
ఫిజిక్స్
1. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు?
టాలెమీ
2. గురుత్వ త్వరణం విలువ?
9.8 మీ./సె.
3. చంద్రుడు, భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే సమయం?
27.3 రోజులు
4. విశ్వగురుత్వ స్థిరాంకం(G) విలువ ?
6.67384 × 10-11 m3 kg-1 s-2
5. ’జ’ విలువలో కలిగే స్వల్ప మార్పులను కనుగొనే పరికరం?
గురుత్వమాపకం
6. {స్పింగ్ త్రాసు పనిచేసే సూత్రాన్ని తొలి సారి కనిపెట్టిన శాస్త్రవేత్త?
రాబర్‌ట హుక్
7. వస్తువు భారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే సూత్రం?
హుక్ సూత్రం
8. 400 గ్రాముల ద్రవ్యరాశి ఉన్న రాయి బరువు?
3.9 N
9. మొలాసిస్ నుంచి చక్కెర స్ఫటికాలను వేరుచేసే పరికరం?
సెంట్రీఫ్యూజ్
10. తిరిగే ఆకురాయితో కత్తిని పదును పెట్టేటప్పుడు నిప్పురవ్వలు ఏ దిశలో ప్రయాణిస్తాయి?
స్పర్శరేఖ దిశలో
11. 1200 కిలోగ్రాములు ఉన్న కారు 6 మీ./సె. వేగంతో 180 మీ. వ్యాసార్ధం ఉన్న వృత్తాకార రోడ్డులో ప్రయాణిస్తోంది. ఆ కారుపై పనిచేసే అభికేంద్ర బలం విలువ?
240 N
12. చేతి గడియారంలో ఉన్న సంతులన చక్రం చేసే చలనం?
డోలాయమాన చలనం
13. 100 సెం.మీ. పొడవున్న సామాన్య లోలకపు ఆవర్తన కాలం?
2 సెకన్లు
14. శారీరక మర్ధనలకు ఉపయోగించే కిర ణాలు?
పరారుణ కిరణాలు
15. ఉపగ్రహాల ద్వారా సమాచార ప్రసారాల్లో ఉపయోగించే తరంగాలు?
మైక్రో తరంగాలు
16. దృశ్యమాన దూరదర్శినిలతో కనుక్కోలేని విషయాలను ఏ పద్ధతి ద్వారా కను గొంటారు?
రేడియో ఖగోళ శాస్త్రం
17. ్ఖ, గ కిరణాల ప్రభావానికి ఎక్కువ కాలం గురైతే వచ్చే వ్యాధి?
కేన్సర్
18. రేడియోధార్మికత వల్ల ఏ కిరణాలు ఉత్పత్తి అవుతాయి?
గామా కిరణాలు
19. విద్యుత్ అయస్కాంత వికిరణాలు ఏ లక్షణాలను కలిగి ఉంటాయి?
తిర్యక్ తరంగ
20. తరంగదైర్ఘ్యాలు (లేదా) పౌనఃపున్యాల సముదాయాన్ని ఏమంటారు?
వర్ణపటం
21. ఒక వస్తువు బాహ్య ఆవర్తన బల ప్రభావంతో కంపిస్తే వాటిని ఏమంటారు?
బలాత్కృత కంపనాలు
22. వరుస అస్పందన, ప్రస్పందనల మధ్య దూరం 10 సెం.మీ. ఐతే తరంగదైర్ఘ్యం విలువ?
40 సెం.మీ.
23. తరంగాగ్రాలు ఏదైనా చిన్న అవరోధాలను తాకి, వాటి అంచుల వెంట వంగి ప్రయా ణించడాన్ని ఏమంటారు?
వివర్తనం
24. కాంతి తరంగాలు వ్యాపించడానికి ఏది అవసరమని హైగెన్‌స ఊహించాడు?
ఈథర్
25. ఒకే పౌనఃపున్యం, ఒకే కంపన పరిమితి ఉన్న రెండు కంపనాల వల్ల ఏర్పడే తరంగాల అధ్యారోహనాన్ని ఏమంటారు?
వ్యతికరణం
26. కాంతి అభివాహానికి ప్రమాణం?
ల్యూమెన్
27. ఘన కోణానికి ప్రమాణం?
స్టెరేడియన్
28. లేజర్‌కు సంబంధించిన శాస్త్రీయ జ్ఞానాన్ని ప్రతిపాదించినవారు?
డా॥చార్లెస్ హెచ్.టేన్‌స
29. సోడియం దీపం గరిష్ఠ కాంతి తీవ్రత?
5893 అని
30. ఘనస్థితి లేజర్‌కు ఉదాహరణ?
రూబి లేజర్
31. లేజర్లను ఏ ప్రత్యేక త్రిమితీయ ఫొటోగ్రఫీలో ఉపయోగిస్తారు?
హాలోగ్రఫీ
32. ఒక పదార్థ అయస్కాంతీకరణ అవధిని ఏమంటారు?
అయస్కాంత సంతృప్తత
33. అయస్కాంతీకరణ తీవ్రతకు ప్రమాణం?
ఆంపియర్/మీటర్
34. అయస్కాంత ససెప్టిబిలిటీకి ప్రమాణాలు?
ప్రమాణాలు లేవు
35. రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ భేదాన్ని ఏ పరికరంతో కొలుస్తారు?
వోల్ట్ మీటర్
36. విద్యుత్ వలయాన్ని జత చేయడానికి, విడదీయడానికి దేన్ని ఉపయోగిస్తారు?
టాప్-కీ
37. విద్యుత్ ప్రవాహాన్ని దేనితో కొలుస్తారు?
అమ్మీటర్
38. ఓమ్ నియమాన్ని పాటించే వాహకాలను ఏమంటారు?
ఓమీయ వాహకాలు (లేదా) రేఖీయ వాహకాలు
39. విశిష్ట నిరోధానికి ప్రమాణం?
ఓమ్-మీటర్
40. 6గి, 12గి లను సమాంతరంగా సంధా నం చేసినప్పుడు ఫలిత నిరోధం?
4గి
41. విద్యుత్ పనిరేటును ఏమంటారు?
విద్యుత్ సామర్థ్యం
42. 1 మెగావాట్ (కగి) ఎన్ని వాట్‌లకు సమానం?
106
43. 1 ఓగిఏ కు ఎన్ని వాట్ సెకన్‌లు?
36ణ105
44. విద్యుద్విశ్లేషణ చేయడానికి వీలున్న పాత్రను ఏమంటారు?
వోల్టా మీటర్
45. వెండి వస్తువులపై బంగారపు పూతను ఏ పద్ధతి ద్వారా వేస్తారు?
ఎలక్ట్రో ప్లేటింగ్
46. విద్యుద్విశ్లేషణ పద్ధతిలో అక్షరాలు చెక్కి ఉన్న దిమ్మె నుంచి ఒక ప్రతిని తయారుచేయడాన్ని ఏమంటారు?
ఎలక్ట్రో టైపింగ్
47. RPM పూర్తి రూపం?
Rotation per minute
48. విద్యుత్ మోటార్‌లో దీర్ఘచతురస్రాకార బంధక కవచాన్ని ఏమంటారు?
ఆర్మేచర్
49. {sాన్‌సఫార్మర్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది?
అన్యోన్య ప్రేరకత్వం
50. తల్లి గర్భంలోని శిశువులను గుర్తించే విధానంలో ఉపయోగించే ధ్వనులు?
అతిధ్వనులు(Ultra sound)
51. ల్యూమెన్ ఎన్ని క్యాండిల్స్‌కు సమానం?
12.56
52. పీడనానికి అంతర్జాతీయ ప్రమాణం?
పాస్కల్
53. పరమాణు కేంద్రక దూరాలను ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?
ఫెర్మి
54. 20HZల కంటే తక్కువ పౌనఃపున్యం ఉన్న ధ్వనులు?
పరశ్రావ్యాలు
55. హెక్టార్‌కు ఎన్ని ఎకరాలు?
2.47
56. ఒక పౌండ్‌కు ఎన్ని కిలోగ్రామ్‌లు?
0.45
57. పైకోమీటర్ అంటే?
1×10−12 మీటర్లు
58. {స్పింగును సాగదీసినప్పుడు జనించే వికృతి?
నిరూపణ వికృతి
59. టెలిఫోన్ గంట ఏర్పరిచే శబ్ద పరిమాణం?
60 డెసిబెల్స్
60. {పతిధ్వని ఆధారంగా ఎగిరే జీవి?
గబ్బిలం
61. గోడ గడియారం చేసే ‘టిక్ టిక్’ అనే శబ్ద పరిమాణం?
30 డెసిబెల్స్
62. వేర్వేరు నీటి ఆవిరి ఉష్ణోగ్రతలను కొలవ డానికి ఉపయోగించే థర్మామీటర్లు?
బెక్‌మన్ థర్మామీటర్
63. He-Ne లేజర్‌లో క్రియాశీల వ్యవస్థ?
Ne
64. {పెషర్ కుక్కర్ లోపల ఉష్ణోగ్రత?
120నిఇ
65. ఫారన్‌హీట్ ఉష్ణమాపకంలోని మొత్తం సమ విభాగాలు?
180
66. మిఠాయి కొట్లు, సెలూన్‌లలో ఉండే దర్పణాల మధ్య కోణం?
180 డిగ్రీలు
67. మోటార్ వాహనాల్లో డ్రైవర్‌కు ఎదురుగా అమర్చేవి?
కుంభాకార దర్పణాలు
68. మోటారు వాహనాల హెడ్‌లైట్‌లలో పరావర్తకాలుగా ఉపయోగించేవి?
పుటాకార దర్పణం
69. ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌లు ఏ దర్పణాన్ని ఉపయోగిస్తారు?
పుటాకార
70. ఉష్ణాన్ని ఇవ్వని కాంతిజనకం?
మిణుగురు పురుగు
71. గాలిలో ధ్వని వేగం?
330 మీ./సె.
72. ఫార్టిన్ భారమితిని ఎలా ఉపయోగిస్తారు?
{పమాణ భారమితి
73. విమానాల ఎత్తును కనుక్కోవడానికి ఉపయోగించే పరికరం?
ఆల్టీమీటర్
74. జలయంత్రాలు, బ్రామాప్రెస్సు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి?
పాస్కల్
కెమిస్ట్రీ
75. లారిక్ ఆమ్లం ఫార్ములా?
C12H24O2
76. ఓలియిక్ ఆమ్ల స్వభావం?
అసంతృప్తం
77. లినోలినిక్ ఆమ్లం వనరులు?
లిన్ గింజలు
78. C18H36O2 సాంకేతికంగా ఉన్న ఫాటీ ఆమ్లం?
స్టియరిక్ ఆమ్లం
79. నూనె/ కొవ్వులకు ముఖ్య వనరులు?
మొక్కలు, వృక్షాలు, జంతువులు
80. సంతృప్త కొవ్వులకు ఉదాహరణ?
డాల్డా, మార్గరీన్
81. నూనెల హైడ్రోజనీకరణంలో ఉపయో గించే ఉత్ప్రేరకం?
(Ni) నికెల్
82. క్షార సమక్షంలో నూనె/ కొవ్వును జల విశ్లేషణం చెందించి సబ్బును నేరుగా పొందే ప్రక్రియను ఏమంటారు?
సఫోనికేషన్