నానమ్మను తలుచుకుంటూ సితార సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యింది. నిన్న(సెప్టెంబర్ 28) సూపర్‌స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదం నెలకొంది. అయితే నానమ్మను తలుచుకుంటూ సితార ఆమె పార్థివదేహం వద్ద వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యం అందరిని కలిచి వేసింది. కూతురు ఏడుస్తుంటే తండ్రి మహేశ్ ఆమెను ఓదార్చిన సన్నివేశం అభిమానుల హృదయాలను ఆకట్టుకుంది. బుధవారం సాయంత్రం ఆమె అంత్యక్రియలను మహాప్రస్థానంలో నిర్వహించారు.
చదవండి: నానమ్మను తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సితార
అనంతరం ఆమెను తలుచుకుంటూ మహేశ్, ఆయన భార్య నమ్రత శిరొద్కర్, సితారలు సోషల్ మీడియా వేదికగాఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వారు భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు. ముఖ్యంగా సితార షేర్ చేసిన పోస్ట్ నెటిజన్ల హృదయాలను హత్తుకుంటుంది. ‘మిస్ యూ సో మచ్ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలని కోరుకుంటున్నా’ అంటూ నానమ్మ, అన్న గౌతమ్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసింది సితార. దీనికి హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని జత చేస్తూ భావోద్వేగానికి గురైంది. ఇక ఇది చూసి ‘నానమ్మ అంటే సితూ పాపలకు ఎంత ఇష్టమో’, ‘ఈ పోస్ట్‌తో సితార తన నానమ్మతో ఉన్న అనుబంధం తెలుస్తుంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఏ స్పెషల్ అకేషన్ ఉన్న సితార, గౌతమ్‌లు నానమ్మతో కలిసి సరదా సమయాన్ని గడిపేవారనే విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment