Migraine
-
పిల్లలపైనా మైగ్రేన్ దాడి
సాక్షి, విశాఖపట్నం: పిల్లల్లోనూ పార్శ్వపు (మైగ్రేన్ హెడేక్) తలనొప్పి విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమని యూఎస్‌కు చెందిన అంతర్జాతీయ న్యూరో నిపుణురాలు డాక్టర్ డెబోరా ఫ్రెడిమాన్ అన్నారు. విశాఖలో జరుగుతున్న ఇండియన్ అకాడెమీ ఆఫ్ న్యూరాలజీ (ఐయాన్‌కాన్)–2024 సదస్సులో కీలకోపన్యాసం చేసేందుకు వచ్చిన ఆమె ‘సాక్షి’తో మైగ్రేన్‌కు సంబంధించిన పరిశోధనలు, చికిత్సలపై ఆదివారం మాట్లాడారు. ఆమె ఏం చెప్పారంటే...ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరికి..15 నుంచి 40 ఏళ్లలోపు వారిలో మైగ్రేన్ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా న్యూరో సమస్యలతో వచ్చే వంద మందిలో 40 మంది మైగ్రేన్ అని చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉంటున్నారు. ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు, ప్రతి 10 మంది పురుషుల్లో ఒకరికి మైగ్రేన్ ఉంది. గడచిన పదేళ్లలో మైగ్రేన్‌తో బాధపడే వారి సంఖ్య దాదాపు 80 శాతం పెరిగింది. ఇది కలవరపాటుకు గురిచేసే అంశం.‘ఆరా’ రావడం వల్లే..ప్రపంచ జనాభాలో 10 శాతం మంది మైగ్రేన్‌తో బాధపడుతున్నారు. వీరిలో 4 శాతం మందికి తలనొప్పి వచ్చే ముందు ‘ఆరా’ అనే అనుభవం ఉంటోంది. కళ్లముందు మెరుపులు వచ్చినట్టు.. చుట్టూ బైర్లు కమ్మినట్లు, శరీరమంతా మొద్దుబారిన భావనకు గురవుతున్నారు. దీన్నే ఆరా అని పిలుస్తున్నాం. ఈ ఆరా ద్వారానే మైగ్రేన్‌కు మంచి చికిత్సల్ని తీసుకురాగలుగుతున్నాం. దాదాపు 20 ఏళ్లుగా మైగ్రేన్‌పై పరిశోధనలు చేస్తున్నాను. మెదడులో ఉండే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ (సీఎస్ఎఫ్) అనే ద్రవం అలల మాదిరిగా కదులుతూ మెదడులోని మలినాల్ని శుభ్రం చేస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ సీఎస్ఎఫ్లోకి సమస్యాత్మక ప్రోటీన్స్ వచ్చినప్పుడు ఆరా మొదలై.. మైగ్రేన్ అనుభవం ఏర్పడుతుంది. ఈ ఆరాకు కారణమవుతున్న ప్రోటీన్లను అడ్డుకునేలా మందులు కనిపెట్టాం. ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నాం.ఒత్తిడికి దూరంగా ఉండాలిమైగ్రేన్ లక్షణాలు అందరిలోనూ ఒకేలా కనిపించడం లేదు. 25 శాతం మంది మాత్రమే మైగ్రేన్ని ముందస్తుగా గుర్తించగలుగుతున్నారు. మైగ్రేన్ వచ్చినప్పుడు ప్రారంభంలోనే గుర్తించి వైద్యుల్ని సంప్రదిస్తే.. దానికి తగినట్లుగా మందులు వాడుతుంటే.. క్రమంగా నివారించగలం. మైగ్రేన్‌కు సరైన చికిత్స లేదు. కానీ.. ఇటీవల కాలంలో సీజీఆర్‌పీ వంటి కొత్త చికిత్సలతో పాటు లాస్మిడిటన్, ట్రిప్టాన్స్ వంటి మందులు అందుబాటులోకి రావడంతో మైగ్రేన్ అటాక్స్‌ని తగ్గించగలుగుతున్నాం. అయితే.. జీవనశైలిలో మార్పులు రావాలి. సమయానికి నిద్ర,మంచి ఆహారం, నీరు ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి లేకుండా చూసుకోవడం ద్వారానే మైగ్రేన్ని నియంత్రించగలం.చిన్నారులూ బాధితులేమరో బాధాకరమైన విషయమేమిటంటే.. మైగ్రేన్‌కు చిన్నారులూ బాధితులుగా మారుతున్నారు. ప్రతి 100 మంది చిన్నారుల్లో 20 మంది దీనిబారిన పడుతున్నారు. బాలికలతో పోలిస్తే బాలురులో ఎక్కువగా ఇది కనిపిస్తోంది. తమకు తలనొప్పి వస్తుందని తల్లిదండ్రులకు చెప్పినా.. వాళ్లు నమ్మడం లేదు. స్కూల్ ఎగ్గొట్టేందుకు చెబుతున్న కుంటిసాకులుగానే తీసుకుంటున్నారు. ఇదే ప్రమాదకరంగా మారుతోంది. తేలిగ్గా తీసుకుంటే మైగ్రేన్ ముప్పుగా మారుతుందన్న విషయం తల్లిదండ్రులు గుర్తించాలి. యుక్తవయసులో మాత్రం ఇది అమ్మాయిల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. -
బొటాక్స్ ఇంజెక్షన్లు ఇంత డేంజరా? మైగ్రేన్ కోసం వాడితే..!
బొటాక్స్ ఇంజక్షన్‌ను ముఖంపై ముడతలు తగ్గించడానికి తీసుకుంటారు. ఇదిచర్మం ముడతలు పడడానికి కారణమైన ధమనులను ఇది నాశనం చేస్తుంది. అలాంటి బొటాక్స్ ఇంజెక్షన్ వివిధ ఆరోగ్య సమస్యలకు కూడా ఉపయోగిస్తారు. ఇక్కడొక మహిళ మైగ్రేన్ కోసం బొటాక్స్ ఇంజెక్షన్ తీసుకోవడమే శాపమై ప్రాణాంతకంగా మారింది. అసలేం జరిగిందంటే..యూఎస్‌లోని టెక్సాస్‌కు చెందిన ఓ మహిళ మైగ్రేన్ సమస్య నుంచి ఉపశమనం కోసం బొటాక్స్ ఇంజెక్షన్ తీసుకుంది. అలా తీసుకుందో లేదో కొద్ది క్షణాల్లోనే మరణం అంచులకు చేరువయ్యేలా ఆమె పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది. తీవ్ర పక్షవాతంతో కనీసం తల కూడా పైకెత్తలేని స్థితిలో అచేతనంగా మారిపోయింది. తన నోటిలోని లాలాజలమే ఆమెను ఉక్కిబిక్కిరి చేసేలా ఉంది ఆమె స్థితి. ఆమె ముగ్గురు పిల్లల తల్లి. ఈ బొటాక్స్ ఇంజెక్షన్ కారణంగా మెడ కండరాల పక్షవాతానికి గురయ్యింది. దీంతో కనీసం చూడలేకపోవడ, మాట్లాడలేకపోవడం, మింగకపోవడం, తలను కదపలేకపోవడం తదితర ఘెరమైన సమస్యలను ఫేస్ చేసింది. చెప్పాలంటే చనిపోతానేమో అనుకుంది. ఈ బొటాక్స్ ఇంజెక్షన్ అధికమవ్వడం వల్ల లేక మరేదైన కారణమో గానీ, ఇది ఆమె శరీరంపై తీవ్ర ప్రభావం చూపి మెడ, ముఖం భాగాల్లోని నరాల నాశనం చేసింది. ఆస్పత్రిలో చేరి కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందింది. ఆ తర్వాత 18 రోజులకు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోయింది. అయితే ఆమె రక్తనాళాల గోడలు, కీళ్లు, చర్మంలోని బంధన కణజాలాన్ని ప్రభావితం చేసే వారసత్వ రుగ్మత అయిన ఎహ్లర్స్-డాన్లోస్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు వైద్యులు. అయితే ఆమె ప్రస్తుతం బెటర్‌గా కోలుకుంటుందన్నారు. కానీ ఆమె సక్రమంగా తినడానికి, తాగడానికి, నడవడానికి, మాట్లాడటానికి కొన్ని వారాల సమయం పట్టొచ్చని వైద్యులు చెప్పారు. ఈ బొటాక్స్‌తో చాలామంది సమస్యలు ఎదుర్కొన్నారు గానీ, ఈ మహిళలా ఇంతలా తీవ్ర పరిస్థితిని ఎదుర్కొనలేదని అన్నారు. అందుకే ఆమె కేసుపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు వైద్యులు. కాగా, సదరు బాధిత మహిళ తాను ఎదుర్కొన్న ఈ భయానక పరిస్థితిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా అయ్యింది. బొటాక్స్ ప్రమాదకరమా? బోట్యులస్' అనే బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే విషపదార్థమే ఈ బోటాక్స్. ఈ బ్యాక్టీరియాను తొలిసారిగా 18వ శతాబ్దంలో పాడైపోయిన సాసేజ్‌ల మీద కనుగొన్నారు. లాటిన్లో సాసేజ్‌ను బోట్యులస్ అంటారు. ఇది బోట్యులైనమ్ టాక్సిన్ అనే అత్యంత విషపూరితమైన పదార్థం. కొన్ని చెమ్చాల బోట్యులైనమ్ టాక్సిన్ ఒక దేశ జనాభానే చంపగలదు. కొన్ని కిలోల బొటాక్స్ ఈ భూమి మీద నివసిస్తున్న సమస్త జనాభానూ సర్వనాశనం చేయగలదు. బోట్యులైనమ్ టాక్సిన్ మనిషి శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీన్లో న్యూరోటాక్సిన్ ఉంటుంది. అంటే ఇది నరాల్లోకి ప్రవేశించి, కీలకమైన ప్రొటీన్లను నాశనం చేస్తుంది. నరాలకు, కండరాలకు మధ్య సంబంధాన్ని హరిస్తుంది. కొత్తగా నరాల చివర్లు పెరిగితే తప్ప మళ్లీ కండరాల పనితీరు బాగుపడదు. దీనికి కొన్ని నెలల సమయం పడుతుంది. దేనికి ఉపయోగిస్తారంటే.. బొటాక్స్‌ను సౌందర్య సాధనంగానే కాక అనేక రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్సగా కూడా వాడతారు. మెల్లకన్ను తొలగించేందుకు, మైగ్రిన్స్ (తీవ్రమైన తలనొప్పులు) తగ్గించేందుకు, అధిక చెమట నుంచి విముక్తి కలిగించేందుకు, మూత్రాశయ ఇబ్బందులను తొలగించేందుకు కూడా వాడతారు. చెప్పాలంటే దాదాపు 20 కన్నా ఎక్కువ ఆరోగ్య సమస్యలకు చికిత్సలో భాగంగా బోటాక్స్ వాడతారని నిపుణులు చెబుతున్నారు. (చదవండి: ఆస్ట్రేలియాలో 'షెగెలోసిస్ వ్యాధి' కలకలం!వందలాది మందికిపైగా..) -
మైగ్రేన్ తలనొప్పి నివారణ పరికరం..
-
మైగ్రేన్ నుంచి ఉపశమనం కలిగించే సరికొత్త డివైజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పార్శ్వపు నొప్పి (మైగ్రేన్) నివారణకు ఔషధ రహిత పరిష్కారాన్ని ఫార్మా రంగ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ తీసుకువచ్చింది. నెరివియో పేరుతో చేతికి ధరించే పరికరాన్ని ప్రవేశపెట్టింది. యూఎస్ఎఫ్డీఏ అనుమతి ఉందని, 12 ఏళ్లు, ఆపై వయసున్న వారు వైద్యుల సిఫార్సు మేరకు దీన్ని వాడొచ్చని కంపెనీ గురువారం ప్రకటించింది. తలనొప్పి ప్రారంభమైన 60 నిమిషాలలోపు వాడాలి. లేదా పార్శ్వపు నొప్పి నివారణకు ప్రతి రెండు రోజులకు ఒకసారి ఉపయోగించాల్సి ఉంటుంది. -
అరుదైన వ్యాధితో ఏళ్లపాటు బాధపడ్డ మహేశ్‌బాబు!
మహేశ్.. ఈ పేరులో వైబ్రేషన్ ఇప్పటికీ అలాగే ఉంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ మహేశ్‌బాబు అందం మరింత పెరుగుతోందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. నిత్య యవ్వనం ఒక్క మహేశ్‌కే సొంతం. ఈయన గౌతమ్ పక్కన నిలబడితే అతడికి తండ్రిలా కాదు, అన్నలా కనిపిస్తున్నాడు. టాలీవుడ్లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో బిరుదును ఏళ్లకొద్దీ కొనసాగిస్తున్న మహేశ్‌బాబు బర్త్‌డే నేడు (ఆగస్టు 9). దీంతో అభిమానులు సోషల్ మీడియాలో మహేశ్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇకపోతే అన్నీ తినేసి, తిన్నది అరిగేవరకు జిమ్‌లో చెమటోడ్చేలా కష్టపడటం మహేశ్ స్టైల్ కాదు. జంక్ ఫుడ్, డైరీ ప్రొడక్ట్స్ జోలికే వెళ్లకుండా చాలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతాడు. ఏమీ తినలేదు కదా అని ఊరికే కూర్చోకుండా క్రమం తప్పకుండా జిమ్ చేస్తాడు. విరామం అనేది ఇవ్వకుండా పదేళ్లుగా దీన్ని కొనసాగిస్తున్నాడు. ఇన్ని జాగ్రత్తలు పాటించే మహేశ్‌బాబు గతంలో ఓ వ్యాధితో సతమతమయ్యాడు. మైగ్రేన్‌తో చాలా ఏళ్లు ఇబ్బందిపడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా గతంలోని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. చాలా కాలం మైగ్రేన్‌తో బాధపడ్డానని, అప్పుడు నొప్పి తగ్గడానికి చాలా పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వాడానని చెప్పాడు. అసలు మైగ్రేన్‌కు చికిత్స లేదని, అది నయం కాని వ్యాధి అని చాలామంది చెప్పారన్నాడు. తన బాధ చూడలేకపోయిన నమ్రత డాక్టర్ సింధూజను కలిసి చక్రసిద్ధ నాడీ వైద్యం చేయించిందని, రెండు, మూడు నెలలకే మైగ్రేన్ నుంచి పూర్తిగా ఉపశమనం పొందానని పేర్కొన్నాడు. అప్పటి నుంచి మళ్లీ పెయిన్ కిల్లర్స్ వేసుకోవాల్సిన అవసరమే రాలేదని తెలిపాడు. అంతకుముందు షూటింగ్స్ వల్ల రోజుకు నాలుగైదు గంటలే నిద్రపోయేవాడినని, కానీ ఈ వైద్యం తీసుకున్న తర్వాత హాయిగా రోజంతా నిద్రపోయానని చెప్పుకొచ్చాడు మహేశ్. చదవండి: మహేశ్ పుట్టినరోజు.. పలు ఇంట్రెస్టింగ్ విషయాలు! హీరోయిన్గా చేసిన రెండు సినిమాలు హిట్.. అయినా పెళ్లి కోసం ఆ కండీషన్ పెట్టిన తండ్రి! -
గల్ఫ్ దేశాల్లో 'వేజ్ ప్రొటెక్షన్ సిస్టం' ఉండాలి!
ఆసియా-గల్ఫ్ వలసల కారిడార్ దేశాలలో వేతనాల చెల్లింపులపై ఉత్తమ ఆచరణపై ఖతార్ రాజధాని దోహాలో వలసలపై జరుగుతున్న సమావేశంలో మంగళవారం చర్చ జరిగింది. ముఖ్యంగా వేతనాల ఎగవేత, ఇతర వేతన సమస్యల పరిష్కార విధానాలపై చర్చ సాగింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం), మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఏ) లు సంయుక్తంగా ఈనెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఖతార్‌లో సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి ఖతార్ ప్రభుత్వం అధికారిక ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో తెలంగాణ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రతినిధి, ప్రవాసి కార్మిక నాయకుడు స్వదేశ్ పరికిపండ్ల ఐక్యరాజ్య సమితి ప్రవాసి కార్మికులకు వేతన రక్షణ నిధి ఏర్పాటు, వలస కార్మికులను రక్షించడానికి కార్మికులను పంపే మూలస్థాన దేశాలు ఏవైనా విధానాలు, శాశ్వత పరిష్కార వ్యవస్థలను కలిగి ఉన్నాయా? అనే ప్రశ్నించారు. నష్టపోయిన కార్మికులను, విదేశాల నుంచి వాపస్ వచ్చిన వలస కార్మికుల రక్షణకోసం మూలస్థాన దేశాలు పునరావాసం, పునరేకీకరణ కోసం ఒక విధానం, శాశ్వత యంత్రాంగం కలిగి ఉండాలని స్వదేశ్ కోరారు. 32 సంవత్సరాల క్రితం 1990-91లో ఇరాక్ - కువైట్ గల్ఫ్ యుద్ధం కారణంగా లక్షలాది మంది వలసదారులు కువైట్ నుండి వారి స్వదేశాలకు తిరిగి పంపబడ్డారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అనుబంధ సంస్థ 'ది యునైటెడ్ నేషన్స్ కంపెన్సేషన్ కమిషన్' (పరిహార కమిషన్) కువైట్‌పై ఇరాక్ దాడికి సంబంధించి 52.4 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన చెల్లింపులను పూర్తి చేసిందని స్వదేశ్ గుర్తు చేశారు. అలాగే ప్రపంచ ఆర్థిక మాంద్యం, ఇరాక్, లిబియా, యెమెన్ లాంటి దేశాలలో యుద్ధ పరిస్థితులు, దివాళా తీసిన కంపెనీలను మూసివేయడం, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఉల్లంఘించి, వీసా గడువు ముగిసిన వారు ఎలాంటి జరిమానా, జైలు శిక్షలు లేకుండా దేశం విడిచి వెళ్ళడానికి గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు 4-5 ఏళ్లకు ఒకసారి క్షమాభిక్ష (అమ్నెస్టీ) ప్రకటించడం, కోవిడ్19 మహమ్మారి లాంటి విపత్తు వలన వలస కార్మికులను బలవంతంగా ఆయా దేశాల నుండి కట్టుబట్టలతో స్వదేశీలకు పంపించివేస్తున్నారని స్వదేశ్ పేర్కొన్నారు. ఇక ముందు కూడా ఇలా జరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వాలు తగిన రక్షణ చర్యలతో సన్నద్ధంగా ఉండాలని సూచించారు ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖలో వేతన రక్షణ విభాగం అధినేత మహమ్మద్ సైద్ అల్ అజ్బా, ఖతార్ లోని ఫిలిప్పీన్ రాయబార కార్యాలయం కార్మిక అధికారి డాన్ ఆల్బర్ట్ ఫిలిప్ సి. పాన్కోగ్, ఫిలిప్పీన్ కేంద్రంగా పనిచేసే మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఏ) రీజనల్ కోఆర్డినేటర్ విలియం గోయిస్, ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం ఫస్ట్ సెక్రటరీ సుమన్ సొంకర్, ఖతార్‌లోని హమద్ బిన్ ఖలీఫా యూనివర్సిటీ ప్రొఫెసర్ డా.రే జురీడిని పానెల్ ప్రవాసుల వేతన సమస్యలపై ప్రసంగించారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) అరబ్ దేశాల వలస నిపుణుడు రిసార్డ్ చోలెవిన్స్కీ మోడరేటర్ గా వ్యవహరించారు. వలస కార్మికుల వేతనాలపై కోవిడ్-19 ప్రభావం, దీనిక అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలుపై ప్యానల్ వక్తలు ప్రసంగించారు. అలాగే కోవిడ్19 మహమ్మారి సంక్షోభం కంటే ముందు గమ్యస్థాన గల్ఫ్ దేశాలు కార్మికులకు 'వేజ్ ప్రొటెక్షన్ సిస్టం' (వేతనాల భరోసా రక్షణ వ్యవస్థ) ఏర్పాటు చేయడానికి ప్రయోగాలు చేశాయి. వేతన చెల్లింపులను పర్యవేక్షించడం, అమలు చేయడం కోసం ప్రయత్నాలు చేశాయని వక్తలు తెలిపారు. -
Health: ప్రెగ్నెన్సీలో మైగ్రేన్ వస్తే? ఈ టాబ్లెట్లు మాత్రం అస్సలు వాడొద్దు!
చాలా ఏళ్లుగా మైగ్రేన్‌తో బాధపడుతున్నాను. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ను. మూడవ నెల. ప్రెగ్నెన్సీలో మైగ్రేన్ వస్తే మందుల్లేకుండా ఎలాంటి జాగ్రత్తలతో తలనొప్పిని కంట్రోల్ చేసుకోవచ్చో చెప్పగలరు. – సి. కళ్యాణి, మండపేట మైగ్రేన్ అనేది చాలా కామన్‌గా చూసే తలనొప్పిలో ఒక రకం. చాలామందికి ఈ తలనొప్పితో వాంతులు, ఎసిడిటీ వస్తాయి. మైగ్రేన్‌ను సరిగ్గా కంట్రోల్ చేయకపోతే కొంతమందికి ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే ప్రమాదం ఉంది. మైల్డ్ హెడేక్ అయితే నీళ్లు ఎక్కువగా తాగడం, విశ్రాంతి తీసుకోవడం, పారాసిటమాల్ తక్కువ డోస్ మాత్ర వేసుకోవడం వంటివి ప్రయత్నించవచ్చు. గర్భం దాల్చిన నాటి నుంచే... ఒత్తిడి వల్ల కూడా మైగ్రేన్ పెరుగుతుంది. రిలాక్సేషన్ టెక్నిక్స్‌ను అలవాటు చేసుకోవాలి. గర్భం దాల్చిన దగ్గర్నుంచే మెడిటేషన్, యోగా ప్రాక్టీస్ చేయాలి. శ్రావ్యమైన సంగీతం వింటూండాలి. మైగ్రేన్ రావడానికి కారణాలు ఏముంటున్నాయో గుర్తించాలి. కొంతమందికి సమయానికి భోజనం చేయకపోయినా.. లేదా భోజనం స్కిప్ అయినా, నిద్రలేకపోయినా మైగ్రేన్ అటాక్ అవుతుంది. సురక్షితమేనా? ఈ ట్రిగ్గర్ పాయింట్లను గ్రహించి.. సమయానికి భోజనం.. 8– 10 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. పారాసిటమాల్, వాంతులు తగ్గే మందులతో మైగ్రేన్‌ను చాలా కంట్రోల్ చేయవచ్చు. తరచుగా మైగ్రేన్ వచ్చే వాళ్లకు ప్రెగ్నెన్సీలో ప్రభావం చూపని సురక్షితమైన మందులను డాక్టర్లు సూచిస్తారు. వాటిని ఎలా వాడాలో కూడా చెబుతారు. మీరు ఆల్రెడీ మైగ్రేన్‌కి మందులు వాడుతున్నట్లయితే.. అవి ప్రెగ్నెన్సీలో సేఫ్ అవునో కాదో మీ డాక్టర్‌ను అడిగి తెలుసుకోండి. Brufen, Ergotamine వంటి మందులు అసలు వాడకూడదు. ఆరవ నెల తర్వాత పెయిన్ కిల్లర్స్ వంటివి వాడకూడదు. ఎపిలెప్సీ మందులను కొంతమంది మైగ్రేన్‌కి కూడా వాడుతుంటారు. అలాంటివి మీరు వాడితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. వాటివల్ల పొట్టలో బిడ్డకు బర్త్ డిఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కొంతమంది విషయంలో న్యురాలజిస్ట్ అభిప్రాయం తీసుకుని మందులు మార్చటం జరుగుతుంది. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: Pregnancy- Iron Rich Foods: ఏడో నెల.. ఐరన్ మాత్రలు వేసుకుంటే వాంతులు! ఇవి తిన్నారంటే.. Tips To Recover From C Section: ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. డెలివరీ అయిన మొదటి 6 వారాలు... -
బ్రెయిన్ స్ట్రోక్ / టీఐఏ ముప్పు ఎవరిలో ఎక్కువ?
కొన్ని జబ్బు లక్షణాలు వ్యాధి రాకముందే బయటపడతాయి. తాము రాబోతున్నామంటూ హెచ్చరికలు జారీచేస్తాయి. జాగ్రత్తపడమంటూ చెప్పి, నివారించుకునేందుకు అవకాశాలిస్తాయి. ఆ వార్నింగ్ సిగ్నల్స్‌ను ఎలా గుర్తించాలో ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి వివరిస్తున్నారు. వాటిని నిలువరించే మార్గాలూ చెబుతున్నారు. తెలుసుకుందాం... రండి. ప్రశ్న : వార్నింగ్ ఇచ్చి వచ్చే వ్యాధులేమైనా ఉన్నాయా? జ: న్యూరో విభాగానికి సంబంధించిన చాలా జబ్బులు ముందస్తు వార్నింగ్ ఇచ్చాకే వస్తాయి. ఉదాహరణకు మైగ్రేన్, ఫిట్స్, పక్షవాతం, అల్జైమర్స్ వంటివి. వీటిల్లో మైగ్రేన్ బాధాకరమే గానీ... చాలావరకు నిరపాయకరం. కానీ పక్షవాతం వల్ల అవయవాలు పనిచేయకపోయే ప్రమాదం ఉంది. ఇతరులపై జీవితాంతం ఆధారపడాల్సిన పరిస్థితి రావచ్చు. ఫిట్స్ కూడా ప్రమాదమే. అందుకే ముందస్తు హెచ్చరికలు చేసే ఆ వ్యాధుల వార్నింగ్ సిగ్నల్స్ అర్థం చేసుకోవడం వల్ల చాలా అనర్థాలను నివారించుకోవచ్చు. ప్రశ్న : పక్షవాతం ముందస్తు సిగ్నల్స్ ఇస్తుందా? అదెలా? జ: పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్)లో చేయిగానీ, కాలుగానీ, లేదా రెండూ పడిపోవడం గానీ, ఒకవైపు చూపు తగ్గిపోవడం, మూతి వంకరపోవడం, మాట పడిపోవడం, మింగడం కష్టం కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి తాత్కాలికంగా పది నిమిషాల నుంచి ఒక గంట లోపు వస్తే దాన్ని ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్ (టీఐఏ) అంటారు. ఈ టీఐఏ లక్షణాలు... అసలు పక్షవాతం కంటే కొంత ముందుగానే కనపడవచ్చు. ముందుగా వచ్చే ఈ ‘టీఐఏ’ తర్వాత బాధితులు పూర్తిగా కోలుకుంటారు. కానీ ఆ సిగ్నల్స్ పెడచెవిన పెట్టి... అసలు పక్షవాతం వచ్చే వరకు నిర్లక్ష్యం చేస్తే కోలుకోడానికి చాలా టైమ్ పట్టవచ్చు లేదా ఆ నష్టం జీవితాంతం బాధించవచ్చు. ప్రశ్న : బ్రెయిన్ స్ట్రోక్ / టీఐఏ ముప్పు ఎవరిలో ఎక్కువ? జ: సాధారణంగా 50 ఏళ్లు దాటి... షుగరు, హైబీపీ ఉన్నవారికి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లు ఈ ముప్పును మరింత పెంచుతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారికీ, ఊబకాయం ఉన్నవారికీ స్ట్రోక్ ముప్పు ఎక్కువ. ప్రశ్న : మైగ్రేన్‌లో ఏయే ముందస్తు లక్షణాలు కనిపిస్తాయి? జ: మైగ్రేన్ తలనొప్పి రెండు విధాలుగా వస్తుంది. మొదటిదానిలో తలనొప్పికి ముందర కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని ‘మైగ్రేన్ విత్ ఆరా’ అంటారు. దాదాపు 20శాతం మందిలో ‘ఆరా’ కనిపిస్తుంది. రెండో రకంలో నేరుగా తలనొప్పి వస్తుంది. ‘మైగ్రేన్ ఆరా’లో కనిపించే లక్షణాలు ఇలా ఉంటాయి. ∙తలనొప్పి వచ్చే గంటలోపు చూపు కొద్దిగా మందగిస్తుంది. ∙కళ్ల ముందు మెరుపులు మెరిసినట్లుగా అనిపించడం, వెలుగు చూడలేకపోవడం, శబ్దాలు వినడంలో ఇబ్బంది కలగడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ∙చుట్టూరా ఉన్నవి కనిపించకుండా, ముందు ఉన్నవే కనిపిస్తాయి. దీన్ని టెలిస్కోపిక్ విజన్ అంటారు. ∙అరుదుగా ఏదో ఓ పక్క కాలు / చేతిలో బలం తగ్గడం. ∙త్వరగా కోపం రావడం, చికాకు పడటం వంటివి కనిపించిన గంట లేదా రెండు గంటల్లోపు అసలు తలనొప్పి మొదలవుతుంది. ప్రశ్న : మైగ్రేన్‌కు చికిత్స ఎలా? జ: దీనికి రెండు రకాలుగా చికిత్స అందిస్తారు. మొదటిది తీక్షణంగా వచ్చే తలనొప్పిని తగ్గించడానికి ఇచ్చే మందులు. ఇవి ఎంత త్వరగా తీసుకుంటే, అంత త్వరగా ఉపశమనం కలుగుతుంది. రెండోవి... మళ్లీ రాకుండా ఉండేందుకు ఇచ్చే మందులు. ప్రశ్న : ఫిట్స్‌లో కూడా ముందస్తు సిగ్నల్స్ కనిపిస్తాయా? జ: మూర్ఛను వైద్యపరిభాషలో ఫిట్స్ అనీ, ఆ జబ్బును ఎపిలెప్సీ అని అంటారు. ఆరు నెలల నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లల్లో జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది. అప్పుడు చల్లటి నీటితో ఒళ్లు తుడుస్తూ, శరీర ఉష్ణోగ్రత తగ్గించి ఫిట్స్ రాకుండా నివారించుకోవచ్చు. కొంతమందిలో ఫిట్స్ వచ్చే కొన్ని నిమిషాల నుంచి గంటల ముందుగా తలనొప్పి, కళ్లు తిరగడం, ఒళ్లు జలదరించడం (జర్క్స్), కనురెప్పలు కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలు ఈ లక్షణాలను గమనించలేరు. కాబట్టి పెద్దలే వాటిని గమనించాలి. ముఖ్యంగా ముందురోజు నిద్ర సరిపోకపోవడం, తీవ్ర ఒత్తిడికి లోనవ్వడం వంటి పరిస్థితుల్లో ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ప్రశ్న : అల్జైమర్స్ జబ్బును ముందస్తుగా గుర్తుపట్టడం ఎలా? జ: అల్జైమర్స్‌లో ముఖ్యమైన మొట్టమొదటి లక్షణం – కొన్ని సెకండ్ల నుంచి నిమిషాలకు ముందుగా జరిగిపోయిన విషయాలను మరచిపోతుండటం. (వీళ్లలో చిన్నప్పటి విషయాలు మాత్రం బాగా గుర్తుండవచ్చు). తర్వాత క్రమంగా దారులు, తేదీలు, పండుగలు మరచిపోతారు. కొత్త విషయాలు ఏవీ గుర్తుపెట్టుకోలేరు. క్రమంగా ప్రవర్తనలో కూడా మార్పు రావచ్చు. సరైన సమయంలోనే ఈ లక్షణాలను గుర్తించలిగితే... సరైన చికిత్సతో... వ్యాధి పెరుగుదలనూ, తీవ్రతనూ నియంత్రించవచ్చు. ఇక్కడ చెప్పిన ఏ వార్నింగ్ కనిపించినా వెంటనే ‘న్యూరో ఫిజీషియన్’ను సంప్రదించి, తగిన పరీక్షలూ, వాటి ఆధారంగా తగిన చికిత్స తీసుకుంటే... ఈ జబ్బులను చాలావరకు రాకముందే నివారించవచ్చు. - డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యూరో ఫిజీషియన్ -
నిమ్మ ఆకులతో ప్రయోజనాలెన్నో..
నిమ్మకాయలు ఆరోగ్యానికి ఎంత మంచివో.. ఆకులు కూడా అంతే ఉపయోగమైనవి. నిమ్మ ఆకుల్లో ఐరన్, క్యాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ బీ1, ఫ్లేవనాయిడ్స్, రైబోఫ్లోవిన్, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. నాలుగు తాజా నిమ్మ ఆకుల్ని ఒక గ్లాసు వేడినీటిలో మూడుగంటలు నానబెట్టి తాగితే.. నిద్రలేమి, గుండెదడ, నరాల బలహీనత వంటివి తగ్గుతాయి. వేడినీటిలో మరిగించకూడదు. కేవలం నానబెట్టాలి. అంతే! నీళ్లను వేడిచేసి దించేయాలి. అందులో గుప్పెడు నిమ్మ ఆకుల్ని వేసి.. ఆ నీటిని రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా నెలరోజులు చేస్తే మైగ్రేన్ తలనొప్పి, ఆస్మా వంటివి తగ్గిపోతాయి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు నిమ్మ ఆకుల్ని నలిపి.. ఆ వాసన పీలిస్తే మంచిది. మనసు వెంటనే ఆహ్లాదకరంగా మారుతుంది. నిమ్మ ఆకుల్లో యాంటీబ్యాక్టీరియా గుణాలు ఉన్నాయి. అందుకనే నిమ్మను పలు రూపాల్లో సౌందర్య ఉత్పత్తులలో వాడుతున్నారు. నిమ్మ ఆకుల పేస్టును ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవచ్చు. దీనికి కాస్త తేనె కూడా కలుపుకోవచ్చు. దీనివల్ల ముఖ పర్చస్సు పెరుగుతుంది. ముఖం మీదున్న మచ్చలు, మొటిమలను కూడా పోగొడతాయివి. నిమ్మ ఆకుల్ని మెత్తగా నూరి పళ్లకు పట్టిస్తే.. నోటి దుర్వాసన పోతుంది. పళ్లలోని బ్యాక్టీరియా నశిస్తుంది. దంతాలు ఆరోగ్యంగా మారతాయి. స్నానం చేసే నీటిలో నిమ్మ ఆకుల్ని వేసుకుని స్నానం చేస్తే చర్మ ఆరోగ్యం బావుంటుంది. నిమ్మ ఆకుల్ని హ్యాండ్‌వాష్‌లా వాడవచ్చు. ఆకుల్ని నలిపి చేతులకు పూసుకుంటే చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. వికారం పోవడానికి నిమ్మ ఆకుల్ని వాడవచ్చు. -
మైగ్రేన్ వేధిస్తోందా? ఇలా చేయండి..
ఎన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహించినా ఏలోపం కనిపించకుండా వేధించే తలనొప్పే మైగ్రేన్. చాలామంది ఉద్యోగుల ఆఫీసు పనిగంటలూ, చాలామంది పిల్లల స్కూల్ అవర్స్ వృథా అయ్యేలా చేస్తుందీ మైగ్రేన్ సమస్య. సాధారణం మగపిల్లలతో పోలిస్తే అమ్మాయిల్లో ఇది ఎక్కువ. మైగ్రేన్‌కు కారణాలు, నివారణ, చికిత్స వంటి అంశాలను తెలుసుకోవడం కోసమే ఈ కథనం. మైగ్రేన్ సమస్య ఉన్నవారి మెదడు చుట్టూ ఉండే రక్తనాళాలు, వాటి పరిమాణం అకస్మాత్తుగా వ్యాకోచిస్తాయి. దాంతో ఆ పరిసరాల నరాలపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. అప్పుడు ఆ నరాల నుంచి రసాయనాలు విడుదల అవుతాయి. వీటివల్ల నొప్పి, వాపు వస్తాయి. రక్తనాళాల పరిమాణం విస్తరించిన కొద్దీ నొప్పి ఎక్కువ అవుతుంది. ఈ సమస్య వల్ల శరీరంలోని సింపాథెటిక్ నరాల వ్యవస్థ ఉత్తేజానికి గురికావడంతో తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఈ తలనొప్పినే మైగ్రేన్ అంటారు. కారణాలు : ► తీక్షణమైన వెలుతురుకు ఎక్స్పోజ్ కావడం ► తీవ్రమైన మానసిక ఒత్తిడి ►నిద్రలేమి తరచూ ఉపవాసాలుండటం ►హార్మోన్ల సమస్యలుసరిపడని వాసనలు ►ఆల్కహాల్ అలవాటు, పొగాకూ... దాని ఉత్పాదనలు వాడటం, పొగతాగడం ►ఎక్కువగా కాఫీ తాగడం లేదా కెఫిన్ ఉండే పదార్థాలు తీసుకోవడం ►మహిళల్లో బహిష్టు ముందర ఈస్ట్రోజెన్ హార్మోన్స్ ఎక్కువగా స్రవించడం వల్ల మైగ్రేన్ కనిపించవచ్చు. లక్షణాలు : తలనొప్పి చాలా తీవ్రంగా వస్తుంది. ►తల బద్దలవుతున్నట్లుగా నొప్పి రావచ్చు. అది ఒక్కోసారి తలకు ఒకవైపు లేదా కొన్నిసార్లు రెండు వైపులా రావచ్చు. ►ఒక్కోసారి కళ్లచుట్టూ, కణతలో, తల వెనక భాగంలో తీవ్రమైన నొప్పి రావచ్చు .తలనొప్పి ఒక పక్క నుంచి మరో పక్కకు మారవచ్చు. ►రోజువారీ పనులు చేస్తుంటే నొప్పి మరీ ఎక్కువవుతుంది ►కొందరిలో వికారం, వాంతులు కనిపించవచ్చు. ►మరికొందరిలో అరుదుగా విరేచనాలు కావచ్చు. ►ఇకొందరిలో ముఖం పాలిపోవడం, కాళ్లూచేతులు చల్లబడటం జరగవచ్చు. ►సాధారణంగా చాలామందిలో వెలుతురు తట్టుకోలేకపోవడం, శబ్దం వినకలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ►చిరాకు, నీరసం, ఉత్సాహాంగా లేకపోవడం వంటి లక్షణాలూ ఉంటాయి. ∙తరచూ ఆవలింతలు కనిపిస్తుండవచ్చు. ముందస్తు హెచ్చరికలూ ఉంటాయి... ►మైగ్రేన్ సమస్య ఉన్నవారిలో తలనొప్పి వచ్చేముందర కొన్ని లక్షణాలను గమనించవచ్చు. వీటినే మైగ్రేన్ ఆరా అంటారు. అవి... కళ్ల ముందు మెరుపులు, ప్రకాశవంతమైన వెలుగులు కనిపించడం. ఈ మెరుపులు మధ్యలో మొదలై చివరలకు వెళ్లినట్లుగా ఉంటాయి. జాగ్రత్తలివే... ∙ఎక్కువ శబ్దాలూ, వెలుతురూ లేని గదిలో విశ్రాంతిగా పడుకోవాలి. ∙కంటినిండా నిద్రపోవాలి ∙మద్యం, పొగతాగే అలవాట్లు పూర్తిగా మానుకోవాలి. ∙కొవ్వుపదార్థాలు, తలనొప్పి ఉన్నప్పుడు ప్రోటీన్ ఫుడ్ అంటే మాంసం, పప్పులు తగ్గించాలి ∙రోజూ తగినంత నీరు తాగాలి. ∙జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి, రోజూ వ్యాయామం చేయాలి. ∙మానసిక ఒత్తిడి తగ్గించుకోడానికి బ్రీతింగ్ వ్యాయామాలూ, యోగా వంటివి అలవరచుకోవాలి. చికిత్స : మైగ్రేన్‌కు రెండు రకాల చికిత్సలు చేస్తారు. ఒకటి నొప్పి వచ్చినప్పుడు దాన్ని తగ్గించడానికి చేసే తక్షణ చికిత్స. మళ్లీ మళ్లీ నొప్పి రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన దీర్ఘకాలిక చికిత్స. డాక్టర్లు ఈ రెండు రకాల మందులు వాడుతూ చాలావరకు మైగ్రేన్‌ను నియంత్రణలో ఉంచుతారు. అయితే ఇది తీవ్రమైన తలనొప్పి కలిగించినప్పటికీ చాలామందిలో వయసు పెరుగుతున్న కొద్దీ ఇది రావడం తగ్గిపోతుంది. పైగా ప్రాణాపాయం లేని నిరపాయకరమైన సమస్య కావడం వల్ల దీనిపట్ల పెద్దగా ఆందోళన అక్కర్లేదు. -
మైగ్రేన్ నయమవుతుందా?
నా వయసు 26 ఏళ్లు. నాకు కొంతకాలంగా తలలో ఒకవైపు విపరీతమైన తలనొప్పి వస్తోంది. ఆఫీసులో ఏపనీ చేయలేకపోతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే మైగ్రేన్ అన్నారు. హోమియో మందులతో ఇది తగ్గుతుందా? – ఆర్. జానకి, అమలాపురం పార్శ్వపు నొప్పి అని కూడా పిలిచే ఈ మైగ్రేన్ తలనొప్పిలో తలలో ఒకవైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. సాధారణంగా ఇది మెడ వెనక ప్రారంభమై కంటివరకు వ్యాపిస్తుంది. యువకులతో పోలిస్తే యువతుల్లో ఇది ఎక్కువ. కారణాలు: తలలోని కొన్ని రకాల రసాయనాలు అధిక మోతాదులో విడుదల కావడం వల్ల పార్శ్వపు నొప్పి వస్తుందని తెలుస్తోంది. ఇక శారీరక, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, చాలాసేపు ఆకలితో ఉండటం, సమయానికి భోజనం చేయకపోవడం, సైనసైటిస్, అతి వెలుగు, గట్టి శబ్దాలు, ఘాటైన వాసనలు, పొగ, మద్యం వంటి అలవాట్లు, మహిళల్లో నెలసరి సమయాల్లో, మెనోపాజ్ సమయాల్లో స్త్రీలలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వంటివి ఈ సమస్యకు కారణాలుగా చెప్పవచ్చు. లక్షణాలు: పార్శ్వపు నొప్పిలో చాలారకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటిని మూడురకాలుగా విభజించవచ్చు. 1 పార్శ్వపు నొప్పి వచ్చేముందు కనిపించే లక్షణాలు : ఇవి పార్శ్వపునొప్పి వచ్చే కొద్ది గంటలు లేదా నిమిషాల ముందు వస్తాయి. చికాకు, నీరసం, అలసట, నిరుత్సాహం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని రకాల తినుబండారాలు ఇష్టపడటం, వెలుతురు, శబ్దాలను తట్టుకోలేకపోవడం, కళ్లు మసకబారడం, కళ్లముందు మెరుపులు కనిపించడం జరగవచ్చు. వీటినే ‘ఆరా’ అంటారు. 2 పార్శ్వపునొప్పి సమయంలో కనిపించే లక్షణాలు: తీవ్రమైన తలనొప్పి, తలలో ఒకవైపు వస్తుంటుంది. ఇది 4 నుంచి 72 గంటల పాటు ఉండవచ్చు. 3 పార్శ్వపు నొప్పి వచ్చాక కనిపించే లక్షణాలు: చికాకు ఎక్కువగా ఉండటం, నీరసంగా ఉండటం, వికారం, వాంతులు విరేచనాలు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స / నివారణ: కొన్ని అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి. మనకు ఏయే అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తున్నాయో జాగ్రత్తగా గమనించి, వాటికి దూరంగా ఉండటం ద్వారా మైగ్రేన్‌ను నివారించవచ్చు. అలాగే కాన్స్టిట్యూషన్ పద్ధతిలో ఇచ్చే ఉన్నత ప్రమాణాలతో కూడిన హోమియో చికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. -
పదేళ్ల బాబుకు తరచూ తలనొప్పి!
