఫ్యాక్టర్ అదుపులోనే ఉందా? వాల్వ్‌లు ఎలా పనిచేస్తున్నాయో నిర్ధారించుకోవాలి. శిక్షలు.. పరిహారం లీకేజీలతో ప్రజానష్టం జరిగితే దక్షిణకొరియా వంటి దేశాల్లో బాధ్యులైన అధికారులకు, కాంట్రాక్టర్లకు జైలు శిక్ష విధించే నిబంధనలు ఉన్నాయి. బాధితులకు కాంట్రాక్టర్ల నుంచి పరిహారం ఇప్పించేలా చట్టాలున్నాయి. మన రాష్ట్రంలోనూ లీకేజీలకు కారణమైన వారిపై చర్యలుండాలి. అప్పుడే వారంతా పకడ్బందీగా చర్యలు తీసుకుంటారు.