scientist Stephen Hawking
-
టెక్నాలజీతో మానవుడికి ముప్పు: హాకింగ్
లండన్ : సాంకేతిక అభివృద్ధిలో దూసుకుపోయేందుకు మానవుడు అవలంబిస్తున్న దుందుడుకు చర్యల వల్ల భవిష్యత్తులో అణు, బయోలాజికల్ యుద్ధాలు తప్ప వని ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. అయితే ఈ ముప్పును తప్పించగలిగేది ఒక్క ‘వరల్డ్ గవర్నమెంట్’ మాత్రమేనని హాకింగ్ స్పష్టంచేశారు. భూతాపం, అనేక జాతులు అంతరించి పోవడం, కృత్రిమ మేధస్సుతో కలిగే ముప్పు వంటివి ప్రపంచాన్ని భయపెడుతున్నప్పటికీ భవిష్యత్తులో మానవ మనుగడ సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘వరల్డ్ గవర్నమెంట్’ను ఏర్పరచుకుంటే అది ముప్పును ముందుగానే గుర్తిస్తుందన్నారు. -
మానవాళి మనుగడ వెయ్యేళ్లే!
శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జోస్యం లండన్: జీవనానికి అనువైన మరో గ్రహాన్ని అన్వేషించకుంటే.. భూమిపై మానవజీవనం మరో వెయ్యేళ్లకు మించి ఉండదని ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. ‘భౌతికశాస్త్రంలో పరిశోధనలకు ఈ ఏడాది అత్యంత యోగ్యమైన సంవత్సరం. పరిశోధనా కోణంలో విశ్వముఖచిత్రం50ఏళ్లలో చాలా మారింది. ఇందులో నా పాత్రా ఉన్నందుకు ఆనందంగా ఉంది. ప్రకృతి సూత్రాలను అర్ధంచేసుకోగలిగితే విశ్వ రహస్యాలను ఛేదించడంలో విజయం సాధిస్తాం’ అని శాస్త్రపరిశోధనల చర్చావేదిక అరుున ‘ఆక్స్ఫర్డ్ యూనియన్’లో సోమవారం వ్యాఖ్యానించినట్లు ‘ది ఇండిపెండెంట్’ వెల్లడించింది. -
హాకింగ్ ‘అకౌంట్’కు అనూహ్య స్పందన
బీజింగ్: ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (75) చైనాకు చెందిన సామాజిక మాధ్యమం ‘సినా వైబో’లో అకౌంట్ తెరిచారు. ఆయన అకౌంట్ ప్రారంభించిన 24 గంటల్లోనే అనూహ్యంగా దాదాపు 20 లక్షల మంది ఆయనను అనుకరించారు. హాకింగ్ ప్రవేశ పెట్టిన శాస్త్రీయ సిద్ధాంతాలను గుర్తు చేస్తూ నెటిజన్లు సామాజిక మాధ్యమం వేదికగా ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ మేరకు గురువారం చైనాకు చెందిన ఓ పత్రిక తెలిపింది. వైబోలో అకౌంట్ తెరిచి మంగళవారం ఉదయం 10.12 గంటలకు తన శాస్త్రవేత్తగా ఆయన జీవనం, జీవన ప్రయాణం గురించి నెటిజన్లకు తెలియపరుస్తూ మొదటి పోస్ట్ చేశారు. పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే లక్షల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. రష్యన్ బిలీనియర్, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ సంయుక్తంగా గ్రహాంతరాల గురించి తెలుసుకునే పరిశోధన కోసం 100 మిలియన్ డాలర్లు ప్రకటించిన ట్లు హాకింగ్ రెండో పోస్టు చేశారు. ఈ పోస్టుకు అనూహ్య సంఖ్యలో నెటిజన్ల నుంచి స్పందనలు వచ్చాయి. ఓ నేటిజన్ స్పందిస్తూ ఇలాంటి సమాచారాన్ని వింటున్నందుకు సంతోషంగా ఉందని హాకింగ్‌కు సందేశం పంపించాడు. కాగా గ్రహాంతరాల గురించి తెలుసుకునేందుకు ‘నానోక్రాఫ్ట్’ను కనుగొననున్నట్లు హాకింగ్ తెలిపారు.