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా బాబు వయసు పదేళ్లు. తరచూ తలనొప్పితో చాలా బాధపడుతున్నాడు. ఇంతకుముందు అప్పుడప్పుడు మాత్రమే తలనొప్పి వచ్చేది. కాని ఇటీవల చాలా తరచుగా తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌కు చూపిస్తే కొన్ని పరీక్షలు చేసి ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. కానీ మాకు ఆందోళనగా ఉంది. దయచేసి తగిన సలహా ఇవ్వండి. – జీవన్‌కుమార్, కాకినాడ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ బాబు దీర్ఘకాలిక తలనొప్పి (క్రానిక్ హెడేక్)తో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు. ఇలా వచ్చే తలనొప్పులకు అనేక కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది మైగ్రేన్. ఇది పెద్దల్లో ఎంత సాధారణమో పిల్లల్లో అంతగా సాధారణం కానప్పటికీ అరుదేమీ కాదు. మైగ్రేన్‌తో పాటు టెన్షన్ హెడేక్, మెదడు లోపలి సమస్యలు, సైనస్, జ్వరాలు రావడం, పళ్లకు సంబంధించిన సమస్యలు, కంటి లోపాలు, మానసికమైన సమస్యల వల్ల కూడా దీర్ఘకాలిక (క్రానిక్) తలనొప్పులు రావచ్చు. మీరు చేయించిన ప్రాథమిక పరీక్షల్లో రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయని చెబుతున్నారు కాబట్టి మీ బాబుది మైగ్రేన్ వల్ల తలనొప్పి అనే భావించవచ్చు. అయితే ఈ మైగ్రేన్‌లోనూ చాలారకాలు ఉన్నాయి. ఆహారంలో నైట్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం, అలసట, నిద్రలేమి వంటి కారణాల వల్ల ఇది మరింత పెరుగుతుంది. నివారణ / చికిత్స ►చాలా ప్రశాంతంగా ఉండే వెలుతురు లేని గదిలో విశ్రాంతి తీసుకోవడం ►నుదిటిపై చల్లటి నీటితో అద్దడం ►నొప్పి తగ్గించడానికి డాక్టర్ సలహా మేరకు మందులు (ఉదాహరణకు ఎన్ఎస్ఏఐడీ గ్రూప్ మందులు) వాడటం ►నీళ్లు ఎక్కువగా తాగించడం ►ఆందోళన, టెన్షన్, మానసిక ఒత్తిడిని నివారించడం పైన పేర్కొన్న జాగ్రత్తలతో మైగ్రేన్ కారణంగా తరచూ వచ్చే తలనొప్పి ఎటాక్స్‌ను చాలావరకు తగ్గించవచ్చు. అయితే ఇది చాలా తరచూ వస్తుంటే మాత్రం ప్రొఫిలాక్టిక్ చికిత్సగా మూడు నుంచి ఆరు నెలల పాటు డాక్టర్ సలహా మేరకు మరికొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. మీరు మరొకసారి మీ న్యూరోఫిజీషియన్ లేదా మీ ఫ్యామిలీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించి తగు సలహా, చికిత్స తీసుకోండి. పాప తల ఒకవైపు ఫ్లాట్‌గా ఉంది..! మా పాప వయసు 13 నెలలు. పాపకు తల ఎడమవైపున ఫ్లాట్‌గా ఉంది. పరిశీలించి చూస్తే ఒకవైపున సొట్టపడ్డట్లుగా అనిపిస్తోంది. ఇది ఏమైనా ప్రమాదమా? దీనికి చికిత్స అవసరమా? – పి. నవ్య, ఖమ్మం మీ పాపకు పొజిషనల్ సెఫాలీ అనే కండిషన్ ఉందని అనిపిస్తోంది. దీన్నే ఫ్లాటెన్‌డ్ హెడ్ సిండ్రోమ్ అని కూడా అంటారు. పిల్లలను ఎప్పుడూ ఒకే స్థితిలో పడుకోబెట్టినప్పుడు ఇది కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో పాప గర్భంలో ఉన్నప్పుడు ఇది మొదలై ఉండవచ్చు. ఇలాంటిదే మరో సమస్య కూడా ఉంది. దీన్నే క్రేనియో సినోస్టాసిస్ అంటారు. అయితే ఇది కాస్తంత తీవ్రమైన సమస్య.పిల్లలు పడుకున్నప్పుడు వాళ్ల తల పొజిషన్‌ను తరచూ మారుస్తుండటం చాలా అవసరం. మెడ కండరాలకు సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే ఒకసారి డాక్టర్‌కు చూపించి దానికి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య అదే సర్దుకుంటుంది. అంటే కాలక్రమంలో తలలోని సొట్టలు కూడా తగ్గిపోయేందుకు అవకాశం ఉంది. దీని వల్ల మెదడుపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ పిల్లల్లో కూడా సాధారణ పిల్లల్లాగానే తెలివితేటలుంటాయి. మీరు ఒకసారి మీ పాపను పీడియాట్రీషియన్‌కు చూపించి ఇది పొజిషనల్ సమస్యేనా, లేదా ఇతరత్రా ఏవైనా సమస్యలున్నాయా అని తెలుసుకోండి. కేవలం తల ఒకవైపు ఫ్లాట్‌గా కనిపిస్తుండటమే సమస్య అయితే దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డా. రమేశ్‌బాబు దాసరి, సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
పోర్టబుల్ టూల్ మైగ్రేన్‌కు చెక్!
పరిశోధన మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్న రోగులకు ఓ శుభవార్త. సైంటిస్టులు ఇప్పుడు కొత్త ఎలక్ట్రానిక్ ఉపకరణాన్ని తయారుచేశారు. ఈ పోర్టబుల్ ఉపకరణం అసలు నొప్పి మెుదలు కాకమందే పనిచేసి రాబోయే నొప్పిని నివారిస్తుందంటున్నారు దీన్ని రూపొందించిన శాస్త్రవేత్తలు. మైగ్రేన్ వచ్చినప్పుడు తలనొప్పి తీవ్రత ఎంతో ఎక్కువగా ఉండటమే కాదు... కళ్ల మందు మెరుపులు, చుక్కలు కనిపించినట్లు అనిపించడం, దృష్టి మందగించిన అనుభూతి, బలహీనంగా ఉండటం, అయోమయంగా అనిపించడం... ఈ లక్షణాలన్నీ సాధారణంగా మైగ్రేన్ ఉన్నవాళ్లలో కనిపిస్తాయి. ఆ తర్వాత తీవ్రమైన తలనొప్పితో పాటు కొందరిలో వికారం, వాంతులు కూడా ఉంటాయి.ఇలాంటి వాళ్ల కోసం ఒహియో యూనివర్సిటీ పరిశోధకులు ఓ ఎలక్ట్రానిక్ పరికరాన్ని రూపొందించారు. ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లేలా రూపొందించిన ఈ ఉపకరణంతో తలనొప్పి నుంచి రోగులకు విముక్తి కలుగుతుందని ఈ పరిశోధనల వల్ల తేలిందని నేతృత్వం వహించిన శాస్త్రజ్ఞుడు యూసఫ్ మహ్మద్ తెలిపారు. ప్రస్తుతం మైగ్రేన్ తలనొప్పులతో బాధపడుతూ సంప్రదాయ చికిత్స తీసుకుంటున్నవారిలో కనీసం 50%–60% మందికి ఈ చికిత్స సాంత్వన కలిగిస్తుందని యూసఫ్ మహ్మద్ పేర్కొన్నారు. మైగ్రేన్ తలనొప్పి రాబోయేముందు మెదడులో జరిగే అలజడులను పసిగట్టే ఈ ‘ట్రాన్స్ క్రేనియల్ మ్యగ్నెటిక్ స్టిమ్యులేటర్’ అనే పరికరం... ఆ అలజడి తలనొప్పిగా రూపొందకముందే తగ్గిస్తుంది. ‘గతంలోనే ఈ ఉపకరణాన్ని తయారుచేశాం. అయితే అప్పుడు అది సైజ్‌లో వురింత పెద్దగా ఉంది. ఒకచోటి నుంచి మరో చోటికి తరలించేందుకు అనువుగా లేదు. అయితే ఇప్పుడు దాన్ని చేత్తో పట్టుకొని తీసుకెళ్లేంత సౌకర్యంగా తీర్చిదిద్దాం’ అంటున్నారు యూసఫ్ మహ్మద్. ఇంట్లో ఉంచుకునేందుకు వీలైన ఈ పరికరం త్వరలోనే మార్కెట్లోకి వస్తుందని ఆశించవచ్చు. -
పెయిన్ఫుల్ మైగ్రేన్!
ఆకాశంలో పొద్దు పొడిచినట్టే తలలో నొప్పి పొడుస్తున్నట్లుగా వస్తుంది. ఆకాశంలో ఒకవైపునే సూర్యుడు ఉన్నట్లే సాధారణంగా తలలో నొప్పి కూడా ఒకేవైపున ఉంటుంది. మధ్యాహ్నమవుతున్న కొద్దీ ఎండప్రచండం అవుతున్నట్లే తలలో నొప్పి కూడా పెరిగిపోతూ బాధిస్తుంది. అంతేకాదు... ఎండను మామూలు కళ్లు చూడలేనట్లుగానే వెలుగునూ ఈ నొప్పి సమయంలో కళ్లు చూడలేకపోతాయి. అచ్చం ఆకాశంలో భానుప్రతాపం లాంటి నొప్పినే తలలోనూ నేను కలిగిస్తాను.మైగ్రేన్అందుకే తెలుగులో నన్ను ‘పార్శ్వపు నొప్పి’ అంటారు. ఇంగ్లిష్‌లో ‘మైగ్రేన్’ అని పిలుస్తుంటారు. పేరు ఏదైనా బాధ మాత్రం అంతే తీవ్రం. ‘మై పెయిన్’ అంటూ నన్ను గురించి నేనే వివరించుకుంటున్నాను. నా గురించి తెలుసుకోండి. ⇔ టీనేజ్‌లో ఉండే వాళ్లంటే అందరికీ ఇష్టమే. అలాగే నాకు కూడా. అందుకే ఆ వయసు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తా. వాళ్ల ఆశలూ, భవిష్యత్తు లాగే నా లక్షణాలూ విలక్షణంగా ఉంటాయి. కళ్లవుుందు రంగురంగుల మెరుపులూ, మిరిమిట్లూ మెరుస్తుంటాయి. కలర్లు కనిపిస్తుంటాయి. మెరుపులెక్కువై ఒక్కోసారి కళ్లు బైర్లుగమ్ముతాయి. సాధారణంగా తలలో ఏదో ఒకవైపునే కనిపిస్తుంటా. ఒక్కోసారి తలలో ఒక చోటనో లేదా తల అంతటా నొప్పి రూపంలో వస్తుంటా. ⇔ నేను రాగానే విచారం, వికారం రెండూ వస్తాయి. నేను ఉన్నంత సేపు కష్టాల జంట అలాగే కొనసాగుతుంది. నేను కనిపించే వారి నిష్పత్తిని పరిశీలిస్తే మహిళలు 70 శాతం, పురుషులు 30 శాతం ఉంటారు. ⇔ నేను వస్తూ, పోతూ ఉండే అతిథిని. వచ్చినప్పుడల్లా తలలో కొన్నాళ్ల పాటు వసతిగృహం ఏర్పాటు చేసుకుంటా. సాధారణంగా కౌవూరం (అడాలసెంట్ వయుస్సు)లో 13-20 ఏళ్లలోపు వాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంటా. ఆ వయుస్సులో వచ్చి వేధించి, వాళ్ల వయుస్సు పెరిగేకొద్దీ రావడం తగ్గిస్తుంటా. కానీ కొంతమందిలో మాత్రం చాలా ఏళ్లు అదేపనిగా వస్తూ ఉంటా. ఎవరెవరిలో కనిపిస్తుంటానంటే... ⇔ వేళకు భోజనం చేయునివారిలో వేళకు నిద్రకు ఉపక్రమించే అలవాటు లేని వారిలో కొన్ని ఆహార పదార్థాలు, వాసనలంటే సరిపడనివారిలో. ⇔ ఆహారంలో ఎక్కువగా చాక్లెట్స్, వుసాలాలు, కొన్ని రకాల కూల్‌డ్రింక్స్, వురిగిన నూనెలో వేపిన పదార్థాలు, నిల్వ ఉంచిన ఆహారం (టిన్డ్ ఫుడ్స్) తినేవారిలో. ⇔ ఎండకు ఎక్కువగా తిరిగే వారిలో ఎక్కువగా కనిపిస్తుంటా. ఇక అదేపనిగా ప్రయాణం చేసే కొందరిలోనూ కొన్నిసార్లు కనిపిస్తుంటాను. ⇔ ఇక ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్నవారి తలకాయలంటే నాకు ఇష్టం. పొగతాగేవారన్నా ఇష్టమే. అలాంటి వారిలో తిష్టవేసి చాలా కాలం బాధిస్తుంటా. వాటిని మానేస్తే గానీ ఒక పట్టాన వాళ్ల నుంచి బయటకు రాను. నేను ఎందుకు వస్తుంటానంటే... అన్ని అవయవాల లాగానే రక్తనాళాల క్రవుబద్ధమైన సంకోచ వ్యాకోచాల వల్ల మెదడుకు కూడా రక్తం అందుతుంది. అరుుతే మైగ్రేన్ నొప్పి ఉన్న సందర్భంలో ఈ రక్తనాళాలు గట్టిగా వుుడుకుపోరుు... వెంటనే బాగా వ్యాకోచిస్తారుు. దాంతో రక్తం ఓ ప్రవాహంలా (గషింగ్) వచ్చేస్తుంది. ఫలితంగా తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ సంకోచ, వ్యాకోచాల సవుయుంలో మెదడులో ఉండే సెరిటోనిన్, ఎపీనెఫ్రిన్, 5 హైడ్రాక్సీట్రిప్టమిన్ (5హెచ్‌టీ), ఎసిటైల్కోలిన్ వంటి రసాయునాలు నొప్పికి కారణవువుతారుు. నొప్పికూడ విచిత్రంగా సాధారణంగా ఒకవైపే వస్తుంది. వురో చిత్రం ఏమిటంటే ఒక్కోసారి నొప్పి కేంద్రీకృతంగా ఒక పారుుంట్‌లో మొదలై ఓ తరంగంలా కదులుతూ ఉంటుంది. ఇలా నిమిషానికి ఒక మిల్లీమీటర్ చొప్పున ప్రవహిస్తూ పక్కకు పాకుతుంది. దీన్నే స్ప్రెడింగ్ డిప్రెషన్ అంటారు. నివారణ ఇలా... సాధారణ జీవన విధానంలో వూర్పులతో దాదాపు 60 - 80 శాతం వుందిలో నన్ను సవుర్థంగా నివారించవచ్చు. క్రవుబద్ధంగా సరైన వేళకు ఆహారం తీసుకోవడం, వేళకు నిద్రపోవడం, వారి వారి శరీర ధర్మాన్ని బట్టి ఎంత నిద్రకావాలో అంతసేపు పడుకోవడం చేస్తుంటే నేను దూరంగా ఉంటా. అరుుతే కొన్ని సందర్భాల్లో వురీ ఎక్కువగా నిద్రపోవడం కూడా నేను రావడానికి కారణవువుతుంది. అందుకే అతిగా కూడా నిద్రపోకూడదు. పొగతాగడం, ఆల్కహాల్‌ను పూర్తిగా వూనేయూలి. అంతేకాదు... పైన పేర్కొన్న నొప్పి బయుటపడేందుకు దోహదపడే అంశాలను అవారుుడ్ చేయుడం ద్వారా నన్ను చాలావరకు నివారించవచ్చు. వురికొన్ని వుుందుజాగ్రత్త చర్యలు... ⇔ నేను రావద్దంటే... ఒత్తిడికి గురికావద్దు. టెన్షన్ పడొద్దు. బాగా చల్లటి పదార్థాలు తాగవద్దు. పడని వస్తువులకు దూరంగా ఉండాలి. ఆకుపచ్చని ఆకుకూరలు, తాజా పళ్లు ఎక్కువగా తీసుకోవాలి. తాజా వాతావరణంలో కాసేపు వాకింగ్ చేయుండి. క్రవుబద్ధమైన వ్యాయామం నా వల్ల వచ్చే బాధను చాలావరకు నివారిస్తుంది. ధ్యానం, ప్రాణాయామంతోనూ నన్ను దూరంగా ఉంచవచ్చుని నిరూపితమైంది. నష్టం ఏమిటి...? ⇔ మైగ్రేన్ తీవ్రమైన నొప్పి ఉండటం వల్ల విద్యార్థులకు చదువుకునే అవుూల్యమైన సవుయుం వృథా అవుతుంది. ఇక ఉద్యోగుల్లోనూ ప్రొడక్టివ్ పనిగంటలు వృథా అవుతారుు. అరుుతే నిజానికి ఆ నొప్పితో వీలుకాదుగానీ... ఒకవేళ ఆ సవుయుంలో పని చేయుదలచినా, చదవదలచినా ఆరోగ్యపరంగా వచ్చే నష్టం ఉండదు. ఆ వైద్యాలు అస్సలు వద్దు... ⇔ నొప్పి తగ్గించడానికి పల్లెటూళ్లలో చేసే నాటు వైద్యం ప్రక్రియులు జీడీ, సున్నం వంటివి వాడటం, కడ్డీలతో కాల్చి వాత పెట్టడం వంటివి చేయుడం సరికాదు. ఇప్పుడు ఆధునిక వైద్య ప్రక్రియులు అందుబాటులో ఉన్న సవుయుంలో ఇలాంటివి చేయుడం అసలే సరికాదు. ⇔ నాకు అంటే... మైగ్రేన్‌కి నొప్పికి రెండు రకాలుగా చికిత్స ఉంటుంది. ఒకటి తక్షణం నొప్పి నివారించే వుందులు ఇవ్వడం. దీన్నే అబార్టివ్ ట్రీట్మెంట్ అంటారు. వురొకటి వుళ్లీ వుళ్లీ రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన దీర్ఘకాలిక చికిత్స. దీన్నే ప్రొఫైలాటిక్ ట్రీట్మెంట్ అంటారు. అబార్టివ్ ట్రీట్మెంట్లో సాధారణ పెరుున్కిల్లర్స్ వుందులు అప్పటికప్పుడు నొప్పి తగ్గిస్తారుు. నొప్పి ఎక్కువగా కొన్ని వుందులు నొప్పి తగ్గించడానికి ఉపయోగపడతారుు. ఇక వుళ్లీ రాకుండా ఇచ్చే ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్లో వుూడు నెలల నుంచి ఆరు నెలల వరకు వుందులు వాడాల్సి ఉంటుంది. కాల్షియుం ఛానెల్ బ్లాకర్స్, బీటా బ్లాకర్స్, టోపిరమేట్, సోడియమ్ వాల్ప్రొయేట్, ఫ్లునారెజిన్ వంటి వుందులు ఉపయోగించాల్సి ఉంటుంది. ఇటీవల బోటాక్స్ ఇంజెక్షన్లతోనూ సత్ఫలితాలు ఉంటున్నారుు. ⇔ నేను అపాయం చేకూర్చను. కానీ అమితంగా బాధిస్తుంటాను. మంచి జీవనశైలితో దాదాపు దూరంగా ఉంటా. నన్ను దూరం పెట్టుకోడానికి ఇదొక మంచి మార్గం. మంచి జీవనశైలి అనుసరించండి. నానుంచి దూరంగా ఉండండి. లక్షణాలివి ⇔ వికారంగా ఉంటూ వాంతి వస్తున్న ఫీలింగ్. అరుుతే కొందరిలో వాంతి అరుుపోరుు వెంటనే నా వల్ల వచ్చే నొప్పి తగ్గిపోతుంది. ⇔ వెలుగును ఏవూత్రం చూడలేరు. ఈ లక్షణాన్నే ఫోటో ఫోబియూ అంటారు. అలాగే నేను ఉన్నప్పుడు వారికి వినిపించే చిన్నపాటి శబ్దం కూడా చికాకు కలిగిస్తుంది. కొద్దిపాటి చప్పుళ్లకు చప్పున కోపం వచ్చేస్తుంటుంది. దాంతో చప్పుడు వినడం అంటేనే భయపడుతుంటారు. ఈ లక్షణాన్నే ఫోనోఫోబియూ అంటారు. ⇔ నేను ఉన్నప్పుడు నా బాధితులు వెలుగు చూడటం, శబ్దాలను వినడాన్ని ఇష్టపడరు కాబట్టే చీకటి గదుల్లో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలా చీకటి గదిలో ఉంటేనే నేను కాస్త అణిగిమణిగి ఉన్నట్లుగా ఉంటా. వాళ్లకు కొద్దిపాటి ఉపశమనం కలిగిస్తుంటా. ⇔ కొందరిలో కేవలం ఎదురుగా ఉన్న ఒకే ఒక అంశంపైనే దృష్టి కేంద్రీకృతమై, అది వూత్రమే కనిపిస్తుంది. అవి తప్ప ఇంకేవీ కనిపించవు. ఈ లక్షణాన్ని టెలిస్కోపిక్ విజన్ అంటారు. ⇔ కొందరిలో కళ్లవుుందు మెరుపుల వంటివి కనిపిస్తారుు. అవి రంగులు రంగులుగా (వుల్టీ కలర్స్), మిరిమిట్లు గొలిపినట్లు (డాజిలింగ్)గా కనిపిస్తారుు. ⇔ వురికొందరిలో ఓ పక్కనే కనిపిస్తూ... వురో పక్క కనిపించకపోవడం కూడా జరగవచ్చు. ఈ లక్షణాన్ని ‘హెమీ అనోపియూ’ అంటారు. ⇔ నేను ఆవహించినప్పుడు కొందరిలో అరుదుగానే వాళ్లలోని ఓ పక్క కాలూ, చేయూ కాసేపు బలహీనంగా అరుుపోతారుు. కళ్లు పక్కకు తిప్పడం కష్టమైపోతుంది. దీన్ని ఆఫ్తాల్మోప్లేజిక్ మైగ్రేన్ అంటారు. ఇంకొందరిలో వుుఖం వంకరపోతుంది. దీన్ని కాంప్లికేటెడ్ మైగ్రేన్ అంటారు. ⇔ కొందరు యుువతుల్లో నేను వాళ్ల రుతుక్రవుం సవుయుంలో వస్తుంటాను. దీన్నే మెన్స్ట్రువల్ మైగ్రేన్ అంటారు. ఇలా నాకు ఎన్నెన్నో రూపాలు. -
తలనొప్పి తగ్గేదెలా..?
న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 23 ఏళ్లు. నేను గత పదేళ్లుగా తలనొప్పితో బాధపడుతున్నాను. తలనొప్పి వచ్చే ముందు చూపు సరిగా కనిపించడం లేదు. తలనొప్పితోబాటు వాంతులు కూడా అవుతున్నాయి. ఏ చిన్న శబ్దం విన్నా, ఎండ చూసినా తట్టుకోలేకపోతున్నాను. మా అమ్మగారికి కూడా ఇలాగే తలనొప్పి వస్తుండేది. దయచేసి నాకు సరైన సలహా ఇవ్వండి. -హారిక, వరంగల్ మీరు మైగ్రేన్ అనే జబ్బుతో బాధపడుతున్నారు. ఇది ముఖ్యంగా యుక్తవయస్కులలో ఎక్కువగా వస్తుంటుంది. వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. మైగ్రేన్ ఉన్నవారు వేళకు భోజనం చేయడం, నిద్రపోవడం, ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండటం మంచిది. ఈ వ్యాధి ఉన్నవారు టీవీ ఎక్కువ చూడటం, బాగా ఎండలోగానీ / చలిలోగాని బయటకు వెళ్లడం చేయకూడదు. పని ఒత్తిడి ఎక్కువైనా ఈ తలనొప్పి రావచ్చు. సరైన పొజిషన్లో కూర్చొని పనిచేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కూడా దీన్ని అదుపు చేయవచ్చు. ఈ జాగ్రత్తలు పాటిస్తూ, కొన్ని మందులు వాడటం వల్ల జబ్బు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. మీకు దగ్గర్లోని న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి నాకు 26 ఏళ్లు. గత మూడు నెలలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాను. తల చుట్టూ తాడు బిగించినట్లుగా నొప్పి వస్తోంది. ఒక్కోసారి రోజంతా కూడా ఉంటుంది. పరిష్కారం చెప్పండి. - తుషార్, హైదరాబాద్ మీరు చెప్పినదాన్ని బట్టి మీరు టెన్షన్ తలనొప్పితో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఆలోచనలు ఎక్కువ కావడం, మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి ఎక్కువైనా, మానవ సంబంధాలలో మార్పుల వల్ల కూడా తలనొప్పి రావచ్చు. ఒత్తిడి తగ్గించే రిలాక్సేషన్ థెరపీ, కౌన్సెలింగ్ వంటి వాటి ద్వారా కొన్ని మందులు వాడటం వల్ల కూడా ఈ తరహా తలనొప్పిని కొంతవరకు తగ్గించవచ్చు. అయితే మీ తలనొప్పికి ఇతర కారణాలు కూడా ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోడానికి ఒకసారి డాక్టర్‌కు చూపించండి. - డా.మురళీధర్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్,కేర్ హాస్పిటల్, బంజారాహిల్స్,హైదరాబాద్ -
తలనొప్పి... తగ్గేదెలా?
న్యూరో కౌన్సెలింగ్ నా వయసు 39 ఏళ్లు. తరచూ తలనొప్పి వస్తోంది. దీని నుంచి విముక్తి పొందడానికి తగిన మార్గాలు చెప్పండి. - నవీన, కరీంనగర్ * మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు మైగ్రేన్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. తలనొప్పి తగ్గడానికి మీరు ఈ కింద పేర్కొన్న సూచనలు పాటించండి. * ఎక్కువ శబ్దం, కాంతి లేని చోట విశ్రాంతి తీసుకోండి. విపరీతమైన శబ్దం, శక్తిమంతమైన వెలుగు వంటి అంశాలు తలనొప్పిని మరింత ప్రేరేపిస్తాయి. * ఘాటైన వాసనలకు దూరంగా ఉండండి. సరిపడని పర్ఫ్యూమ్ల వల్ల తలనొప్పి ఎక్కువ కావచ్చు. * తలనొప్పి తగ్గుతుందనే అపోహతో టీ, కాఫీలను పరిమితికి మించి తాగడం మంచిది కాదు. * చాక్లెట్లు, కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం మానేయాలి. కెఫిన్ ఉండే శీతలపానీయాల నుంచి దూరంగా ఉండాలి. * ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు పనిచేయాల్సి వచ్చినప్పుడు యాంటీగ్లేర్ గ్లాసెస్ ధరించడం మంచిది. ప్రతి అరగంటకు ఒకసారి కనీసం ఐదు నిమిషాల పాటు రిలాక్స్ కావాలి. కనురెప్ప కొట్టకుండా అదేపనిగా కంప్యూటర్ స్క్రీన్‌ను చూడటం సరికాదు. * కంటికి ఒత్తిడి కలిగించే పనులు చేయకూడదు. కుట్లు, అల్లికలు వంటి పనులు చేసేవారు మధ్య మధ్య కాస్త విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. * తలనొప్పితో పాటు వాంతులు, తలతిరగడం వంటివి కనిపిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. - డాక్టర్ మురళీధర్‌రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ హోమియో కౌన్సెలింగ్ నా వయసు 34 సంవత్సరాలు. ఈమధ్య కాళ్లు నొప్పిగా ఉండి, నడుముభాగం నుంచి కాలివేళ్ల వరకు లాగినట్లుగా ఉంటోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే సయాటికా అన్నారు. సయాటికా అంటే ఏమిటో తెలియజేస్తూ, హోమియోపతిలో దీనికి పరిష్కారం సూచించగలరు. -ఏనుగుల శ్రీనివాసరావు, మెదక్ సయాటికా అనేది ఒకరకపు నొప్పి. ఇది ముఖ్యంగా తుంటినుండి మొదలై కాలివరకు నొప్పి వస్తుంది. సయాటిక్ నరంలోకి వచ్చే అసాధారణ లోపాల వల్ల ఇది వస్తుంది. ఈ సయాటిక్ నరం నడుములోని వెన్నుపాము నుంచి ప్రారంభమై దిగువకు ప్రయాణించి పాదాలను చేరుకుంటుంది. కాలిలో ఉండే అనేక కండరాలను, ఇతర నిర్మాణాలను నియంత్రిస్తుంది. సయాటిక్ నరం ప్రయాణించే మార్గంలో అడ్డంకులు లేదా అవరోధాలు ఏర్పడటం లేదా నరం నలగడం లేదా వత్తుకుపోవడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంది. కారణాలు: ప్రధాన కారణం హెర్నియేటెడ్ డిస్క్. అంటే వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ వెలుపలికి చొచ్చుకొని వచ్చి, వెన్నుపామును నొక్కడం వల్ల సయాటిక్ నరం ఒత్తుకుపోయి నొప్పి వస్తుంది. వెన్నుపూసల మధ్య ఉండే డిస్కు అరిగిపోవడం లేదా దానిలో ఉండే జిగురు వంటి పదార్థం తగ్గిపోవడం వల్ల కూడా బయటి నుంచి సయాటిక్ నరంపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. లాంబార్ స్పైనల్ స్టీనోసిస్: ఏ కారణం చేత అయినా వెన్నుపాము ప్రయాణించే మార్గం ఇరుకుగా మారితే దానిని స్టీనోసిస్ అంటారు. దీనివల్ల నరాలపై వత్తిడి పెరుగుతుంది. నొప్పి వస్తుంది. ఫైరీ ఫార్మిస్ సిండ్రోమ్: ఫైరీ ఫార్మిస్ అనే కండరం సయాటిక్ కండరంపై అమరి ఉంటుంది. ఒకవేళ ఈ కండరంలో ఒత్తిడి పెరిగితే సయాటిక్ నరం పైన కూడా ఒత్తిడి పెరిగి, నొప్పి వస్తుంది. ఇది ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల లేదా మోటారు వాహనాల యాక్సిడెంట్లు, జారిపడటం వంటి వాటివల్ల కూడా వస్తుంది. లక్షణాలు: ఎక్కువసేపు కూర్చోలేకపోవడం, నడవలేకపోవడం, చేతివేళ్లు, కాలివేళ్లు తిమ్మిరి పట్టినట్లు అవడం, కాళ్లు, పాదాలలో సూదులతో గుచ్చినట్లు ఉండటం, ఒక్కోసారి నొప్పితోబాటు కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపించడం వంటివి సయాటికాలో ముఖ్యలక్షణాలు. నిర్ధారణ: ఎక్స్‌రే, నొప్పి లక్షణాల ఆధారంగా. నివారణ: పోషకాహారం తీసుకోవడం, మజిల్ రిలాక్సేషన్ ఎక్సర్సైజులు చేయడం, విశ్రాంతి తీసుకోవడం ద్వారా. హోమియో చికిత్స: హోమియోలో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా వ్యాధిని అదుపు చేయడం జరుగుతుంది. మీరు హోమియో వైద్య నిపుణులను సంప్రదించండి. - డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి,హైదరాబాద్ బ్లడ్ క్యాన్సర్ కౌన్సెలింగ్ మా అమ్మగారికి 40 ఏళ్లు. ఈమధ్య కొన్ని పరీక్షలు చేయించినప్పుడు ఆమెకు బ్లడ్‌క్యాన్సర్ అని తెలిసింది. బ్లడ్ క్యాన్సర్ రావడానికి కారణాలు చెప్పండి. - లక్ష్మిసుప్రియ, నిడదవోలు రక్తకణాల ఉత్పత్తి ప్రభావితం కావడం వల్ల బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. ఇది ప్రధానంగా బోన్ మ్యారో (ఎముకమజ్జ /మూలగ)లో ప్రారంభమవుతుంది. ఇక్కడి మూలకణాలు వృద్ధిచెంది... అవి ఎర్ర, తెల్ల కణాలుగానూ, ప్లేట్లెట్స్గానూ తయారవుతాయి. బ్లడ్ క్యాన్సర్ వచ్చినవారిలో తెల్లరక్తకణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోతాయి. దాంతో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఇలా అనియంత్రితంగా రక్తకణాలు పెరగడాన్ని బ్లడ్‌క్యాన్సర్‌గా చెప్పుకోవచ్చు. ఇలా నియంత్రణ లేకుండా పెరిగిన కణాలు మిగతా వాటిని పనిచేయనివ్వవు. ఫలితంగా రోగనిరోధక శక్తి కోల్పోతారు. బ్లడ్ క్యాన్సర్స్‌లో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి. అవి... 1) లుకేమియా 2) లింఫోమా 3) మైలోమా లక్షణాలు: బ్లడ్‌క్యాన్సర్‌లో పరిపక్వం కాని తెల్లరక్తకణాలు అధిక సంఖ్యలో ఉత్పత్తి అవుతుంటాయి. వీటివల్ల గాయాలైనప్పుడు రక్తాన్ని గడ్డకట్టించడానికి అవసరమైన ప్లేట్లెట్స్ తగ్గుతాయి. ఫలితంగా క్యాన్సర్ రోగులలో గాయాలైనప్పుడు అధిక రక్తస్రావం, శరీరం కమిలినట్లుగా కనపడటం, చర్మం మీద ఎర్రగా దద్దుర్లు కనిపిస్తుంటాయి. తెల్ల రక్తకణాలు వ్యాధి కారక సూక్ష్మజీవులతో పోరాడుతూ ఉండే తెల్లరక్తకణాల పనితీరు దెబ్బతింటుంది. దాంతో అవి తమ విధులను సక్రమంగా నెరవేర్చలేవు. పైగా అవి విపరీతంగా పెరగడం వల్ల ఎర్రరక్తణాలు తగ్గిపోవడంతో రోగికి రక్తహీనత రావచ్చు. దాంతో వాళ్లకు ఆయాసం కూడా రావచ్చు. ఇతర జబ్బులలో కూడా ఈ లక్షణాలు ఉండవచ్చు. అందుకే కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు బోన్‌మ్యారో పరీక్ష చేసి వ్యాధి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఇతర లక్షణాలు: జ్వరం, వణుకు, రాత్రుళ్లు చెమటలు పోవడం, ఇన్ఫ్లుయెంజా, అలసట, ఆకలి లేకపోవడం, చిన్నగాయం నుంచి అధిక రక్తస్రావం, తలనొప్పి, కాలేయం, స్ప్లీన్ వాడు, ఎముకల నొప్పి, సాధారణంగా బ్లడ్ క్యాన్సర్ ఉన్నవారికి ప్రధానంగా మందులతో (కీమోథెరపీ) చికిత్స చేస్తారు. మీ అమ్మగారి విషయంలో మీ డాక్టర్ చెప్పిన సూచనలు పాటించి, తగిన చికిత్స అందించండి. - డాక్టర్ శైలేశ్ ఆర్ సింగీ,సీనియర్ హిమటో ఆంకాలజిస్ట్, బీఎమ్‌టీ స్పెషలిస్ట్, సెంచరీ హాస్సిటల్స్, హైదరాబాద్ -
లివర్ పెరుగుతోంది... ఎందుకు?
హోమియో కౌన్సెలింగ్ నా వయస్సు 45 ఏళ్లు. నేను గత రెండేళ్లుగా తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నాను. నేను చాలా మంది డాక్టర్లను కలిశాను. కానీ తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తుంది. హోమియోపతిలో దీనికి ప్రత్యేక పరిష్కారమార్గాలు ఏవైనా ఉన్నాయా? - శ్యామ్, కరీంనగర్ మైగ్రేన్ అనేది ఒక విధమైన తలనొప్పి. తలనొప్పిలో చాలా రకాలు ఉంటాయి. ఈ మైగ్రేన్ అనేది తలకు ఒక పక్కనే వస్తుంది కాబట్టి దీనికి పార్శ్వపు నొప్పి అంటారు. కారణాలు: మానసిక ఒత్తిడి అధిక శ్రమ ప్రకాశవంతమైన వెలుతురు కళ్లపైన పడటం ఋతుక్రమంలో తేడాలు మత్తు పానీయాలు ఎక్కువగా తీసుకోవడం పొగ తాగడం వంటివి దీనికి కారణాలు. కొందరిలో గర్భనిరోధక మాత్రలు మైగ్రేన్‌ను ప్రేరేపించే అవకాశం ఉంది తలకు ఒక వైపు వెళ్లే నరాలు ఒక్కసారిగా కుచించుకుపోవడం వల్ల లక్షణాలు ప్రారంభమవుతాయి. మైగ్రేన్ రకాలు 1) క్లాసికల్ మైగ్రేన్: ఈ రకం తలనొప్పి స్త్రీ, పురుషులకు సమానంగా ఏ వయసు వారికైనా రావచ్చు. ఈ రకం తలనొప్పి మొదట చెవి పై భాగంలో మొదలై తరువాత తల సగ భాగానికి వ్యాపిస్తుంది. 2) కామన్ మైగ్రేన్: ఈ రకం తలనొప్పి సాధారణంగా స్త్రీలలో ఎక్కువగా మధ్య వయస్సు వారిలో కనిపిస్తుంది. ఈ నొప్పి తలలో ఎక్కడైనా రావచ్చు. ఈ నొప్పి మంద్రంగా కళ్లల్లో సందులతో గుచ్చుతున్నట్లుగా ఉంటుంది. లక్షణాలు: ఉదయం నిద్ర మేల్కొన్నప్పుడు ఎక్కువగా తలనొప్పి వస్తుంది కొందరిలో వాంతి వచ్చినట్లు ఉంటుంది అధిక వెలుతురును భరించలేకపోవడం ఎక్కువ శబ్దాలను తట్టుకోలేకపోవడం కళ్ల ముందు వెలుతురు చుక్కలాగా కనిపించడం ఆకలి తగ్గిపోవడం స్త్రీలలో రుతుక్రమ సమయంలో ఈ నొప్పి ఎక్కువవుతుంది ముఖంలోని ఒక భాగంలో కాని, ఒక చేయి కాని, తిమ్మిరి పట్టడం జరుగుతుంది కళ్లు తిరగడం నిర్థారణ: వ్యాధి లక్షణాలు తెలుసుకోవడం, సిటీ స్కాన్, ఎమ్మారై, రక్త పరీక్ష ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ చేయవచ్చు నివారణ: పోషకాఆరం తీసుకోవడం రోజూ వ్యాయామం చేయడం ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఉండడం పొగతాగడం, మత్తు పానీయాలకు దూరంగా ఉండడం ఎక్కువగా యాంటీ బయాటిక్స్‌కు వాడకుండా ఉండడం. హోమియో చికిత్స: హోమియోలో ఎటువంటి సమస్యలకైనా కాన్స్టిట్యూషనల్ చికిత్స ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధి తీవ్రతను తగ్గించి క్రమక్రమంగా పూర్తిగా వ్యాధి నివారణ చేయవచ్చు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. నేను నిద్రపోయే సమయంలో ఛాతీ కింద ఎడమవైపున గత వారం నుంచి నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే లివర్ సైజు పెరిగిందని చెప్పారు. లివర్ సైజు ఎందుకు పెరుగుతుందో దయచేసి తెలియజేయండి. - విజయ్, ఆమదాలవలస మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే మీ లివర్ సైజు పెరిగిందనే తెలుస్తోంది. దీనికి వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. ఆల్కహాల్ మితిమీరి తీసుకునేవారిలో, స్థూలకాయుల్లో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి లివర్ సైజ్ పెరిగే అవకాశం ఉంది. కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు, హైపటైటిస్-బి, హెపటైటిస్-సి వంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా లివర్ పెరిగే అవకాశం ఉంది. కానీ మీరు రాసిన కాలేయం పరీక్షలో అన్నీ నార్మల్‌గా ఉన్నాయి కాబట్టి అలాంటివి ఉండే అవకాశం తక్కువ. - ముందుగా మీలో లివర్ పరిమాణం ఎంత పెరిగిందో తెలుసుకోడానికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించండి. ఒకసారి ఎండోస్కోపీ కూడా చేయించగలరు. ఈ రెండు పరీక్షల వల్ల మీలో కాలేయం పరిమాణం పెరగడానికి కారణంతో పాటు నొప్పి ఎందుకు వస్తోంది అన్న విషయం కూడా తెలిసే అవకాశం ఉంది. మీకు మద్యం, పొగతాగడం వంటి అలవాట్లు ఉంటే వాటిని వెంటనే మానేయండి. మా బాబు వయసు పదేళ్లు. అతడికి ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు పచ్చకామెర్లు వచ్చాయి. అవి నెలలోపు వాటంతట అవే తగ్గిపోయాయి. మళ్లీ రెండు వారాల క్రితం నుంచి కళ్లు పచ్చగా కనిపిసర్తున్నాయి. దయచేసి సలహా ఇవ్వగలరు. - సుభాష్, నవీన్‌నగర్ మీ అబ్బాయి వయసులోని వారికి ప్రధానంగా హైపటైటిస్-ఎ, హెపటైటిస్-ఈ అనే వైరస్ల వల్ల కామెర్లు రావడానికి అవకాశం ఉంటుంది. మీవాడికి ఇంతకుముందు కూడా ఒకసారి కామెర్లు వచ్చాయంటున్నారు. కాబట్టి ఈ వైరస్ వల్ల మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం చాలా అరుదు. ఒకసారి పై ఇన్ఫెక్షన్లు సోకితే వాటి పట్ల వ్యాధి నిరోధకశక్తి అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే మీ బాబు కామెర్లకు ఇతర కారణాలు అంటే... విల్సన్ డిసీజ్ వంటివి ఉండవచ్చు. మీ బాబుకు దురద, రక్తహీనత వంటి లక్షణాలు ఉన్నాయా, లేవా అన్న విషయం మీరు రాయలేదు. మీరు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌కు చూపించుకోండి. డాక్టర్ భవానీరాజు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ హైదరాబాద్ క్యాన్సర్ కౌన్సెలింగ్ మా తాతగారు, నానమ్మ, పెద్దనాన్న, మా నాన్నగారు క్యాన్సర్ బారిన పడి చనిపోయారు. కుటుంబసభ్యుల్లో ఎవరైనా క్యాన్సర్‌బారిన పడి ఉంటే, ఆ కుటుంబ వారసులూ జాగ్రత్తగా ఉండాలని చదివాను. మా కుటుంబ వైద్య చరిత్రలో క్యాన్సర్ ఉంది కాబట్టి నేనూ క్యాన్సర్‌తో చనిపోతాననే ఆందోళన ఉంది. దయచేసి నా అనుమానాలకు తగిన సమాధానాలు ఇవ్వండి. - రఘు, విజయవాడ మీ అనుమానాలకు తగిన బలముంది. క్యాన్సర్ వ్యాధి బారిన పడి చనిపోయిన కుటుంబ చరిత్ర ఉంటే వాళ్ల వారసులకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగానే ఉందని చెప్పాలి. దీనికి స్త్రీ, పురుషులు, వయసు వంటి అంశాలతో సంబంధం లేదు. ఎవరికైనా రావచ్చు. అయితే మా తాతగారి కాలంలో క్యాన్సర్ వ్యాధికి సరైన చికిత్సే కాదు... దానిని ముందుగా కనిపెట్టేందుకు తగినంత వైద్యపరిజ్ఞానం కూడా లేదు. దాంతో అప్పట్లో క్యాన్సర్ పదం వింటేనే ఆ వ్యాధి బారిన పడ్డవారిపై ఆశలు వదలులుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. అత్యాధునిక వైద్యపరిజ్ఞానంతో పాటు నిపుణులైన డాక్టర్లు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. అంతేకాదు ముఖ్యంగా ఈ క్యాన్సర్ వ్యాధిని ముందే గుర్తించే అధునాతనమైన వైద్య పరిరకాలు, ఉపకరణాలు, వైద్య పరీక్షలు, ఇతరత్రా అనేక ప్రక్రియలు మనకు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా ఏ రకమైన క్యాన్సర్‌నైనా మొదటిదశలోనే గుర్తిస్తే దాన్ని సమూలంగా రూపుమాపవచ్చు. సకాలంలో గుర్తిస్తే దాదాపు 75 శాతం వరకు దీనిని ఎదుర్కొనే వైద్య సదుపాయాలు ఉన్నాయి. కానీ దీని బారిన పడ్డవారు చివరిదశలో చికిత్స కోసం వస్తే వారి జీవితానికి 25 శాతం మాత్రమే హామీ ఉంటుంది. ఇక మీ విషయానికి వస్తే... మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీకు ఉన్న అలవాట్లను బట్టి మీరు వెంటనే కొన్ని వైద్య పరీక్షలు చేయించుకుంటే మీకు క్యాన్సర్ వస్తుందా, రాదా అని కూడా చెప్పవచ్చు. మీకు ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవనశైలి ఉంటే క్యాన్సర్‌ను జయించవచ్చు. ఒకవేళ చెడు అలవాట్లకు లోనైతే క్యాన్సర్‌బారిన పడే అవకాశాలు ఎక్కువ. అయితే అందరూ గుర్తించి, పాటించాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవి... పొగతాగే అలవాటు ఉంటే వెంటనే దాన్ని మానేయాలి విపరీతంగా మద్యం తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి తాజా పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు తినాలి చిన్నప్పుడు ఇవ్వాల్సిన అన్ని రకాల వ్యాక్సిన్‌ను పిల్లలకు ఇవ్వాలి. డాక్టర్ జి. వంశీకృష్ణారెడ్డి సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ యశోద హాస్పిటల్స్ మలక్‌పేట హైదరాబాద్ -
న్యూరాలజీ కౌన్సెలింగ్
మైగ్రేన్ తలనొప్పిని గుర్తించడం ఎలా? నా వయసు 16 ఏళ్లు. నాకు తరచూ తలనొప్పి వస్తోంది. ఇలా వస్తోందంటే మైగ్రేన్ కావచ్చని అంటున్నారు. మైగ్రేన్‌ను గుర్తించడం ఎలా? దీనికి చికిత్స ఏమిటి? - సుదీప, నెల్లూరు మైగ్రేన్ అనేది నరాలకు సంబంధించిన ఒక రకం తలనొప్పి జబ్బు. నొప్పి ముఖ్యంగా తలకు ఒకవైపున మొదలై, రెండోవైపునకు వ్యాపిస్తుంది. తలనొప్పితో పాటు కళ్లు తిరగడం, వాంతి వచ్చినట్లుగా ఉండటం, వెలుతురు ఉన్న వైపు చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా సందర్భాల్లో వాంతి అయ్యాక తలనొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. ఇలాంటి మైగ్రేన్ నొప్పి నెలకో, వారానికో ఒకసారి వచ్చి ఒకటి లేదా రెండు రోజులు బాధించి తగ్గుతుంది. ఇలా పూర్తిగా తగ్గిన నొప్పి ఒక నిర్ణీత సమయానికే తిరిగిరావడం దీని ప్రత్యేకత. దీనిని తెలుగులో పార్శ్వపు తలనొప్పి లేదా ఒంటి చెంపపోటు అని పిలుస్తారు. తలలోని రక్తనాళాలు అకస్మాత్తుగా సంకోచించి, వెంటనే వ్యాకోచించడం వల్ల అధిక రక్తప్రవాహం జరిగి నొప్పి ప్రారంభమవుతుంది. మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఉపవాసం ఉండటం వల్ల ఈ నొప్పి ఎక్కువగా వస్తుంది. మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లు నాలుగురెట్లు అధికంగా ఈ వ్యాధిబారిన పడతారు. వ్యాధి లక్షణాల తీవ్రతలో వ్యక్తి వ్యక్తికీ వ్యత్యాసం ఉంటుంది. సాధారణ స్థాయి నొప్పి ఉంటూ, రోజువారీ పనులకు ఇబ్బంది లేకపోతే అసలు ఈ వ్యాధికి మందులే వాడాల్సిన అవసరమే లేదు. కానీ తీవ్రమైన నొప్పితో ఇబ్బందిపడేవారు డాక్టర్ల పర్యవేక్షణలో మూడు నెలల నుంచి ఏడాది పాటు మందులు వాడితే నొప్పి తగ్గిపోతుంది. చాలామందిలో 40 నుంచి 50 ఏళ్ల వయసు తర్వాత మైగ్రేన్ పూర్తిగా తగ్గిపోతుంది. మైగ్రేన్ అనేది చాలా సాధారణమైన జబ్బు. దీని గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తగినంత నిద్రపోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం వంటి జీవనశైలిలో మార్పులతో దీన్ని నివారించుకోవచ్చు. ఇదేమీ ప్రమాదకరమైనది కాదు కాబట్టి దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -
ప్రయాణం పడటం లేదా?
ట్రావెల్ కొందరికి ప్రయాణాలంటే భయం ఉంటుంది. ప్రయాణాల్లో తల తిరగడం, కడుపులో తిప్పి వాంతి అవడం, విపరీతంగా చెమటలు పట్టడం వంటి సమస్యలే అందుక్కారణం. రెండు నుంచి 12 ఏళ్ల పిల్లలు, గర్భవతులు, మైగ్రేయిన్ వంటి సమస్యలు ఉన్నవారిలో ఈ సమస్య అధికం. ఎక్కువ మోతాదులో ఆహారం, పానీయాలు తీసుకోకూడదు. మసాలాలు, కొవ్వు పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం ప్రయాణానికి ముందు తీసుకోకూడదు. కారులో కూర్చునేటప్పుడు వీలైనంత వరకు ముందు సీటునే ఎంచుకోవాలి. విండో అద్దాలను పూర్తిగా మూసేయకుండా బయటి గాలిని పీల్చుకుంటూ ఉండాలి. తల తిరిగినా, వాంతి వచ్చినట్టు అనిపించినా అల్లం, యాలకులు, లవంగం, వాము వంటివి బుగ్గన పెట్టుకోవాలి. తలను వెనక్కు వాల్చి, కళ్లు మూసుకొని ఏదైనా అందమైన ప్రదేశంలో ఉన్నట్టు ఊహించుకోవాలి. లేదంటే, నిద్రపోవడానికి ప్రయత్నించాలి. -
ఈ వ్యాధులున్నాయా... ఓ కన్నేయండి..!
అప్పటివరకూ మనకు ఎలాంటి వ్యాధీ లేదనుకుంటాం... ఏదో పరీక్ష చేయించుకోవడానికి వెళితే షుగర్ ఉన్నట్లు తేలుతుంది. అంతే... వెంటనే డాక్టర్ ఎందుకైనా మంచిదంటూ మరికొన్ని పరీక్షలతో పాటు కంటి పరీక్ష విధిగా చేయిస్తారు. అలాగే ఎందుకో అనుకోకుండా రక్తపోటు చూపించుకుంటారు. ఉండాల్సినదాని కంటే అది చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. రెండు, మూడు పరీక్షల తర్వాత... రక్తపోటు ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యాక... డాక్టర్లు ముందుగా మూత్రపిండాలనూ, తర్వాత కంటినీ పరీక్షించి అక్కడి రక్తనాళాలు బాగున్నాయా, లేదా అని చూస్తారు. ఇలా... వచ్చిన వ్యాధి గుండెపోటు నుంచి మైగ్రేన్ వంటి తలనొప్పి వరకు ఏదైనప్పటికీ... కంటిపై అది తన దుష్ర్పభావాన్ని చూపవచ్చు. అందుకే, కొన్ని వ్యాధులు ఉన్నవారు విధిగా కన్ను విషయంలోనూ జాగ్రత్త వహించాలి. చాలా మందికి అంతగా తెలియని ఈ విషయాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడుతూ తమ కళ్లను రక్షించుకునేందుకు ఉపకరించేదే ఈ ప్రత్యేక కథనం... మనలో ఎన్నో కణాలుంటాయి. ఆ కణాలన్నీ కలిసి కణజాలంగా ఏర్పడతాయి. ఆయా కణజాలాలు కొన్ని విధులు నిర్వహించడానికి ప్రత్యేకంగా కొన్ని అవయవాలుగా ఏర్పడతాయి. ఆ అవయవాలు ఒక వ్యవస్థలా రూపొంది కొన్ని జీవక్రియలు నిర్వహిస్తుంటాయి. మనకు ఏదైనా వ్యాధి వచ్చిందంటే చాలా సందర్భాల్లో అది ఆ అవయవానికో, ఆ అవయవం నిర్వహించే జీవవ్యవస్థకో పరిమితమవుతుందని అనుకుంటాం. ఉదాహరణకు థైరాయిడ్ అనే అవయవానికి ఏదైనా జబ్బు వస్తే అది థైరాయిడ్కే పరిమితం కాదు. అలాగే రక్తప్రసరణ వ్యవస్థలో ఏదైనా హెచ్చుతగ్గులు ఏర్పడితే అది అంతవరకే తన ప్రభావం చూపదు. కంటి మీదా దాని దుష్ర్పభావం కనిపించవచ్చు. అలా కంటిపై ప్రభావం కనిపించేందుకు ఆస్కారం ఉన్న కొన్ని జబ్బులు, వ్యవస్థలూ, ఆరోగ్య పరిస్థితులు ఉదాహరణకు... డయాబెటిస్ రక్తపోటు థైరాయిడ్ రక్తహీనత (అనీమియా) కొలాజెన్ వాస్క్యులార్ డిసీజ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కొన్ని ట్యూమర్లు (గడ్డలు) కొన్ని రకాల ఆనువంశిక (హెరిడిటరీ) వ్యాధులు కొన్ని రకాల మందులు హార్మోన్లలో వచ్చే అసమతౌల్యతలు కొన్ని విటమిన్లు అధికంగా తీసుకోవడం... ఇవన్నీ కంటిపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. అందుకే కొన్ని వ్యాధులున్నవారు, కొన్ని మందులు, విటమిన్ సప్లిమెంట్లు తీసుకునేవారు విధిగా ఆ మందుల వల్ల కంటిపై దుష్ర్పభావం కలుగుతుందా అని అడిగి తెలుసుకోవాలి. అంతేకాదు కొన్ని లక్షణాలేమైనా కనిపించినప్పుడు విధిగా కంటి డాక్టరునూ సంప్రదించాలి. సోరియాసిస్ సోరియాసిస్ వ్యాధిలో చర్మం పొడిబారి పొట్టు రాలుతున్నట్లుగా ఉంటుంది. మన రోగ నిరోధకశక్తి మనకే ప్రతికూలంగా పనిచేయడంతో పాటు మరికొన్ని కారణాలతో వచ్చే ఈ జబ్బులో కన్ను కూడా ప్రభావితమవుతుంది. ఈ జబ్బు ఉన్నవాళ్లలో రెటీనాకూ, తెల్లగుడ్డులో భాగమైన స్ల్కెరా పొరకు మధ్య ఇన్ఫ్లమేషన్ రావడం (యువైటిస్) కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావడం (కెరటైటిస్), కంజెంక్టివా అనే పొరకు ఇన్ఫెక్షన్ రావడం (కంజెంక్టివైటిస్), కన్ను పొడిబారడం (డ్రై ఐ) వంటి లక్షణాలు కనిపించవచ్చు. పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... సోరియాసిస్‌కు ఇప్పుడు గతంలో కంటే అధునాతనమైన చికిత్స ప్రక్రియలే అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు పూవా, గతంలో మాదిరిగా అల్ట్రా వయొలెట్ రేడియేషన్ కిరణాలతో ఇచ్చే చికిత్సలు, ఇమ్యూనో మాడ్యులేటర్స్ అనే ఆధునిక తరహా చికిత్సలు. వీటిని తీసుకుంటూనే ఒకసారి కంటి వైద్యుడిని కూడా సంప్రదించాలి. మియస్థేనియా గ్రేవిస్ ఇది నరాలకు, కండరాలకు వచ్చే జబ్బు. ఈ జబ్బు వల్ల కండరాలు క్రమంగా తమ శక్తిని కోల్పోయి ఒక దశలో పూర్తిగా చచ్చుబడిపోయినట్లుగా మారిపోతాయి. శక్తిహీనంగా తయారవుతాయి. ఈ వ్యాధి వల్ల కలిగే దుష్ర్పభావంతో చూపు కూడా దెబ్బతింటుంది. కంటిపై ఈ వ్యాధి కనబరిచే దుష్ర్పభావాలు... పై కనురెప్ప గాని లేదా కింది కనురెప్పగానీ వ్యక్తి ప్రమేయం లేకుండా దానంతట అదే మూసుకుపోవడం (టోసిస్) ఒకే వస్తువు రెండు వస్తువులుగా కనిపించడం (డిప్లోపియా) పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... మియస్థేనియా గ్రేవిస్ జబ్బు ఉన్న వారు దాన్ని నియంత్రించుకునేందుకు... డాక్లర్లు సూచించిన స్టెరాయిడ్స్ క్రమం తప్పకుండా వాడాలి. ఇమ్యూనో మాడ్యులేటర్స్ అనే మందులను వాడాల్సి ఉంటుంది. ఒక్కోసారి శస్త్రచికిత్స అవసరం కావచ్చు. మైగ్రేన్ ఇది ఒక రకం తలనొప్పి. మైగ్రేన్ (పార్శ్వపు తలనొప్పి) ఉన్నవారిలో కంటికి సంబంధించి కనిపించే లక్షణాలు ఏమిటంటే... చూపు మసకగా అనిపించడం ఒక పక్క కన్నుగుడ్డులో తీవ్రమైన నొప్పి తాత్కాలికంగా చూపు తగ్గడం లేదా తాత్కాలికంగా ఏమీ కనిపించకపోవడం కంటి కండరాలకూ, కనురెప్పలకూ తాత్కాలికంగా పక్షవాతం రావడం. పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... కొన్ని రకాల అంశాలు మైగ్రేన్ తలనొప్పిని తక్షణం ప్రేరేపిస్తాయి. ఉదా: కొన్ని రకాల సుగంధద్రవ్యాల వాసన లేదా అగరొత్తుల వంటి వాసనలు మైగ్రేన్‌ను ప్రేరేపించి తక్షణం తలనొప్పి వచ్చేలా చేస్తాయి. ఈ అంశాలను ‘ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్’ అంటారు. తమకు ఏ అంశం వల్ల అది వస్తుందో గుర్తించి, దాని నుంచి దూరంగా ఉండాలి. మైగ్రేన్‌కు డాక్టర్లు రెండు రకాల చికిత్సలు చేస్తారు. మొదటిది... తక్షణమే నొప్పి తగ్గేందుకు చేసే చికిత్స. రెండోది... దీర్ఘకాలంలో ఈ నొప్పి మళ్లీ మళ్లీ రాకుండా నివారించేందుకిచ్చే మందులతో చేసే చికిత్స. ఈ మందులను క్రమం తప్పకుండా వాడాలి. డయాబెటిస్ ఇటీవల మన సమాజంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి ఇది. పైగా ఈ వ్యాధి ఉన్నవారిలో కనీసం 20 శాతం మందిలో కంటిపై దాని తాలూకు దుష్ర్పభావం కనిపించే అవకాశం ఉంది. మధుమేహం వల్ల కంటికి వచ్చే వ్యాధులివే... డయాబెటిక్ రెటినోపతి: రెటీనా అనే కంటి వెనక ఉండే తెరపై పడే ప్రతిబింబం నుంచి మెదడుకు సిగ్నల్స్ అందడం వల్లనే మనకు చూపు అనే జ్ఞానం కలుగుతుందన్న విషయం తెలిసిందే. డయాబెటిస్ కారణంగా రక్తనాళాలు మొద్దుబారడం వల్ల రెటీనాకు అందాల్సినంతగా పోషకాలు, ఆక్సిజన్ అందక క్రమంగా రెటీనా తన పనితీరును కోల్పోయే ప్రమాదం ఉంది. దీనివల్ల దృష్టిలోపం కూడా రావచ్చు. అందుకే డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి. వాటి నరాలు స్పందనలు కోల్పోతున్నాయా అన్న అంశాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. గ్లకోమా: డయాబెటిస్ ఉన్నవారికి కంట్లో నల్లముత్యం లేదా నీటికాసులు అని పిలిచే గ్లకోమా రావచ్చు. కంట్లో ఉండే ఇంట్రా ఆక్యులార్ ఒత్తిడి పెరిగి మనకు కనిపించే దృష్టి విస్తృతి క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా గ్లకోమా కండిషన్ ఉత్పన్నమైందా అన్న విషయం తెలుసుకోడానికి కంటి డాక్టర్ చేత పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. క్యాటరాక్ట్: కంట్లోని లెన్స్ పారదర్శకతను కోల్పోయే స్థితిని క్యాటరాక్ట్ అంటారన్న విషయం తెలిసిందే. డయాబెటిస్ ఉన్నవారిలో క్యాటరాక్ట్ వచ్చే అవకాశమూ ఉన్నందున సంబంధిత పరీక్షలూ చేయించుకోవాలి. ఎందుకంటే సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే డయాబెటిస్ ఉన్నవాళ్లకు క్యాటరాక్ట్ పదేళ్ల ముందే వస్తుంది. ఆప్టిక్ న్యూరోపతీ: డయాబెటిస్ వల్ల నరాలు మొద్దుబారి తమ చైతన్యాన్ని కోల్పోతాయన్న విషయం తెలిసిందే. మిగతా నరాల విషయం ఎలా ఉన్నా చూపును ప్రసాదించే ఆప్టిక్ నర్వ్ దెబ్బతింటే జీవితం అంధకారమయ్యే ప్రమాదముంది. కాబట్టి, డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా క్రమం తప్పక కంటిపరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెరపాళ్లను జాగ్రత్తగా నియంత్రించుకోవాలి క్రమం తప్పకుండా మందులు వాడాలి కంటి డాక్టర్‌నూ సంప్రదిస్తూ ఉండాలి అవసరాన్ని బట్టి లేజర్ చికిత్స లేదా శస్త్రచికిత్స చేయించుకోవాలి. అధిక రక్తపోటు అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్) ఉన్నవారిలో అకస్మాత్తుగా చూపు మసకబారవచ్చు. లేదా చూపు కనిపించకపోవచ్చు. దీనికి అనేక కారణాలుంటాయి. రక్తపోటు కారణంగా... రెటీనాకు సంబంధించిన కేంద్ర రక్తనాళం (సిర) లేదా ఏదైనా రక్తనాళపు శాఖలో రక్తం గడ్డకట్టి అడ్డుపడవచ్చు. రెటీనాకు సంబంధించిన ప్రధాన ధమని లేదా ధమని శాఖలో రక్తం గడ్డకట్టి అడ్డుపవచ్చు. ఆప్టిక్ న్యూరోపతి అనే నరాల సంబంధమైన సమస్య రావచ్చు. కన్నులోని ఒక భాగమైన విట్రియల్ ఛేంబర్లో రక్తస్రావం కావచ్చు గ్లకోమా కూడా రావచ్చు. పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... రక్తపోటు ఉన్నవారు బీపీని అదుపులో పెట్టుకోవాలి ఉప్పు, నూనె పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవాలి కంటికి సంబంధించిన సమస్య వస్తే మందులు వాడటం లేదా లేజర్ చికిత్స లేదా శస్త్రచికిత్స చేయించుకోవాలి. థైరాయిడ్ సమస్య గొంతు వద్ద ఊపిరితిత్తుల్లోకి గాలి తీసుకెళ్లే నాళం చుట్టూ ఉండే ప్రధాన గ్రంథి థైరాయిడ్. ఇది స్రవించే హార్మోన్ కారణంగా మన శరీరంలోని అనేక జీవక్రియలు సజావుగా జరుగుతాయి. దీనిలో ఏదైనా లోపం ఏర్పడితే దాని దుష్ర్పభావం కంటిపైనా పడవచ్చు. అప్పుడు కనిపించే లక్షణాలివే... కన్నుగుడ్డు బయటకు పొడుచుకు వచ్చినట్లుగా కనిపించడం (ప్రాప్టోసిస్) ఒకే వస్తువు రెండు వస్తువులుగా కనిపించడం (డిప్లోపియా) కంటికి రంగులను చూసే శక్తి క్షీణించడం (డిఫెక్టివ్ కలర్ విజన్) కన్ను పూర్తిగా పొడిబారిపోవడం (డ్రై ఐ) కార్నియాకు సంబంధించిన సమస్యలు రావచ్చు. పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... థైరాయిడ్ సమస్య ఉన్నవారు డాక్టర్లు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి అవసరాన్ని బట్టి స్టెరాయిడ్స్ తీసుకోవాలి కొన్ని ఇమ్యునో సప్రెసెంట్స్ వాడాలి అవసరాన్ని బట్టి రేడియోథెరపీ తీసుకోవాల్సిరావచ్చు. తప్పని పరిస్థితుల్లో ఆర్బిటోటమీ అనే శస్త్రచికిత్స చేయించాల్సి రావచ్చు. డిస్లిపిడేమియా రక్తంలో ఉండే కొన్ని రకాల కొవ్వు పదార్థాలు (ఉదా: కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్స్ వంటివి) ఉండాల్సిన పాళ్లలో కాకుండా వేర్వేరు విలువలతో ఉండటం వంటి సమస్యలు రావచ్చు. ఇవన్నీ కంటిచూపును ప్రభావితం చేసే అవకాశం ఉంది. పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... కొవ్వులు అతి తక్కువగా ఉండి, పీచు పదార్థాలు చాలా ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి తమలోని కొవ్వులు దహనం అయ్యేలా వ్యాయాయం చేయాలి కొవ్వులను తగ్గించే మందులను వాడాలి. రక్తహీనత శరీరంలో దాదాపు ఐదు లీటర్ల వరకు రక్తం ఉంటుంది. రక్తంలో ఉండే ఎర్ర రక్తకణాలే శరీరంలోని అన్ని కణాలకూ అవసరమైన ఆక్సిజన్‌ను మోసుకెళ్తుంటాయి. ఈ ఎర్ర రక్తకణాల సంఖ్య తక్కువగా ఉండే కండిషన్‌ను రక్తహీనత (ఎనీమియా) అంటారు. కొందరిలో ఎర్రరక్తకణాల సంఖ్య తగినంతగా ఉన్నా ఆక్సిజన్‌ను మోసుకుపోయే హిమోగ్లోబిన్ తక్కువగా ఉండవచ్చు. ఇలా రక్తహీనత ఉన్నవారిలో ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి. రెటీనాపై రక్తస్రావం (రెటినల్ హేమరేజ్) కంటిలోని లెన్స్ పారదర్శకత కోల్పోవడం నరాల సమస్య వంటివి కనిపిస్తాయి. పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... ఎనీమియాను తగ్గించే ఐరన్ టాబ్లెట్లు / మందులు వాడడం విటమిన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవడం. గుండెజబ్బులు కొన్ని రకాల గుండెజబ్బులు (కార్డియో వ్యాస్క్యులార్ డిసీజెస్) కూడా కంటిపై తన దుష్ర్పభావాన్ని చూపవచ్చు. దీని వల్ల కింద పేర్కొన్న ఈ లక్షణాలు కనిపించవచ్చు. అకస్మాత్తుగా చూపు కనిపించకపోవడం తాత్కాలికంగా చూపు కోల్పోవడం కంటి చూపునకు దోహదపడే నరానికి (ఆప్టిక్ నర్వ్‌కు) సంబంధించిన సమస్యలు. పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... అసలు సమస్యకు చికిత్స చేయించు కోవ డమే... గుండెజబ్బుల కారణంగా వచ్చే కంటి సమస్యలకు కూడా పరిష్కారం. అలాగే, దీనితో పాటు తరచూ కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కొలాజెన్ వ్యాస్క్యులార్ డిసీజెస్ కొలాజెన్ అనేది శరీరంలోని ఒక రకం ప్రోటీన్లతో కూడిన కణజాలం. మన రోగనిరోధక శక్తి మన కణజాలాన్నే శత్రువుగా పరిగణించి కొలాజెన్ అనే మన ప్రొటీన్లపై దాడి చేయడం వల్ల కొన్ని వ్యాధులు వస్తాయి. వాటన్నింటినీ కలిపి కొలాజెన్ వ్యాస్క్యులార్ డిసీజెస్‌గా అభివర్ణిస్తారు. ఆ వ్యాధులు ఏమిటంటే... సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్ (ఎస్‌ఎల్‌ఈ) కీళ్లనొప్పులు (జాయింట్ పెయిన్స్) రుమటాయిడ్ ఆర్థరైటిస్ వెజెనెర్స్ గ్రాన్యులొమాటోసిస్ వంటి వ్యాధులు అన్నమాట. ఎస్‌ఎల్‌ఈ (లూపస్): లూపస్ అంటే ఉల్ఫ్ (తోడేలు) అని అర్థం. ముఖం మీద ముక్కుకు ఇరువైపులా మచ్చతో కనిపించే వ్యాధి తాలూకు ఒక లక్షణం. ఇది శారీరక వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది కాబట్టి దీన్ని సిస్టమిక్ లూపస్ అరిథమెటోసస్ (ఎస్‌ఎల్‌ఈ) అని చెబుతారు. లక్షణాలు ముక్కుపై నుంచి చెంపల పైన ఇరువైపులా మచ్చల్లా కనిపించే దద్దుర్ల (ర్యాష్) లాగా వస్తుంది. సూర్యకాంతి ప్రతిస్పందన (ఫోటో సెన్సిటివిటీ)తో ఈ ర్యాష్ మరింత పెరగవచ్చు. కాళ్లూ చేతులకు సంబంధించిన రెండు మూడు కీళ్లలో వాపు వస్తుంది. రుమటాయిడ్ జబ్బుల్లోలా లూపస్‌లో జాయింట్స్ వాపు వచ్చి జాయింట్స్ ఒంగిపోతాయి. అయితే... రుమటిజంలో లాగా ఈ ఒంపు వల్ల శాశ్వత అంగవైకల్యం రాదు. ఇలా కీళ్లు ఒంగిపోవడం అన్నది తాత్కాలికంగానే జరుగుతుంది. కొందరిలో డిప్రెషన్ కనిపించి ఉద్వేగాలకు లోనవుతుంటారు. వీరి సమస్యను మానసికమైన లేదా నరాలకు సంబంధించినదిగా పొరబాటుపడే అవకాశం ఉంది. ఇలాంటి వాళ్లలో ఏఎన్ఏ పరీక్ష నిర్వహించి- లూపస్ వల్ల మెదడుపై ఏదైనా దుష్ర్పభావం పడిందేమో పరీక్షించాలి. కొందరిలో ఫిట్స్ కూడా రావచ్చు. పై వ్యాధి వల్ల కంటికి జరిగే దుష్పరిణామం ఏమిటంటే... అరుదుగా కొందరిలో కళ్లలో రక్తపోటు పెరిగి (హేమరేజిక్ రెటినైటిస్) అంధత్వానికి దారితీయవచ్చు. కొందరిలో కంటి చూపు క్రమంగా తగ్గుతూ ఉండవచ్చు. కొందరిలో జుట్టు రాలిపోవచ్చు. మరికొందరిలో నోటిలో, ముక్కులో పుండ్లు (అల్సర్స్) కూడా రావచ్చు. ఈ అల్సర్స్ వల్ల నొప్పి ఉండదు. వీటన్నింటితో పాటు కళ్లకు సంబంధించి కన్ను పొడిబారడం (డ్రై ఐ), రెటీనాకూ, తెల్లగుడ్డులో భాగమైన స్క్లెరా పొరకు మధ్య ఇన్ఫ్లమేషన్ రావడం (యువైటిస్), స్క్లెరా పొరకు ఇన్ఫ్లమేషన్, కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావడం (కెరటైటిస్) వంటి సమస్యలు రావచ్చు. పిల్లల్లోనూ... పిల్లల్లోనూ లూపస్ రావచ్చు. దీన్ని జువెనైల్ సిస్టమిక్ లూపస్ అని అంటారు. పిల్లల్లో జ్వరం వచ్చి రెండు మూడు కీళ్లలో వాపు రావడం ద్వారా ఇది కనిపిస్తుంది. ఎండను చూడలేక బాధపడుతుండే పిల్లల విషయంలో జువెనైల్ లూపస్ ఉందేమోనని అనుమానించి పరీక్షలు చేయించడం ముఖ్యం. పిల్లల్లో వచ్చినప్పుడు (నియోనేటల్ లూపస్)- పుట్టుకతోనే గుండె కవాటాలలో లోపం (కంజెనిటల్ హార్ట్ బ్లాక్) రావచ్చు. ఇలా పిల్లల్లో లూపస్ వస్తే అది కళ్లపై దుష్ర్పభావం చూపుతుంది కాబట్టి స్కూళ్లకు వెళ్లే వయసు పిల్లల్లో ప్రతి ఆరు నెలలకు ఒకసారి వైద్యపరీక్షలు, కంటి పరీక్షలు (మాక్యులార్ టెస్ట్) చేయించడం మంచిది. పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... ప్రధానమైన సమస్యలైన ఎస్‌ఎల్‌ఈ, కీళ్లనొప్పులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వాటికి చికిత్స తీసుకోవడంతో పాటు కంటికి సంబంధించిన సమస్యలకూ తగిన చికిత్స తీసుకోవాలి. ఇక పిల్లల్లో జువెనైల్ సిస్టమిక్ లూపస్‌ను గుర్తించడం సాధ్యం కాదు కాబట్టి స్కూల్ పిల్లలందరికీ కంటివైద్యుల ద్వారా తరచూ పరీక్షలు చేయించడం కూడా ఒక మంచి ఆలోచనే. పోషకలోపాలు మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు అనే పోషకాలు లోపించడం వల్ల కూడా కంటికి సంబంధించిన కొన్ని సమస్యలు వస్తాయి. అందుకే ఆయా విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. లేదా అన్ని విటమిన్లూ అందేలా సమతులాహారాన్ని తీసుకోవడం మంచిది. విటమిన్ లోపం- ఏర్పడే సమస్య విటమిన్ ఏ- కన్ను పొడిబారడం, రేచీకటి, అంధత్వం (కార్నియల్ బ్లైండ్నెస్) విటమిన్ బి1- కార్నియల్ అనస్థీషియా, కార్నియల్ డిస్ట్రొఫీ విటమిన్ బి2- చూపు మసక బారడం, ఫొటో ఫోబియా (వెలుగు చూడలేకపోవడం), కంజెంక్టివా పొరపై దురదలు, మంటలు విటమిన్ సి- కంజెంక్టివా పొరలో రక్తస్రావం, కనురెప్పలు, రెటీనా సమస్యలు. విటమిన్ డి- జోన్యులార్ క్యాటరాక్ట్, ఆప్టిక్ నర్వ్ వాపు చివరగా... పైన పేర్కొన్న వ్యాధులేగాక రకరకాల బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్, పరాన్నజీవుల కారణంగా వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్ల వల్ల కూడా కళ్లు ప్రభావితమవుతాయి. ఇందులో అతి ముఖ్యమైనది - ఎయిడ్స్ వల్ల కంటిపై పడే దుష్ర్పభావం. అందుకే ఏదైనా బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్, పరాన్నజీవుల (పారసైటిక్) ఇన్ఫెక్షన్ తర్వాత ఒకసారి కంటి డాక్టర్‌తో కూడా పరీక్ష చేయించుకోవడం మేలు. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి -
మెదడుకు చైతన్యం
ఆవిష్కరణ మ్యాగ్నటిక్ బ్రెయిన్ థెరపీ విధానంలో మరో కొత్త ఆవిష్కరణ ట్రాన్స్‌క్రేనియల్ మాగ్నటిక్ స్టిమ్యులేషన్. ఈ విధానంలో మైగ్రేన్, డిప్రెషన్, పక్షవాతం వంటి సమస్యలకు చికిత్స చేయవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. మెదడును చైతన్యవంతం చేయడం ద్వారా కోమాలోకి వెళ్లిన వ్యక్తికి కూడా చికిత్స చేయవచ్చని వారి అభిప్రాయం. ఈ ప్రక్రియను యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్ ఎఫ్‌డిఎ) ఆమోదించింది. డిప్రెషన్‌తో బాధపడుతూ యాంటీ డిప్రెసెంట్ మందులు ప్రభావం చూపని వారికి ఈ ప్రక్రియ చక్కటి పరిష్కారమవుతుందని ఎఫ్‌డిఎ ధ్రువీకరిస్తోంది. ఈ చికిత్స విధానంలో తల మీద ఎలెక్ట్రో మ్యాగ్నటిక్ కాయిల్‌ను అమరుస్తారు. ఈ కాయిల్ మెదడు టికణాలను చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. ప్రయోగదశ దాటిన ఈ వైద్యప్రక్రియ అందుబాటులోకి రావడానికి కనీసం ఏడాది పట్టవచ్చు.