Mahesh Babu Wife Namrata Shirodkar Emotional Post On Instagram Over Indira Devi - Sakshi
Sakshi News home page

Namrata Shirodkar: ప్రతి రోజూ ఆమెను గుర్తు చేసుకుంటాం.. నమ్రత ఎమోషనల్ పోస్ట్

Oct 10 2022 7:06 PM | Updated on Oct 10 2022 8:11 PM

Mahesh Babu Wife Namrata Shirodkar Emotional Post In Instagram - Sakshi

హీరో మహేశ్‌ బాబు తల్లి, సూపర్‌ స్టార్‌ కృష్ణ సతీమణి ఇందిరా దేవి ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా మహేశ్ భార్య, నటి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేశారు. అత్త ఇందిరా దేవిని తలుచుకుంటూ ఎమోషనల్ అ‍య్యారు.   

నమ్రత శిరోద్కర్ రాస్తూ.. 'జీవితం అనేది ఒక సర్కిల్ లాంటిది. ఇప్పుడు నా జీవితం ఇదే. మామయ్య గారు మా జీవితంలో ఉన్నందుకు మాకు సంతోషం. అమ్మ ఇందిరాదేవి ఇప్పుడు మా మధ్య లేకపోయినా ఆమె మా గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటుంది. మేం జీవించి ఉన్నంత వరకు ప్రతి రోజూ ఆమెను గుర్తు చేసుకుంటాం.  ఆమె మా కుటుంబాన్ని కాపాడుతుందని మాకు తెలుసు.. లవ్‌ యూ మమ్మీ' అంటూ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇటీవలే ఇందిరా దేవి పెద్దకర్మ కూడా నిర్వహించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement