అతన్ని కలిసేందుకే జర్మనీ వెళ్లిన మహేశ్‌ బాబు | Superstar Mahesh Babu Germany Trip Reason Revealed, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Mahesh Babu Germany Tour: అతన్ని కలిసేందుకే జర్మనీ వెళ్లిన మహేశ్‌ బాబు

Published Mon, Jan 22 2024 12:14 PM | Last Updated on Mon, Jan 22 2024 1:21 PM

Mahesh Babu Behind Germany Tour - Sakshi

టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌ బాబు కొద్దిరోజుల క్రితం జర్మనీ వెళ్లారు. గుంటూరు కారం సినిమా విడుదల తర్వాత ఆయన వెళ్లడం జరిగింది. సాధారణంగా విదేశాలకి వెళ్లినప్పుడు మహేశ్‌ బాబు కుటుంబంతో కలిసి వెళ్తారు.. కానీ ఈసారి ఒక్కరే వెళ్లడంతో చాలామంది అతని పర్యటన మీద పలు ఊహాగానాలు వచ్చాయి. ముఖ్యంగా రాజమౌళి సినిమా కోసం తన లుక్, మేకోవర్‌ గురించిన సాంకేతికపరమైన విషయాల గురించి వెళ్లారని వార్తలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో SSMB29 త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

తాజాగా మహేశ్‌ ఒక ఫోటో షేర్‌ చేసి తాను ఎందుకు జర్మనీ వెళ్లారో చెప్పకనే చెప్పారు. మహేశ్​ జర్మనీకి వెళ్ళింది ఒక డాక్టర్‌ను కలుసుకోవడం కోసమని తెలిసింది. అయితే ఆ డాక్టర్​ను మహేశ్‌ కలుసుకోవడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు కలిశారు. దీంతో ఆ డాక్టర్ ఎవరు?  ఆయన దగ్గర ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? అనే ప్రశ్నలు అభిమానుల్లో వస్తున్నాయి.

జర్మనీలోని ప్రముఖ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆ డాక్టర్ పేరు 'హరీ కొనిగ్'. ఆయన బాడీ ఫిట్‌నెస్​కు సంబంధించిన డాక్టర్. అక్కడ ఆయనకు ఎంతో ప్రత్యేకత ఉంది. మహేశ్‌ కూడా తన బాడీ ఫిట్‌నెస్‌పై ఎక్కువగా  దృష్టి పెడతారనే విషయం అందరికీ తెలిసిందే.. గుంటూరు కారం చిత్రం సమయం నుంచే ఆయన  SSMB29 కోసం కసరత్తులు ప్రారంభించారు. ఆ వర్కౌట్‌ ఫోటోలు అప్పుడప్పుడు ఇన్‌స్టాలో ఆయన పోస్ట్‌ చేస్తుంటారు కూడా.. రాజమౌళి సినిమా కోసం తన బాడీ ఫిట్‌నెస్‌ గురించే ఆ డాక్టర్‌ను కలిసేందుకు జర్మనీ వెళ్లినట్లు తెలస్తుంది. రాజమౌళి - మహేశ్ కాంబోలో రానున్న చిత్రానికి సంబంధించిన కథ వర్క్‌ పూర్తి అయిందని రాజమౌళి తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ వేసవి నుంచి షూటింగ్‌ జరిగే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement