
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రతిపక్ష పార్టీల నేతలను ఎందుకు ఆహ్వానించలేదని ప్రభుత్వాన్ని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ప్రశ్నించారు. ఆదివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగు మహాసభలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఇంటి మహాసభలుగా మార్చేశారని మండిపడ్డారు.
తెలంగాణలో ఉన్న ప్రతిపక్షానికి, పక్కరాష్ట్ర ముఖ్యమంత్రికి గౌరవమివ్వని కేసీఆర్ వైఖరి సరికాదన్నారు. అదే పక్కరాష్ట్ర సీఎం పిలిస్తే అమరావతి శంకుస్థాపనకు, మంత్రి పరిటాల సునీత కుమారుడి వివాహానికి వెళ్తారని ఎద్దేవా చేశారు. అందరూ ఆహ్వానితులే అనడం సరికాదని, ప్రతిపక్ష పార్టీలకు ప్రత్యేక ఆహ్వానం పంపడం సమంజసం అని పేర్కొన్నారు.