న్యూఢిల్లీ: ఎడ్‌టెక్ యూనికార్న్ ఫిజిక్స్‌వాలా తాజాగా రూ.1,753 కోట్ల నిధులను సమీకరించింది. సిరీస్–బి రౌండ్‌లో హార్న్‌బిల్ క్యాపిటల్, లైట్‌స్పీడ్ వెంచర్ పార్ట్‌నర్స్, జీఎస్‌వీ, వెస్ట్‌బ్రిడ్జ్ ఈ మొత్తాన్ని అందించాయి. ఈ డీల్‌తో కంపెనీ విలువ ఏడాదిలో రెండున్నర రెట్లు దూసుకెళ్లి రూ.23,380 కోట్లకు చేరింది.
ఇదీ చదవండి: అనిల్ అంబానీకి ఇక అన్నీ మంచి రోజులేనా?
పెద్ద సంస్థల వాల్యుయేషన్‌లో గణనీయమైన తగ్గుదల కారణంగా భారతీయ ఎడ్‌టెక్ రంగంలో పెద్ద ఎత్తున నిధుల కొరత చాలా కాలంగా ఉంది. ‘ఎడ్‌టెక్ రంగానికి సవాలుగా ఉన్న ప్రస్తుత సమయంలో తాజా ఫండింగ్ రౌండ్ ఆశావాదానికి దారితీసింది. కంపెనీ అభివృద్ధి, దేశం అంతటా విద్యను ప్రజాస్వామ్యం చేయాలనే లక్ష్యంపై ఇప్పటికే ఉన్న, కొత్త పెట్టుబడిదారుల అచంచల విశ్వాసానికి ఇది నిదర్శనం’ అని ఫిజిక్స్‌వాలా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment