ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య | Intermediate student committed suicide | Sakshi
Sakshi News home page

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

Published Fri, May 27 2016 8:30 AM | Last Updated on Mon, Sep 4 2017 1:04 AM

Intermediate student committed suicide

సెల్‌ఫోన్ విషయమై మిత్రులతో గొడవపడిన ఓ విద్యార్థి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా విజయవాడ నగరంలోని లయోలా కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన కమల్‌జైన్ లయోలా కళాశాల హాస్టల్‌లో ఉండి ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు.

 

గురువారం ఇతనికి సెల్‌ఫోన్ విషయమై తోటి వారితో గొడవజరిగింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపం చెందిన కమల్ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని చనిపోయాడు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement