valuation
-
ఒక్క డీల్‌తో దూసుకెళ్లిన ఫిజిక్స్‌వాలా
న్యూఢిల్లీ: ఎడ్టెక్ యూనికార్న్ ఫిజిక్స్‌వాలా తాజాగా రూ.1,753 కోట్ల నిధులను సమీకరించింది. సిరీస్–బి రౌండ్లో హార్న్‌బిల్ క్యాపిటల్, లైట్‌స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్, జీఎస్వీ, వెస్ట్‌బ్రిడ్జ్ ఈ మొత్తాన్ని అందించాయి. ఈ డీల్‌తో కంపెనీ విలువ ఏడాదిలో రెండున్నర రెట్లు దూసుకెళ్లి రూ.23,380 కోట్లకు చేరింది.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి ఇక అన్నీ మంచి రోజులేనా?పెద్ద సంస్థల వాల్యుయేషన్‌లో గణనీయమైన తగ్గుదల కారణంగా భారతీయ ఎడ్టెక్ రంగంలో పెద్ద ఎత్తున నిధుల కొరత చాలా కాలంగా ఉంది. ‘ఎడ్టెక్ రంగానికి సవాలుగా ఉన్న ప్రస్తుత సమయంలో తాజా ఫండింగ్ రౌండ్ ఆశావాదానికి దారితీసింది. కంపెనీ అభివృద్ధి, దేశం అంతటా విద్యను ప్రజాస్వామ్యం చేయాలనే లక్ష్యంపై ఇప్పటికే ఉన్న, కొత్త పెట్టుబడిదారుల అచంచల విశ్వాసానికి ఇది నిదర్శనం’ అని ఫిజిక్స్‌వాలా తెలిపింది. -
Flipkart: రెండేళ్లలో రూ.41000 కోట్లు తగ్గిన ఫ్లిప్‌కార్ట్ విలువ!
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వేల్యుయేషన్ గత రెండేళ్లలో రూ. 41,000 కోట్ల మేర (సుమారు 5 బిలియన్ డాలర్లు) తగ్గింది. 2022 జనవరిలో ఇది 35 బిలియన్ డాలర్లుగా ఉండగా ఈ ఏడాది జనవరి 31 నాటికి 35 బిలియన్ డాలర్ల స్థాయికి పరిమితమైంది. ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ ఈక్విటీ స్వరూపంలో వచి్చన మార్పుల పరిశీలనతో ఇది వెల్లడైంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ 8 శాతం వాటాని 3.2 బిలియన్ డాలర్లకు విక్రయించింది. తద్వారా సంస్థ వేల్యుయేషన్ 40 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టినట్లయింది. మరోవైపు, 2024 ఆర్థిక సంవత్సరంలో వాల్‌మార్ట్ 3.5 బిలియన్ డాలర్లతో తన వాటాను 10 శాతం పెంచుకోవడంతో వేల్యుయేషన్ 35 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టినట్లయింది. అయితే, వేల్యుయేషన్ తగ్గిపోయిందనడానికి లేదని, 2023లో ఫోన్‌పే సంస్థను విడగొట్టడం వల్ల సర్దుబాటు అయినట్లుగా మాత్రమే భావించాల్సి ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ వర్గాలు తెలిపాయి. సంస్థ వేల్యుయేషన్ ప్రస్తుతం 38–40 బిలియన్ డాలర్లుగా ఉంటుందని సంబంధిత వర్గాలు వివరించాయి. -
ఫ్లిప్‌కార్ట్‌కు 600 మిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశీ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు అమెరికన్ రిటైల్ దిగ్గజం 600 మిలియన్ డాలర్లు సమకూర్చనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత వేల్యుయేషన్‌కు అదనంగా 5–10% లెక్కగట్టి వాల్‌మార్ట్ ఈ నిధులు అందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, తాజా నిధుల సమీకరణ తర్వాత కంపెనీ వేల్యుయేషన్ ఎంత స్థాయిలో ఉంటుందనేది వెల్లడి కాలేదు. ఇది 40 బిలియన్ డాలర్ల లోపే ఉంటుందని ఇతర వర్గాలు తెలిపాయి. ఫ్లిప్‌కార్ట్ చివరిసారి 37.6 బిలియన్ డాలర్ల విలువతో జీఐసీ, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్, సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ 2 తదితర సంస్థల నుంచి 3.6 బిలియన్ డాలర్లను సమీకరించింది. -
ఐపీవో అధిక వేల్యుయేషన్స్‌పై సెబీ దృష్టి
ముంబై: పబ్లిక్ ఇష్యూలకు సంబంధించి భారీ ప్రీమియంలు, అధిక వేల్యుయేషన్ల అంశాన్ని పరిశీలించనున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చీఫ్ మాధవి పురి బుచ్ తెలిపారు. పెద్దగా తెలియని కంపెనీలు కూడా ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ఫేస్ వేల్యూను తక్కువగా చూపించి, షేరును మాత్రం భారీ ప్రీమియం రేటుకు ఆఫర్ చేస్తున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు పబ్లిక్ ఇష్యూల టైమింగ్‌ను మార్కెట్‌కి వదిలేయాలన్నదే సెబీ ఉద్దేశమని మాధవి చెప్పారు. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నప్పుడే కంపెనీలు ఇష్యూకి వస్తాయని, ఎప్పుడు రావాలనేది సెబీ నిర్దేశించడమనేది ఇటు ఇన్వెస్టర్లు, అటు సంస్థకు ప్రయోజనకరంగా ఉండబోదని ఆమె పేర్కొన్నారు. -
దివాలా పరిష్కార ప్రక్రియ సమయం కుదింపు!
న్యూఢిల్లీ: దివాలా ఆస్తుల పరిష్కార ప్రక్రియను పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని తగ్గించడం, తద్వారా ఆయా రుణ ఆస్తుల విలువ గణనీయమైన కోతను నిరోధించడం లక్ష్యంగా కేంద్రం కసరత్తు ప్రారంభించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ దిశలో దివాలా చట్టాన్ని సవరించడానికి కేంద్రం సిద్ధమవుతున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దివాలా ఆస్తుల పరిష్కారానికి 2016లో అమల్లోకి వచ్చిన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ (ఐబీసీ)కు సవరణలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. బ్యాంకర్లు, న్యాయవాదులతో సహా సంబంధిత వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, రాబోయే వారాల్లో మార్పులు ఖరారు కావచ్చని తెలిపారు. ప్రస్తుతం ఇలా... ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) నుండి ఈ ఏడాది సెప్టెంబర్ చివరి వరకు అందిన గణాంకాల ప్రకారం, ఐబీసి కింద మొత్తం 553 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందుకు సగటు సమయం 473 రోజులు. ఒక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 57 కేసులు పరిష్కారం అయితే, ఇందుకు సగటు సమయం 679 రోజులు తీసుకుంది. 2021–22లో 143 కేసులు పరిష్కారం అయితే ఇందుకు పట్టిన సమయం 560 రోజులు. 2020–21లో 120 కేసులకు 468 రోజుల సమయం తీసుకోవడం జరిగింది. నిజానికి రిజల్యూషన్ ప్రాసెస్ కోసం ఐబీసీ కాలపరిమితి 330 రోజులు. లిటిగేషన్లో క్లిష్టతలుసహా పలు కారణాలతో దివాలా పరిష్కార పక్రియ కాలయాపన జరుగుతోంది. ఈ లోపాలు సవరించడానికి కేంద్రం తాజాగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. -
సంపద సృష్టిలో అదానీ రికార్డ్!
ముంబై: అదానీ గ్రూపు తన విలువను అత్యంత వేగంగా పెంచుకుంది. 2020 ఏప్రిల్ వరకు ఆరు నెలల కాలంలో (2021 నవంబర్–2022 ఏప్రిల్) అదానీ గ్రూపు విలువ 88 శాతం పెరిగి రూ.17.6 లక్షల కోట్లకు చేరింది. ‘బర్గుండీ ప్రైవేట్ హరూన్ ఇండియా 500’ జాబితా బుధవారం విడుదలైంది. రూ.18.87 లక్షల కోట్లతో అదానీ గ్రూపు కంటే ఈ జాబితాలో ముందున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ అదే కాలంలో 13.4 శాతమే పెరిగింది. మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, రెండో స్థానంలో అదానీ గ్రూపు ఉండగా, రూ.12.97 లక్షల కోట్లతో టీసీఎస్ మూడో స్థానంలో ఉంది. 2022 ఏప్రిల్ వరకు ఆరు నెలల్లో టీసీఎస్ విలువ 0.9% తగ్గినా కానీ, మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ ఉన్నాయి. ► అదానీ గ్రూపు కంపెనీల్లో అదానీ గ్రీన్ ఎనర్జీ విలువ ఆరు నెలల్లో 139 శాతం పెరిగి 2022 ఏప్రిల్ నాటికి రూ.4.50 లక్షల కోట్లకు చేరింది. గ్రూపు కంపెనీల్లో అత్యంత వేగంగా ఎక్కువ విలువను పెంచుకున్న కంపెనీ ఇది. దీంతో జాబితాలో ఆరో స్థానానికి ఎగబాకింది. అంతకుముందు ఆరు నెలల క్రితం నాటి జాబితాలో ఇది 16వ స్థానంలో ఉండడం గమనార్హం ► అదానీ విల్మార్ ఇదే కాలంలో 190 శాతం వృద్ధి చెంది రూ.66,427 కోట్లకు ఎగసింది. అదానీ పవర్ 158 శాతం పెరిగి రూ.66,185 కోట్లకు చేరింది. ► అదానీ గ్రూపులో తొమ్మిది కంపెనీల విలువ ఉమ్మడిగా 88.1 శాతం పెరిగి రూ.17.6 లక్షల కోట్లకు చేరింది. టాప్–500 కంపెనీల మొత్తం విలువలో అదానీ గ్రూపు కంపెనీల విలువ 7.6 శాతంగా ఉంది. ► 2020 ఏప్రిల్ నాటికి 6 నెలల్లో భారత్‌లోని టాప్–500 కంపెనీల మార్కెట్ విలువ సగటున కేవలం 2% పెరగ్గా.. అదానీ గ్రూపు కంపెనీల విలువ 88% పెరగడం విశేషం. ► 2021 అక్టోబర్ 30 నాటికి భారత్‌లో టాప్–500 కంపెనీల మార్కెట్ విలువ రూ.231 లక్షల కోట్లుగా ఉంటే, 2022 ఏప్రిల్ నాటికి రూ.232 లక్షల కోట్లకు చేరింది. ► వీటి మార్కెట్ విలువ కొద్దిగానే పెరిగినా.. బీఎస్ఈ 30 షేర్ల కంటే మెరుగ్గానే ఉంది. ఇదే కాలంలో సెన్సెక్స్ 4 శాతం క్షీణించగా, నాస్డాక్ ఏకంగా 17% పతనాన్ని ఎదుర్కొన్నది. ► మార్కెట్ విలువలో క్షీణత చూసినవీ ఉన్నాయి. రామ్‌దేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద్ విలువ ఇదే కాలంలో 17.9 శాతం పడిపోయి రూ.23,000 కోట్లుగా ఉంది. అన్‌లిస్టెడ్ కంపెనీలు.. ► అన్‌లిస్టెడ్ కంపెనీల్లో ఎన్ఎస్ఈ మార్కెట్ విలువ 2022 ఏప్రిల్ వరకు ఆరు నెలల్లో 35.6 శాతం పెరిగి రూ.2.28 లక్షల కోట్లకు చేరింది. ► సీరమ్ ఇన్స్టిట్యూట్ విలువ 4.6 శాతం పెరిగి రూ.1.75 లక్షల కోట్లకు చేరగా, బైజూస్ విలువ 24.7 శాతం వృద్ధి చెంది రూ.1.68 లక్షల కోట్లుగా ఉంది. ► శాతం వారీగా చూస్తే వేదంత్ ఫ్యాషన్స్ విలువ 320 శాతం పెరగ్గా, అదానీ విల్మార్, బిల్ డెస్క్ 173 శాతం మేర (విడిగా) వృద్ధి చెందాయి. -
ఇష్యూ ధర సహేతుకంగా ఉండాలి.. లేదంటే ?
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూలకు సహేతుకమైన ధరే కీలకమని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ అజయ్ త్యాగి తెలిపారు. ఈ విషయంలో మర్చంట్ బ్యాంకర్లు .. నిబంధనలను తూచా తప్పకుండా పాటించడం మాత్రమే కాకుండా వాటి వెనుక గల స్ఫూర్తిని కూడా గుర్తెరిగి వ్యవహరించాలని సూచించారు. ఇటు ఇష్యూకి వచ్చే సంస్థల ఆకాంక్షలు, అటు ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడే విధంగా విస్తృతంగా చర్చలు జరిపి తగు విధంగా ధరను నిర్ణయించాలని పేర్కొన్నారు. ఒకవేళ మధ్యవర్తి సంస్థలు తమ బాధ్యతలకు కట్టుబడకపోతే చర్యలు తీసుకునేందుకు సెబీ వెనుకాడబోదని ఆయన స్పష్టం చేశారు. కొత్త తరం టెక్నాలజీ కంపెనీల నియంత్రణ నిబంధనల్లోనూ తగు సమయంలో మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని చెప్పారు. అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఆఫ్ ఇండియా (ఏఐబీఐ) వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా త్యాగి ఈ విషయాలు వెల్లడించారు. ఇటీవల లిస్టింగ్ తర్వాత పలు సంస్థల షేర్ల ధరలు .. ఇష్యూ ధరతో పోలిస్తే గణనీయంగా పతనమవుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఏడాది ఐపీవోల ద్వారా 76 కంపెనీలు ఏకంగా రూ. 90,000 కోట్లు (నవంబర్ వరకూ) సమీకరించాయి. ప్రైమరీ ఈక్విటీ మార్కెట్లో పాలుపంచుకునే రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. మరోవైపు, ఈ ఏడాది టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లు .. పెద్ద ఎత్తున స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యాయి. జొమాటో ఐపీవోకి బంపర్ స్పందన లభించడంతో నైకా, పేటీఎం, పాలసీబజార్ వంటి టెక్ సంస్థలు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. చదవండి:పేటీఎమ్ ఐపీవో తొలి రోజు.. ప్చ్! -
ప్రముఖ క్రికెటర్లను దాటేసిన నీరజ్ చోప్రా..!
Neeraj Chopra Social Media Valuation: టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించి చరిత్రపుటల్లో కొత్త అధ్యాయాన్ని లిఖించిన విషయం తెలిసిందే. జావెలింగ్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా భారత్‌కు సరికొత్త పతకాన్ని సాధించి రికార్డును నెలకొల్పాడు. సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కూడా నీరజ్ దూసుకుపోయాడు. బంగార పతకం సాధించిన ఒక్కరోజులోనే అతని సోషల్‌మీడియా అకౌంట్లకు గణనీయంగా ఫాలోవర్స్ పెరిగిపోయారు. పలు కంపెనీలు తమ కంపెనీలకు నీరజ్‌ను బ్రాండింగ్ చేయడం కోసం క్యూ కట్టాయి. వాల్యూయేషన్‌లో నీరజ్ హవా...! 23 ఏళ్ల నీరజ్ చోప్రా సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యాన్ని పొందాడు. చోప్రా ఒలింపిక్ గోల్డ్ గెలిచిన రోజు నుంచి సోషల్, డిజిటల్ మీడియా రంగంలో అతడి వాల్యూ విపరీతంగా పెరిగింది. రీసెర్చ్ కన్సల్టెన్సీ సంస్థ యూగోవ్ స్పోర్ట్ నివేదిక ప్రకారం... ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ మెన్షన్ పర్సన్‌గా నీరజ్ నిలిచాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 2.9 మిలియన్ల యూజర్లు నీరజ్ గురించి ప్రస్తావించారు. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫాంలో నీరజ్ ప్రస్తావన సుమారు 2055 శాతంగా ఉంది. దీంతో నీరజ్ చోప్రా సోషల్ మీడియా వాల్యుయేషన్ ఏకంగా 428 కోట్లకు పెరిగింది. సాధారణ ఇండియన్ అథ్లెట్ల కంటే మూడు రెట్లు ఎక్కువ..! నీరజ్ చోప్రాకు జెఎస్డబ్ల్యూ స్పోర్ట్ తన మద్దతును అందిస్తోంది. ప్రస్తుతం జెఎస్డబ్ల్యూ నీరజ్ చోప్రాకు దీర్ఘకాలిక సహకారాన్ని అందించాలని చూస్తోంది. పలు ఇతర బ్రాండ్లు కూడా నీరజ్ చోప్రాపై ఆసక్తి కనబరుస్తున్నాయి. యూగోవ్ స్పోర్ట్ నివేదిక ప్రకారం, గోల్డ్ మెడల్ సాధించినప్పటి నుంచి నీరజ్ చోప్రా సోషల్ మీడియాలో ఇంటారక్షన్స్ సుమారు 86.3శాతం చొప్పున 12.79 మిలియన్లకు పెరిగింది. రికార్డుస్థాయిలో 4.05 మిలియన్ల మేర వీడియో ఎంగేజ్మెంట్ ఇంటారక్షన్స్ నమోదయ్యాయి. ఇది సోషల్ మీడియాలో దిగ్గజ ఇండియన్ అథ్లెట్ల సగటు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. నీరజ్ చోప్రా ప్రస్తుతం సోషల్ మీడియా ఇంటరాక్షన్‌లో కెఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లను దాటేశాడు. సహజంగానే, నీరజ్ చోప్రా సోషల్‌మీడియా ఖాతాల అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య కూడా వేగంగా పెరిగింది, అతని ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ ఇప్పుడు 4.4 మిలియన్లుగా నమోదైంది, ఫాలోవర్స్‌లో 2297శాతం మేర పెరుగుదలను సూచిస్తోంది. -
కోవిడ్-19 దెబ్బ- చౌకగా మారిన షేర్లు
ప్రపంచ దేశాలతోపాటు దేశీయంగానూ కరోనా వైరస్ విస్తరించడంతో పలు రంగాలు కుదేలయ్యాయి. కోవిడ్-19ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్‌డవున్ విధించడంతో ఆర్థిక వ్యవస్థ మందగమన బాటపట్టింది. పలు బిజినెస్‌లకు డిమాండ్ పడిపోవడంతోపాటు.. ఉత్పత్తి, సరఫరా సమస్యలు తలెత్తాయి. దీంతో వేల సంఖ్యలో ఉద్యోగాల కోతకు తెరలేచింది. ప్రపంచ దేశాలన్నీ లాక్‌డవును అనుసరించడంతో దేశాల మధ్య ప్రయాణాలు రద్దయ్యాయి. వెరసి అటు టూరిజం, హోటళ్లు, విమానయానంతోపాటు.. ఇటు మల్టీప్లెక్స్‌లు, ఫ్యాషన్ రిటైలింగ్ తదితర రంగాలలో కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయి. దీంతో మార్చిలో ప్రపంచ మార్కెట్ల బాటలో దేశీ మార్కెట్లు సైతం కుప్పకూలినప్పటికీ తదుపరి ఏప్రిల్‌లో బౌన్స్‌బ్యాక్ సాధించాయి. అయినప్పటికీ పలు రంగాలకు చెందిన కౌంటర్లు ఇప్పటికీ ఏడాది గరిష్టాలతో పోలిస్తే చౌకగా ట్రేడవుతున్నాయి. మారిన పరిస్థితులలో ఇటీవల ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాలకు డిమాండ్ పెరుగుతూ వచ్చినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. రుణ చెల్లింపుల వాయిదాలపై ఆర్బీఐ మారటోరియం విధించినప్పటికీ ఆర్థిక మందగమనం కారణంగా కొంతమేర ఎస్ఎంఈ, కార్పొరేట్ తదితర రుణాల నాణ్యత దెబ్బతినే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితంగా ఎన్బీఎఫ్సీ, బ్యాంకింగ్ రంగ కౌంటర్లు సైతం బలహీనంగా కదులుతున్నట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం.. 20-50 శాతం డౌన్ లాక్‌డవున్ ప్రకటించిన మార్చి 24 నుంచి బీఎస్ఈ-500లోని పలు కంపెనీలు 20-50 శాతం మధ్య పతనమయ్యాయి. జాబితాలో పలు రంగాలు, కంపెనీలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా కొన్ని కౌంటర్లను పరిశీలిస్తే.. చాలెట్ హోటల్స్ 49 శాతం పతనమైంది. ఏడాది కాలంలో 71 శాతం కుప్పకూలింది. కంపెనీ ఆదాయంలో సగ భాగం విదేశీ టూరిస్టుల నుంచే సమకూరుతుందని విశ్లేషకులు తెలియజేశారు. ఇక లెమన్ ట్రీ హోటల్స్ గత రెండు నెలల్లో 33 శాతం క్షీణించగా.. గరిష్టం నుంచి 74 శాతం పడిపోయింది. ఇతర కౌంటర్లలో మల్టీప్లెక్స్ కంపెనీ పీవీఆర్ షేరు 38 శాతం నీరసించగా.. గరిష్టం నుంచి 71 శాతం తిరోగమించింది. మాల్స్‌పై లాక్‌డవున్ కొనసాగుతుండటం, ఓటీటీ ప్లాట్‌ఫామ్ పుంజుకోవడం ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫైనాన్స్ వీక్ కోవిడ్-19 ధాటికి ఫైనాన్షియల్ రంగ కౌంటర్లూ బలహీనపడ్డాయి. ఇటీవల కొంతమేర రికవర్ అయినప్పటికీ.. పీఎస్‌యూ, ప్రయివేట్ బ్యాంక్, ఎన్బీఎఫ్సీ కంఔటర్లు డీలాపడ్డాయి. పీఎన్బీ, ఆర్బీఎల్, డీసీబీ, బీవోబీలతోపాటు.. చోళమండలం ఫైనాన్షియల్, శ్రీరామ్ సిటీ యూనియన్, రెప్కో హోమ్ తదితరాలు గత రెండు నెలల్లో 22-33 శాతం మధ్య క్షీణించాయి. పెట్టుబడుల ఆవశ్యకత, మొండిబకాయిలు పెరగనున్న అంచనాలు ఇందుకు కారణంకాగా.. ఆదిత్య బిర్లా ఫ్యాషన్, ఫ్యూచర్ రిటైల్, షాపర్స్ స్టాప్ సైతం 30-34 శాతం మధ్య వెనకడుగు వేశాయి. -
స్టార్టప్స్ వేల్యుయేషన్స్‌పై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: కుప్పతెప్పలుగా పుట్టుకొచ్చిన స్టార్టప్ సంస్థలు భారీ వేల్యుయేషన్స్ దక్కించుకుంటూ ఉండటంపై కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ దృష్టి సారించింది. ఈ స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు భారీ ప్రీమియంతో షేర్లు తీసుకోవడం వెనుక అసలు కారణాలను తెలుసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. తొలి విడత నిధుల సమీకరణ తర్వాత వేల్యుయేషన్స్ గణనీయంగా పడిపోయిన కంపెనీలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 2013 నుంచి నిధులు సమీకరించిన 2,000 పైచిలుకు స్టార్టప్స్‌కు గత 45 రోజుల్లో నోటీసులు పంపినట్లు సమాచారం. అసలు ఏ ప్రాతిపదికన ఇంత వేల్యుయేషన్ లెక్కగట్టి నిధులు సమీకరించారో వివరణనివ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. అలాగే ఏదైనా ప్రభుత్వ పథకం కింద మినహాయింపులేమైనా పొందాయా అన్న విషయాన్ని కూడా తెలపాలని నోటీసుల్లో సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘మీ స్టార్టప్ సంస్థ అధిక ప్రీమియంతో షేర్లను కేటాయించడం జరిగింది. దీన్ని ఏ విధంగా సమర్ధించుకుంటారు. అలాగే, స్టార్టప్‌కి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి మినహాయింపులు పొందారో తెలపాలి‘ అంటూ స్టార్టప్‌లకు ఎంసీఏ నోటీసులు పంపింది. అయితే, వీటిల్లో ట్యాక్సేషన్ గురించి లేదా పెనాల్టీల గురించిన ప్రస్తావన ఏమీ లేదు. వేల్యుయేషన్‌ను ప్రభావితం చేసే అంశాలు అనేకం.. మరోవైపు, స్టార్టప్స్ వేల్యుయేషన్స్ అనేవి భవిష్యత్ లాభదాయకత మొదలైన అనేక అంశాల ఆధారంగా ఉంటాయని పన్నుల నిపుణులు తెలిపారు. వేల్యుయేషన్ లెక్కింపునకు పాటించే విధానాలు సందర్భానుసారంగా వివాదాస్పదంగానూ కనిపించవచ్చని పేర్కొన్నారు. ఇక అధిక ప్రీమియంతో నిధులు సమీకరించినా.. వ్యాపార పరిస్థితులు, తీవ్ర పోటీ, అధిక వృద్ధి సాధనలో మేనేజ్మెంట్ విఫలం కావడం వంటి అంశాల కారణంగా వేల్యుయేషన్ పడిపోయే అవకాశాలు ఉన్నాయని ట్యాక్స్ నిపుణులు తెలిపారు. ఆదాయ పన్ను శాఖ కూడా 2016లో స్టార్టప్స్ నుంచి ఇలాంటి వివరణే అడిగిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. తొలి రౌండు నిధుల సమీకరణ తర్వాత వేల్యుయేషన్స్ పడిపోయిన పక్షంలో స్టార్టప్‌లు 33 శాతం పన్నులు కట్టాలంటూ ఆదాయ పన్ను శాఖ డిమాండ్ చేస్తోంది. అయితే, ఏంజెల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులను మాత్రమే ఆదాయ పన్ను శాఖ ప్రశ్నించగా.. ఎంసీఏ మాత్రం వెంచర్ క్యాపిటల్, పీఈ లావాదేవీల సహా అన్ని రకాల పెట్టుబడులను నోటీసుల పరిధిలోకి చేర్చింది. ఆదాయ పన్ను శాఖ నోటీసులపై స్టార్టప్‌లు ఇంకా న్యాయపోరాటం కొనసాగిస్తుండగానే.. తాజాగా ఎంసీఏ నోటీసులు మరిన్ని తలనొప్పులు తెచ్చిపెట్టనున్నాయి. -
నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం
ఆదిలాబాద్‌టౌన్ : పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం జిల్లా విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం నుంచి ఈనెల 13వరకు జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ పాఠశాలలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం జరగనుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లా పరిధిలోని 2,314 మంది ఉపాధ్యాయులకు విధులు అప్పగించారు. 11 మంది ఏసీఓలను, 1524 మంది ఏఈలను, 259 సీఈలను 520 స్పెషల్ అసిస్టెంట్లను నియమించారు. 24 జిల్లాలకు సంబంధించి 5,64,626 జవాబు పత్రాలను జిల్లాకు కేటాయించారని పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ అనురాధ తెలిపారు. తెలుగు, ఉర్దూ జవాబు పత్రాలు 90,233, హింది 68,450, ఆంగ్లం 65,196, గణితం 98,794, సామాన్యశాస్త్రం 98,215, సాంఘిక శాస్త్రం 1,43,739 జవాబు పత్రాలను జిల్లాకు కేటాయించినట్లు తెలిపారు. డీఈవో క్యాంప్ ఆఫీసర్‌గా, డెప్యూటీ ఈఓ, పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. మూల్యాంకనం ఉదయం 9 నుంచిమధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు జరగనుంది. రోజుకో ఉపాధ్యాయుడికి 40 పేపర్ల చొప్పున మూల్యాంకనం చేసేందుకు ఇవ్వనున్నారు. స్పాట్ బహిష్కరణ వాయిదా.. స్పాట్ బహిష్కరిస్తామని ప్రకటించిన ఉపాధ్యాయ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శనివారం రాత్రి చర్చలు జరిపారు. చర్చలు సఫలం కావడంతో స్పాట్ బహిష్కరణ వాయిదా వేస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. 34 డిమాండ్లతో జాయింట్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ యూనియన్ గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. చర్చలు జరిపిన డెప్యూటీ సీఎం త్వరలో సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో స్పాట్ యథావిధిగా జరగనుంది. కాగా డీటీఎఫ్ సంఘం స్పాట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించింది. -
మూల్యాంకనంపై మీమాంస
నల్లజర్ల/నిడమర్రు : విద్యా సంవత్సరం పూర్తయి 10 రోజులు దాటింది. ముందెన్నడూ లేనివిధంగా వేసవి సెలవుల ముందే కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. 6నుంచి 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన సమ్మెటివ్–3 (వారి్షక) పరీక్షల జవాబు పత్రాల సంగ్రహణాత్మక మూల్యాంకన (సమ్మెటివ్ అసెస్మెంట్) విషయంలో విద్యాశాఖ నిర్ణయాలతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ఫలితంగా వీటి మూల్యాంకన వాయిదా పడగా, ఎట్టకేలకు సోమవారం నుంచి 6, 7 తరగతుల జవాబు పత్రాల్లో 5 శాతం మూల్యాంకన మాత్రమే ప్రారంభమైంది. అందుబాటులో ఉన్న సబ్జెక్ట్ నిపుణులతో ఈ ప్రక్రియను అధికారులు హడావుడిగా ప్రారంభించారు. అయితే, 8, 9వ తరగతుల జవాబు పత్రాల మూల్యాకనంపై అధికారులు నేటికీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో మీమాంస నెలకొంది. టెన్త స్పాట్‌తో ఆలస్యం 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకన (స్పాట్ వేల్యూయేషన్)లో హైసూ్కల్ ఉపాధ్యాయులు వి«ధులు నిర్వహిస్తున్నారు. మరోపక్క పాఠశాలల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించినట్టు చెబుతూనే ‘సవరణాత్మక బోధన’ అనే 100 రోజుల కార్యక్రమం ప్రారంభించారు. ఇప్పటికే పాఠశాలల్లో సిబ్బంది కొరత కారణంగా సవరణాత్మక బోధన తలకు మించిన భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో బాహ్య మూల్యాంకనానికి వెళ్లేందుకు ఉపాధ్యాయులు ముందుకు రావడం లేదు. ఫలితంగా 6 నుంచి 9వ తరగతుల మూల్యాకనం మూలనపడింది. అరకొరగానే ప్రారంభం జిల్లాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 2.18 లక్షల మంది విద్యార్థులు సమ్మెటివ్–3 పరీక్షలు రాశారు. ప్రతి తరగతికి 6 చొప్పున సుమారు 14 లక్షల వరకూ జవాబు పత్రాలు ఉన్నాయి. అందుబాటులో ఉన్న సిబ్బందిని ఉపయోగించుకుని మూల్యాంకన అయినకాడికి పూర్తి చేసేలా జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. 8, 9వ తరగతుల మూల్యాకనం 100 శాతం జవాబు పత్రాలను బాహ్య మూల్యాంకనం చేయాల్సి ఉంది. సీసీఈ విధానంలో 8, 9వ తరగతుల్లో లభించిన మార్కుల ఆధారంగా పదో తరగతిలో ఇంటర్నల్ మార్కులు ఇవ్వాల్సి ఉం టుంది. దీనివల్ల విద్యార్థుల జవాబు పత్రాలను వారు చదివిన పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు దిద్దితే అవకతవకలు చోటుచేసుకునే అవకాశం ఉంది. దీంతో వాటిని బాహ్య మూల్యాకనం (బయటి ఉపాధ్యాయులతో దిద్దించడం) చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ జవాబు పత్రాలు 1.8 లక్షల వరకూ ఉంటాయి. వీటిని దిద్దాలంటే మండలానికి 50 నుంచి 60 మంది ఉపాధ్యాయులు అవసరం. దీంతో టెన్త్ స్పాట్ ముగిసిన తర్వాత ఆ సిబ్బందిని కలుపుకుని ఈనెల 20 లోపు మూల్యాకనం పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. మొత్తం మీద పదో తరగతి స్పాట్ వేల్యూయేషన్ మాదిరిగా తొలిసారి 8, 9 తరగతుల మూల్యాకనం ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. 20లోగా పూర్తి చేస్తాం పదవ తరగతి స్పాట్ వేల్యూయేషన్ వల్ల సిబ్బంది కొరత ఏర్పడింది. ఈ కారణంగానే సమ్మెటివ్ అసెస్మెంట్–3 బాహ్య మూల్యాకనం ప్రక్రియ ఆలస్యమైంది. ఉన్న సిబ్బందిని ఉపయోగించుకుని తొలివిడతగా 6, 7 తరగతులు, తర్వాత 8, 9 తరగతులు బాహ్య మూల్యాంకన పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నాం. 10వ తరగతి స్పాట్‌కు వెళ్లిన ఉపాధ్యాయులంతా ఈనెల 15 నుంచి అందుబాటులో ఉంటారు. 6, 7 తరగతులు బోధించే ఉపాధ్యాయులను టెన్త్ స్పాట్ నుంచి∙తప్పించాం. మొత్తంగా ఈనెల 20వ తేదీలోగా మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేస్తాం. – ఆర్ఎస్ గంగాభవాని, డీఈవో -
జంబ్లింగ్ జగడం
ఏలూరు సిటీ : విద్యారంగంలో సర్కారు తీసుకొస్తున్న సంస్కరణలతో గందరగోళ పరిస్థితులు నెల కొంటున్నాయి. చట్టాలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే వాటికి భిన్నంగా నూతన విధానాలు అమలు చేసేందు కు ప్రయత్నించటాన్ని ఉపాధ్యాయ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈనెల 21 నుంచి పాఠశాల విద్యార్థులకు నిర్వహించే సమ్మెటివ్–1 పరీక్షకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనను జంబ్లింగ్ విధానంలో చేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ కామన్ పరీక్షా విధానం అమలు చేయటాన్ని స్వాగతిస్తున్న ఉపాధ్యాయులు మూల్యాంకనలో జంబ్లింగ్ విధానాన్ని అమలు చేయాలనే నిర్ణయాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక మండలంలోని విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను వేరే మండలానికి పంపించి మూల్యాంకన చేయించడం వల్ల అనే సమస్యలు ఉత్పన్నమవుతాయని వాదిస్తున్నారు. విద్యాబోధనకు విఘాతమే సమ్మెటివ్–1 పరీక్షలకు సంబంధించి విద్యార్థులందరికీ ఏకీకృత (కామన్) ప్రశ్నాపత్రాలను ఇస్తారు. దీని ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులంతా ఒకే రకమైన పరీక్ష రాయాల్సి ఉంటుంది. టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో అయితే ప్రశ్నాపత్రాలను పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు పోలీస్ బందోబస్తు నడుమ విద్యా శాఖ అధికారులు విడుదల చేస్తారు. సమ్మెటివ్ కామన్ పరీక్షకు అటువంటి అవకాశం లేదు. దీనివల్ల పారదర్శకత లోపిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఒక మండలానికి సంబంధించిన జవాబు పత్రాలు ఇతర మండలాల్లోని స్కూల్ కాంప్లెక్స్‌ల్లో మూల్యాంకన చేస్తారు. దీనివల్ల వాటిని దిద్దేందుకు వెళ్లే ఉపాధ్యాయులు 15నుంచి 20రోజులపాటు తరగతులకు దూరమవుతారు. ఫలితంగా విద్యాబోధన కుంటుపడుతుందని, దీనివల్ల విద్యార్థులు నష్టపోతారని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఏడాదిలో మూడు సమ్మెటివ్ పరీక్షలు జరుగుతాయి. ఆ జవాబు పత్రాల మూల్యాంకన కోసం ఉపాధ్యాయులు మొత్తంగా 45 రోజులకుపైగా పాఠశాలలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. విద్యాహక్కు చట్టం–09 ప్రకారం విద్యార్థి వయసు ఆధారంగా పాస్, ఫెయిల్‌తో సంబంధం లేకుండా పై తరగతులకు పంపించాల్సి ఉంది. ఇక నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) విధానంలోనూ ఉపాధ్యాయుడే విద్యార్థికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. విద్యాహక్కు చట్టం ఇలా చెబుతుంటే.. విద్యాశాఖ అధికారులు కొత్త విధానాలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇదో ప్రహసనమే జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో 6నుంచి 10వ తరగతి విద్యార్థులు సుమారు 2.50 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ సమ్మెటివ్–1 పరీక్షలో జవాబు పత్రాల మూల్యాంకన జంబ్లింగ్ విధానంలో చేపడతారు. ఐదు పరీక్షలకు సంబంధించి లక్షల సంఖ్యలో జవాబు పత్రాలను మూల్యాంకన చేయటం ప్రహసనంగా మారనుంది. ఇలా ఏడాదిలో మూడు పరీక్షలకు జవాబు పత్రాల మూల్యాంకన చేయటం సామాన్యమైన విషయం కాదంటున్నారు. నాణ్యమైన విద్య అంటూనే విద్యారంగాన్ని కష్టాల్లోకి నెట్టేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కామన్ పరీక్ష మంచిదే కానీ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు కామన్ పరీక్షలు నిర్వహించటం మంచిదే. కానీ.. జవాబు పత్రాల మూల్యాంకనను జంబ్లింగ్ పద్ధతిలో చేయాలనే ఆలోచన సరికాదు. దీనివల్ల ఉపాధ్యాయులు పాఠశాలలకు దూరమవుతారు. విద్యార్థులకు సరైన బోధన అందదు. అధికారులు ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవటం మానుకోవాలి – బీఏ సాల్మన్‌రాజు, ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్ జిల్లా శాఖ సంస్కరణలు ఇలాకాదు విద్యారంగంలో ఒకేసారి సంస్కరణలు చేస్తే ఆశించిన స్థాయిలో ఫలితాలు రావు. ఉపాధ్యాయ సంఘాలు, విద్యారంగ నిపుణులు, ప్రైవేట్ విద్యాసంస్థలతో చర్చించి విద్యార్థికి ప్రయోజనం కలిగేలా విధానాలు రూపొందించాలి. విద్యాహక్కు చట్టం, సీసీఈ విధానాలకు భిన్నంగా నూతన విధానాలు ఉంటున్నాయి. జవాబు పత్రాల మూల్యాంకనలో జంబ్లింగ్ విధానం సమర్థనీయం కాదు. – ఎంబీఎస్ శర్మ, ఉపాధ్యక్షుడు, అపుస్మా -
ఏటీఎం వ్యాల్యువేషన్ చేస్తామని మోసం..
వివరాలన్నీ తెలుసుకొని రూ.97 వేలు డ్రా లబోదిబోమంటున్న బాధితుడు మేడ్చల్‌రూరల్ : ఏటిఎం కార్డు వ్యాల్యువేషన్ గడువు ముగిసిందని ఫోన్లో వివరాలు తెలుసుకుని ఓ వ్యక్తిని మోసగించారు. అతడి ఖాతా నుంచి భారీగా నగదు డ్రా చేసుకున్న సంఘటన మేడ్చల్‌లో శనివారం చోటు చేసుకుంది. మేడ్చల్‌లోని సూర్యనగర్‌కాలనీవాసి శ్రీనివాస్ మునిరాబాద్ గ్రామంలో సాస్ తయారీ కంపెనీ నిర్వహిస్తున్నాడు. కంపెనీ లావాదేవీల కోసం మేడ్చల్‌లోని కెనరా బ్యాంక్‌లో ఖాతా తెరిచి తన లావాదేవీలు కూడా కొనసాగిస్తున్నాడు. కాగా ఈనెల 7వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి అతడికి ఫోన్ చేసి మీ ఏటీఎం కార్డు వ్యాల్యువేషన్ గడువు ముగిసిందని కార్డు వెనుక ఉన్న నంబర్‌ను తెలపాలని చెప్పారు. వివరాలు తెలిపే ప్రాసస్ మొదలుపెడతామని నమ్మబలికాడు. దీంతో శ్రీనివాస్ అన్ని వివరాలు తెలిపాడు. అదే రోజునే బీహర్ రాష్ట్రంలో స్నాప్‌డీల్ కొనుగోలుకు రూ.71,369 ఖాతా నుంచి క్రెడిట్ అయినట్లు శ్రీనివాస్‌కు మెసేజ్ వచ్చింది. తర్వాత 9వ తేదీన ఊదుసార్లు ఏటీఎం నుంచి రూ.25,970 డ్రా అయ్యాయి. దీంతోతో బాధితుడు 9వ తేదీన బ్యాంక్‌కు వెళ్లి అధికారులతో మాట్లాడాడు. బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో శ్రీనివాస్ సైబర్ క్రైం పోసులకు ఫిర్యాదు చేశారు. తనను మోసం చేసిన వారిని పట్టుకుని న్యాయం చేయాలని, మరెవ్వరికి తనలా మోసపోకుండా జాగ్రత్త పడాలని బాధితుడు శ్రీనివాస్ తెలిపారు. -
మూల్యాంకనంపై శిక్షణ ఇవ్వాలి
ఎయిడెడ్ మేనేజ్మెంట్ స్కూల్స్ అసోసియేషన్ మంత్రికి వినతి ఎస్కేయూ : సమగ్ర మూల్యాంకన పద్ధతిపై శిక్షణ ఇవ్వాలని ఏపీ అన్ ఎయిడెడ్ మేనేజ్మెంట్ స్కూల్స్ అసోసియేషన్ కోరింది. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కుసుమ పుల్లారెడ్డి అధ్యక్షతన మంత్రి గంటాకు వినతి పత్రం అందచేశారు. ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు ఇదే తరహాలో సమగ్ర మూల్యాంకనం పై శిక్షణ ఇవ్వాలని విన్నవించారు. జిల్లా కార్యదర్శి గాజుల చం ద్ర, జిల్లా గౌరవధ్యక్షుడు జంగటి అమర్నాథ్, స్టేట్ జాయింట్ సెక్రెటరీ కణేకంటి రామిరెడ్డి, కే. సుబ్బారెడ్డి, నాగరాజు, ఇక్బాల్, రవిశంకర్ ప్రసాద్, రఘనాథరావు, మధుసూదన్‌రెడ్డి, రామ్మోహన్, సంజీ వరెడ్డి, శ్రీనివాసులు, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
పది మూల్యాంకనంలో మార్పులు
ఈ ఏడాది నుంచి అమలుకు విద్యాశాఖ కసరత్తు గురజాల: విద్యా వ్యవస్థలో బట్టీ విధానానికి ఇక కాలం చెల్లనుంది. ఈ విధానం నుంచి విద్యార్థులను బయటపడేసేందుకు రాష్ట్ర విద్యా శాఖ సమాయత్తమైంది. ఇందులో భాగంగానే మూల్యాంకన విధానంలో మార్పులు..చేర్పులు తీసుకొచ్చింది. పదో తరగతి ప్రతి సబ్జెక్టులో సిద్ధాంతం (థియరీకి)80 మార్కులు, ఇంటర్నల్ మూల్యాంకనానికి 20 మార్కులు వేయనున్నారు. ఈ ఏడాది నుంచి పబ్లిక్ పరీక్షలకు ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. బట్టీ విధానానికి స్వస్తి... కచ్చితంగా వస్తాయనే ప్రశ్నలను కొందరు విద్యార్థులతో బట్టీ పట్టిస్తున్నారు. ఇకపై విద్యార్థులు సొంతంగా ఆలోచించి బహుళ సమాధానాలను రాసే వీలు కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు పదో తర గతి పబ్లిక్ పరీక్షలను ప్రైవేట్‌గా వేలాది మంది విద్యార్థులు రాసేవారు. నూతన విధానంలో ఈ అవకాశముండదు. నూతన విధానంలో పరీక్షలిలా.... - కొత్త విధానంలో పదో తరగతి హిందీ మినహా మిగిలిన పేపర్లన్నీ రెండేసి పేపర్లుతో కలిపి మెత్తం 11 పేపర్లు ఉంటాయి. - ఒక పేపర్‌కు 40 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. ఇంటర్నల్ మూల్యాంకనం ద్వారా 20 మార్కులు కేటాయిస్తారు. - ప్రతి మూల్యాంకనంలో నోటు పుస్తకాలు రాయడం, లఘు పరీక్షలు ఉంటాయి. త్రై మాసిక, అర్ధ సంవత్సర పరీక్షల మార్కులను బట్టి ఆ 20 మార్కుల్లో కలుపుతారు. - నిరంతర మూల్యాంకనంలో విద్యార్థులు సాధించే ఫలితాలను ప్రతి నెలా వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఈ ఏడాది నుంచి నూతన విధానం అమలు.. ఈ ఏడాది నుంచి సీసీఈ విధానం అమలు చేస్తున్నారు. పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పరీక్ష పత్రం ఇవ్వనున్నారు. నూతన విధానంతో పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. – డిప్యూటీ డీఈఓ శేషుబాబు, సత్తెనపల్లి -
కాఫీ డే ఐపీవో 14న
ధరల శ్రేణి రూ. 316-328 రూ. 1,150 కోట్ల సమీకరణ దాదాపు మూడేళ్లలోనే అతి పెద్ద ఐపీవో ముంబై: కెఫె కాఫీ డే (సీసీడీ)ని నిర్వహించే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ ఈ నెల 14న ఐపీవోకి రానుంది. ఇందుకోసం షేర్ల ధరల శ్రేణిని రూ. 316-328గా నిర్ణయించింది. తద్వారా రూ. 1,150 కోట్లు సమీకరించనుంది. దీంతో దాదాపు 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 6,500 కోట్లు) వాల్యుయేషన్‌ని దక్కించుకునే అవకాశముంది. ఈ నెల 16న ఐపీవో ముగుస్తుంది. గడిచిన మూడేళ్లలో ఇదే భారీ ఐపీవో కానుండటం గమనార్హం. కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఐపీవో మార్కెట్ .. కాఫీ డే రాకతో మళ్లీ కళకళ్లాడగలదని అంచనాలు నెలకొన్నాయి. దీన్ని బట్టే ఇన్ఫీబీమ్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ తదితర సంస్థలు కూడా ఐపీవోకి రానున్నాయి. ఇన్ఫీబీమ్.. భారత్‌లో ఐపీవోకి వస్తున్న తొలి ఈ-కామర్స్ సంస్థ కాగా, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్.. ఇండిగో బ్రాండ్ పేరిట విమానయాన సర్వీసులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో వచ్చిన ఐపీవోలన్నీ చిన్న మొత్తాలకు సంబంధించినవే. 2014లో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ఆరు సంస్థలు కలిసి కేవలం రూ. 1,528 కోట్లే సమీకరించగలిగాయి. విస్తరణకు నిధులు: ఐపీవోలో దాదాపు రూ. 15 కోట్ల విలువ చేసే షేర్లను తమ కంపెనీలో పనిచేసే అర్హులైన ఉద్యోగుల కోసం కాఫీ డే కేటాయిస్తోంది. కనీసం 45 షేర్ల చొప్పున బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. సమీకరించిన నిధుల్లో రూ. 635 కోట్లు.. హోల్డింగ్ కంపెనీ రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగించనుంది. మరో రూ. 290 కోట్లు వచ్చే 18 నెలల్లో కార్యకలాపాల విస్తరణ కోసం వెచ్చించనున్నట్లు, మిగతా రూ. 125 కోట్లను కాఫీ వ్యాపారాభివృద్ధికి ఉపయోగించనున్నట్లు సంస్థ చైర్మన్ వీజీ సిద్ధార్థ తెలిపారు. ప్రతి సంవత్సరం 135 కొత్త స్టోర్స్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. సిద్ధార్థ సహా ప్రమోటర్లకు కంపెనీలో 92.74 శాతం వాటాలు ఉన్నాయి. -
ఫ్లిప్‌కార్ట్ @ లక్ష కోట్లు!
కంపెనీ ప్రస్తుత వాల్యుయేషన్ 15 బిలియన్ డాలర్లు.. * త్వరలో 800 మిలియన్ డాలర్ల పెట్టుబడి * ఆ తరవాత నుంచి రుణ సమీకరణపై దృష్టి బెంగళూరు/న్యూఢిల్లీ: నిధుల కోసం ఇప్పటిదాకా ఇన్వెస్టర్లపై ఆధారపడిన భారతీయ ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్... ఇకపై రుణాలు సేకరించాలని భావిస్తున్నట్లుగా తెలిసింది. నిజానికిప్పటికే ఫ్లిప్‌కార్ట్ దాదాపు 15 మంది ఇన్వెస్టర్ల నుంచి 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని తీసుకుంది. ఇదికాక మరో 600-800 మిలియన్ డాలర్లను కూడా పెట్టుబడులుగా స్వీకరించడానికి సంస్థ చర్చిస్తోందని, దాదాపు 15 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.లక్ష కోట్లు) వాల్యుయేషన్‌పై ఈ నిధుల్ని స్వీకరిస్తోందని ఇటీవలే వార్తలు వెలువడ్డాయి. గత డిసెంబర్లో సంస్థ 700 మిలియన్ డాలర్ల పెట్టుబడి స్వీకరించినపుడు దాని విలువను 11.5 బిలియన్ డాలర్లుగా అంచనా వేశా రు. నాలుగు నెలలు తిరక్కుండానే ఆ విలువ 15 బిలియన్ డాలర్లకు చేరుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇకపై వాటా తగ్గకుండా రుణాల ద్వారా నిధులు సేకరించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఎంత సేకరించాలన్నది ఇంకా నిర్ణయించకపోయినా.. తొలి విడత 200 మిలియన్ డాలర్లు సమీకరించవచ్చని తెలిసింది. దీనిపై ఫ్లిప్‌కార్ట్ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. సంస్థ భారీ నిధుల సమీకరణ కోసం వచ్చే 18 నెలల్లో ఐపీఓకు రానున్నదన్న వార్తలూ ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. వీటిని ఒకదశలో ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యం కూడా ధ్రువీకరించటం గమనార్హం. -
ఆధునిక పద్ధతిలో మూల్యాంకనం
సమస్యలకు చెక్ పెట్టేందుకే.. జేఎన్టీయూహెచ్లోనే వాల్యుయేషన్ సకాలంలోనే బీటెక్, బీఫార్మసీ ఫలితాల విడుదల సాక్షి, సిటీబ్యూరో: పరీక్షా ఫలితాల విడుదల లో జాప్యంతోపాటు ఎదురయ్యే ఇతర సమస్యలకు చెక్ పెట్టేందుకు మూల్యాంకన విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టినట్టు జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఎన్వీ రమణారావు తెలిపారు. శనివారం జేఎన్టీయూహెచ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో తెలంగాణ వ్యాప్తంగా 65 కేంద్రాల్లో మూల్యాంకనం జరిగేదన్నారు. ప్రస్తుతం జేఎన్టీయూహెచ్ వేదికగా ఒకేచోట అన్ని జవాబు పత్రాల మూల్యాంకనం చేస్తున్నందున క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కు ఆధునిక ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే.. ఈ తరహా టెక్నాలజీ ఒక్క జేఎన్టీయూహెచ్లో మాత్రమే ఉందన్నారు. అంతేకాకుండా జవాబు పత్రాల బండిల్స్ మిస్ కాకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. తేడాలొస్తే బ్లాక్‌లిస్ట్‌లో.. మూల్యాంకనాన్ని మెరుగైన పద్ధతిలో చేపడుతున్నామని వర్సిటీ పరీక్షల విభాగం డెరైక్టర్ ఈశ్వర్ప్రసాద్ అన్నారు. జవాబు పత్రాన్ని మూడు నిమిషాలలోపు మూల్యాంకనం చేస్తే సర్వర్ అనుమతించదన్నారు. మూల్యాంకనంలో తేడాలను గమనించేందుకు ఒక చీఫ్ ఎగ్జామినర్తోపాటు నలుగురు అదనపు కంట్రోలర్లు ఉంటారన్నారు. ప్రతి బండిల్ నుంచి ర్యాండమ్‌గా రెండేసి పేపర్లు తనిఖీ చేస్తారని, తేడాలున్నట్టు తేలితే రీవాల్యుయేషన్ చేయిస్తామని తెలిపారు. నిర్లక్ష్యం వహించే ఆచార్యులను బ్లాక్ లిస్ట్‌లో పెడతామన్నారు. ఏటా ఫలితాలు వచ్చిన తరువాత కనీసం 15 వేలమంది రీవాల్యుయేషన్, రీకౌంటింగ్లకు దరఖాస్తు చేసుకునేవారని, మూల్యాంకనంలో నాణ్యతను పెంపొందించడంతో రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ దరఖాస్తుల సంఖ్య ఈ ఏడాది 1,500కు మించలేదన్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతున్న తీరును సీసీటీవీల ద్వారా వీసీ, రిజిస్ట్రార్, రెక్టార్లు తమ చాంబర్నుంచే పర్యవేక్షిస్తారని చెప్పారు. మూల్యాంకనం తరువాత మార్కులను ఎప్పటికప్పుడు ట్యాబ్లెట్ పీసీల్లో నమోదు చేయడం ద్వారా నేరుగా సర్వర్‌కు అనుసంధానం చేశామన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఫలితాలను సకాలంలో అందించాలనే ఉద్దేశంతో ఉదయం 9 నుంచి రాత్రి10 గంటల వరకు ఈ కేంద్రం పనిచేస్తుందన్నారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ రెక్టార్ టి.కిషన్ కుమార్‌రెడ్డి, వర్సిటీ ఇన్నోవేషన్ టెక్నాలజీ సెంటర్ డెరైక్టర్ మాధవీలత తదితరులు పాల్గొన్నారు.