టెక్నాలజీతో మానవుడికి ముప్పు: హాకింగ్
లండన్ : సాంకేతిక అభివృద్ధిలో దూసుకుపోయేందుకు మానవుడు అవలంబిస్తున్న దుందుడుకు చర్యల వల్ల భవిష్యత్తులో అణు, బయోలాజికల్ యుద్ధాలు తప్ప వని ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు.
అయితే ఈ ముప్పును తప్పించగలిగేది ఒక్క ‘వరల్డ్ గవర్నమెంట్’ మాత్రమేనని హాకింగ్ స్పష్టంచేశారు. భూతాపం, అనేక జాతులు అంతరించి పోవడం, కృత్రిమ మేధస్సుతో కలిగే ముప్పు వంటివి ప్రపంచాన్ని భయపెడుతున్నప్పటికీ భవిష్యత్తులో మానవ మనుగడ సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘వరల్డ్ గవర్నమెంట్’ను ఏర్పరచుకుంటే అది ముప్పును ముందుగానే గుర్తిస్తుందన్నారు.