సాక్షి,హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లపై చేసిన వ్యాఖ్యలకుగాను కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఈ విషయమై జగ్గారెడ్డి శనివారం(జనవరి25) మీడియాతో మాట్లాడారు.‘బండి సంజయ్‌కి రాజకీయ అనుభవం లేకుండానే మినిస్టర్ పోస్ట్ వచ్చింది. బండి సంజయ్‌కి అనుభవం లేదు.
అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఏది పడితే అది మాట్లాడుతా అంటే కుదరదు. కొందరు నేతలు న్యూస్ బ్రేకింగ్ కోసం మాట్లాడుతున్నారు. బండి సంజయ్ బ్రేకింగ్ లీడర్.. ఆయన మాట్లాడితే తలా తోక ఉండదు. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వారి ఫోటోనే ఉంటది. మోదీ ఫోటో పెట్టకపోతే పైసలు ఇయ్యరా.
బండి సంజయ్ తెలంగాణ ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. బియ్యానికి పైసలు ఇయ్యమని బండి సంజయ్ ఎలా అంటారు. ఇళ్ళ కు నిధులు ఇవ్వమని బెదిరిస్తారా...ఇంత డైరెక్ట్ గా బెదిరింపులా నిధులు ఏమైనా సీఎం రేవంత్ రెడ్డికి ఇస్తున్నారా..తెలంగాణ ప్రజలకే కదా. మోదీకి గులాం చేస్తేనే నిధులు ఇస్తారా. బండి సంజయ్ వాఖ్యలను కిషన్ రెడ్డి సమర్దిస్తారా’చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment