అరగంట వ్యాయామంతో దీర్ఘాయువు..
మూడు ముచ్చట్లు
రోజుకు అరగంట వ్యాయామం చేస్తే చాలు, దీర్ఘాయువు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. వయసు మళ్లిన వారు సైతం అరగంట సేపు వ్యాయామానికి కేటాయిస్తే, వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు. క్రమం తప్పకుండా రోజూ కనీసం అరగంట సేపు వ్యాయామం చేసే వృద్ధులు, బద్ధకస్తులైన తమ తోటి వారి కంటే ఎక్కువకాలం బతుకుతారని ఒక తాజా అధ్యయనంలో తేలింది.
అరవయ్యేళ్ల వయసు దాటిన పురుషులపై నిర్వహించిన ఈ అధ్యయనంలో వ్యాయామం చేసే వారు తర్వాతి పన్నెండేళ్లలో అకాల మరణానికి గురయ్యే ముప్పు 40 శాతం మేరకు తగ్గుతుందని ఓస్లో పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలినట్లు బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ వెల్లడించింది.