Mahesh Babu Mother
-
అతన్ని కలిసేందుకే జర్మనీ వెళ్లిన మహేశ్ బాబు
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు కొద్దిరోజుల క్రితం జర్మనీ వెళ్లారు. గుంటూరు కారం సినిమా విడుదల తర్వాత ఆయన వెళ్లడం జరిగింది. సాధారణంగా విదేశాలకి వెళ్లినప్పుడు మహేశ్ బాబు కుటుంబంతో కలిసి వెళ్తారు.. కానీ ఈసారి ఒక్కరే వెళ్లడంతో చాలామంది అతని పర్యటన మీద పలు ఊహాగానాలు వచ్చాయి. ముఖ్యంగా రాజమౌళి సినిమా కోసం తన లుక్, మేకోవర్ గురించిన సాంకేతికపరమైన విషయాల గురించి వెళ్లారని వార్తలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్లో SSMB29 త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజాగా మహేశ్ ఒక ఫోటో షేర్ చేసి తాను ఎందుకు జర్మనీ వెళ్లారో చెప్పకనే చెప్పారు. మహేశ్ జర్మనీకి వెళ్ళింది ఒక డాక్టర్‌ను కలుసుకోవడం కోసమని తెలిసింది. అయితే ఆ డాక్టర్‌ను మహేశ్ కలుసుకోవడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు కలిశారు. దీంతో ఆ డాక్టర్ ఎవరు? ఆయన దగ్గర ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? అనే ప్రశ్నలు అభిమానుల్లో వస్తున్నాయి. జర్మనీలోని ప్రముఖ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆ డాక్టర్ పేరు 'హరీ కొనిగ్'. ఆయన బాడీ ఫిట్‌నెస్‌కు సంబంధించిన డాక్టర్. అక్కడ ఆయనకు ఎంతో ప్రత్యేకత ఉంది. మహేశ్ కూడా తన బాడీ ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టి పెడతారనే విషయం అందరికీ తెలిసిందే.. గుంటూరు కారం చిత్రం సమయం నుంచే ఆయన SSMB29 కోసం కసరత్తులు ప్రారంభించారు. ఆ వర్కౌట్ ఫోటోలు అప్పుడప్పుడు ఇన్‌స్టాలో ఆయన పోస్ట్ చేస్తుంటారు కూడా.. రాజమౌళి సినిమా కోసం తన బాడీ ఫిట్నెస్ గురించే ఆ డాక్టర్‌ను కలిసేందుకు జర్మనీ వెళ్లినట్లు తెలస్తుంది. రాజమౌళి - మహేశ్ కాంబోలో రానున్న చిత్రానికి సంబంధించిన కథ వర్క్ పూర్తి అయిందని రాజమౌళి తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ వేసవి నుంచి షూటింగ్ జరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) View this post on Instagram A post shared by Dr. Harry König (@drharrykoenig) -
ఫ్యాన్స్ కోసం మహేష్ బాబు ఎన్నిరకాల ఫుడ్ వండించాడో చూడండి
-
'అందుకే నాన్న మమ్మల్ని విడిచి వెళ్లారేమో'.. సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె ఎమోషనల్ పోస్ట్
కొద్ది రోజుల సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఘట్టమనేని ఇందిరా దేవి కన్నుమూశారు. ఈ ఏడాదిలోనే కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు కూడా మరణించారు. మహేశ్ బాబుకు ఈ ఏడాది తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. టాలీవుడ్ చిత్రసీమ మొత్తం కదలివచ్చి సూపర్‌స్టార్‌కు నివాళులర్పించింది. ఇందిరా దేవికి రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఐదుగురు సంతానం. తాజాగా ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరా దేవి పెళ్లిరోజు సందర్భంగా మంజుల ఎమోషనల్ పోస్ట్ చేసింది. (చదవండి: నాన్న.. నువ్వు ప్రపంచానికే సూపర్ స్టార్.. మంజుల ఎమోషనల్ ట్వీట్) మంజుల తన ఇన్‌స్టాలో రాస్తూ..' వారి వివాహబంధం స్వర్గంలో కొనసాగేంత గొప్ప బంధం. అమ్మ వెళ్లిన తర్వాత నాన్న చాలా మిస్ అయ్యారని నేను అనుకుంటున్నా. అందుకేనేమో మమ్మల్ని విడిచి అమ్మ వద్దకే చేరాడు. నిజంగా వారు ఆత్మలు కూడా సహచరులేనేమో. వారి 60 ఏళ్ల వివాహబంధానికి మేం ఐదుగురు పిల్లలం. ఇలాంటి ఉన్నతమైన వ్యక్తులు నా తల్లిదండ్రులు కావడం నిజంగా అదృష్టం. వారి ప్రేమ మాకు ఎల్లప్పుడు అండగా ఉంటుంది. వారిలో కనీసం 10 శాతమైన స్వచ్ఛంగా మారడమే వారికిచ్చే ఉత్తమ బహుమతి అని నేను భావిస్తున్నా.' అంటూ ఎమోషనల్ అయ్యారు మంజుల. అమ్మా, నాన్నకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వారితో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు . View this post on Instagram A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni) -
కృష్ణ మరణంతో ఒంటరివాడైన మహేష్ బాబు..
-
మహేశ్‌బాబును అలా ఎన్నడూ చూడలేదు: పరుచూరి గోపాలకృష్ణ
టాలీవుడ్ సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విశ్లేషకుడిగా మారిన విషయం తెలిసిందే! ఏదైనా సినిమాను తీసుకుని అందులో తప్పొప్పులను చర్చిస్తూ ఆ లోపాలను సవరిస్తున్నాడు. ఈ మధ్యే వారియర్ సినిమాలోని ప్లస్ మైనస్‌ల గురించి వీడియో చేసిన ఆయన తాజాగా సూపర్ స్టార్ మహేశ్‌బాబు కుటుంబం గురించి మాట్లాడాడు. ఇటీవలే ఇందిరా దేవిని పోగొట్టుకుని మహేశ్ ఫ్యామిలీ పుట్టెడు శోకంలో మునిగిపోయింది. ఆమె సంస్మరణ సభకు పరుచూరి గోపాలకృష్ణ కూడా హాజరయ్యాడు. ఆ సమయంలో మహేశ్, కృష్ణల పరిస్థితి చూసి విలవిల్లాడిపోయానన్నాడు పరుచూరి. 'ఘట్టమనేని కుటుంబంతో నాకున్న అనుబంధాన్ని ఎన్నోసార్లు తెలియజేశాను. కృష్ణ, మహేశ్‌బాబు, రమేశ్ బాబు, హనుమంతురావు, ఆది శేషగిరిరావు గారితో.. వీరందరితో కుటుంబంలో కుటుంబంలా కలిసిపోయాం. నేను అమెరికా నుంచి వచ్చేలోగా మహేశ్ తల్లి ఇందిరా దేవి కన్నుమూశారని తెలిసింది. ఏకాదశి నాడు వారిని కలిశాను. అప్పుడు కృష్ణగారిని చూస్తే గుండె తరుక్కుపోయింది. ఇన్ని సంవత్సరాల కాలంలో మహేశ్‌బాబును అంత డల్‌గా ఎప్పుడూ చూడలేదు. ఇందిరమ్మ అంటే మా దృష్టిలో మహాలక్ష్మి, దేవత. ఆమె ఎక్కువ మాట్లాడరు, కేవలం చిన్న చిరునవ్వుతో పలకరిస్తుంటారు. ఆమె మరణించాక కృష్ణగారి ముఖం చూసి ఎంతో ఆవేదన చెందాను. సామాన్యంగా అలాంటి సందర్భాల్లో మనం తల్లడిల్లిపోతాం. కానీ సాహసమే ఆయన ఊపిరి అన్నట్లుగా గుండెనిబ్బరం చేసుకుని కూర్చున్నారు. మహేశ్‌బాబును చిరునవ్వు లేకుండా అలా దిగులుగా చూడటం ఇదే మొదటిసారి. అలాంటి రోజు వస్తుందనుకోలేదు. ఆయనకు కోపం వచ్చినప్పుడు కూడా పెదాలపై చిరునవ్వు ఉండేది. అలాంటిది ఆ తల్లి జ్ఞాపకాల్లో మహేశ్ పెదాలపై చిరునవ్వు మాయమైంది. మహేశ్‌బాబు కాశీకి కూడా వెళ్లి వచ్చాడు. తల్లిని గుర్తు చేసుకుంటూ తండ్రిని బాగా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనదే' అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ. చదవండి: కొత్త కారు ఇంటికి తెచ్చిన సింగర్ ప్రముఖ బుల్లితెర నటికి క్యాన్సర్? -
మమ్మీ మా గుండెల్లో ఎప్పుడు జీవించే ఉంటారు.. నమ్రత ఎమోషనల్ పోస్ట్
హీరో మహేశ్ బాబు తల్లి, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా మహేశ్ భార్య, నటి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేశారు. అత్త ఇందిరా దేవిని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. నమ్రత శిరోద్కర్ రాస్తూ.. 'జీవితం అనేది ఒక సర్కిల్ లాంటిది. ఇప్పుడు నా జీవితం ఇదే. మామయ్య గారు మా జీవితంలో ఉన్నందుకు మాకు సంతోషం. అమ్మ ఇందిరాదేవి ఇప్పుడు మా మధ్య లేకపోయినా ఆమె మా గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటుంది. మేం జీవించి ఉన్నంత వరకు ప్రతి రోజూ ఆమెను గుర్తు చేసుకుంటాం. ఆమె మా కుటుంబాన్ని కాపాడుతుందని మాకు తెలుసు.. లవ్ యూ మమ్మీ' అంటూ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇటీవలే ఇందిరా దేవి పెద్దకర్మ కూడా నిర్వహించారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి సంస్మరణ సభ(ఫోటోలు)
-
దివంగత ఇందిరా దేవి 11వ రోజు కార్యక్రమం( ఫోటోలు)
-
మహేశ్ బాబు, కృష్ణలను పరామర్శించిన చిరంజీవి
సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబులను తాజాగా మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. గురువారం వారి ఇంటికి వెళ్లి మహేశ్, కృష్ణలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణ సతీమణి, మహేశ్ తల్లి ఇందిరా దేవి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు చిరు సంతాపం తెలిపారు. కాగా బుధవారం(సెప్టెంబర్ 28న) మహేశ్ తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. చదవండి: మిస్ యూ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలి..: సితార ఎమోషనల్ పోస్ట్ సినీ, రాజకీయ ప్రముఖులు నిన్న మహేశ్ ఇంటికి వెళ్లి ఇందిరా దేవి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఇక ఆమె అంత్యక్రియల్లో విక్టర్ వెంకటేశ్, నాగార్జున అక్కినేని, మోహన్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌తో పాటు పలువురు హీరోలు, దర్శకులు పాల్గొన్నారు. అయితే చిరు తాజా చిత్రం గాడ్ ఫాదర్ ట్రైలర్ ఈవెంట్ నిన్న అనంతపురంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం నేపథ్యంలో బుధవారం ఇందిరా దేవి అంత్యక్రియల్లో ఆయన పాల్గొన లేకపోయారు. -
మిస్ యూ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలి..: సితార ఎమోషనల్ పోస్ట్
నానమ్మను తలుచుకుంటూ సితార సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యింది. నిన్న(సెప్టెంబర్ 28) సూపర్‌స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదం నెలకొంది. అయితే నానమ్మను తలుచుకుంటూ సితార ఆమె పార్థివదేహం వద్ద వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యం అందరిని కలిచి వేసింది. కూతురు ఏడుస్తుంటే తండ్రి మహేశ్ ఆమెను ఓదార్చిన సన్నివేశం అభిమానుల హృదయాలను ఆకట్టుకుంది. బుధవారం సాయంత్రం ఆమె అంత్యక్రియలను మహాప్రస్థానంలో నిర్వహించారు. చదవండి: నానమ్మను తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సితార అనంతరం ఆమెను తలుచుకుంటూ మహేశ్, ఆయన భార్య నమ్రత శిరొద్కర్, సితారలు సోషల్ మీడియా వేదికగాఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వారు భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు. ముఖ్యంగా సితార షేర్ చేసిన పోస్ట్ నెటిజన్ల హృదయాలను హత్తుకుంటుంది. ‘మిస్ యూ సో మచ్ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలని కోరుకుంటున్నా’ అంటూ నానమ్మ, అన్న గౌతమ్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసింది సితార. దీనికి హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని జత చేస్తూ భావోద్వేగానికి గురైంది. ఇక ఇది చూసి ‘నానమ్మ అంటే సితూ పాపలకు ఎంత ఇష్టమో’, ‘ఈ పోస్ట్‌తో సితార తన నానమ్మతో ఉన్న అనుబంధం తెలుస్తుంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఏ స్పెషల్ అకేషన్ ఉన్న సితార, గౌతమ్‌లు నానమ్మతో కలిసి సరదా సమయాన్ని గడిపేవారనే విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
ముగిసిన ఇందిరాదేవి అంత్యక్రియలు
సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఇందిరాదేవి అంత్యక్రియలు ముగిశాయి. పద్మాలయ స్టూడియో నుంచి జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానం వరకు కొనసాగిన అంతిమ యాత్రలో ఘట్టమనేని కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. సాంప్రదాయ పద్ధతిలో మహేష్ బాబు తల్లి మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తమ అభిమాన హీరో తల్లిని కడసారి చూడడానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. పలువురు సినీ ప్రముఖులు అంత్యక్రియల్లో పాల్గొని తుది వీడ్కోలు పలికారు. ఇందిరాదేవి పార్థివ దేహాన్ని చూసి కృష్ణ, మహేశ్ బాబు చలించిపోయారు. ఇద్దరూ కన్నీంటి పర్యంతమయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి.. బుధవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి బుధవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, ప్రముఖుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోలోకి తరలించారు. అనంతరం మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే.. ఈ కార్యక్రమానికి మీడియాకు అనుమతి ఇవ్వలేదు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మహేష్‌బాబుకు మాతృ వియోగం.. ఇందిరా దేవి పార్థీవదేహానికి ప్రముఖుల నివాళి (ఫొటోలు)
-
ఇందిరా దేవి పార్థీవదేహానికి కుటుంబ సభ్యుల నివాళులు (ఫొటోలు)
-
అమ్మ చేతి కాఫీ.. దేవుడి ప్రసాదంతో సమానం: మహేశ్ ఎమోషనల్
‘ఎంతమందికి తెలుసో..తెలియదు కాని ఏప్రిల్ 20న మా అమ్మ ఇందిరమ్మగారి పుట్టిన రోజు. అమ్మ ఆశిస్సులు, దీవెనలకు మించిదేది ఉండదు. ఆ రోజున నా సినిమా విడుదల కావడం నిజంగా సంతోషంగా ఉంది. అమ్మగారి ఆశిస్సులు నాకు చాలా ముఖ్యమైనవి’.. ఇవి ‘భరత్ అనే నేను’ ప్రీరిలీజ్ ఈవెంట్లో తన తల్లి గురించి మాట్లాడిన మాటలు. మహేశ్ బాబుకు తన మాతృమూర్తి తో ఎంతో అనుబంధం ఉంది. అమ్మ పట్ల తనకున్న ఇష్టాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా అభిమానులతో పంచుకునేవాడు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) "Naaku Amma Ante Devudutho Samanam" ❤️🙏 This is a very huge loss to Superstar #MaheshBabu!! 💔💔#RIPIndiraDeviGaru #IndiraDevi #Indiramma #TeluguFilmNagar pic.twitter.com/krtRqemJZw — Telugu FilmNagar (@telugufilmnagar) September 28, 2022 మహర్షి సినిమా సక్సెస్ మీట్లో కూడా తల్లి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. ‘నాకు అమ్మంటే నాకు దేవుడితో సమానం. సినిమా విడుదలకు ముందు అమ్మదగ్గరకు వెళ్లి కాఫీ తాగుతాను. ఆ కాఫీ తాగినే దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్లు ఉంటుంది. ఆమె ఆశీస్సులు నాకెప్పటికీ ముఖ్యం’అని మహేశ్ అన్నారు. బుధవారం(సెప్టెంబర్ 28)తెల్లవారు జామున ఇందిరాదేవి మరణంతో గతంలో తల్లి గురించి మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాతృమూర్తి పట్లకు మహేశ్‌కు ఉన్న ప్రేమను గుర్తు చేసుకుంటూ సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఆ వీడియోలను షేర్ చేస్తూ..‘ధైర్యంగా ఉండండి అన్నా’అంటూ కామెంట్ చేస్తున్నారు. మహేశ్ నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాలోని తల్లి సెంటిమెంట్ సీన్‌ను కూడా షేర్ చేస్తున్నారు. RIP Amma 🙏 Stay Strong @urstrulyMahesh Anna 💔#MaheshBabu 😓 pic.twitter.com/e6wTJxG4Au — Sardaar S (@SardaarSainik) September 28, 2022 చదవండి: సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు మాతృవియోగం ఒకే ఏడాది రెండు విషాదాలు..తీవ్ర దుఃఖంలో మహేశ్ తల్లి మృతితో శోకసంద్రంలో మహేశ్‌బాబు