బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ పరిచయం అక్కర్లేని పేరు. ఆమె నటించిన కుచ్ కుచ్ హోతా హై (1998) చిత్రంతో క్రేజ్ తెచ్చుకుంది. రాజా కీ ఆయేగీ బారాత్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత సూపర్ హిట్ చిత్రాలతో అలరించింది. వరుస సినిమాలతో బాలీవుడ్‌లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. ఎన్నో సినిమాలకు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు ఆమె. ఇప్పటికీ ఏడు ఫిలింఫేర్ పురస్కారాలు ఆమె దక్కించుకున్నారు.
అయితే తాజాగా ఆమె కెరీర్‌లో ఎదురైన ఓ సంఘటనను అభిమానులతో పంచుకున్నారు. సినిమాల్లో నటనతో పాటు స్త్రీలు, చిన్నారులు ఎదుర్కొంటున్న వివక్షపై ఆమె ఎన్నోసార్లు మాట్లాడారు. సినీ నిర్మాత ఆదిత్య చోప్రాను 2014లో వివాహం చేసుకున్నారామె. ఏడాది తర్వాతే ఓ పాపకు కూడా జన్మనిచ్చారు. ఆ తర్వాత నటనకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. అయితే ప్రసవ సమయంలో రాణీ ముఖర్జీకి ఎదుర్కొన్న చేదు సంఘటనను గుర్తు చేసుకున్నారు. మొదటిసారి బిడ్డను చూసినప్పుడు తన ఫీలింగ్‌ను ఆమె పంచుకున్నారు.
రాణి ముఖర్జీ మాట్లాడుతూ.. 'నా కుమార్తె నెలలు నిండకుండానే పుట్టింది. నిర్ణీత సమయానికి రెండు నెలల ముందే బిడ్డకు జన్మనిచ్చా. పాప అప్పుడు చాలా సన్నగా ఉంది. దీంతో నేను తీవ్ర ఒత్తిడికి గురయ్యా. ఒక తల్లిగా నాకు చాలా బాధ కలిగింది. పాపను దాదాపు 7 రోజులు ఐసీయూలో ఉంచారు. దీంతో అక్కడ 15 రోజులు ఉండాల్సి వచ్చింది. కానీ అదృష్టవశాత్తూ దేవుడి దయతో నా బిడ్డ క్షేమంగానే తిరిగొచ్చింది. మన జీవితంలో ఒకరిని ఎందుకు అంతగా ప్రేమిస్తామో మొదటిసారి తెలిసొచ్చింది. ఆ క్షణం నా బిడ్డ కంటే నాకేదీ ముఖ్యం కాదనిపించింది." అని అన్నారు. రాణీ ముఖర్జీ తన కుమార్తెకు ఆదిరా అనే పేరు పెట్టారు.
కాగా.. ఆదిరాకు జన్మనిచ్చిన తర్వాత రాణి నటనకు విరామం ఇచ్చింది. ఆ తర్వాత ఆమె 2018లో హిచ్కీ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. అంతే కాకుండా మర్దానీ 2, బంటీ ఔర్ బబ్లీ 2, ఇటీవలే మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే వంటి చిత్రాలలో కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment