ఏటీఎం వ్యాల్యువేషన్ చేస్తామని మోసం..
వివరాలన్నీ తెలుసుకొని రూ.97 వేలు డ్రా
లబోదిబోమంటున్న బాధితుడు
మేడ్చల్‌రూరల్ : ఏటిఎం కార్డు వ్యాల్యువేషన్ గడువు ముగిసిందని ఫోన్‌లో వివరాలు తెలుసుకుని ఓ వ్యక్తిని మోసగించారు. అతడి ఖాతా నుంచి భారీగా నగదు డ్రా చేసుకున్న సంఘటన మేడ్చల్‌లో శనివారం చోటు చేసుకుంది. మేడ్చల్‌లోని సూర్యనగర్‌కాలనీవాసి శ్రీనివాస్ మునిరాబాద్ గ్రామంలో సాస్ తయారీ కంపెనీ నిర్వహిస్తున్నాడు. కంపెనీ లావాదేవీల కోసం మేడ్చల్‌లోని కెనరా బ్యాంక్‌లో ఖాతా తెరిచి తన లావాదేవీలు కూడా కొనసాగిస్తున్నాడు. కాగా ఈనెల 7వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి అతడికి ఫోన్ చేసి మీ ఏటీఎం కార్డు వ్యాల్యువేషన్ గడువు ముగిసిందని కార్డు వెనుక ఉన్న నంబర్‌ను తెలపాలని చెప్పారు. వివరాలు తెలిపే ప్రాసస్ మొదలుపెడతామని నమ్మబలికాడు. దీంతో శ్రీనివాస్ అన్ని వివరాలు తెలిపాడు. అదే రోజునే బీహర్ రాష్ట్రంలో స్నాప్‌డీల్ కొనుగోలుకు రూ.71,369 ఖాతా నుంచి క్రెడిట్ అయినట్లు శ్రీనివాస్‌కు మెసేజ్ వచ్చింది. తర్వాత 9వ తేదీన ఊదుసార్లు ఏటీఎం నుంచి రూ.25,970 డ్రా అయ్యాయి. దీంతోతో బాధితుడు 9వ తేదీన బ్యాంక్‌కు వెళ్లి అధికారులతో మాట్లాడాడు. బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో శ్రీనివాస్ సైబర్ క్రైం పోసులకు ఫిర్యాదు చేశారు. తనను మోసం చేసిన వారిని పట్టుకుని న్యాయం చేయాలని, మరెవ్వరికి తనలా మోసపోకుండా జాగ్రత్త పడాలని బాధితుడు శ్రీనివాస్ తెలిపారు.