సాక్షి, హైదరాబాద్: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం హెచ్‌సీయూకు రానున్నారు. రోహిత్ కుటుంబాన్ని పరామర్శించడానికి, సస్పెన్షన్‌కు గురైన విద్యార్థులకు మద్దతు తెలపడానికి ఖర్గే వస్తున్నట్టుగా రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారని, విద్యార్థులతో మాట్లాడిన తర్వాత బెంగ ళూరు వెళ్తారని వివరించారు.