
సూపర్‌స్టార్ కృష్ణ మరణం అటు ఘట్టమనేని కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. ఒకే ఏడాది మహేశ్ బాబు సోదరుడు రమేష్ బాబు, తల్లి ఇందిరా దేవి, ఆ తర్వాత కృష్ణ కన్నుమూయడంతో ఆ విషాదం నుంచి కుటుంబసభ్యులు, అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా మహేశ్ భార్య నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది. ఎవర్ గ్రీన్ స్టార్, ఎన్నింటికో పునాది వేసి.. నిజమైన ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు.
ఆయనకు సినిమాలపై ఉన్న ప్రేమే ఆయన్ను సూపర్ స్టార్‌ను చేసింది. ఇయన ఎప్పటికీ సూపర్ స్టారే. ఆయన్ను మామయ్య గారు అని పిలవడం నా అదృష్టం. జీవితంలోని ఎన్నో విలువైన పాఠాలను నేర్చుకున్నాను. ఆయన వారసత్వాన్ని, ఖ్యాతిని ఎప్పటికీ మేం పండగలా జరుపుకూనే ఉంటాం. లవ్ యూ మామయ్య గారు అంటూ కృష్ణ సుధీర్ఘ జర్నీకి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం నమ్రత షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment