
సాక్షి, ముంబై : వివాదాల్లో కూరుకుపోయిన మణికర్ణిక మూవీ టీమ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సమయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చిత్ర నిర్మాత కమల్ జైన్ పక్షవాతానికి గురై ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
ఆస్పత్రిలో చేరేందుకు ఇది కచ్చితంగా సరైన సమయం కాదు..త్వరలోనే కోలుకుని చిత్ర విజయానికి మన సమిష్టి కృషిని గుర్తుచేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుందామని అంతకుముందు జైన్ ట్వీట్ చేశారు. ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా బయోపిక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషించడంతో పాటు కొంత భాగానికి దర్శకత్వం వహించారు. కాగా జనవరి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు సినిమాలో కొన్ని సన్నివేశాలపై హిందూ కర్ణిసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment