వ్యాయామంతోనే ఆరోగ్యం
వ్యాయామంతోనే ఆరోగ్యం
Published Mon, Dec 5 2016 10:28 PM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM
– జిల్లా పోలీసు సిబ్బందికి ఎస్పీ సూచన
– జగన్నాథగట్టు శివారుల్లోని ఫైరింగ్ రేంజ్ పరిశీలన
కర్నూలు: జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న హోంగార్డు నుంచి పోలీసు ఉన్నత స్థాయి అధికారి వరకు ప్రతి రోజు వ్యాయామం చేయడం ద్వారా శరీరాకృతి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎస్పీ ఆకె రవికృష్ణ సూచించారు. నగర శివారుల్లోని జగన్నాథగట్టు పోలీసు శిక్షణా కేంద్రం సమీపంలో జిల్లా పోలీసుల కోసం ఏర్పాటు చేసిన ఫైరింగ్ రేంజ్ స్థలాన్ని ఎస్పీ ఆకె రవికృష్ణ సోమవారం ఉదయం పరిశీలించారు. పోలీసు కానిస్టేబుళ్లతో కలిసి వరుసలో నిలబడి ఎస్పీ స్వయంగా ఫైరింగ్ చేశారు. ఈ సందర్భగా సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వరుసలో నిలబడిన వారు ఫైరింగ్ రేంజ్‌లో ఇచ్చే కమాండింగ్ పాటించి బాగా ఫైర్ చేయాలన్నారు. పోలీసులు చక్కటి శరీరాకృతి, «ధారుడ్యాలతో ఫిట్‌గా ఉండాలన్నారు. ఆళ్లగడ్డ, ఆదోని, డోన్, కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు సబ్ డివిజన్‌ల నుంచి సిబ్బంది ఫైరింగ్ రేంజ్‌లో పాల్గొంటారు. ప్రతి సబ్ డివిజన్‌కు రెండు రోజుల పాటు ఫైరింగ్ సమయం కేటాయించారు. ఉదయం 6 గంటల నుంచి 10.30 గంటల వరకు ఉంటుంది. కర్నూలు సబ్ డివిజన్ నుంచి మొదటి రోజు 160 మంది సిబ్బంది ఫైరింగ్ రేంజ్‌లో పాల్గొని ఫైరింగ్ చేశారు. ఫైరింగ్ బోర్డు దగ్గరకు ఎస్పీ స్వయంగా వెళ్లి, కలియ తిరిగి ఫైరింగ్‌లో ఎవరెవరు (బుల్ ఇన్నల్ ఔటర్ మెక్) ఎంత ప్రతిభ కనబరిచారన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కర్నూలు తాలుకా సీఐ మహేశ్వరరెడ్డి, ఆర్‌ఐ రంగముని తదితరులు పాల్గొన్నారు.
Advertisement