Do You Know About When Superstar Mahesh Babu Suffered With Migraine Pain And How He Got Cured - Sakshi
Sakshi News home page

Mahesh Babu: ఆ వ్యాధితో కొన్నేళ్లపాటు సతమతమైన సూపర్‌స్టార్‌.. తన బాధ చూడలేక నమ్రత..

Published Wed, Aug 9 2023 12:36 PM | Last Updated on Wed, Aug 9 2023 1:00 PM

Do You Know About When Superstar Mahesh Babu Suffered With Migraine Pain - Sakshi

జంక్‌ ఫుడ్‌, డైరీ ప్రొడక్ట్స్‌ జోలికే వెళ్లకుండా చాలా స్ట్రిక్ట్‌ డైట్‌ ఫాలో అవుతాడు. ఏమీ తినలేదు కదా అని ఊరికే కూర్చోకుండా క్రమం తప్పకుండా జిమ్‌ చేస్తాడు. విరామం అనే

మహేశ్‌.. ఈ పేరులో వైబ్రేషన్‌ ఇప్పటికీ అలాగే ఉంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ మహేశ్‌బాబు అందం మరింత పెరుగుతోందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. నిత్య యవ్వనం ఒక్క మహేశ్‌కే సొంతం. ఈయన గౌతమ్‌ పక్కన నిలబడితే అతడికి తండ్రిలా కాదు, అన్నలా కనిపిస్తున్నాడు. టాలీవుడ్‌లో మోస్ట్‌ హ్యాండ్సమ్‌ హీరో బిరుదును ఏళ్లకొద్దీ కొనసాగిస్తున్న మహేశ్‌బాబు బర్త్‌డే నేడు (ఆగస్టు 9). దీంతో అభిమానులు సోషల్‌ మీడియాలో మహేశ్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు చెప్తున్నారు.

ఇకపోతే అన్నీ తినేసి, తిన్నది అరిగేవరకు జిమ్‌లో చెమటోడ్చేలా కష్టపడటం మహేశ్‌ స్టైల్‌ కాదు. జంక్‌ ఫుడ్‌, డైరీ ప్రొడక్ట్స్‌ జోలికే వెళ్లకుండా చాలా స్ట్రిక్ట్‌ డైట్‌ ఫాలో అవుతాడు. ఏమీ తినలేదు కదా అని ఊరికే కూర్చోకుండా క్రమం తప్పకుండా జిమ్‌ చేస్తాడు. విరామం అనేది ఇవ్వకుండా పదేళ్లుగా దీన్ని కొనసాగిస్తున్నాడు. ఇన్ని జాగ్రత్తలు పాటించే మహేశ్‌బాబు గతంలో ఓ వ్యాధితో సతమతమయ్యాడు. మైగ్రేన్‌తో చాలా ఏళ్లు ఇబ్బందిపడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా గతంలోని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

చాలా కాలం మైగ్రేన్‌తో బాధపడ్డానని, అప్పుడు నొప్పి తగ్గడానికి చాలా పెయిన్‌ కిల్లర్‌ టాబ్లెట్లు వాడానని చెప్పాడు. అసలు మైగ్రేన్‌కు చికిత్స లేదని, అది నయం కాని వ్యాధి అని చాలామంది చెప్పారన్నాడు. తన బాధ చూడలేకపోయిన నమ్రత డాక్టర్‌ సింధూజను కలిసి చక్రసిద్ధ నాడీ వైద్యం చేయించిందని, రెండు, మూడు నెలలకే మైగ్రేన్‌ నుంచి పూర్తిగా ఉపశమనం పొందానని పేర్కొన్నాడు. అప్పటి నుంచి మళ్లీ పెయిన్‌ కిల్లర్స్‌ వేసుకోవాల్సిన అవసరమే రాలేదని తెలిపాడు. అంతకుముందు షూటింగ్స్‌ వల్ల రోజుకు నాలుగైదు గంటలే నిద్రపోయేవాడినని, కానీ ఈ వైద్యం తీసుకున్న తర్వాత హాయిగా రోజంతా నిద్రపోయానని చెప్పుకొచ్చాడు మహేశ్‌.

చదవండి: మహేశ్ పుట్టినరోజు.. పలు ఇంట్రెస్టింగ్ విషయాలు!

హీరోయిన్‌గా చేసిన రెండు సినిమాలు హిట్‌.. అయినా పెళ్లి కోసం ఆ కండీషన్‌ పెట్టిన తండ్రి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement