Loyola College
-
ఏపీ: వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఫ్రీ హెల్త్ క్యాంపు
సాక్షి, విజయవాడ: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా అహర్నిశలు శ్రమించి విధులు నిర్వహించే ఫ్రంట్ లైన్లో జర్నలిస్టులు కూడా ఉన్నారు. వాళ్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖలు సంయుక్తంగా హెల్త్‌క్యాంప్ నిర్వహిస్తున్నాయి. జర్నలిస్టులు, వాళ్ల కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి కోరుతున్నారు. విజయవాడలోని లయోలా ఇంజినీరింగ్ కాలేజీలో మే 13, 14వ తేదీల్లో రెండు రోజుల పాటు హెల్త్ క్యాంపు నిర్వహించనున్నారు. ఈ క్యాంప్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు. జర్నలిస్ట్ కుటుంబాలకు ఫ్రీగా వైద్య సేవలు అందించేందుకు ఆంధ్రా హాస్పిటల్, కేపిటల్, కామినేని, సెంటిని, పిన్నమనేని, అమెరికన్ ఆంకాలజీ & ఇండో బ్రిటిష్ హాస్పిటల్, ఉషా కార్డిక్ సెంటర్, HCG క్యూరి సిటీ క్యాన్సర్ సెంటర్ & హార్ట్ కేర్ సెంటర్, సన్ రైజ్, అను, స్వర హాస్పిటల్.. మొత్తం 11 ప్రముఖ ఆస్పత్రులకు చెందిన అనుభవజ్ఞులైన వైద్య బృందంచే ఈ హెల్త్ క్యాంపులో పాల్గొనుంది. ఇప్పటికే https://forms.gle/UEKdx4fZG7yUGBns7 లింక్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వర్కింగ్ జర్నలిస్టులు.. శనివారం(మే 13వ తేదీ) ఉదయం 7 గం.ల నుండి సాయంత్రం 5 గం.ల వరకు హెల్త్ క్యాంపులో వైద్య సేవలు ఉచితంగా పొందవచ్చు. తొలి రోజు వర్కింగ్ జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేస్తారు. రెండో రోజు(మే 14వ తేదీన) డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది. రెండు రోజుల పాటు నిర్వహించే ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం(హెల్త్ క్యాంపు) లో మామోగ్రామ్, హృద్రోగ సంబంధిత టెస్ట్ లు, ఈసీజీ, 2డీఎకో, ట్రేడ్ మిల్ టెస్ట్(టిఎంటీ), ఆల్ట్రా సౌండ్ స్కానింగ్, సీబీపీ, లివర్ పంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొపైల్ టెస్ట్, థైరాయిడ్, డయాబెటిక్ టెస్ట్ లు, ఎక్స్ రే, కళ్లు, డెంటల్ పరీక్షలు వంటి తదితర 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. చిన్న పిల్లలకు సైతం అవసరమైన వైద్య సదుపాయం అందిస్తారు. హెల్త్ క్యాంపులో నిర్ధారిత పరీక్షలు చేశాక.. అత్యవసర వైద్య సేవలు, దీర్ఘకాలిక వ్యాధులకు వైద్య సాయం పొందాల్సి వస్తే ఆరోగ్యశ్రీ అనుబంధిత ఆస్పత్రుల(రిఫరల్ హాస్పిటల్)కు వెళ్లడానికి జర్నలిస్ట్ హెల్త్ కార్డు తప్పనిసరి. కాబట్టి కొత్తగా అక్రిడిటేషన్ కార్డులు పొందిన జర్నలిస్టులు హెల్త్ కార్డు పొందడానికి వీలైనంత త్వరగా రూ.1,250 చెల్లిస్తే, దీనికి ప్రభుత్వం తరపున మరో రూ.1,250 చెల్లిస్తుందని కమిషనర్ విజయ్‌కుమార్ వెల్లడించారు. అవసరం మేరకు హెల్త్ క్యాంపులో కూడా కొత్తగా హెల్త్ కార్డు పొందే సదుపాయాన్ని ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. క్యాంపుకు హాజరయ్యే జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డు లేదంటే విధులు నిర్వర్తిస్తున్న సంస్థకు సంబంధించిన గుర్తింపు(ఐడీ) కార్డును తీసుకురావాల్సి ఉంటుంది. ఈ క్యాంప్ నిర్వహణ కోసం.. ప్రభుత్వం చర్చలు జరిపింది. మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, విడదల రజని, సమాచార శాఖ కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ సీఈవో హరిందర్ ప్రసాద్ సమీక్షలు నిర్వహించారు కూడా. ఇదీ చదవండి: కొర్రీలు పెట్టొద్దు.. ఉదారంగా ఉండండి -
విజయవాడ ఆంధ్రా లయోలా కళాశాల మైదానం కల్చరల్ ఫెస్ట్ (ఫొటోలు)
-
విజయవాడలో ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల జాతీయ క్రీడలు
-
రాక్‌స్టార్‌గా మారిన మేఘాలయ సీఎం
అల్వాల్: ఓ రాష్ట్రానికి సీఎం అనగానే... సీరియస్ చిత్రాన్ని ఊహించుకుంటాం. కానీ... సంగీత ప్రియుడైన మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ కొంగల్ సంగ్మా రాక్‌స్టార్‌గా మారిపోయారు. హైదరాబాద్, అల్వాల్‌లోని లయోలా కళాశాలలో శుక్రవారం జరిగిన వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన... సభలో గిటార్ వాయిస్తూ పాటపాడి విద్యార్థులను ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ సందర్భంగా సంగ్మా మాట్లాడుతూ... సంగీతం మనసుని తేలిక పరుస్తుందన్నారు. ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని ముందుకు సాగాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. దేశం ఉన్నతి అయినా, తిరోగమనం అయినా విద్యార్థుల చేతిలోనే ఉందని, అందుకే భవిష్యత్ పట్ల స్పష్టమైన అవగాహనతో ఉండాలని విద్యార్థులకు సూచించారు. యువతను సన్మాన మార్గంలో నడిపించే భాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యా రంగానికి విశేష సేవలు అందించిన అధ్యాపకులు, ఉత్తమ ప్రతిభ కనబర్చిన 73 మంది విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామక్రిష్ణారావు, లయోలా ప్రిన్సిపాల్ ఫాదర్ జోజిరెడ్డి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు వందలాదిగా పాల్గొన్నారు. ప్రగతిభవన్‌కు మేఘాలయ సీఎం దంపతులు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పర్యటనలో ఉన్న మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు శుక్రవారం ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై ఇరువురు చర్చించారు. సంగ్మా దంపతులను మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు శాలువాతో సత్కరించి మెమెంటో అందజేశారు. ప్రగతిభవన్‌లో కేటీఆర్ దంపతులతో భేటీ అయిన ఫొటోలను సంగ్మా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. -
స్మార్ట్ సృజన
ఆ చిట్టి బుర్రలు సృజనకు స్మార్ట్‌గా పదునుపెట్టాయి. అద్భుత ఆవిష్కరణలకు రూపమిచ్చాయి. అందరిచేత ఔరా అనిపించాయి. నిపుణులనూ అబ్బురపరిచి జాతీయస్థాయిలో సత్తాచాటాయి. గుంటూరు జిల్లా కీర్తి పతాకను రెపరెపలాడించాయి. రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ మనక్ ప్రదర్శనలో జిల్లా విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. వినూత్న ఆవిష్కరణలతో అందరినీ ఆకట్టుకున్నారు. గత నెల 31, ఈనెల ఒకటో తేదీన విజయవాడలోని లయోలా కళాశాలలో ఇన్స్పైర్ మనక్ రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. ఆన్లైన్ మూల్యాంకనంలో భాగంగా 13 జిల్లాల నుంచి వచ్చిన 331 మంది విద్యార్థులు తమ నమూనాలను ప్రదర్శించారు. వీటికి ముగ్దులైన ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు జాతీయస్థాయికి 34 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. వీటిలో గుంటూరు జిల్లా నుంచి మూడు నమూనాలు ఉన్నాయి. ఎంపికైన మూడు ప్రాజెక్టులూ ఒకే పాఠశాలకు చెందిన విద్యార్ధినులు రూపొందించినవి కావడం విశేషం. మంగళగిరిలోని సీకే జూనియర్ కాలేజ్ హైస్కూల్‌కు చెందిన జయశ్రీ, తేజశ్రీ, వర్గీస్ రూపొందించిన మూడు ప్రాజెక్టులు న్యాయ నిర్ణేతలను అమితంగా ఆకట్టుకున్నాయి. గైడ్ టీచర్ బండారు టైటస్ పర్యవేక్షణలో వీరు ప్రాజెక్టులను రూపొందించారు. వీరు త్వరలో జాతీయస్థాయిలో జరిగే ప్రదర్శనకు హాజరు కానున్నారు. – గుంటూరు ఎడ్యుకేషన్ ప్రతిభే ‘బ్యాగ్’బోన్ ప్రాజెక్టు పేరు: స్మార్ట్ స్కూల్‌బ్యాగ్ విద్యార్థిని పేరు: బిట్రా జయశ్రీ, 8వ తరగతి స్మార్ట్ స్కూల్ బ్యాగ్‌ను అత్యద్భుతంగా రూపొందించి ఔరా అనిపించింది. బిట్రా జయశ్రీ. ఈ బ్యాగ్ ద్వారా ఎంత బరువు పుస్తకాలను మోస్తున్నదీ తెలుసుకోవచ్చు. ఎక్కువ పుస్తకాలను మోయడం కష్టమనిపిస్తే దీనిని ట్రాలీగా మార్చుకోవచ్చు. బ్యాగ్‌లోనే మాస్క్, శానిటైజర్ ఉంచుకోవచ్చు. వర్షం వస్తే ఆటోమేటిక్‌గా గొడుగు తెరుచుకునేలా సెన్సార్ల అమరిక ఉంది. దీనివల్ల విద్యార్థి పొరపాటుగా తప్పిపోయినా, దుండగులు అపహరించుకుని వెళ్లినా జీపీఎస్ ద్వారా పోలీసులకు సమాచారం వెళ్తుంది. బ్యాగులో ఉన్న పుస్తకాలను దొంగిలించే యత్నం చేసినా వెంటనే పసిగట్టే వీలుంది. ఔరా సౌర ఊయల ప్రాజెక్టు పేరు: సోలార్ స్మార్ట్ ఊయల విద్యార్థిని పేరు: బేగ్ వర్గీస్, 8వ తరగతి చంటిపిల్లల కోసం చక్కటి ఊయలను తీర్చిదిద్దింది బేగ్ వర్గీస్. ఇది సౌర శక్తితో పనిచేస్తుంది. ఊయలకు మోటర్‌ను అమర్చడం ద్వారా సోలార్ మాడ్యూల్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌శక్తి ద్వారా ఇది ఊగుతుంటుంది. ఊయలకు ఫ్యాన్నూ అమర్చుకోవచ్చు. పిల్లలను ఆస్పత్రుల్లో ఉంచినప్పుడు సెలైన్ అయిపోయినా, ఎవరైనా అపరిచిత వ్యక్తులు పిల్లలను ఎత్తుకువెళ్లే యత్నం చేసినా సైరన్ మోగుతుంది. భళా సైకిల్ ప్రాజెక్టు పేరు: స్మార్ట్ ఫోల్డబుల్ ఈ–సైకిల్ విద్యార్థిని పేరు: మాచర్ల తేజశ్రీ, 9వ తరగతి సౌరశక్తితో పని చేసే స్మార్ట్ ఫోల్డబుల్ ఈ–సైకిల్‌ను ఆవిష్కరించి భళా అనిపించింది. మాచర్ల తేజశ్రీ. దీనిని పాఠశాలకు వెళ్లేందుకు, ఇతర పనులకు ఉపయోగించవచ్చు. ఫోల్డ్ చేసి ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. వ్యక్తిగత అవసరాలతోపాటు వ్యవసాయ పనుల్లో భాగంగా పంటకు నీరు పెట్టడం, విత్తనాలు నాటేందుకు ఉపయోగించొచ్చు. రైతులు, మహిళలు, వికలాంగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. -
అలరించిన బీమాస్–2016
-
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
సెల్‌ఫోన్ విషయమై మిత్రులతో గొడవపడిన ఓ విద్యార్థి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా విజయవాడ నగరంలోని లయోలా కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన కమల్‌జైన్ లయోలా కళాశాల హాస్టల్లో ఉండి ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. గురువారం ఇతనికి సెల్‌ఫోన్ విషయమై తోటి వారితో గొడవజరిగింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపం చెందిన కమల్ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని చనిపోయాడు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. -
రాజధాని నిర్మాణంలో యువశక్తి కీలకం
‘లయోలా రన్ ఫర్ అమరావతి’ని ప్రారంభించిన గౌతమ్ సవాంగ్ విజయవాడ (మొగల్రాజపురం) రాజధాని అమరావతి నిర్మాణంలో యువశక్తి కీలకమని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అన్నారు. శుక్రవారం ఉదయం ఆంధ్రా లయోలా కళాశాల, ఆంధ్రా లయోలా కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం సంయుక్తంగా నిర్వహించిన ‘లయోలా రన్ ఫర్ అమరావతి’ కార్యక్రమాన్ని గౌతమ్‌సవాంగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో విద్యార్థులందరూ భాగస్వాములు కావాలన్నారు. నా ఇటుక-నా అమరావతిలో భాగంగా కళాశాల యాజమాన్యం విద్యార్థుల తరపున నాలుగు లక్షల ఒక వెయ్యి నూట పదహారు రూపాయలను ఆన్లైన్ ద్వారా రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇస్తున్నామని కళాశాల డెరైక్టర్ రవిశేఖర్ తెలిపారు. మైదానంలో రాష్ట్ర మ్యాప్ ఆకారంలో విద్యార్థులు కూర్చుని అలరించారు. పద మూడు జిల్లాల పేర్లు తెలిసేలా జెండాలు పట్టుకోవడంతో పాటుగా జిల్లాకు ఒక రంగు వంతున 13 రంగుల టోపీలను ధరించారు. అనంతరం జరిగిన రన్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
పోలీసులు తనిఖీల్లో రూ. 3.50 లక్షలు స్వాధీనం
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అల్వాల్ లయోల కళాశాల వద్ద గురువారం తునిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు కారులో తరలిస్తున్న రూ. మూడున్నర లక్షల నగదును గుర్తించారు. వాటికి సంబంధించి సరైన పత్రాలు చూపకపోవడంతో.. పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. -
కెవ్వు కేక