గర్భిణులు తిండి బాగా  తినాలా? | Funday family health counseling | Sakshi
Sakshi News home page

గర్భిణులు తిండి బాగా  తినాలా?

Published Sun, Nov 4 2018 2:02 AM | Last Updated on Sun, Nov 4 2018 2:02 AM

Funday family health counseling - Sakshi

నా వయసు 23. నేను ప్రెగ్నెంట్‌. నాకు పెద్దగా తిండిమీద ధ్యాస ఉండదు. ఏదో సమయానికి తినాలి కాబట్టి తింటూ ఉంటాను. అయితే గర్భిణులు తిండి బాగా తినాలంటున్నారు నా సన్నిహితులు. ‘గర్భిణులు కచ్చితంగా 350 కేలరీల ఆహారం అధికంగా తీసుకోవాలి’ అంటుంటారు. దీని గురించి వివరించండి. నాకు సీతాఫలాలు అంటే చాలా ఇష్టం. ఈ సమయంలో తినవచ్చా? తెలియజేయగలరు – కె.శ్యామల, కొత్తపట్నం
సాధారణ మహిళలకు రోజువారి బరువును బట్టి, చేసే పనిని బట్టి 1800 నుంచి 2200 క్యాలరీల శక్తి అవసరం ఉంటుంది. అదే గర్భిణీలలో అయితే 350 క్యాలరీల శక్తి అధికంగా అవసరం ఉంటుంది. మొదటి 7 నెలల వరకు . తర్వాత నుంచి 500 క్యాలరీల అధికంగా అవసరం ఉంటుంది. ఇది తల్లిలో జరిగే మార్పులకు, గర్భంలో పెరిగే శిశువు బరువుకు అవయవాల అవసరాలకు ముఖ్యం. గర్భం అంటే ఇద్దరికి సరిపడా తినాలని అనుకుంటూ ఉంటారు. అది సరికాదు. సాధారణంగా తీసుకునే ఆహారం కంటే 350 క్యాలరీలు శక్తినిచ్చే ఆహారం అంటే రోజుకు కనీసం రెండు గ్లాసులు పాలు, పండ్లు, పప్పులు తీసుకున్నా సరిపోతుంది. ఆహారంలో ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, పాలు, పెరుగు, పండ్లు కొద్దిగా డ్రై ఫ్రూట్స్‌ ఉండేటట్లు చూసుకోవడం మంచిది. మాంసాహారలు అయితే రోజు ఒక గుడ్డు, వారానికి రెండుసార్లు బాగా ఉడకబెట్టిన  మాంసాహారం తీసుకోవచ్చు. సీతాఫలాలలో విటమిన్‌–సి, ఎ, బి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, ఐరన్, ఫైబర్‌ వంటివి సమృద్ధిగా ఉంటాయి. బరువు ఎక్కువగా లేనివాళ్లు రోజుకొక సీతాఫలం తీసుకోవచ్చు. ఇందులో చక్కెరశాతం కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి, బరువు ఎక్కువ ఉన్నవారు, షుగర్‌ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నవారు, ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. లేదా ఇది తీసుకునప్పుడు ఆ పూటకి మిగతా కార్బోహైడ్రేట్స్‌ అంటే అన్నం వంటివి తీసుకోకపోవటం మంచిది.

మా చెల్లికి పెళ్లై ఎనిమిదేళ్లు కావస్తోంది. తనకి ఇంకా పిల్లలు పుట్టలేదు. తన వయసు 29. ఎన్నో ట్రీట్‌మెంట్స్, పరీక్షలు చేయించుకున్న తర్వాత ‘థ్రాంబోఫిలియా’ వల్లనే పిల్లలు కలగడం లేదని డాక్టర్‌ చెప్పారట. అసలు థ్రాంబోఫిలియా అంటే ఏమిటి? దీని గురించి వివరంగా తెలియజేయగలరు. – బి.సుకన్య, కర్నూల్‌
రక్తనాళాలల్లో కొన్ని కారణాల వల్ల రక్తం ఎక్కువగా గూడు కట్టి.. దాని వల్ల వచ్చే పరిస్థితినే థ్రాంబోఫిలియా అంటారు. దీని వల్ల ఏ అవయవానికి రక్త సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తం గూడు కడుతుందో ఆ అవయవానికి రక్త సరఫరా తగ్గి, ఆక్సిజన్‌ సరఫరా తగ్గి, ఆ అవయవం పని తీరు స్తంభించి సమస్యలు ఏర్పడవచ్చు. మన శరీరంలో ఎక్కడైన దెబ్బతగిలినప్పుడు, రక్తస్రావం(బ్లీడింగ్‌) అవుతుంది. దీనిని ఆపటానికి సహజసిద్ధంగా మన శరీరంలో ఉండే క్లాటింగ్‌ ఫ్యాక్టర్స్‌ రక్తం గూడు కట్టేటట్లు బ్లీడింగ్‌ని ఆపుతాయి. ఇది సహజం. కానీ థ్రాంబోఫిలియాలో జన్యుపరమైన కారణాలతో పాటు ఇంకా అనేక కారణాల వల్ల క్లాటింగ్‌ ఫ్యాక్టర్స్‌ ఉత్పత్తి పనితీరులో లోపాలు వల్ల, రక్తనాళాలలో రక్తం మరీ ఎక్కువగా గూడు కట్టిపోతుంది. అది ఎక్కడ గూడు కట్టింది అనే దానిబట్టి గుండెనొప్పి, ఆయాసం, పక్షవాతం, కళ్లు కనిపించకపోవడం వంటి అనేక సమస్యలు ఏర్పడుతుంటాయి. ఇందులో కొందరిలో పుట్టుకతో లోపాలు ఉండవచ్చు. కొందరిలో రక్తనాళాలలో కొన్ని పదార్థాలకు వ్యతిరేకంగా యాంటీబాడీస్‌ తయారవడం వల్ల లోపాలు ఏర్పడవచ్చు. థ్రాంబోఫిలియా ఉన్నవారిలో గర్భాశయపొరకి రక్తసరఫరా చేసే రక్తనాళాలలో రక్తం గూడు కట్టి రక్త సరఫరా సరిగా లేకపోవడం వల్ల అక్కడ పిండం అంటుకుని ఎదగలేక (జీఝp ్చn్ట్చ్టజీౌn జ్చజీ uట్ఛ) గర్భం అందదు. అలాగే గర్భం పెరగకుండా అబార్షన్లు అవటం జరుగుతుంది. కొందరిలో పీరియడ్స్‌ ఆలస్యంగా వచ్చి, గర్భం దాల్చినట్లు అనిపించి పీరియడ్స్‌ వచ్చేయడం జరుగుతుంది. కొందరిలో తల్లి నుంచి బిడ్డకు రక్తం అందించే రక్తనాళాల్లో, మాయలో రక్తం గూడు కట్టడం వల్ల తీవ్ర సమస్యలు వస్తాయి. (కొందరిలో ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నాలు చేసేవారిలో గర్భం రాకపోవడం, అబార్షన్లు అవ్వడం, బిడ్డ బరువు పెరగకపోవడం, బీపీ పెరగడం, గర్భం బ్లీడింగ్‌ ఎక్కువ అవ్వడం, కడుపులో బిడ్డ చనిపోవడం, నెలలు నిండకుండానే కాన్పు చెయ్యవలసి రావటం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి) థ్రాంబోఫిలియా సమస్య ఉన్నవారిలో గర్భాశయానికి రక్తసరఫరా సరిగా లేకపోవడం వల్ల కొందరిలో టెస్ట్‌ట్యూబ్‌ బేబీ పద్ధతిని అనుసరించినా కూడా గర్భం అందదు. డాక్టర్‌ పర్యవేక్షణలో ఇఆ్క యాంటీ పాస్పోలిపిడ్‌ యాంటీబాడీస్, అ్కఖీఖీ, ్కఖీ క్లాటింగ్‌ ఫ్యాక్టర్స్‌ వంటి అనేక రక్తపరీక్షలు చెయ్యడం వల్ల థ్రాంబోఫిలియా నిర్ధారణ చెయ్యడం జరుగుతుంది. ఈ సమస్య ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీకి ప్రయత్నం చేసేవారికి రక్తం గూడుకట్టకుండా ఉండేందుకు ఉఛిౌటpటజీn, ఏ్ఛp్చటజీn జీn్జ్ఛఛ్టిజీౌnటఇవ్వడం జరుగుతుంది. ఇది గర్భం వచ్చిన తర్వాత కూడా 9 నెలలు వరకు ఇవ్వడం జరుగుతుంది.

గర్భస్థ శిశువు ఆరోగ్యంపై శ్రద్ధ చూపమని చెబుతుంటారు. అయితే ఏ రకంగా అనే దాని గురించి మాత్రం నాకు తెలియదు. దయచేసి తెలియజేయగలరు. – కె.రుక్మిణి, విజయనగరం
గర్భంలో శిశువు ఆరోగ్యంగా పెరగటానికి, తల్లి మానసికంగా.. శారీరకంగా.. ఆరోగ్యం కలిగి ఉండాలి. శిశువు ఎదుగుదలకి తల్లి నుంచే పోషకపదార్థాలు అందుతాయి. దీని కోసం తల్లి తొమ్మిది నెలల పాటు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం మంచిది. డాక్టర్‌ దగ్గర సక్రమంగా చెకప్‌లకు వెళ్లడం, అవసరమైన రక్తపరీక్షలు, స్కానింగ్‌లు చెయ్యించుకుని, పరిస్థితిని బట్టి అవసరమైన ఐరన్, ఫోలిక్‌యాసిడ్, కాల్షియం వంటి విటిమిన్‌ టాబ్లెట్స్‌ వాడుకుంటూ, డాక్టర్‌ సలహాలను పాటించటం మంచిది. ఆహారంలో పచ్చని ఆకుకూరలు, తాజా కూరగాయలు పప్పులు, పాలు, పెరుగు, పండ్లు, గుడ్లు, కొద్దిగా మాంసాహారం వంటివి తీసుకోవడం మంచిది. ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్‌ సలహా మేరకు చిన్నగా నడక, ధ్యానం, చిన్నచిన్న వ్యాయామాలు, యోగా, ప్రాణాయామం వంటివి చెయ్యడం మంచిది. ఈ సమయంలో ఆందోళన చెందకుండా ఎక్కువగా మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవటం మంచిది. దీనికి కుటుంబసభ్యుల సహకారం అవసరం. మనసుని ఆనందంగా ఉంచుకునప్పుడు బిడ్డ యొక్క మానసిక పెరుగుదల కూడా బాగుంటుంది.
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో హైదర్‌నగర్‌
హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement