సాక్షి,హైదరాబాద్: బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమే లేదన్నారు. పొరపాటున బీజేపీకి తెలంగాణలో 8 ఎంపీ సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో జగ్గారెడ్డి ఆదివారం(జనవరి26) మీడియాతో మాట్లాడారు.
‘ఈ దేశంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఇంధిరమ్మ ఇల్లు కనిపిస్తుంది. ఏ ముసలి అవ్వ, ముసలి తాతను అడిగినా ఇంధిరమ్మ ఇళ్లలోనే ఉంటుంన్నాం అని చెప్తారు. ఇంధిరమ్మను చూసేందుకు మారుమూల గ్రామాల నుంచి ఎడ్లబండ్లు కట్టుకుని వచ్చేవారు. ఉనికి కోసమే బండి సంజయ్ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. ఇంధిరమ్మ పేరు పెడితే నిధులు ఇవ్వమని సంజయ్ బెదిరిస్తున్నారు.
బండి సంజయ్ నీ ఊరికే వస్తా.. ఇంధిరమ్మ గురించి ఓ ముసలమ్మను అడుగుదాం.. ఏం చెప్తదో చూద్దాం. స్వాతంత్ర్య ఉధ్యమంలో నిండు గర్బినిగా ఉండగా ఇందిరమ్మ జైలుకు వెళ్లారు. విలువలతో కూడిన రాజకీయం బీజేపీ చేయడం లేదు. అటల్ బీహారీ వాజ్‌పేయి,ఎల్‌కే అద్వానీ గురించి మేము ఏనాడూ తప్పుగా మాట్లాడలేదు. ఇంధిరా గాంధీ చరిత్ర ఎంత చెప్పినా తక్కువే. రాజ్యాంగాన్ని నిర్మించే భాధ్యత అంబేద్కర్‌కు అప్పగించింది నెహ్రూయే. ఇంధిరాగాంధీని విమర్శించడం బండి సంజయ్ వయస్సుకు తగదు. బండి సంజయ్ క్షమాపణ చెప్పి..ఈ వివాదానికి స్వస్తి పలకాలి’అని జగ్గారెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment