ఆయనే వంట నేర్పించారు
స్వీట్ హోమ్
మీ ఇంట్లో బాస్ ఎవరు? అని కొందరు చిలిపిగా అడుగుతారు... నేను కూడా అంతే చిలిపిగా సమాధానం చెబుతాను. ‘పిల్లలు’ అని! నాకు, ఆయనకు మధ్య ఎలాంటి ఇగోలు లేవు. మా లక్ష్యం ఒక్కటే...పిల్లలకు మంచి చదువు చెప్పించాలి అని.
పిల్లల హోమ్ వర్క్ విషయంలో నేను సహాయం చేస్తాను. సబ్జెక్ట్‌లను ఇద్దరం పంచుకుంటాం. నేను బాటనీ చెబుతాను. మ్యాథ్స్, ఫిజిక్స్ ఆయన చెబుతారు.
నేను కొన్ని సందర్భాల్లో తల్లిగా కొంచెం కఠినంగా వ్యవహరించినా, ఇంకొన్ని సందర్భాల్లో మాత్రం స్నేహంగా ఉంటాను.
భోజనాన్ని వృథా చేయడం నాకు నచ్చదు. దాని విలువ గురించి వాళ్లకు చెబుతుంటాను.
‘భర్త నా చేతిలో ఉండాలి... నేను చెప్పినదానికల్లా తల ఊపాలి’ అనుకునే రకం కాదు నేను. మనం ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు వారి మీద ఎలాంటి ఆంక్షలూ పెట్టకూడదు.
మా ఇద్దరిలో ఎవరు రొమాంటిక్ అంటే...ఇద్దరమూ! ఒకరికొకరం ఆశ్చర్యపరిచే బహుమతులు ఇచ్చుకుంటాం. క్యాండిల్‌లైట్ డిన్నర్‌లను ఇష్టపడతాం. మా ఆయన బాగా వంట చేస్తాడు. ఆయన నుంచే నేను వంట నేర్చుకున్నాను.
- మాధురీ దీక్షిత్