న్యూఢిల్లీ: ఒప్పందంలో భాగమైన షేర్ల మారి్పడి ప్రక్రియను వ్యతిరేకిస్తుండటంపై ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్విసెస్ (ఏఈఎస్‌ఎల్)కు ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ మాతృసంస్థ థింగ్ అండ్ లెర్న్ (టీఎల్‌పీఎల్) నోటీసులు పంపింది. వివరాల్లోకి వెడితే .. 2021లో ఏఈఎస్‌ఎల్‌ను బైజూస్ 940 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. నగదు, షేర్ల మారి్పడి రూపంలోని ఈ డీల్ ప్రకారం ఏఈఎస్‌ఎల్‌లో టీఎల్‌పీఎల్‌కు 43 శాతం, దాని వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌కు 27 శాతం, ఏఈఎస్‌ఎల్ వ్యవస్థాపకుడు చౌదరి కుటుంబానికి 18 శాతం, బ్లాక్‌స్టోన్‌కు 12 శాతం వాటాలు దక్కాయి.
ఒప్పందాన్ని బట్టి ఏఈఎస్‌ఎల్‌ను టీఎల్‌పీఎల్‌లో విలీనం చేయాలి. అయితే, విలీన ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో షేర్ల మార్పిడిని అమలు చేయాలని కోరుతూ చౌదరి కుటుంబానికి టీఎల్‌పీఎల్ నోటీసులు ఇచి్చంది. కానీ మైనారిటీ షేర్‌హోల్డర్లు ఇందుకు నిరాకరించినట్లు సమాచారం. షేర్ల మారి్పడి ప్రక్రియలో పన్నులపరమైన అంశాలు ఉన్నందున.. దానికి బదులుగా పూర్తిగా నగదే తీసుకోవాలని చౌదరి కుటుంబం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆకాశ్ ఆదాయం మూడు రెట్లు పెరిగి రూ. 3,000 కోట్లకు పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment