
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించిన యాక్షన్ మూవీ ధాకడ్ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా చతికిలపడ్డ విషయం తెలిసిందే! రూ.85 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా కేవలం రూ.3.77 కోట్లు రాబట్టినట్లు సమాచారం. దీంతో నిర్మాత దీపక్ ముకుత్ భారీ నష్టాలు చవిచూశాడని, ఈ కారణంగా తన ఆఫీస్ కూడా అమ్మేశాడని ఆమధ్య వార్తలు వెలువడ్డాయి. తాజాగా దీనిపై ముకుత్ స్పందించాడు.
'ధాకడ్ సినిమాను మేము ఎంతో బాగా తెరకెక్కించాం. కానీ అసలు ఎక్కడ తప్పు జరిగిందో అర్థం కావడం లేదు. అయినా సినిమాను ఆదరించాలా? లేదా? అనేది పూర్తిగా ప్రేక్షకుల అభిప్రాయం. కానీ మావరకైతే మహిళా ప్రధాన పాత్రలో సినిమాను నిర్మించినందుకు గర్వంగా ఉంది. ఇక ఈ సినిమాతో భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయన్నదాంట్లో నిజం లేదు. ఎందుకంటే పెట్టుబడి పెట్టినదానిలో చాలావరకు తిరిగి వచ్చేసింది. మా సినిమాను కొనుగోలు చేసేందుకు చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే సినిమా రిలీజయ్యాక జీ 5 ఓటీటీ హక్కులు సొంతం చేసుకుంది' అని చెప్పుకొచ్చాడు దీపక్ ముకుత్.
చదవండి: ఆ విషయంలో చిరంజీవి చాలా గ్రేట్
పాన్ ఇండియా మల్టీస్టారర్‌పై సామ్ ఫోకస్.. అప్పుడు నయన్, ఇప్పుడు తాప్సీ
Comments
Please login to add a commentAdd a comment