
న్యూఢిల్లీ: ఎడ్‌టెక్ దిగ్గజం ఫిజిక్స్ వాలా వచ్చే రెండు, మూడేళ్లలో రూ. 120 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. టెక్నాలజీని, ప్లాట్‌ఫాంను అభివృద్ధి చేసుకోవడంతో పాటు ప్రాంతీయ భాషల్లో కంటెంట్‌ను రూపొందించడం, పరిశ్రమ నిపుణులను నియమించుకోవడం తదితర అంశాలపై ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ మహేశ్వరి తెలిపారు. సాధారణంగా కోర్సుల్లో ప్రాక్టికల్ శిక్షణకు అంతగా ప్రాధాన్యం ఉండటం లేదని ఆయన వివరించారు.
ప్రాంతీయ భాషల్లో శిక్షణ చాలా తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పరిశ్రమ నిపుణులు ప్రాథమికాంశాల నుంచి బోధించేలా నాణ్యమైన కంటెంట్‌ను పోటీ సంస్థలతో పోలిస్తే చౌకగా అందించడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు. ఫిజిక్స్ వాలా ప్రస్తుతం డేటా సైన్స్, జావా, సీప్లస్‌ప్లస్ వంటి వాటిల్లో హైబ్రిడ్ కోర్సులను రూ. 3,500 నుంచి అందిస్తోంది.
ఇదీ చదవండి: Friendship Recession: మరో కొత్త మాంద్యం! ఏంటది.. నిఖిల్ కామత్ ఏమన్నారు?
Comments
Please login to add a commentAdd a comment