![Physics Wallah To Hire 2500 Employees Across Verticals By March - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/30/edtech%20company.jpg.webp?itok=QIWI_1EX)
సాక్షి,ముంబై: ఐటీ దిగ్గజాల నుంచి స్టార్టప్‌ల దాకా ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాల ఊచకోత వార్తలు ఆందోళన రేపుతోంటే ఒక యూనికార్న్ ఎడ్‌టెక్ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. 2023,మార్చి నాటికి 2500మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ఫిజిక్స్ వాలా ప్రకటించింది. బిజినెస్ అనలిస్ట్‌లు, డేటా అనలిస్ట్‌లు, కౌన్సెలర్‌లు, ఆపరేషన్స్ మేనేజర్‌లు, బ్యాచ్ మేనేజర్‌లు, టీచర్లు, ఇతర ఫ్యాకల్టీ సభ్యులతో పాటు నిపుణులను నియమిస్తున్నట్లు ఫిజిక్స్ వాలా కంపెనీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
తమ ప్రతిష్టాత్మక బ్రాండ్ వృద్ధి లక్ష్యాలకనుగుణంగానే ఈ నియామకాలని తెలిపింది. అన్నింటికీ మించి విద్యార్థులందరికీ సరసమైన, నాణ్యమైన విద్యను అందించాలనే తమ విజన్‌కు అనుగుణంగా పనిచేసే ఉత్సాహవంతులైన, నిబద్ధతల వారి కోసం చూస్తున్నామని సంస్థ హెచ్ ఆర్ హెడ్, సతీష్ ఖేంగ్రే తెలిపారు.
కాగా కంపెనీలో ప్రస్తుతం 6,500 మంది ఉద్యోగులున్నాయి. ఇందులో 2వేల మంది ఉపాధ్యాయులు, విద్యా నిపుణులు ఉన్నారు. గత నెలలో, అప్‌స్కిల్లింగ్ విభాగంలో iNeuronని కొనుగోలు చేసింది కంపెనీ. గత ఏడాది బైజూస్, అనాకాడెమీ, వేదాంతు, ఫ్రంట్‌రో మొదలైన అనేక ఎడ్‌టెక్ కంపెనీలు భారీ లే-ఆఫ్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment