పెయిన్ఫుల్ మైగ్రేన్! | Migraine pain health tips special story | Sakshi
Sakshi News home page

పెయిన్ఫుల్ మైగ్రేన్!

Published Wed, Sep 21 2016 11:20 PM | Last Updated on Sat, Mar 23 2019 7:54 PM

పెయిన్ఫుల్ మైగ్రేన్! - Sakshi

పెయిన్ఫుల్ మైగ్రేన్!

ఆకాశంలో పొద్దు పొడిచినట్టే తలలో నొప్పి పొడుస్తున్నట్లుగా వస్తుంది. ఆకాశంలో ఒకవైపునే సూర్యుడు ఉన్నట్లే సాధారణంగా తలలో నొప్పి కూడా ఒకేవైపున ఉంటుంది. మధ్యాహ్నమవుతున్న కొద్దీ ఎండప్రచండం అవుతున్నట్లే తలలో నొప్పి కూడా పెరిగిపోతూ బాధిస్తుంది. అంతేకాదు... ఎండను మామూలు కళ్లు చూడలేనట్లుగానే వెలుగునూ ఈ నొప్పి సమయంలో కళ్లు చూడలేకపోతాయి. అచ్చం ఆకాశంలో భానుప్రతాపం లాంటి నొప్పినే తలలోనూ నేను కలిగిస్తాను.మైగ్రేన్అందుకే తెలుగులో నన్ను ‘పార్శ్వపు నొప్పి’ అంటారు. ఇంగ్లిష్‌లో ‘మైగ్రేన్’ అని పిలుస్తుంటారు. పేరు ఏదైనా బాధ మాత్రం అంతే తీవ్రం. ‘మై పెయిన్’ అంటూ నన్ను గురించి నేనే వివరించుకుంటున్నాను.

 నా గురించి తెలుసుకోండి.
టీనేజ్‌లో ఉండే వాళ్లంటే అందరికీ ఇష్టమే. అలాగే నాకు కూడా. అందుకే ఆ వయసు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తా. వాళ్ల ఆశలూ, భవిష్యత్తు లాగే నా లక్షణాలూ విలక్షణంగా ఉంటాయి. కళ్లవుుందు రంగురంగుల మెరుపులూ, మిరిమిట్లూ మెరుస్తుంటాయి. కలర్‌లు కనిపిస్తుంటాయి. మెరుపులెక్కువై ఒక్కోసారి కళ్లు బైర్లుగమ్ముతాయి. సాధారణంగా తలలో ఏదో ఒకవైపునే కనిపిస్తుంటా. ఒక్కోసారి తలలో ఒక చోటనో లేదా తల అంతటా నొప్పి రూపంలో వస్తుంటా.

నేను రాగానే విచారం, వికారం రెండూ వస్తాయి. నేను ఉన్నంత సేపు కష్టాల జంట అలాగే కొనసాగుతుంది. నేను కనిపించే వారి నిష్పత్తిని పరిశీలిస్తే మహిళలు 70 శాతం, పురుషులు 30 శాతం ఉంటారు.

నేను వస్తూ, పోతూ ఉండే అతిథిని. వచ్చినప్పుడల్లా తలలో కొన్నాళ్ల పాటు వసతిగృహం ఏర్పాటు చేసుకుంటా. సాధారణంగా కౌవూరం (అడాలసెంట్ వయుస్సు)లో 13-20 ఏళ్లలోపు వాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంటా. ఆ వయుస్సులో వచ్చి వేధించి, వాళ్ల వయుస్సు పెరిగేకొద్దీ రావడం తగ్గిస్తుంటా. కానీ కొంతమందిలో మాత్రం చాలా ఏళ్లు అదేపనిగా వస్తూ ఉంటా. 

 ఎవరెవరిలో కనిపిస్తుంటానంటే...
వేళకు భోజనం చేయునివారిలో  వేళకు నిద్రకు ఉపక్రమించే అలవాటు లేని వారిలో  కొన్ని ఆహార పదార్థాలు, వాసనలంటే సరిపడనివారిలో.

ఆహారంలో ఎక్కువగా చాక్లెట్స్, వుసాలాలు, కొన్ని రకాల కూల్‌డ్రింక్స్, వురిగిన నూనెలో వేపిన పదార్థాలు, నిల్వ ఉంచిన ఆహారం (టిన్‌డ్ ఫుడ్స్) తినేవారిలో.

ఎండకు ఎక్కువగా తిరిగే వారిలో ఎక్కువగా కనిపిస్తుంటా. ఇక అదేపనిగా ప్రయాణం చేసే కొందరిలోనూ కొన్నిసార్లు కనిపిస్తుంటాను.

ఇక ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్నవారి తలకాయలంటే నాకు ఇష్టం. పొగతాగేవారన్నా ఇష్టమే. అలాంటి వారిలో తిష్టవేసి చాలా కాలం బాధిస్తుంటా. వాటిని మానేస్తే గానీ ఒక పట్టాన వాళ్ల నుంచి బయటకు రాను.

నేను ఎందుకు వస్తుంటానంటే...
అన్ని అవయవాల లాగానే రక్తనాళాల క్రవుబద్ధమైన సంకోచ వ్యాకోచాల వల్ల మెదడుకు కూడా రక్తం అందుతుంది. అరుుతే మైగ్రేన్ నొప్పి ఉన్న సందర్భంలో ఈ రక్తనాళాలు గట్టిగా వుుడుకుపోరుు... వెంటనే బాగా వ్యాకోచిస్తారుు. దాంతో రక్తం ఓ ప్రవాహంలా (గషింగ్) వచ్చేస్తుంది. ఫలితంగా తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ సంకోచ, వ్యాకోచాల సవుయుంలో మెదడులో ఉండే సెరిటోనిన్, ఎపీనెఫ్రిన్, 5 హైడ్రాక్సీట్రిప్టమిన్ (5హెచ్‌టీ), ఎసిటైల్‌కోలిన్ వంటి రసాయునాలు నొప్పికి కారణవువుతారుు. నొప్పికూడ విచిత్రంగా సాధారణంగా ఒకవైపే వస్తుంది. వురో చిత్రం ఏమిటంటే ఒక్కోసారి నొప్పి కేంద్రీకృతంగా ఒక పారుుంట్‌లో మొదలై ఓ తరంగంలా కదులుతూ ఉంటుంది. ఇలా నిమిషానికి ఒక మిల్లీమీటర్ చొప్పున ప్రవహిస్తూ పక్కకు పాకుతుంది. దీన్నే స్ప్రెడింగ్ డిప్రెషన్ అంటారు.

నివారణ ఇలా...
సాధారణ జీవన విధానంలో వూర్పులతో దాదాపు 60 - 80 శాతం వుందిలో నన్ను  సవుర్థంగా నివారించవచ్చు. క్రవుబద్ధంగా సరైన వేళకు ఆహారం తీసుకోవడం, వేళకు నిద్రపోవడం, వారి వారి శరీర ధర్మాన్ని బట్టి ఎంత నిద్రకావాలో అంతసేపు పడుకోవడం చేస్తుంటే నేను దూరంగా ఉంటా. అరుుతే కొన్ని సందర్భాల్లో వురీ ఎక్కువగా నిద్రపోవడం కూడా నేను రావడానికి  కారణవువుతుంది. అందుకే అతిగా కూడా నిద్రపోకూడదు. పొగతాగడం, ఆల్కహాల్‌ను పూర్తిగా వూనేయూలి. అంతేకాదు... పైన పేర్కొన్న నొప్పి బయుటపడేందుకు దోహదపడే అంశాలను అవారుుడ్ చేయుడం ద్వారా నన్ను  చాలావరకు నివారించవచ్చు.

వురికొన్ని వుుందుజాగ్రత్త చర్యలు...
నేను రావద్దంటే... ఒత్తిడికి గురికావద్దు. టెన్షన్ పడొద్దు. బాగా చల్లటి పదార్థాలు తాగవద్దు. పడని వస్తువులకు దూరంగా ఉండాలి. ఆకుపచ్చని ఆకుకూరలు, తాజా పళ్లు ఎక్కువగా తీసుకోవాలి. తాజా వాతావరణంలో కాసేపు వాకింగ్ చేయుండి. క్రవుబద్ధమైన వ్యాయామం నా వల్ల వచ్చే బాధను చాలావరకు నివారిస్తుంది. ధ్యానం, ప్రాణాయామంతోనూ నన్ను దూరంగా ఉంచవచ్చుని నిరూపితమైంది.

నష్టం ఏమిటి...?
మైగ్రేన్ తీవ్రమైన నొప్పి ఉండటం వల్ల విద్యార్థులకు చదువుకునే అవుూల్యమైన సవుయుం వృథా అవుతుంది. ఇక ఉద్యోగుల్లోనూ ప్రొడక్టివ్ పనిగంటలు వృథా అవుతారుు. అరుుతే నిజానికి ఆ నొప్పితో వీలుకాదుగానీ... ఒకవేళ ఆ సవుయుంలో పని చేయుదలచినా, చదవదలచినా ఆరోగ్యపరంగా వచ్చే నష్టం ఉండదు.

 ఆ వైద్యాలు అస్సలు వద్దు...
నొప్పి తగ్గించడానికి పల్లెటూళ్లలో చేసే నాటు వైద్యం ప్రక్రియులు జీడీ, సున్నం వంటివి వాడటం, కడ్డీలతో కాల్చి వాత పెట్టడం వంటివి చేయుడం సరికాదు. ఇప్పుడు ఆధునిక వైద్య ప్రక్రియులు అందుబాటులో ఉన్న సవుయుంలో ఇలాంటివి చేయుడం అసలే సరికాదు.

నాకు అంటే... మైగ్రేన్‌కి నొప్పికి రెండు రకాలుగా చికిత్స ఉంటుంది. ఒకటి తక్షణం నొప్పి నివారించే వుందులు ఇవ్వడం. దీన్నే అబార్టివ్ ట్రీట్‌మెంట్ అంటారు. వురొకటి వుళ్లీ వుళ్లీ రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన దీర్ఘకాలిక చికిత్స. దీన్నే ప్రొఫైలాటిక్ ట్రీట్‌మెంట్ అంటారు. అబార్టివ్ ట్రీట్‌మెంట్‌లో సాధారణ పెరుున్‌కిల్లర్స్ వుందులు అప్పటికప్పుడు నొప్పి తగ్గిస్తారుు. నొప్పి ఎక్కువగా కొన్ని వుందులు నొప్పి తగ్గించడానికి ఉపయోగపడతారుు. ఇక వుళ్లీ రాకుండా ఇచ్చే ప్రొఫైలాక్టిక్ ట్రీట్‌మెంట్‌లో వుూడు నెలల నుంచి ఆరు నెలల వరకు వుందులు వాడాల్సి ఉంటుంది. కాల్షియుం ఛానెల్ బ్లాకర్స్, బీటా బ్లాకర్స్, టోపిరమేట్, సోడియమ్ వాల్‌ప్రొయేట్, ఫ్లునారెజిన్ వంటి వుందులు ఉపయోగించాల్సి ఉంటుంది. ఇటీవల బోటాక్స్ ఇంజెక్షన్లతోనూ సత్ఫలితాలు ఉంటున్నారుు.

నేను అపాయం చేకూర్చను. కానీ అమితంగా బాధిస్తుంటాను. మంచి  జీవనశైలితో దాదాపు దూరంగా ఉంటా. నన్ను దూరం పెట్టుకోడానికి ఇదొక మంచి మార్గం. మంచి జీవనశైలి అనుసరించండి. నానుంచి దూరంగా ఉండండి.

లక్షణాలివి
వికారంగా ఉంటూ వాంతి వస్తున్న ఫీలింగ్. అరుుతే కొందరిలో వాంతి అరుుపోరుు వెంటనే నా వల్ల వచ్చే నొప్పి తగ్గిపోతుంది.

వెలుగును ఏవూత్రం చూడలేరు. ఈ లక్షణాన్నే ఫోటో ఫోబియూ అంటారు. అలాగే నేను ఉన్నప్పుడు వారికి వినిపించే చిన్నపాటి శబ్దం కూడా చికాకు కలిగిస్తుంది. కొద్దిపాటి చప్పుళ్లకు చప్పున కోపం వచ్చేస్తుంటుంది. దాంతో చప్పుడు వినడం అంటేనే భయపడుతుంటారు. ఈ లక్షణాన్నే ఫోనోఫోబియూ అంటారు.

నేను ఉన్నప్పుడు నా బాధితులు వెలుగు చూడటం, శబ్దాలను వినడాన్ని ఇష్టపడరు కాబట్టే చీకటి గదుల్లో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలా చీకటి గదిలో ఉంటేనే నేను కాస్త అణిగిమణిగి ఉన్నట్లుగా ఉంటా. వాళ్లకు కొద్దిపాటి ఉపశమనం కలిగిస్తుంటా. 

కొందరిలో కేవలం ఎదురుగా ఉన్న ఒకే ఒక అంశంపైనే దృష్టి కేంద్రీకృతమై, అది వూత్రమే కనిపిస్తుంది. అవి తప్ప ఇంకేవీ కనిపించవు. ఈ లక్షణాన్ని టెలిస్కోపిక్ విజన్ అంటారు.

కొందరిలో కళ్లవుుందు మెరుపుల వంటివి కనిపిస్తారుు. అవి రంగులు రంగులుగా (వుల్టీ కలర్స్), మిరిమిట్లు గొలిపినట్లు (డాజిలింగ్)గా కనిపిస్తారుు.

వురికొందరిలో ఓ పక్కనే కనిపిస్తూ... వురో పక్క కనిపించకపోవడం కూడా జరగవచ్చు. ఈ లక్షణాన్ని ‘హెమీ అనోపియూ’ అంటారు.

నేను ఆవహించినప్పుడు కొందరిలో అరుదుగానే వాళ్లలోని ఓ పక్క కాలూ, చేయూ కాసేపు బలహీనంగా అరుుపోతారుు. కళ్లు పక్కకు తిప్పడం కష్టమైపోతుంది. దీన్ని  ఆఫ్తాల్మోప్లేజిక్ మైగ్రేన్ అంటారు. ఇంకొందరిలో వుుఖం వంకరపోతుంది. దీన్ని  కాంప్లికేటెడ్ మైగ్రేన్ అంటారు.

కొందరు యుువతుల్లో నేను వాళ్ల రుతుక్రవుం సవుయుంలో వస్తుంటాను. దీన్నే మెన్‌స్ట్రువల్ మైగ్రేన్ అంటారు. ఇలా నాకు ఎన్నెన్నో రూపాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement