
సాగునీటిరంగ నిపుణుడు హనుమంతరావు కన్నుమూత
ప్రముఖ సాగునీటి రంగ నిపుణుడు హనుమంతరావు ఆదివారం రాత్రి గుండెపోటుతో మరణించారు.
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సాగునీటి రంగ నిపుణుడు, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ టి.హనుమంతరావు ఆదివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. పది రోజుల కిందట తీవ్ర జ్వరంతో ఆయన బేగంపేటలోని వివేకానంద ఆస్పత్రిలో చేరారు.
చికిత్స జరుగుతున్న సమయంలో గుండెపోటు రావడంతో కన్నుమూశారు. రాష్ట్ర సాగునీటి రంగానికి విశేష సేవలందించడంతో పాటు రాజస్తాన్ సహా వివిధ దేశాల్లోనూ సాగు, తాగునీటి సమస్యలకు హనుమంతరావు పరిష్కారాలు చూపారు.