న్యూఢిల్లీ: ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ నెమ్మదిగా, స్థిరంగా వృద్ధి చెందుతోందని సంస్థ సీఈవో బైజూ రవీంద్రన్ తెలిపారు. గ్రూప్ స్థాయిలో లాభదాయకతకు చాలా దగ్గర్లోనే ఉన్నామని ఆయన చెప్పారు. బైజూస్ వృద్ధి, భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితిపై ఆందోళనలను తొలగించేందుకు నిర్వహించిన టౌన్‌హాల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా రవీంద్రన్ ఈ విషయాలు తెలిపారు.
1.2 బిలియన్ డాలర్ల టర్మ్ లోన్ బీ (టీఎల్‌బీ) రుణదాతలతో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, మరికొన్ని వారాల్లోనే సానుకూల ఫలితం రాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. అంతర్జాతీయంగా టెక్ కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ బైజూస్ మాత్రం లాభదాయకత లక్ష్యాల దిశగా గణనీయంగా పురోగతి సాధించిందని రవీంద్రన్ చెప్పారు.బైజూస్ ఆర్థిక పని తీరు, రుణ భారం, ఆర్థిక ఫలితాలను ప్రకటించడంలో జాప్యాలు, కంపెనీ వేల్యుయేషన్‌ను ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ప్రోసస్ 6 బిలియన్ డాలర్లకు కుదించడం తదితర ప్రతికూల పరిణామాల నేపథ్యంలో రవీంద్రన్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment