ఎడ్‌టెక్‌కు తగ్గిన ఫండింగ్‌ | Reduced funding for ed-tech | Sakshi
Sakshi News home page

ఎడ్‌టెక్‌కు తగ్గిన ఫండింగ్‌

Published Thu, Sep 19 2024 6:38 AM | Last Updated on Thu, Sep 19 2024 9:19 AM

Reduced funding for ed-tech

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దశాబ్ద కాలంలో భారతీయ ఎడ్‌టెక్‌ రంగం నూతన గరిష్టాలను నమోదు చేసింది. ప్రస్తుతం ఈ రంగం నిధుల కొరతను ఎదుర్కొంటోంది. 2021లో దాని గరిష్ట స్థాయితో పోలిస్తే ఈ ఏడాది 47% తగ్గుదల ఉంది. అయితే అభివృద్ధి చెందుతున్న పోకడలు, మార్కెట్‌ స్థితిస్థాపకత ద్వారా ఈ రంగంలో దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రాక్‌ఎక్స్‌ఎన్‌ ఫీడ్‌ జియో రిపోర్ట్‌: ఎడ్‌టెక్‌ ఇండియా 2024 ప్రకారం భారతీయ ఎడ్‌టెక్‌ పర్యావరణ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా మూడవ అత్యధిక నిధులతో కొనసాగుతోంది. ప్రస్తుతం నిధుల సవాళ్లు ఉన్నప్పటికీ దాని సామర్థ్యాన్ని గణాంకాలు నొక్కి చెబుతున్నాయి.  

గరిష్టం నుంచి క్షీణత.. 
భారతీయ ఎడ్‌టెక్‌ రంగం 2024 సంవత్సరంలో ఇప్పటి వరకు 215 మిలియన్‌ డాలర్ల నిధులను సేకరించింది. 2023లో పరిశ్రమ 321 మిలియన్‌ డాలర్లను అందుకుంది. అయితే ఈ మొత్తాలు 2021లో సేకరించిన 4.1 బిలియన్‌ డాలర్ల అత్యున్నత స్థాయితో పోలి్చతే చాలా తక్కువగా ఉంది. 2022లో మొదలైన క్షీణత 2023 వరకు కొనసాగింది. 2022లో ఈ రంగం 87 శాతం క్షీణించింది. ఇది స్థూల ఆర్థికపర ఎదురుగాలులు, పెట్టుబడిదారుల హెచ్చరిక, సంప్రదాయ అభ్యాస నమూనాలకు తిరిగి మారడం వంటి కారణాలతో కూడిన సవాళ్ల వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది.  

పుంజుకునే సంకేతాలు.. 
ఇన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఈ రంగం పుంజుకునే సంకేతాలను చూపుతోంది. 2024 మొదటి అర్ధ భాగంలో ఎడ్‌టెక్‌ రంగంలోకి వచ్చిన నిధులు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 96 శాతం దూసుకెళ్లి 164 మిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. 2023 జనవరి–జూన్‌లో ఇది 81.9 మిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ వృద్ధి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ 2021 క్యూ3లో ఎడ్‌టెక్‌ పరిశ్రమ అందుకున్న 2.48 బిలియన్‌ డాలర్ల త్రైమాసిక గరిష్టంతో పోలిస్తే చాలా తక్కువ.  

మార్కెట్‌ సవాళ్లు ఉన్నప్పటికీ.. 
నిధుల హెచ్చుతగ్గుల మధ్య కీలక కంపెనీలు వ్యూహాత్మక ఎత్తుగడలను కొనసాగించాయి. ఆన్‌లైన్‌ లెండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అవాన్స్‌ 120 మిలియన్‌ డాలర్ల నిధులను పొందింది. న్యాయ విద్య స్టార్టప్‌ అయిన లాసీకో 2024లో పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లింది. దీంతో ఈ ఏడాది ఎడ్‌టెక్‌ రంగంలో ముఖ్యమైన మైలురాళ్లు నమోదయ్యాయి. ఈ పరిణామాలు విస్తృత మార్కెట్‌ సవాళ్లు ఉన్నప్పటికీ పెట్టుబడిని ఆకర్షించడానికి, వృద్ధిని పెంచడానికి రుణాలు, ప్రత్యేక శిక్షణా ప్లాట్‌ఫామ్‌ల వంటి ఎడ్‌టెక్‌లోని సముచిత విభాగాల సామర్థ్యాన్ని నొక్కిచెప్పాయి. 

2024లో ఒకటి మాత్రమే.. 
అన్‌అకాడమీ, ఎరుడిటస్, అప్‌గ్రాడ్‌ వంటి ప్రముఖ ఎడ్‌టెక్‌ కంపెనీలు భారత మార్కెట్‌లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. అన్‌అకాడమీ ఏకంగా 3.44 బిలియన్‌ డాలర్ల విలువతో అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఈ రంగంలో 2023 నుండి కొత్త యునికార్న్‌ ఉద్భవించలేదు. పెట్టుబడిదారుల విశ్వాసం ఇంకా పూర్తిగా కోలుకోలేదని ఇది సూచిస్తోంది. ఈ రంగంలో కొనుగోళ్లు 2021లో ఏకంగా 31 నమోదయ్యాయి. 2023లో ఈ సంఖ్య 13కు పరిమితమైంది. 2024లో ఒకటి మాత్రమే నమోదు కావడం నిరాశ కలిగిస్తోంది.  

మారుతున్న పెట్టుబడుల తీరు.. 
భారతీయ ఎడ్‌టెక్‌ రంగంలో నిధుల ల్యాండ్‌స్కేప్‌ నాటకీయంగా మారిపోయింది. లేట్‌ స్టేజ్‌ నిధులు 2021లో గరిష్ట స్థాయికి చేరుకుని 3.9 బిలియన్‌ డాలర్లు నమోదయ్యాయి. 2023లో 187 మి.డాలర్లు, 2024లో ఇప్పటి వరకు 166 మిలియన్‌ డాలర్లకు పడిపోయింది. ప్రారంభ దశ పెట్టుబడులు 2022లో 654 మి.డాలర్ల నుండి 85 శాతం తగ్గి ఆ తర్వాతి సంవత్సరంలో 96.4 మి.డాలర్లకు వచ్చి చేరాయి. 2021లో 175 మి.డాలర్లకు చేరుకున్న సీడ్‌ స్టేజ్‌ ఫండింగ్‌ 2024లో కేవలం 8.5 మి.డాలర్లకు పడిపోయింది. అన్ని దశలలో తగ్గుతున్న పెట్టుబడులనుబట్టి ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు అవగతమవుతోంది. స్థూల ఆర్థిక అనిశి్చతులు, మహమ్మారి అనంతర విద్యా విధానంలో మార్పులు ఇందుకు కారణం.  

యూఎస్‌ తర్వాత మనమే..   
ప్రస్తుత నిధుల సవాళ్లు ఉన్నప్పటికీ భారతీయ ఎడ్‌టెక్‌ రంగం గ్లోబల్‌ లీడర్‌గా ఉంది. ఆరు యునికార్న్‌లతో విజయవంతంగా కొనసాగుతోంది. యూనికార్న్‌ల సంఖ్య పరంగా యూఎస్‌ తర్వాత రెండవ స్థానంలో భారత్‌ నిలిచింది. మారుతున్న వినియోగదారుల అవసరాలు, అంచనాలకు అనుగుణంగా ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌ విద్యా నమూనాల ఏకీకరణ ద్వారా ఈ రంగం భవిష్యత్తు వృద్ధి ఆధారపడి ఉంది. ఆర్టిఫీíÙయల్‌ ఇంటెలిజెన్స్, తరగతి గదులలో వాయిస్‌ టెక్‌ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను స్వీకరించడం ఆవిష్కరణను ప్రోత్సహిస్తుంది. అలాగే వృద్ధికి కొత్త మార్గాలను సృష్టిస్తోంది. ఉదాహరణకు వ్యక్తిగతీకరించిన అభ్యాసం, స్మార్ట్‌ అసెస్‌మెంట్‌లు, ఏఐ ఆధారిత అడాప్టివ్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు ఈ రంగంలో ప్రముఖంగా మారుతున్నాయి.  

విస్తరణకు అనుకూలమైన విధానం
డిజిటల్‌ విద్య, ప్రభుత్వ–ప్రైవేట్‌ భాగస్వామ్యాలను నొక్కిచెప్పే జాతీయ విద్యా విధానం–2020 వంటి విధాన మద్దతు భవిష్యత్‌ విస్తరణకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. సంప్రదాయ, డిజిటల్‌ వేదికలలో ఉత్తమమైన వాటిని మిళితం చేసే హైబ్రిడ్‌ లెరి్నంగ్‌ మోడల్స్‌ ప్రమాణికంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలలో ఈ విధానం విద్య సౌలభ్యాన్ని, నాణ్యతను పెంపొందిస్తుంది. దీర్ఘకా లిక దృక్పథం సానుకూలంగానే ఉన్నప్పటికీ భారతీయ ఎడ్‌టెక్‌కు ముందున్న మార్గం సవాళ్లతో నిండి ఉంది అని ట్రాక్‌ఎక్స్‌ఎన్‌ నివేదిక చెబుతోంది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement