
హీరో మహేశ్ బాబు(Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. కొన్నిరోజుల క్రితం ఒడిశాలో షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చాడు. ఆ వెంటనే తన కుటుంబంతో కలిసి ఇటలీ ట్రిప్ వేశాడు. తాజాగా తిరిగి హైదరాబాద్ వచ్చేశాడు. ఈ క్రమంలోనే తల్లి గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.
(ఇదీ చదవండి: దెయ్యం సినిమాకు వసూళ్లు ఎంతొచ్చాయ్?)
మహేశ్ బాబుకు తల్లి ఇందిరా దేవి(Indira Devi) అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ 2022లో ఆమె చనిపోవడం మాత్రం మహేశ్ కి తీరనిలోటు అని చెప్పొచ్చు. తర్వాత సందర్భం వచ్చిన ప్రతిసారి ఆమెని గుర్తుచేసుకుంటూ ఉంటాడు. తాజాగా ఆదివారం (ఏప్రిల్ 20) ఆమె పుట్టినరోజు సందర్భంగా మహేశ్ బాబు లవ్లీ పోస్ట్ పెట్టాడు.
మాటల్లో చెప్పలేనంతగా నిన్ను మిస్ అవుతున్నా అమ్మ.. హ్యాపీ బర్త్ డే అని అమ్మతో కలిసి ఉన్న ఓ ఫొటోని మహేశ్ బాబు పోస్ట్ చేశాడు. దీనికి అతడి అభిమానులు తెగ కామెంట్స్ పెడుతున్నారు.
(ఇదీ చదవండి: స్టార్ హీరోకి ఐదేళ్ల తర్వాత హిట్.. కలెక్షన్ ఎంతొచ్చాయంటే?)
తల్లినే కాదు కుటుంబానికి మహేశ్ చాలా ప్రాధాన్యమిస్తాడు. అయితే షూటింగ్ లో ఉంటాడు. లేదంటే ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపుతూ కనిపిస్తుంటాడు. అందుకే ఏడాదిలో రెండు మూడు సార్లు కూతురు సితార(Sitara Ghattamaneni), కొడుకు గౌతమ్, భార్య నమ్రతతో కలిసి మహేశ్ ట్రిప్స్ కి వెళ్తూనే ఉంటాడు.
ఇక రాజమౌళితో మహేశ్ బాబు చేస్తున్న సినిమా విషయానికొస్తే.. అడవుల బ్యాక్ డ్రాప్ లో జరిగే అడ్వెంచరస్ కథతో దీన్ని తీస్తున్నారు. మహేశ్ తోపాటు ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 31న గానీ లేదా అంతకుముందే మూవీ గురించి అనౌన్స్ మెంట్ ఉండొచ్చని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: చాలా అసహ్యంగా నటించా.. ఇప్పుడు చూస్తే సిగ్గేస్తుంది: సమంత)