మానవాళి మనుగడ వెయ్యేళ్లే!
శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జోస్యం
లండన్: జీవనానికి అనువైన మరో గ్రహాన్ని అన్వేషించకుంటే.. భూమిపై మానవజీవనం మరో వెయ్యేళ్లకు మించి ఉండదని ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. ‘భౌతికశాస్త్రంలో పరిశోధనలకు ఈ ఏడాది అత్యంత యోగ్యమైన సంవత్సరం. పరిశోధనా కోణంలో విశ్వముఖచిత్రం50ఏళ్లలో చాలా మారింది. ఇందులో నా పాత్రా ఉన్నందుకు ఆనందంగా ఉంది.
ప్రకృతి సూత్రాలను అర్ధంచేసుకోగలిగితే విశ్వ రహస్యాలను ఛేదించడంలో విజయం సాధిస్తాం’ అని శాస్త్రపరిశోధనల చర్చావేదిక అరుున ‘ఆక్స్‌ఫర్డ్ యూనియన్’లో సోమవారం వ్యాఖ్యానించినట్లు ‘ది ఇండిపెండెంట్’ వెల్లడించింది.