![LEAD Launches AI-powered Assessment For Schools - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/8/LEAD-MEHTA.jpg.webp?itok=3SPaI4o2)
ముంబై: ఎడ్‌టెక్ సంస్థ లీడ్ తాజాగా పాఠశాలల్లో కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత మూల్యాంకన విధానాన్ని అందుబాటులోకి తెచి్చంది. నిర్దిష్ట తరగతుల విద్యార్థుల స్థాయులను బట్టి మెరుగైన ప్రశ్నలను రూపొందించేందుకు ఇది ఉపయోగపడతుందని సంస్థ సీఈవో సుమీత్ మెహతా తెలిపారు. టీచర్లు అవసరమైతే వీటిని సమీక్షించి, తగు మార్పులు, చేర్పులు కూడా చేసేందుకు వెసులుబాటు ఉంటుందని వివరించారు.
బోధనాంశాలను నేర్చుకోవడంలో విద్యార్థులకు ఎదురవుతున్న సవాళ్లను గుర్తించేందుకు, తగు పరిష్కార మార్గాలను అమలు చేసేందుకు ఇది సహాయకరంగా ఉంటుందని మెహతా పేర్కొన్నారు. అలాగే ఎగ్జామ్ పేపర్ల లీకేజీ సమస్యకు కూడా అడ్డుకట్ట పడుతుందన్నారు. విద్యార్థుల స్థాయిని బట్టి అసెస్‌మెంట్ విధానాన్ని ఎంచుకునే వీలు కలి్పంచే ఈ విధానం .. తమ నెట్‌వర్క్‌లోని 9,000 పైచిలుకు పాఠశాలల్లో, 50,000 మంది పైచిలుకు ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉంటుందని మెహతా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment