అవాస్తవం
కొలెస్ట్రాల్ అన్న మాట వింటేనే కంగారు పడిపోతున్నారంతా. ఇటీవల వాడుకలో దానిపై చాలా దురభిప్రాయాలూ, అపోహలూ పెచ్చరిల్లడమే అందుక్కారణం. మన శరీరంలోని కాలేయం ఉత్పత్తి చేసే ఒకలాంటి కొవ్వుని కొలెస్ట్రాల్ అంటారు. శరీరంలోని ప్రతి కణంలో ఇది ఉంటుంది. ఇది చాలా అవసరం. అరుుతే కొలెస్ట్రాల్ అవసరమైన దానికంటే ఎక్కువైతే రక్తనాళాలు కొవ్వుతో నిండి హృద్రోగాలు, పక్షవాతం వంటి సవుస్యలు రావడం జరుగుతుంది.
కొలెస్ట్రాల్‌లో మంచి కొలెస్ట్రాల్ (హై డెన్సిటీ లైపోప్రొటీన్ - హెచ్‌డీఎల్), చెడు కొలెస్ట్రాల్ (లో డెన్సిటీ లైపోప్రొటీన్ -ఎల్‌డీఎల్) అని రెండు రకాలు ఉంటాయి. ఈ మంచి కొలెస్ట్రాల్ ఉండాల్సిన పరిమాణంలో ఉండాలి. ఒంటిలోకి కొన్ని విటమిన్లు వచ్చి చేరాలంటే కొన్ని కొవ్వులు ఆరోగ్యకరమైన మోతాదులో ఉండాల్సిందే.
చెడు కొలెస్ట్రాల్‌గా పేర్కొనే ఎల్‌డీఎల్ పరిమిత స్థాయికి మించితే అది రక్తనాళాల్లో చేరి రక్తప్రవాహాన్ని అడ్డుకుని గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్‌కు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగడానికీ, చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికీ తగినంత వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్ మోతాదులను పరిశీలించుకుంటూ... వాటి వల్ల ఎలాంటి ముప్పూ లేదని ఎప్పటికప్పుడు నిర్ధారించుకుంటూ ఉంటే నిర్భయంగా ఉండవచ్చు.
కొలెస్ట్రాల్ అంత చెడ్డదా?!
Published Sun, Feb 14 2016 4:08 AM | Last Updated on Wed, Apr 3 2019 4:38 PM
Advertisement
Advertisement