హాకింగ్ ‘అకౌంట్’కు అనూహ్య స్పందన
బీజింగ్: ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (75) చైనాకు చెందిన సామాజిక మాధ్యమం ‘సినా వైబో’లో అకౌంట్ తెరిచారు. ఆయన అకౌంట్ ప్రారంభించిన 24 గంటల్లోనే అనూహ్యంగా దాదాపు 20 లక్షల మంది ఆయనను అనుకరించారు. హాకింగ్ ప్రవేశ పెట్టిన శాస్త్రీయ సిద్ధాంతాలను గుర్తు చేస్తూ నెటిజన్లు సామాజిక మాధ్యమం వేదికగా ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ మేరకు గురువారం చైనాకు చెందిన ఓ పత్రిక తెలిపింది.
వైబోలో అకౌంట్ తెరిచి మంగళవారం ఉదయం 10.12 గంటలకు తన శాస్త్రవేత్తగా ఆయన జీవనం, జీవన ప్రయాణం గురించి నెటిజన్లకు తెలియపరుస్తూ మొదటి పోస్ట్ చేశారు. పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే లక్షల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. రష్యన్ బిలీనియర్, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ సంయుక్తంగా గ్రహాంతరాల గురించి తెలుసుకునే పరిశోధన కోసం 100 మిలియన్ డాలర్లు ప్రకటించిన ట్లు హాకింగ్ రెండో పోస్టు చేశారు. ఈ పోస్టుకు అనూహ్య సంఖ్యలో నెటిజన్ల నుంచి స్పందనలు వచ్చాయి. ఓ నేటిజన్ స్పందిస్తూ ఇలాంటి సమాచారాన్ని వింటున్నందుకు సంతోషంగా ఉందని హాకింగ్‌కు సందేశం పంపించాడు. కాగా గ్రహాంతరాల గురించి తెలుసుకునేందుకు ‘నానోక్రాఫ్ట్’ను కనుగొననున్నట్లు హాకింగ్ తెలిపారు.