వేలానికి జగ్గారెడ్డి బంగారు బ్రాస్ లెట్
హైదరాబాద్ :
ఎంపీ హనుమంతరావు బహుకరించిన బంగారు బ్రాస్ లెట్ను మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వేలం వేయనున్నారు. వేలం డబ్బులు ఖమ్మం మిర్చి రైతులకు విరాళంగా ఇవ్వనున్నారు. సంగారెడ్డిలో జూన్ 1వ తేదీన జరిగిన తెలంగాణ ప్రజా గర్జన విజయవంతం ఆయిన సందర్బంగా సమావేశ నిర్వాహకులు జగ్గారెడ్డికి, ఎంపీ హనుమంతరావు బంగారు బ్రాస్ లెట్ను బహుకరించిన విషయం తెలిసిందే.
ఈ బ్రాస్ లెట్ను శుక్రవారం సోమాజిగూడా ప్రెస్ క్లబ్లో వేలం వేయనున్నారు. వేలంలో వచ్చిన డబ్బులు ఖమ్మం లో అరెస్ట్ అయిన మిర్చి రైతులకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు.