ed-tech company
-
ఒక్క డీల్‌తో దూసుకెళ్లిన ఫిజిక్స్‌వాలా
న్యూఢిల్లీ: ఎడ్టెక్ యూనికార్న్ ఫిజిక్స్‌వాలా తాజాగా రూ.1,753 కోట్ల నిధులను సమీకరించింది. సిరీస్–బి రౌండ్లో హార్న్‌బిల్ క్యాపిటల్, లైట్‌స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్, జీఎస్వీ, వెస్ట్‌బ్రిడ్జ్ ఈ మొత్తాన్ని అందించాయి. ఈ డీల్‌తో కంపెనీ విలువ ఏడాదిలో రెండున్నర రెట్లు దూసుకెళ్లి రూ.23,380 కోట్లకు చేరింది.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి ఇక అన్నీ మంచి రోజులేనా?పెద్ద సంస్థల వాల్యుయేషన్‌లో గణనీయమైన తగ్గుదల కారణంగా భారతీయ ఎడ్టెక్ రంగంలో పెద్ద ఎత్తున నిధుల కొరత చాలా కాలంగా ఉంది. ‘ఎడ్టెక్ రంగానికి సవాలుగా ఉన్న ప్రస్తుత సమయంలో తాజా ఫండింగ్ రౌండ్ ఆశావాదానికి దారితీసింది. కంపెనీ అభివృద్ధి, దేశం అంతటా విద్యను ప్రజాస్వామ్యం చేయాలనే లక్ష్యంపై ఇప్పటికే ఉన్న, కొత్త పెట్టుబడిదారుల అచంచల విశ్వాసానికి ఇది నిదర్శనం’ అని ఫిజిక్స్‌వాలా తెలిపింది. -
ఎడ్‌టెక్‌కు తగ్గిన ఫండింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దశాబ్ద కాలంలో భారతీయ ఎడ్టెక్ రంగం నూతన గరిష్టాలను నమోదు చేసింది. ప్రస్తుతం ఈ రంగం నిధుల కొరతను ఎదుర్కొంటోంది. 2021లో దాని గరిష్ట స్థాయితో పోలిస్తే ఈ ఏడాది 47% తగ్గుదల ఉంది. అయితే అభివృద్ధి చెందుతున్న పోకడలు, మార్కెట్ స్థితిస్థాపకత ద్వారా ఈ రంగంలో దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రాక్ఎక్స్ఎన్ ఫీడ్ జియో రిపోర్ట్: ఎడ్టెక్ ఇండియా 2024 ప్రకారం భారతీయ ఎడ్టెక్ పర్యావరణ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా మూడవ అత్యధిక నిధులతో కొనసాగుతోంది. ప్రస్తుతం నిధుల సవాళ్లు ఉన్నప్పటికీ దాని సామర్థ్యాన్ని గణాంకాలు నొక్కి చెబుతున్నాయి. గరిష్టం నుంచి క్షీణత.. భారతీయ ఎడ్టెక్ రంగం 2024 సంవత్సరంలో ఇప్పటి వరకు 215 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. 2023లో పరిశ్రమ 321 మిలియన్ డాలర్లను అందుకుంది. అయితే ఈ మొత్తాలు 2021లో సేకరించిన 4.1 బిలియన్ డాలర్ల అత్యున్నత స్థాయితో పోలి్చతే చాలా తక్కువగా ఉంది. 2022లో మొదలైన క్షీణత 2023 వరకు కొనసాగింది. 2022లో ఈ రంగం 87 శాతం క్షీణించింది. ఇది స్థూల ఆర్థికపర ఎదురుగాలులు, పెట్టుబడిదారుల హెచ్చరిక, సంప్రదాయ అభ్యాస నమూనాలకు తిరిగి మారడం వంటి కారణాలతో కూడిన సవాళ్ల వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. పుంజుకునే సంకేతాలు.. ఇన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఈ రంగం పుంజుకునే సంకేతాలను చూపుతోంది. 2024 మొదటి అర్ధ భాగంలో ఎడ్టెక్ రంగంలోకి వచ్చిన నిధులు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 96 శాతం దూసుకెళ్లి 164 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2023 జనవరి–జూన్‌లో ఇది 81.9 మిలియన్ డాలర్లుగా ఉంది. ఈ వృద్ధి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ 2021 క్యూ3లో ఎడ్టెక్ పరిశ్రమ అందుకున్న 2.48 బిలియన్ డాలర్ల త్రైమాసిక గరిష్టంతో పోలిస్తే చాలా తక్కువ. మార్కెట్ సవాళ్లు ఉన్నప్పటికీ.. నిధుల హెచ్చుతగ్గుల మధ్య కీలక కంపెనీలు వ్యూహాత్మక ఎత్తుగడలను కొనసాగించాయి. ఆన్లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ అవాన్స్ 120 మిలియన్ డాలర్ల నిధులను పొందింది. న్యాయ విద్య స్టార్టప్ అయిన లాసీకో 2024లో పబ్లిక్ ఇష్యూకు వెళ్లింది. దీంతో ఈ ఏడాది ఎడ్టెక్ రంగంలో ముఖ్యమైన మైలురాళ్లు నమోదయ్యాయి. ఈ పరిణామాలు విస్తృత మార్కెట్ సవాళ్లు ఉన్నప్పటికీ పెట్టుబడిని ఆకర్షించడానికి, వృద్ధిని పెంచడానికి రుణాలు, ప్రత్యేక శిక్షణా ప్లాట్‌ఫామ్‌ల వంటి ఎడ్టెక్లోని సముచిత విభాగాల సామర్థ్యాన్ని నొక్కిచెప్పాయి. 2024లో ఒకటి మాత్రమే.. అన్అకాడమీ, ఎరుడిటస్, అప్‌గ్రాడ్ వంటి ప్రముఖ ఎడ్టెక్ కంపెనీలు భారత మార్కెట్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. అన్అకాడమీ ఏకంగా 3.44 బిలియన్ డాలర్ల విలువతో అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఈ రంగంలో 2023 నుండి కొత్త యునికార్న్ ఉద్భవించలేదు. పెట్టుబడిదారుల విశ్వాసం ఇంకా పూర్తిగా కోలుకోలేదని ఇది సూచిస్తోంది. ఈ రంగంలో కొనుగోళ్లు 2021లో ఏకంగా 31 నమోదయ్యాయి. 2023లో ఈ సంఖ్య 13కు పరిమితమైంది. 2024లో ఒకటి మాత్రమే నమోదు కావడం నిరాశ కలిగిస్తోంది. మారుతున్న పెట్టుబడుల తీరు.. భారతీయ ఎడ్టెక్ రంగంలో నిధుల ల్యాండ్‌స్కేప్ నాటకీయంగా మారిపోయింది. లేట్ స్టేజ్ నిధులు 2021లో గరిష్ట స్థాయికి చేరుకుని 3.9 బిలియన్ డాలర్లు నమోదయ్యాయి. 2023లో 187 మి.డాలర్లు, 2024లో ఇప్పటి వరకు 166 మిలియన్ డాలర్లకు పడిపోయింది. ప్రారంభ దశ పెట్టుబడులు 2022లో 654 మి.డాలర్ల నుండి 85 శాతం తగ్గి ఆ తర్వాతి సంవత్సరంలో 96.4 మి.డాలర్లకు వచ్చి చేరాయి. 2021లో 175 మి.డాలర్లకు చేరుకున్న సీడ్ స్టేజ్ ఫండింగ్ 2024లో కేవలం 8.5 మి.డాలర్లకు పడిపోయింది. అన్ని దశలలో తగ్గుతున్న పెట్టుబడులనుబట్టి ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు అవగతమవుతోంది. స్థూల ఆర్థిక అనిశి్చతులు, మహమ్మారి అనంతర విద్యా విధానంలో మార్పులు ఇందుకు కారణం. యూఎస్ తర్వాత మనమే.. ప్రస్తుత నిధుల సవాళ్లు ఉన్నప్పటికీ భారతీయ ఎడ్టెక్ రంగం గ్లోబల్ లీడర్‌గా ఉంది. ఆరు యునికార్న్‌లతో విజయవంతంగా కొనసాగుతోంది. యూనికార్న్‌ల సంఖ్య పరంగా యూఎస్ తర్వాత రెండవ స్థానంలో భారత్ నిలిచింది. మారుతున్న వినియోగదారుల అవసరాలు, అంచనాలకు అనుగుణంగా ఆఫ్‌లైన్, ఆన్లైన్ విద్యా నమూనాల ఏకీకరణ ద్వారా ఈ రంగం భవిష్యత్తు వృద్ధి ఆధారపడి ఉంది. ఆర్టిఫీíÙయల్ ఇంటెలిజెన్స్, తరగతి గదులలో వాయిస్ టెక్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను స్వీకరించడం ఆవిష్కరణను ప్రోత్సహిస్తుంది. అలాగే వృద్ధికి కొత్త మార్గాలను సృష్టిస్తోంది. ఉదాహరణకు వ్యక్తిగతీకరించిన అభ్యాసం, స్మార్ట్ అసెస్మెంట్లు, ఏఐ ఆధారిత అడాప్టివ్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఈ రంగంలో ప్రముఖంగా మారుతున్నాయి. విస్తరణకు అనుకూలమైన విధానండిజిటల్ విద్య, ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యాలను నొక్కిచెప్పే జాతీయ విద్యా విధానం–2020 వంటి విధాన మద్దతు భవిష్యత్ విస్తరణకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. సంప్రదాయ, డిజిటల్ వేదికలలో ఉత్తమమైన వాటిని మిళితం చేసే హైబ్రిడ్ లెరి్నంగ్ మోడల్స్ ప్రమాణికంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలలో ఈ విధానం విద్య సౌలభ్యాన్ని, నాణ్యతను పెంపొందిస్తుంది. దీర్ఘకా లిక దృక్పథం సానుకూలంగానే ఉన్నప్పటికీ భారతీయ ఎడ్‌టెక్‌కు ముందున్న మార్గం సవాళ్లతో నిండి ఉంది అని ట్రాక్ఎక్స్ఎన్ నివేదిక చెబుతోంది. -
రూ.5 వేల జీతానికి నానా అగచాట్లు.. ఇప్పుడు ఏకంగా...
సాధారణంగా ప్రైవేటు టీచర్లంటే చిన్నచూపు ఉంటుంది. తక్కువ జీతం ఉంటుందని, పెద్దగా సంపాదన ఉండదని భావిస్తారు. కానీ టీచింగ్‌తోనే ఎడ్టెక్ సంస్థలు పెట్టి రూ.కోట్లు సంపాదిస్తున్న వారూ ఉన్నారు. వారిలో దేశంలోనే రిచెస్ట్ టీచర్‌గా నిలిచిన ఓ వ్యక్తి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సంపన్న ఉపాధ్యాయుడిగా నిలిచారు ఫిజిక్స్‌వాలా ( PhysicsWallah ) వ్యవస్థాపకుడు, సీఈవో అలఖ్ పాండే ( Alakh Pandey ). అయితే దేశంలో రిచెస్ట్ టీచర్ బైజూస్ రవీంద్రన్ అని చాలామంది వాదించవచ్చు. కానీ ఇప్పుడు ఆ టైటిల్ ఆయనది కాదు. ఫోర్బ్స్ ప్రకారం బైజూస్ పతనం తర్వాత, దాని నికర విలువ కూడా రూ. 830 కోట్లకు పడిపోయింది. అంటే రూ. 2000 కోట్ల కంటే ఎక్కువ నెట్‌వర్త్ ఉన్న అలఖ్ పాండేనే దేశంలోనే అత్యంత ధనిక ఉపాధ్యాయుడు. ప్రముఖ ఉపాధ్యాయుడు, ఎంటర్‌ప్రిన్యూర్‌గా పేరొందిన అలఖ్ పాండే సాధారణంగా లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖలో ఈ స్టార్టప్ నమోదై ఆయన వార్షిక వేతనం వెల్లడి కావడంతో వార్తల్లోకి వచ్చారు. భారతీయ టెక్, స్టార్టప్ సంస్థల సమాచారం అందించే ‘Inc42’ నివేదిక ప్రకారం.. అలఖ్ పాండే వేతనం 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 9.6 కోట్లు. దీంట్లో ఆయన రూ.5 కోట్లను తగ్గించుకున్నారు. అయినప్పటికీ 2023 ఆర్థిక సంవత్సరంలో అలఖ్ పాండే వేతనం రూ. 4.57 కోట్లు. ఇంత ఆదాయం ఉన్న అలఖ్ పాండే మొదటి సంపాదన ఎంతో తెలుసా.. కేవలం రూ.5 వేలు. అది కూడా చాలా మంది పిల్లలకు ట్యూషన్లు చెప్పడం ద్వారా వచ్చేది. యాక్టర్ కావాలనుకున్నాడు దేశంలో 101వ యునికార్న్ కంపెనీ ఫిజిక్స్‌వాలాను స్థాపించిన అలఖ్ పాండే ఒక టీచర్‌గానే చాలా మందికి తెలుసు. అయితే యాక్టర్ కావాలన్నది తన కల అని ఎంత మందికి తెలుసు? అలహాబాద్‌లో జన్మించిన అలఖ్ పాండే యాక్టర్ అవ్వాలనే కోరికతో నుక్కడ్ నాటకాల్లో పాల్గొనేవాడు. అయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో 8వ తరగతి నుంచే ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాడు. అలఖ్ పాండే, ఆయన సోదరి చదువుల కోసం వారి తల్లిదండ్రులు తమ ఇంటిని అమ్మేశారు. అలఖ్ పాండే చాలా చురుకైన విద్యార్థి. 10వ తరగతిలో 91 శాతం, 12వ తరగతిలో 93.5 శాతం మార్కులు వచ్చాయి. కోటి మందికిపైగా సబ్స్క్రైబర్లు ఐఐటీలో చేరాలనుకున్న అలఖ్ పాండే కాన్పూర్‌లోని హార్కోర్ట్ బట్లర్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాడు. అయితే, కోర్సు మూడవ సంవత్సరం తర్వాత కాలేజీ మానేశాడు. 2017లో యూపీలో ఒక చిన్న గది నుంచి యూట్యూబ్ వీడియోలను రూపొందించడం ప్రారంభించాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో అలాఖ్ పాండే వీడియోలు చాలా విజయవంతమయ్యాయి. ఎంతగా అంటే ఓ ఎడ్-టెక్ కంపెనీని ప్రారంభించేంతలా. ఇందులో ఇప్పుడు 500 మందికి పైగా టీచర్లు, 100 మంది టెక్నికల్ సిబ్బంది పనిచేస్తున్నారు. యూట్యూబ్‌లో ఫిజిక్స్‌వాలా చానల్‌కు కోటి మందికిపైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. -
బైజూస్‌పై దివాలా పిటిషన్
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ బైజూస్‌పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)–బెంగళూరులో దివాలా పిటిషన్ దాఖలైంది. కంపెనీకి 1.2 బిలియన్ డాలర్ల మేర టర్మ్ లోన్–బీ (టీఎల్‌బీ) ఇచి్చన రుణదాతల్లో 80 శాతం సంస్థలు కలిసి గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ద్వారా దీన్ని దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, దివాలా పిటిషన్ విషయం ఇంకా బహిరంగంగా వెల్లడి కాలేదు. బైజూస్ ఈ వ్యవహారమంతా నిరాధారమైనదని పేర్కొంది. రుణదాతల చర్యలపై అమెరికా కోర్టుల్లో పలు కేసులు నడుస్తుండగా ఎన్సీఎల్టీని ఆశ్రయించడం సరికాదని వ్యాఖ్యానించింది. అనుబంధ సంస్థలను విక్రయించడం ద్వారా వచ్చే నిధులతో రుణాలను తీర్చేసుకునేందుకు టీఎల్‌బీ రుణదాతలతో చర్చలు జరుపుతున్నట్లు బైజూస్ చెబుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్యాంకులు కాకుండా సంస్థాగత ఇన్వెస్టర్లు ఇచ్చిన రుణాన్ని టీఎల్‌బీ లోన్‌గా వ్యవహరిస్తున్నారు. వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు బైజూస్ అమెరికా విభాగం ఆల్ఫా 2021లో టీఎల్‌బీ తీసుకుంది. అయితే, కంపెనీ 500 మిలియన్ డాలర్ల మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఇతర అనుబంధ సంస్థలకు బదలాయించిందని, రుణ చెల్లింపులను వేగవంతం చేయాలని రుణదాతలు అమెరికాలోని డెలావేర్ కోర్టును ఆశ్రయించారు. దీన్ని న్యాయస్థానంలో సవాలు చేసిన బైజూస్.. రుణదాతలతో వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నాల్లో ఉంది. -
పెరుగుతున్న నిపుణుల కొరత..
ముంబై: ఐటీ కంపెనీలు నైపుణ్యాల కొరతను ఎదుర్కొంటుండగా, కృత్రిమ మేథ (ఏఐ) దీన్ని మరింత వేగవంతం చేస్తున్నట్టు ఎడ్టెక్ కంపెనీ స్కిల్‌సాఫ్ట్ నిర్వహించిన ‘2023 ఐటీ స్కిల్స్ అండ్ శాలరీ సర్వే’లో తెలిసింది. అర్హత కలిగిన నిపుణులు లభించడం కష్టంగా ఉందని ప్రతి ముగ్గురు ఐటీ కంపెనీల ప్రతినిధుల్లో ఒకరు చెప్పారు. నైపుణ్యాల అంతరం, నైపుణ్యాల కొరత, టెక్నాలజీల్లో మార్పు ఐటీ విభాగాలను ప్రభావితం చేస్తున్నట్టు ఈ సర్వే నివేదిక తెలిపింది. ‘‘ఉద్యోగులకు ఇంతకుముందెన్నడూ లేనట్టు తరచూ మారుతున్న టెక్నాలజీలపై శిక్షణ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏఐ తదితర టెక్నాలజీకి సంబంధించిన నైపుణ్యాలు, సామర్థ్యాల నిర్మాణంలో సంస్థలు చురుగ్గా వ్యవహరించాల్సిన దశలో ఉన్నాయి’’అని స్కిల్‌సాఫ్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఓర్లా డ్యాలీ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 5,700 మంది ఐటీ నిపుణులు, కంపెనీల ప్రతినిధుల అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా స్కిల్‌సాఫ్ట్ తెలుసుకుంది. శిక్షణ ఎంతో అవసరం.. 82 శాతం ఐటీ నిపుణులు శిక్షణ తమ కెరీర్లో ఎంతో ముఖ్యమని చెప్పారు. చేస్తున్న పనిలో ఎలాంటి వృద్ధి లేకపోవడం వల్ల తాము సంస్థను మారాల్సి వచి్చనట్టు ఎక్కువ మంది తెలిపారు. టీమ్ కమ్యూనికేషన్ (40 శాతం), ఇంటర్‌పర్సనల్ కమ్యూనికేషన్ (21 శాతం), ఎమోషనల్ ఇంటెలిజెన్స్ (13) అన్నవి కావాల్సిన మూడు ముఖ్యమైన నైపుణ్యాలుగా ఐటీ రంగ ఉద్యోగులు చెప్పారు. రానున్న రోజుల్లో నాయకత్వ నైపుణ్యాలు కూడా తమ పెట్టుబడుల ప్రాధాన్యతల్లో ఒకటిగా 6 శాతం మంది పేర్కొన్నారు. సాంకేతికేతర నైపుణ్యాల అవసరాన్ని 7 శాతం మంది వ్యక్తం చేశారు. 72 శాతం మంది ఐటీ ఉద్యోగులు తమ టీమ్ నాయకత్వ నైపుణ్యాలు మధ్యస్థం నుంచి తక్కువగా ఉన్నట్టు అంగీకరించారు. ఈ విభాగంలో శిక్షణ పరంగా ఎంతో అంతరం ఉన్నట్టు పేర్కొన్నారు. నాయకత్వంలో శిక్షణ ఇవ్వడం ద్వారా సమగ్రమైన ఐటీ నైపుణ్యాలు సమకూర్చుకునేందుకు ఇప్పుడు పెద్ద అవకాశం కంపెనీల మందున్నట్టు ఈ సర్వే నివేదిక పేర్కొంది. -
ఆన్లైన్ డిగ్రీ కోర్సులతో జాగ్రత్త: యూజీసీ
న్యూఢిల్లీ: విదేశీ యూనివర్సిటీల సహకారంతో కాలేజీలు, ఎడ్టెక్ కంపెనీలు అందించే డిగ్రీల కు తమ గుర్తింపు లేదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) స్పష్టం చేసింది. ఇటువంటి డిగ్రీలకు ఏమాత్రం విలువ లేదని, ఆయా కోర్సుల్లో చేరవద్దని విద్యార్థులను హెచ్చరించింది. విదేశీ వర్సిటీలు, విద్యా సంస్థలతో కొన్ని ఉన్నత విద్యా సంస్థలు, కాలేజీలు పొందే అనుబంధ గుర్తింపు, ఒప్పందాలను తాము అనుమతించడం లేదని యూజీసీ సెక్రటరీ మనీశ్ జోషి చెప్పారు. ఆయా సంస్థలు ఇచ్చే డిగ్రీలు, డిప్లొమాలకు ఎటువంటి విలువా ఉండదని వివరించారు. -
పాఠశాలల్లో లీడ్ ఏఐ ఆధారిత అసెస్మెంట్
ముంబై: ఎడ్టెక్ సంస్థ లీడ్ తాజాగా పాఠశాలల్లో కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత మూల్యాంకన విధానాన్ని అందుబాటులోకి తెచి్చంది. నిర్దిష్ట తరగతుల విద్యార్థుల స్థాయులను బట్టి మెరుగైన ప్రశ్నలను రూపొందించేందుకు ఇది ఉపయోగపడతుందని సంస్థ సీఈవో సుమీత్ మెహతా తెలిపారు. టీచర్లు అవసరమైతే వీటిని సమీక్షించి, తగు మార్పులు, చేర్పులు కూడా చేసేందుకు వెసులుబాటు ఉంటుందని వివరించారు. బోధనాంశాలను నేర్చుకోవడంలో విద్యార్థులకు ఎదురవుతున్న సవాళ్లను గుర్తించేందుకు, తగు పరిష్కార మార్గాలను అమలు చేసేందుకు ఇది సహాయకరంగా ఉంటుందని మెహతా పేర్కొన్నారు. అలాగే ఎగ్జామ్ పేపర్ల లీకేజీ సమస్యకు కూడా అడ్డుకట్ట పడుతుందన్నారు. విద్యార్థుల స్థాయిని బట్టి అసెస్మెంట్ విధానాన్ని ఎంచుకునే వీలు కలి్పంచే ఈ విధానం .. తమ నెట్‌వర్క్‌లోని 9,000 పైచిలుకు పాఠశాలల్లో, 50,000 మంది పైచిలుకు ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉంటుందని మెహతా చెప్పారు. -
ఉద్యోగులకు షాకిచ్చిన ‘ఫిజిక్స్‌వాలా’!
ప్రముఖ దేశీయ ఎడ్టెక్ యూనికార్న్ సంస్థ ఫిజిక్స్ వాలా ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. 70 నుంచి 120 మంది ఉద్యోగుల్ని తొలగించింది. దీంతో నిధుల కొరత కారణంగా ఉద్యోగుల్ని తొలగించిన జాబితాలో ఫిజిక్స్ వాలా చేరిపోయింది. అయితే ఉద్యోగుల పనితీరు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. పిడబ్ల్యూలో మేం మిడ్ టర్మ్, అక్టోబర్ నెల ముగిసే సమయానికి ఎండ్ టర్న్ సైకిల్స్‌లో ఉద్యోగుల పనితీరును అంచనా వేస్తాం. ఫిజిక్స్ వాలా మొత్తం వర్క్ ఫోర్స్‌లో 0.8శాతం కంటే తక్కువ అంటే 70 నుండి 120 మంది ఉద్యోగుల్లో పనితీరులో సమస్యలు ఉన్నట్లు గుర్తించాము’ అని చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సతీష్ ఖేంగ్రే ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో అదనంగా 1000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నామని, ఇది వృద్ధి పట్ల తమ నిబద్ధతను బలపరుస్తుందని ఖేంగ్రే తెలిపారు. ఫిజిక్స్ వాలా గత ఏడాది రూ.100 కోట్ల యూనికార్న్ క్లబ్లో చేరింది. ఈ కంపెనీలో వెస్ట్‌బ్రిడ్జ్ కేపిటల్, జీఎస్వీ వెంచర్స్ వంటి కేపిటల్ మార్కెట్ కంపెనీలు 1 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాయి. పెట్టుబడి దారులు తమ ఫోర్ట్ ఫోలియో కంపెనీ ఫిజిక్స్ వాలాలో పెట్టిన పెట్టుబడులతో లాభాల్ని గడించాలని భావిస్తున్న సమయంలో ఆ సంస్థ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభంలో ఫిజిక్స్ వాలా తన విస్తరణ ప్రయత్నాల్లో భాగంగా కేరళకు చెందిన సైలెమ్ లెర్నింగ్ లో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఆకాశ్‌కు బైజూస్ నోటీసులు
న్యూఢిల్లీ: ఒప్పందంలో భాగమైన షేర్ల మారి్పడి ప్రక్రియను వ్యతిరేకిస్తుండటంపై ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్విసెస్ (ఏఈఎస్ఎల్)కు ఎడ్టెక్ కంపెనీ బైజూస్ మాతృసంస్థ థింగ్ అండ్ లెర్న్ (టీఎల్‌పీఎల్) నోటీసులు పంపింది. వివరాల్లోకి వెడితే .. 2021లో ఏఈఎస్ఎల్ను బైజూస్ 940 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. నగదు, షేర్ల మారి్పడి రూపంలోని ఈ డీల్ ప్రకారం ఏఈఎస్‌ఎల్‌లో టీఎల్పీఎల్కు 43 శాతం, దాని వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌కు 27 శాతం, ఏఈఎస్ఎల్ వ్యవస్థాపకుడు చౌదరి కుటుంబానికి 18 శాతం, బ్లాక్‌స్టోన్‌కు 12 శాతం వాటాలు దక్కాయి. ఒప్పందాన్ని బట్టి ఏఈఎస్ఎల్ను టీఎల్పీఎల్లో విలీనం చేయాలి. అయితే, విలీన ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో షేర్ల మార్పిడిని అమలు చేయాలని కోరుతూ చౌదరి కుటుంబానికి టీఎల్‌పీఎల్ నోటీసులు ఇచి్చంది. కానీ మైనారిటీ షేర్హోల్డర్లు ఇందుకు నిరాకరించినట్లు సమాచారం. షేర్ల మారి్పడి ప్రక్రియలో పన్నులపరమైన అంశాలు ఉన్నందున.. దానికి బదులుగా పూర్తిగా నగదే తీసుకోవాలని చౌదరి కుటుంబం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆకాశ్ ఆదాయం మూడు రెట్లు పెరిగి రూ. 3,000 కోట్లకు పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి. -
బుడి బుడి నడకల నుంచి సూపర్ స్పీడ్ వరకు...
సక్సెస్ అనేది రాత్రికి రాత్రి వచ్చేది కాదు. నిద్రలేని రాత్రులు ఎన్నో గడపాల్సి ఉంటుంది. తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, విజయం కోసం ఎదురు చూస్తూ ఏఐ ఇంగ్లీష్ ట్యూటర్ స్టార్టప్ ‘స్పార్క్ స్టూడియో’ ద్వారా ఘన విజయం సాధించింది అనుశ్రీ గోయల్... కొన్ని సంవత్సరాల క్రితం... స్టాన్ఫోర్డ్(యూఎస్)లో యూత్ ఫెయిల్యూర్ స్టార్టప్‌ల గురించి పాల్ గ్రహమ్ విశ్లేషణాత్మకమైన ప్రసంగం ఇచ్చాడు. ‘స్టార్టప్‌కు సంబంధించిన సమస్త విషయాలపై దృష్టి పెడుతున్నారు. ప్రజలు బాగా కోరుకునేది ఏమిటి అనే కీలకమైన విషయాన్ని మాత్రం మరిచిపోతున్నారు’ పాల్ గ్రహమ్ అన్నప్పుడు హాల్లో చప్పట్లు మారుమోగాయి. ఆ ప్రేక్షకులలో అనుశ్రీ గోయెంకా ఉంది. అనుశ్రీకి గ్రహమ్ ఉపన్యాసం ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. అహ్మదాబాద్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన అనుశ్రీ మానిటర్ గ్రూప్‌లో కన్సల్టంట్గా అయిదు సంవత్సరాలు పనిచేసింది. ఆ తరువాత స్క్రోల్ మీడియా, స్విగ్గీలో పనిచేసింది. ఉద్యోగం యాంత్రికం అనిపించిందో, ఇంతకంటే చేయడానికి ఏం లేదు.. అనే నిర్లిప్తత ఆవహించిందో తెలియదు కానీ చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి కొత్త దారిలోకి వచ్చింది. ‘వ్యాపారంపై నా ముద్ర ఉండాలి. అది నాకు సంతోషం కలిగించేలా ఉండాలి’ అనుకుంటూ రంగంలోకి దిగింది అనుశ్రీ. పది సంవత్సరాలు కార్పొరేట్ ప్రపంచంలో పనిచేసిన అనుశ్రీ గ్రహమ్ ప్రసంగాన్ని పదేపదే గుర్తు తెచ్చుకుంటూ బెంగళూరు కేంద్రంగా ‘స్పార్క్ స్టూడియో’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం మొదలుపెట్టింది. ‘స్పార్క్ స్టూడియో’ అనేది పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఎక్స్ట్రా కరిక్యులర్ లెర్నింగ్ అండ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్. మొదట ‘స్పార్క్ స్టూడియో’ ఐడియాను శ్రేయోభిలాషులు, ఇండస్ట్రీ ఎనలిస్ట్లకు చెప్పినప్పుడు– ‘సక్సెస్ కావడం కష్టం’ అంటూ ఎన్నో కారణాలు చెప్పారు. అయినా వెనకడుగు వేయలేదు అనుశ్రీ. ‘మన దేశంలో హై–క్వాలిటీ ఆర్ట్స్, లిబరల్ ఎడ్యుకేషన్‌కు కొరత ఉంది’ తాను తరచుగా విన్న మాట ‘స్పార్క్ స్టూడియో’కు శ్రీకారం చుట్టడానికి కారణం అయింది. పిల్లలకు ఆన్లైన్ బోధన చేయడానికి ‘స్పార్క్ స్టూడియో’ ద్వారా దేశవ్యాప్తంగా పేరున్న పెయింటర్లు, మ్యూజిషియన్లు, ఇతర ఆర్టిస్ట్‌లను ఒకే వేదిక మీదికి తీసుకు వచ్చింది అనుశ్రీ. ‘స్పార్క్ స్టూడియో’ ప్రారంభమైన కొద్ది నెలల తరువాత... ‘ఎక్స్ట్రా కరిక్యులర్ మార్కెట్లో విపరీతమైన పోటీ ఉంది. మీరు చాలా ఆలస్యంగా దీనిలోకి అడుగు పెట్టారు. ఇప్పటికే ఎంతోమంది సక్సెస్ సాధించారు. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి చేసేదేమిటి?’ ఇలాంటి కామెంట్స్ ఎన్నో వినిపించాయి. ‘వంద వ్యాపారాల్లో నీదొకటి అయినప్పుడు దానిపై నీదైన ముద్ర, శైలి ఉండాలి’ అని గ్రహమ్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తన స్నేహితులైన కౌస్తుబ్ ఖడే, జ్యోతిక సహజనందన్, నమిత గోయెంకాలతో ఒక టీమ్‌గా ఏర్పడింది అనుశ్రీ. ‘నేను బాగా పేరున్న స్కూల్లో చదువుకున్నాను. అయితే హై–క్వాలిటీ ఆర్ట్స్ కరికులమ్‌కు అక్కడ చోటు లేదు. స్పార్క్ స్టూడియో ద్వారా విద్యార్థులకు ఉపయోగపడే నిర్మాణాత్మకమైన కరికులమ్‌ను డిజైన్ చేశాము. పిల్లలు యానిమేషన్, మ్యూజిక్, ఫొటొగ్రఫీ...ఎన్నో నేర్చుకోవచ్చు. తమ పిల్లలు ఎన్నో కళలు నేర్చుకోవచ్చు అనే ఆలోచన తల్లిదండ్రులకు బాగా నచ్చింది. ఆర్ట్స్, మ్యూజిక్ ద్వారా పిల్లల్లో భాషా నైపుణ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతుంది అని ఎంత నచ్చజెప్పినా, వారు డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా లేకపోవడం అసలు సమస్య. మార్కెట్ అంటే ఇదే అనే విషయం ఆలస్యంగా అర్థమైంది. ఇలా ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నాను’ అంటుంది అనుశ్రీ. రెండు సంవత్సరాల ‘స్పార్క్ స్టూడియో’ ప్రయాణం లాభాలు లేవు, నష్టాలు లేవు అన్నట్లుగా ఉండేది. అప్పటికే కొన్ని ప్రసిద్ధ ఎక్స్ట్రాకరిక్యులర్ ఎడ్టెక్ స్టార్టప్‌లు మూత పడ్డాయి. ఈ నేపథ్యంలో ‘ఏం మిస్ అవుతున్నాం’ అంటూ ఆలోచిస్తున్న సమయంలో అనుశ్రీకి తట్టిన ఐడియా....పబ్లిక్ స్పీకింగ్ కోర్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఈ రెండు అంశాలు చేర్చడంతో అప్పటి వరకు బుడి బుడి నడకల ‘స్పార్క్ స్టూడియో’ వేగం పుంజుకుంది. సక్సెస్‌ఫుల స్టార్టప్‌గా నిలిచింది. ‘నమ్మకమే వెన్నెముకగా ఉన్న వ్యాపారం ఇది. నమ్మకాన్ని డబ్బుతో కొనలేము. కష్టపడి సంపాదించుకోవాలి’ అంటుంది అనుశ్రీ గోయెంక. నమ్మకమే వెన్నెముకగా ఉన్న వ్యాపారం ఇది. నమ్మకాన్ని డబ్బుతో కొనలేము. కష్టపడి సంపాదించుకోవాలి. – అనుశ్రీ గోయెంకా తన బృందంతో అనుశ్రీ గోయెంకా -
లాభదాయకతకు దగ్గర్లో బైజూస్
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ బైజూస్ నెమ్మదిగా, స్థిరంగా వృద్ధి చెందుతోందని సంస్థ సీఈవో బైజూ రవీంద్రన్ తెలిపారు. గ్రూప్ స్థాయిలో లాభదాయకతకు చాలా దగ్గర్లోనే ఉన్నామని ఆయన చెప్పారు. బైజూస్ వృద్ధి, భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితిపై ఆందోళనలను తొలగించేందుకు నిర్వహించిన టౌన్‌హాల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా రవీంద్రన్ ఈ విషయాలు తెలిపారు. 1.2 బిలియన్ డాలర్ల టర్మ్ లోన్ బీ (టీఎల్‌బీ) రుణదాతలతో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, మరికొన్ని వారాల్లోనే సానుకూల ఫలితం రాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. అంతర్జాతీయంగా టెక్ కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ బైజూస్ మాత్రం లాభదాయకత లక్ష్యాల దిశగా గణనీయంగా పురోగతి సాధించిందని రవీంద్రన్ చెప్పారు.బైజూస్ ఆర్థిక పని తీరు, రుణ భారం, ఆర్థిక ఫలితాలను ప్రకటించడంలో జాప్యాలు, కంపెనీ వేల్యుయేషన్‌ను ఇన్వెస్ట్మెంట్ సంస్థ ప్రోసస్ 6 బిలియన్ డాలర్లకు కుదించడం తదితర ప్రతికూల పరిణామాల నేపథ్యంలో రవీంద్రన్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. -
బైజూస్‌లో ఏం జరుగుతోంది? ఆడిటర్‌గా తప్పుకున్న డెలాయిట్.. డైరెక్టర్ల రాజీనామా
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ బైజూస్‌లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు కంపెనీ ఆడిటింగ్ బాధ్యతల నుంచి డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ తప్పుకోగా మరోవైపు ముగ్గురు డైరెక్టర్లు రాజీనామా చేశారు. వివరాల్లోకి వెడితే .. 2021–22 ఆర్థిక సంవత్స ఆర్థిక ఫలితాల రూపకల్పనలో తీవ్ర జాప్యం నేపథ్యంలో తమ కాంట్రాక్టు ముగియడానికి మూడేళ్ల ముందే రాజీనామా చేసినట్లు డెలాయిట్ తెలిపింది. ఆడిటింగ్ కోసం తాము తరచుగా బైజూస్ ఎండీ బైజూ రవీంద్రన్‌కి లేఖలు రాస్తూనే ఉన్నప్పటికీ తమకు ఎటువంటి సమాచారం లభించలేదని పేర్కొంది. ఫలితంగా ఇప్పటివరకూ ఆడిట్ ప్రారంభించలేకపోయామని డెలాయిట్ వివరించింది. దీంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు బైజూస్ బోర్డుకు రాసిన లేఖలో తెలిపింది. డెలాయిట్ 2016 నుంచి బైజూస్‌కి ఆడిటర్‌గా వ్యవహరిస్తోంది. మరోవైపు, 2022 ఆర్థిక సంవత్సరం నుంచి వర్తించేలా అయిదేళ్ల పాటు బీడీవో (ఎంఎస్కేఏ అండ్ అసోసియేట్స్)ను చట్టబద్ధ ఆడిటర్లుగా నియమించుకున్నట్లు బైజూస్ మరో ప్రకటనలో తెలిపింది. బీడీవో ప్రస్తుతం ఐసీఐసీఐ, సిస్కో వంటి దిగ్గజాలకు ఆడిటింగ్ సేవలు అందిస్తోంది. టర్నోవరుపరంగా టాప్ అయిదు గ్లోబల్ ఆడిట్ సంస్థల్లో ఒకటిగా ఉంది. ఇక బైజూ రవీంద్రన్తో అభిప్రాయభేదాల కారణంగా డైరెక్టర్ల బోర్డులో ముగ్గురు రాజీనామా చేశారు. పీక్ 15 పార్ట్నర్స్ (గతంలో సెక్వోయా క్యాపిటల్)కి చెందిన జీవీ రవిశంకర్, చాన్ జకర్బర్గ్ ఇనీíÙయేటివ్ ప్రతినిధి వివియన్ వూ, ప్రోసస్కి చెందిన రసెల్ డ్రీసెన్స్టాక్ వీరిలో ఉన్నారు. బోర్డులోని మొత్తం ఆరుగురు సభ్యుల్లో మిగతా ముగ్గురు బైజూ రవీంద్రన్, దివ్యా గోకుల్‌నాథ్, రిజూ రవీంద్రన్ ఉన్నారు. అటు కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బాధ్యతలు చేపట్టే వరకూ ఆగాలని బైజూస్ భావించడమే ఆడిటింగ్ జాప్యానికి కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. బైజూస్ కొత్త గ్రూప్ సీఎఫ్‌వోగా అజయ్ గోయల్ నెల రోజుల క్రితమే చేరారని, వచ్చే వారం తర్వాత నుంచి ఆడిటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని వివరించాయి. -
ఫిజిక్స్ వాలా దూకుడు! రూ. 120 కోట్ల పెట్టుడులు
న్యూఢిల్లీ: ఎడ్టెక్ దిగ్గజం ఫిజిక్స్ వాలా వచ్చే రెండు, మూడేళ్లలో రూ. 120 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. టెక్నాలజీని, ప్లాట్‌ఫాంను అభివృద్ధి చేసుకోవడంతో పాటు ప్రాంతీయ భాషల్లో కంటెంట్‌ను రూపొందించడం, పరిశ్రమ నిపుణులను నియమించుకోవడం తదితర అంశాలపై ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ మహేశ్వరి తెలిపారు. సాధారణంగా కోర్సుల్లో ప్రాక్టికల్ శిక్షణకు అంతగా ప్రాధాన్యం ఉండటం లేదని ఆయన వివరించారు. ప్రాంతీయ భాషల్లో శిక్షణ చాలా తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పరిశ్రమ నిపుణులు ప్రాథమికాంశాల నుంచి బోధించేలా నాణ్యమైన కంటెంట్‌ను పోటీ సంస్థలతో పోలిస్తే చౌకగా అందించడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు. ఫిజిక్స్ వాలా ప్రస్తుతం డేటా సైన్స్, జావా, సీప్లస్‌ప్లస్ వంటి వాటిల్లో హైబ్రిడ్ కోర్సులను రూ. 3,500 నుంచి అందిస్తోంది. ఇదీ చదవండి: Friendship Recession: మరో కొత్త మాంద్యం! ఏంటది.. నిఖిల్ కామత్ ఏమన్నారు? -
నైపుణ్యాలను పెంచుకుంటాం
న్యూఢిల్లీ: కెరీర్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకునేందుకు మన దేశంలో ఎక్కువ మంది నిపుణులు సానుకూల దృక్పథంతో ఉన్నారు. ఎడ్టెక్ ప్లాట్‌ఫామ్ ‘గ్రేట్ లెర్నింగ్’ ఈ మేరకు ఒక అధ్యయనం నిర్వహించి నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయంగా చూస్తే నైపుణ్యాల పెంపు విషయంలో భారత్‌లోనే ఎక్కువ మంది సానుకూల ధోరణితో ఉన్నారు. అలాగే, తమ ఉద్యోగాలను కాపాడుకోగలమని భారత్‌లో 71% మంది నిపుణులు చెప్పగా, అంతర్జాతీయంగా ఇలా చెప్పిన వారు 59 శాతంగానే ఉన్నారు. అంటే భారత్‌లోనే ఎక్కువ మంది ఉద్యోగ భద్రత విషయంలో నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తోంది. నైపుణ్యాల పెంపు, ఈ దిశగా వారిని ప్రేరేపించే అంశాలు, నైపుణ్యాలను పెంచుకోకుండా అడ్డుపడే అంశాలు, కార్యాలయాలు తిరిగి తెరవడం వల్ల నైపుణ్యాల పెంపుపై ప్రభావం గురించి గ్రేట్ లెర్నింగ్ సంస్థ తన నివేదికలో వివరాలు వెల్లడించింది. సర్వే అంశాలు.. ► మన దేశంలో 85 శాతం మంది నిపుణులు అదనపు నైపుణ్యాలు సంపాదించడం ద్వారా తమ కెరీర్లో భవిష్యత్తు అవసరాలకు సన్నద్ధంగా ఉండాలని అనుకుంటున్నట్టు చెప్పారు. కానీ, అంతర్జాతీయంగా చూస్తే 76 శాతం మంది ఈ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ► ఆగ్నేయాసియా దేశాల నుంచి 84 శాతం మంది, ల్యాటిన్ అమెరికా నుంచి 76 శాతం మంది నిపుణులు అదనపు నైపుణ్యాల ప్రాముఖ్యాన్ని తెలియజేశారు. ► అభివృద్ధి చెందిన అమెరికాలో తమ కెరీర్ భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలను సముపార్జించుకుంటామని కేవలం 64 శాతం మంది చెప్పగా, మధ్య ప్రాచ్యం నుంచి 66 శాతం మంది ఈ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ► 2023లోనే తాము నైపుణ్యాలను పెంచుకుంటామని 83 శాతం మంది భారతీయులు చెప్పగా, అంతర్జాతీయంగా 74 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని తెలియజేశారు. ► 71 శాతం మంది భారతీయ నిపుణులు తమ ఉద్యోగాలను నిలుపుకుంటామని చెప్పగా, అంతర్జాతీయంగా 59 శాతం మంది ఈ విధమైన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ► మన దేశంలో 71 శాతం మంది నిపుణులు ప్రస్తుత ఉద్యోగాల్లో కొనసాగుతామని చెప్పారు. అంతర్జాతీయంగా ఇలా చెప్పిన వారు 59 శాతంగా ఉన్నారు. ► అమెరికాలో 59 శాతం మంది నిపుణులు ఉద్యోగ భద్రతను ప్రదర్శించారు. ఆగ్నేయాసియాలో ఇది 60 శాతంగా ఉంది. నేర్చుకోవడానికి సిద్ధం మెజారిటీ ఉద్యోగుల మనోగతం పియర్సన్ స్కిల్ అవుట్‌లుక్ సర్వేలో వెల్లడి తమ కెరీర్ అవసరాలకు అనుగుణంగా ఉండేందుకు తాము కెరీర్ అంతటా నేర్చుకునేందుకు, శిక్షణ తీసుకునేందుకు సుముఖంగా ఉన్నా మని 88% మంది ఉద్యోగులు తెలిపారు. కొత్త భాషను, ముఖ్యంగా ఇంగ్లిష్ నేర్చుకోవడం వల్ల తమ కెరీర్లో పురోగతికి తోడ్పడుతుందని వారు భావిస్తున్నారు. పియర్సన్ స్కిల్ అవుట్‌లుక్ సర్వే లో ఈ విషయాలు తెలిశాయి. అమెరికా, బ్రిటన్, భారత్, బ్రెజిల్లో 4,000 మంది ఉద్యోగుల అభిప్రాయాల ఆధారంగా సర్వే వివరాలు విడుదలయ్యాయి. ► ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా ఉండేందుకు నేర్చుకోవడాన్ని కొనసాగిస్తామని ప్రతి 10 మందిలో 9 మంది చెప్పారు. ► కంపెనీలు తమకు నైపుణ్య శిక్షణను ఆఫర్ చేస్తాయని 75 శాతం మంది చెప్పారు. ► మన దేశంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా ప్రాసెసింగ్, కోడింగ్ భవిష్యత్తు ప్రాధాన్య నైపుణ్యాలుగా ఉన్నాయి. ► భవిష్యత్ మానవ నైపుణ్యాలుగా భాషను జెనరేషన్ జెడ్ గ్రూపులోని వారు (1990– 2010 మధ్య జన్మించిన) చూస్తున్నారు. ► జెనరేషన్ ఎక్స్‌లోని వారు తమ కెరీర్ వృద్ధి పట్ల సానుకూల దృక్పథంతోఉన్నారు. ► గత మూడేళ్లలో ఎదురైన అనిశ్చితుల నేపథ్యంలో తమ కెరీర్‌పై పునరాలోచన చేస్తున్నట్టు 88 శాతం జెనరేషన్ జెడ్ వారు చెప్పారు. -
వావ్.. 2500 ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్న కంపెనీ
సాక్షి,ముంబై: ఐటీ దిగ్గజాల నుంచి స్టార్టప్‌ల దాకా ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాల ఊచకోత వార్తలు ఆందోళన రేపుతోంటే ఒక యూనికార్న్ ఎడ్టెక్ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. 2023,మార్చి నాటికి 2500మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ఫిజిక్స్ వాలా ప్రకటించింది. బిజినెస్ అనలిస్ట్‌లు, డేటా అనలిస్ట్‌లు, కౌన్సెలర్లు, ఆపరేషన్స్ మేనేజర్లు, బ్యాచ్ మేనేజర్లు, టీచర్లు, ఇతర ఫ్యాకల్టీ సభ్యులతో పాటు నిపుణులను నియమిస్తున్నట్లు ఫిజిక్స్ వాలా కంపెనీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. తమ ప్రతిష్టాత్మక బ్రాండ్ వృద్ధి లక్ష్యాలకనుగుణంగానే ఈ నియామకాలని తెలిపింది. అన్నింటికీ మించి విద్యార్థులందరికీ సరసమైన, నాణ్యమైన విద్యను అందించాలనే తమ విజన్‌కు అనుగుణంగా పనిచేసే ఉత్సాహవంతులైన, నిబద్ధతల వారి కోసం చూస్తున్నామని సంస్థ హెచ్ ఆర్ హెడ్, సతీష్ ఖేంగ్రే తెలిపారు. కాగా కంపెనీలో ప్రస్తుతం 6,500 మంది ఉద్యోగులున్నాయి. ఇందులో 2వేల మంది ఉపాధ్యాయులు, విద్యా నిపుణులు ఉన్నారు. గత నెలలో, అప్‌స్కిల్లింగ్ విభాగంలో iNeuronని కొనుగోలు చేసింది కంపెనీ. గత ఏడాది బైజూస్, అనాకాడెమీ, వేదాంతు, ఫ్రంట్‌రో మొదలైన అనేక ఎడ్టెక్ కంపెనీలు భారీ లే-ఆఫ్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
తప్పుడు ప్రకటనలిస్తే...ఎడ్టెక్ కంపెనీలకు స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: తప్పుదారి పట్టించే ప్రకటనలు తదితర అక్రమ వ్యాపార విధానాలను అవలంబిస్తున్న ఎడ్టెక్ కంపెనీలకు ప్రభుత్వం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. పరిశ్రమలో ప్రధాన సంస్థలు స్వీయ నియంత్రణలు పాటించని పక్షంలో కఠిన మార్గదర్శకాలను తీసుకురావలసి ఉంటుందని హెచ్చరించింది. ఎడ్టెక్ విభాగంలో నకిలీ రివ్యూలు పెరగడంతో వీటిని అరికట్టేందుకున్న అవకాశాలపై వినియోగ వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఒక సమావేశంలో చర్చించారు. ఇండియా ఎడ్టెక్ కన్సార్షియం(ఐఈసీ), తదితర పరిశ్రమ సంబంధ సంస్థలతో రోహిత్ కుమార్ చర్చలు నిర్వహించారు. దేశీ ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్(ఐఏఎంఏఐ) ఆధ్వర్యంలో ఐఈసీ నడుస్తోంది. ఈ సమావేశానికి ఐఈసీ సభ్యులతోపాటు ఐఏఎంఏఐ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ జాబితాలో అప్‌గ్రేడ్, అన్అకాడమీ, వేదాంతు, గ్రేట్ లెర్నింగ్, వైట్‌హ్యాట్ జూనియర్, సన్‌స్టోన్ తదితరాలున్నాయి. -
ఉద్యోగాల మార్పు కోసం 49 శాతం మంది...
టాలెంట్ఎడ్జ్ సర్వే.. ముంబై: వచ్చే ఏడాది చాలా మంది ఉద్యోగులు ఉద్యోగాలు మార్పు కోరుకుంటున్నారు. 2017లో దాదాపు 49%కి పైగా ఉద్యోగులు జాబ్ మారాలని భావిస్తున్నారని ఈడీ–టెక్ సంస్థ టాలెంట్ఎడ్జ్ తన నివేదికలో పేర్కొంది. ఇక 50%కి పైగా ఉద్యోగులు గణనీయమైన ఇంక్రిమెంట్ కోరుకుంటున్నారని తెలిపింది. ఉద్యోగాలు మారడానికి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే అంచనాలు కారణమని పేర్కొంది. నివేదికలోని ప్రధానాంశాలు.. ⇔ తమ భవిష్యత్ అంచనాలపై డీమోనటైజేషన్ ఎలాంటి ప్రభావం చూపలేదని సర్వేలో పాల్గొన్న చాలా మంది అభిప్రాయపడ్డారు. ⇔ నోట్ల రద్దు వల్ల రానున్న రోజుల్లో ఆర్థిక వ్య వస్థ బలమైన వృద్ధి బాటలో పయనిస్తుందని వారు అంచనా వేశారు. ⇔ 25–30 ఏళ్ల వయసు గ్రూప్ ఉద్యోగులతో పోలిస్తే.. 21–24 ఏళ్ల వయసు గ్రూప్ వారు ఉద్యోగాలుమారడానికి ఆసక్తి చూపడం లేదు. ⇔ 25–30 ఏళ్ల వయసులో ఉన్న ఉద్యోగులు వచ్చే ఏడాదిలో ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఆశావహంగా ఉంటే.. 21–24 ఏళ్ల వయసులో ఉన్న ఉద్యోగులు మాత్రం 2017లో ప్రమోషన్లు బాగుంటాయని ఆశిస్తున్నారు.