Kamal Jain
-
‘క్రిష్ చేయని పనికి క్రెడిట్ అడుగుతున్నారు’
మణికర్ణిక సినిమా వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదిక క్రిష్, చిత్ర యూనిట్‌పై ముఖ్యంగా కంగనా రనౌత్‌పై ఆరోపణలు గుప్పిస్తుంటే, కంగనా కూడా అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తోంది. పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ వివాదంపై స్పందిస్తున్నారు. కొందరు కంగనాను తప్పు పడుతుండగా, మరికొందరు క్రిష్ తీరును విమర్శిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై స్పందించిన చిత్ర నిర్మాత కమల్ జైన్.. క్రిష్ వాదనను తప్పు పట్టారు. దర్శకురాలిగా కంగనా పేరు ముందు వేయటం అనేది నిర్మాణ సంస్థ నిర్ణయం అన్నారు. అంతేకాదు.. క్రిష్, తన వాదన సరైనదే అని భావిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చిన తెలిపారు. ఆయన, తను చేయని పనికి క్రెడిట్ కావాలని కోరటం సరైన పద్దతి కాదన్నారు. సినిమా సక్సెస్ సాధించిన తరువాత క్రిష్ తనకు క్రెడిట్ కావాలని వాదిస్తున్నారని విమర్శించారు. -
మణికర్ణికకు మరో ఎదురుదెబ్బ
సాక్షి, ముంబై : వివాదాల్లో కూరుకుపోయిన మణికర్ణిక మూవీ టీమ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సమయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చిత్ర నిర్మాత కమల్ జైన్ పక్షవాతానికి గురై ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఆస్పత్రిలో చేరేందుకు ఇది కచ్చితంగా సరైన సమయం కాదు..త్వరలోనే కోలుకుని చిత్ర విజయానికి మన సమిష్టి కృషిని గుర్తుచేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుందామని అంతకుముందు జైన్ ట్వీట్ చేశారు. ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా బయోపిక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషించడంతో పాటు కొంత భాగానికి దర్శకత్వం వహించారు. కాగా జనవరి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు సినిమాలో కొన్ని సన్నివేశాలపై హిందూ కర్ణిసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. -
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
సెల్‌ఫోన్ విషయమై మిత్రులతో గొడవపడిన ఓ విద్యార్థి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా విజయవాడ నగరంలోని లయోలా కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన కమల్‌జైన్ లయోలా కళాశాల హాస్టల్లో ఉండి ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. గురువారం ఇతనికి సెల్‌ఫోన్ విషయమై తోటి వారితో గొడవజరిగింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపం చెందిన కమల్ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని చనిపోయాడు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారు.