న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వేల్యుయేషన్ గత రెండేళ్లలో రూ. 41,000 కోట్ల మేర (సుమారు 5 బిలియన్ డాలర్లు) తగ్గింది. 2022 జనవరిలో ఇది 35 బిలియన్ డాలర్లుగా ఉండగా ఈ ఏడాది జనవరి 31 నాటికి 35 బిలియన్ డాలర్ల స్థాయికి పరిమితమైంది. ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ ఈక్విటీ స్వరూపంలో వచి్చన మార్పుల పరిశీలనతో ఇది వెల్లడైంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ 8 శాతం వాటాని 3.2 బిలియన్ డాలర్లకు విక్రయించింది.
తద్వారా సంస్థ వేల్యుయేషన్ 40 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టినట్లయింది. మరోవైపు, 2024 ఆర్థిక సంవత్సరంలో వాల్‌మార్ట్ 3.5 బిలియన్ డాలర్లతో తన వాటాను 10 శాతం పెంచుకోవడంతో వేల్యుయేషన్ 35 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టినట్లయింది. అయితే, వేల్యుయేషన్ తగ్గిపోయిందనడానికి లేదని, 2023లో ఫోన్‌పే సంస్థను విడగొట్టడం వల్ల సర్దుబాటు అయినట్లుగా మాత్రమే భావించాల్సి ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ వర్గాలు తెలిపాయి. సంస్థ వేల్యుయేషన్ ప్రస్తుతం 38–40 బిలియన్ డాలర్లుగా ఉంటుందని సంబంధిత వర్గాలు వివరించాయి.
Comments
Please login to add a commentAdd a comment