స్టాక్‌హోం: ఫిజిక్స్‌లో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ఈ ఏడాది (2017) ముగ్గురు అమెరికన్లను వరించింది. లిగో-విర్గో డిటెక్టర్ కొలాబరేషన్‌కు చెందిన రైనర్ వీస్, బారీ సీ బారిష్, థోర్న్‌లకు గురుత్వాకర్షణ తరంగాలను కనుగొన్నందుకు ఈ పురస్కారం దక్కింది. ప్రపంచాన్ని కుదిపివేసే ఆవిష్కరణకు ఈ ఏడాది నోబెల్ లభించిందని స్టాక్‌హోమ్‌లో జరిగిన సమావేశంలో నోబెల్ కమిటీ ప్రతినిధి పేర్కొన్నారు.
1901 నుంచి ఫిజిక్స్‌లో అవార్డును ఇప్పటివరకూ 111 సార్లు నోబెల్ కమిటీ ప్రదానం చేసింది. గత ఏడాది టోపోలజీలో చేసిన అసమాన కృషికి గాను ముగ్గురు పరిశోధకులు నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్‌ను సొంతం చేసుకున్నారు. ఫిజిక్స్‌లో నోబెల్ ప్రైజ్ విజేతలు అల్బర్ట్ ఐన్‌స్టీన్, మేరి క్యూరీ, నీల్స్ బోర్ వంటి దిగ్గజాల సరసన చేరతారు. ఇక 2010లో నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్‌ను యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ శాస్త్రవేత్తలు అండ్రీ జీమ్, నొవొసెలొవ్‌లు పొందారు. గ్రఫీన్‌తో వీరు అద్భుత ప్రయోగాలు చేసినందుకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment