Rani Mukherji
-
నెలలు నిండకుండానే ప్రసవం.. తీవ్ర ఒత్తిడికి గురయ్యా: స్టార్ హీరోయిన్
బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ పరిచయం అక్కర్లేని పేరు. ఆమె నటించిన కుచ్ కుచ్ హోతా హై (1998) చిత్రంతో క్రేజ్ తెచ్చుకుంది. రాజా కీ ఆయేగీ బారాత్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత సూపర్ హిట్ చిత్రాలతో అలరించింది. వరుస సినిమాలతో బాలీవుడ్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. ఎన్నో సినిమాలకు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు ఆమె. ఇప్పటికీ ఏడు ఫిలింఫేర్ పురస్కారాలు ఆమె దక్కించుకున్నారు. అయితే తాజాగా ఆమె కెరీర్లో ఎదురైన ఓ సంఘటనను అభిమానులతో పంచుకున్నారు. సినిమాల్లో నటనతో పాటు స్త్రీలు, చిన్నారులు ఎదుర్కొంటున్న వివక్షపై ఆమె ఎన్నోసార్లు మాట్లాడారు. సినీ నిర్మాత ఆదిత్య చోప్రాను 2014లో వివాహం చేసుకున్నారామె. ఏడాది తర్వాతే ఓ పాపకు కూడా జన్మనిచ్చారు. ఆ తర్వాత నటనకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. అయితే ప్రసవ సమయంలో రాణీ ముఖర్జీకి ఎదుర్కొన్న చేదు సంఘటనను గుర్తు చేసుకున్నారు. మొదటిసారి బిడ్డను చూసినప్పుడు తన ఫీలింగ్‌ను ఆమె పంచుకున్నారు. రాణి ముఖర్జీ మాట్లాడుతూ.. 'నా కుమార్తె నెలలు నిండకుండానే పుట్టింది. నిర్ణీత సమయానికి రెండు నెలల ముందే బిడ్డకు జన్మనిచ్చా. పాప అప్పుడు చాలా సన్నగా ఉంది. దీంతో నేను తీవ్ర ఒత్తిడికి గురయ్యా. ఒక తల్లిగా నాకు చాలా బాధ కలిగింది. పాపను దాదాపు 7 రోజులు ఐసీయూలో ఉంచారు. దీంతో అక్కడ 15 రోజులు ఉండాల్సి వచ్చింది. కానీ అదృష్టవశాత్తూ దేవుడి దయతో నా బిడ్డ క్షేమంగానే తిరిగొచ్చింది. మన జీవితంలో ఒకరిని ఎందుకు అంతగా ప్రేమిస్తామో మొదటిసారి తెలిసొచ్చింది. ఆ క్షణం నా బిడ్డ కంటే నాకేదీ ముఖ్యం కాదనిపించింది." అని అన్నారు. రాణీ ముఖర్జీ తన కుమార్తెకు ఆదిరా అనే పేరు పెట్టారు. కాగా.. ఆదిరాకు జన్మనిచ్చిన తర్వాత రాణి నటనకు విరామం ఇచ్చింది. ఆ తర్వాత ఆమె 2018లో హిచ్కీ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. అంతే కాకుండా మర్దానీ 2, బంటీ ఔర్ బబ్లీ 2, ఇటీవలే మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే వంటి చిత్రాలలో కనిపించింది. -
అమీర్, అనుష్క ఎందుకు నోరు విప్పలేదు?
బాలీవుడ్ సంచలన హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి బాలీవుడ్ స్టార్లపై మండిపడ్డారు. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును ఆమె ప్రస్తావిస్తూ.. సుశాంత్‌తో కలిసి నటించిన వాళ్లు దీనిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. హీరో అమీర్ ఖాన్, హీరోయిన్ అనుష్క శర్మ.. సుశాంత్‌తో కలిసి 'పీకే' చిత్రంలో పని చేశారని తెలిపారు. ఈ ఇద్దరూ సుశాంత్‌కు న్యాయం జరగాలనో లేదా సీబీఐ విచారణ జరపాలనో ఎందుకు డిమాండ్ చేయలేదని నిలదీశారు. వీళ్లే కాకుండా పీకే సినిమా దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, సుశాంత్ సినిమాలను తెరకెక్కించిన నిర్మాత ఆదిత్య చోప్రా, రాణి ముఖర్జీలపై కూడా ఆమె అసహనం వ్యక్తం చేశారు. వీళ్లందరినీ బాలీవుడ్ రాకెట్ ముఠాగా పరిగణించారు. (టర్కీ ప్రథమ మహిళతో ఆమిర్.. నెటిజన్ల ఫైర్) ఒక్కరు సైలెంట్‌గా ఉన్నా అందరూ అదే ఫాలో అవుతారు "ఈ రాకెట్ ఎలా పని చేస్తుందో తెలుసా? ఒక్కరు నోరు విప్పకపోయినా మిగతా అందరూ మౌనంగా ఉంటారు. అలా.. ఎవరూ సీబీఐ దర్యాప్తు జరగాల్సిందేనని డిమాండ్ చేయడానికి ముందు రాలేదు. ఇదెలా ఉంటుందంటే.. అమీర్ ఖాన్ ఏమీ మాట్లాడలేదనుకో, అనుష్క కూడా నాకెందుకొచ్చిందిలే అని సైలెంట్‌గా ఉంటారు. అలానే రాజ్‌కుమార్ హిరానీ, ఆదిత్య చోప్రా, అతని భార్య రాణి ముఖర్జీ కూడా నోరు మెదపరు. వీళ్లదంతా ఓ గ్యాంగ్" అని కంగనా మండిపడ్డారు. (అమిర్ నాకు పెట్టకుండానే తిన్నారు: దీపిక) మీకు మాటలే కరువయ్యాయా? "మీకు ఎక్కడో చోట తప్పు చేశామన్న అపరాధ భావన లేకపోతే మీ సహనటుడు, ఇండస్ట్రీలోని ముఖ్య వ్యక్తి సుశాంత్ మరణంపై ఎందుకు స్పందించట్లేదు? అంటే మీకు ఈగనో, దోమనో చనిపోయినట్లు అనిపిస్తుందా? అతని కోసం చెప్పేందుకు మీకు మాటలే కరువయ్యాయా? అక్కడ అతని కుటుంబం రోదిస్తోంది. కనీసం వారి పట్ల మీరు సానుభూతి కూడా చూపించలేరా? సీబీఐ దర్యాప్తు చేయాల్సిందేనని గొంతెత్తి ప్రశ్నించలేరా? ఇందులో మీరు ఏ ఒక్కటీ చేయలేదు, ఎందుకు? ఎందుకని ఇంతలా భయపడుతున్నారు? జరుగుతున్న పరిణామాలన్నింటినీ దేశమంతా చూస్తోంది" అని ఆమె పేర్కొన్నారు. కాగా సుప్రీం కోర్టు సుశాంత్ బలవన్మరణం కేసును సీబీఐకి అప్పగించాలని కంగనా మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. అనంతరం ఇదే డిమాండ్ అంతటా వినిపించడంతో ఎట్టకేలకు సుప్రీం కోర్టు సీబీఐ దర్యాప్తుకు అంగీకరించిన విషయం తెలిసిందే. (సుశాంత్ కేసు సీబీఐకే) -
చైనాలో ‘రాణీ’స్తోన్న హిచ్కీ
కెరియర్ తొలి నాళ్లలో గ్లామర్ పాత్రలకే పరిమితమైన హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం తమ పాత్రకు ప్రాధాన్యమున్న చిత్రాల్లోనే నటిస్తున్నారు. ఈ కోవలోకే వస్తారు నటి రాణీ ముఖర్జీ. ఈ ఏడాది మార్చిలో ‘హిచ్కీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రాణి. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు రాబట్టింది. ఇండియాలో ఈ చిత్రం రూ. 76 కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల సరసన నిలిచింది. ఈ చిత్రం ఇప్పుడు మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. చైనాలో ఈ నెల 12న విడుదలయిన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ 100 కోట్ల మార్క్‌ను దాటేసినట్లు రాణి ముఖర్జీ తెలిపారు. కంటెంట్ ఉన్న సినిమాకు భాషతో, ప్రాంతంతో సంబంధం లేదని ‘హిచ్కీ’ మరోసారి నిరూపించిందని ఆమె పేర్కొన్నారు. సిద్థార్థ్ మల్హోత్రా దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో రాణి టీచర్ కావాలనే బలమైన లక్ష్యం...కానీ నోరు తెరచి ఏ మాట్లాడినా వింత శబ్దాలు చేసే జబ్బు...అన్ని అడ్డంకులు దాటుకొని లక్ష్యం చేరుకునే మహిళ నైనా మాథుర్ పాత్రలో ఆకట్టుకున్నారు. గతంలో ఆమిర్ ఖాన్ ‘ధూమ్3’, ‘దంగల్’, ‘పీకే’, ‘సీక్రెట్ సూపర్ స్టార్స్’, సల్మాన్ ఖాన్ ‘బజరంగి భాయిజాన్’ చిత్రాలు చైనా బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని సాధించాయి. -
‘ఆయన్ని అందుకే పెళ్లి చేసుకున్నా’
బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ హిచ్కి సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తోంది. కెమెరా కంటికి దూరంగా ఎక్కడో ఇటలీలో దర్శక నిర్మాత ఆదిత్య చోప్రాను వివాహం చేసుకున్న ఆమె ఇక సినిమాలకు గుడ్ బై చెప్పినట్లేనని అంతా భావించారు. అయితే నాలుగేళ్ల తర్వాత హిచ్కితో రీఎంట్రీ ఇచ్చిన ఆమె అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.‘ఆదిత్యా చోప్రాను వివాహం ఎందుకు చేసుకున్నానని చాలా మందికి అనుమానాలు ఉండేవి. ఆయన నుంచి నాకు కావాల్సిన ముఖ్యమైంది దక్కింది. అదే గౌరవం. ఏ మహిళ అయినా తన గౌరవాన్ని కాపాడి, ప్రేమను పంచే వ్యక్తి జీవిత భాగస్వామి కావాలని కోరుకుంటుంది. ఆదిత్యలో అది నేను పొందాను. అందుకే ఆయన్ని వివాహం చేసుకున్నానని అని రాణీ తెలిపింది. ఇక ప్రస్తుతం ఆనందంగా ఉండటానికి కారణం సినిమా సక్సెస్ ఒక్కటే కాదని.. తన కూతురు ఆదిరా కూడా ఓ కారణమని ఆమె చెప్పుకొచ్చారు. ఓ గృహిణిగా, ఓ బిడ్డకు తల్లిగా మాత్రమే తనలో మార్పు వచ్చిందని.. నటిగా తనలో ఎలాంటి మార్పు రాలేదని ఆమె పేర్కొన్నారు. హిచ్కి ఇచ్చిన జోష్‌తో కెరీర్‌ను ముందుకు సాగిస్తానని రాణీ ప్రకటించారు. -
జనవరిలో బిడ్డకు జన్మనివ్వనున్న రాణీముఖర్జీ
చాలా రోజులుగా వెండితెరకు దూరంగా ఉంటున్న బాలీవుడ్ నటి రాణీముఖర్జీ తల్లికాబోతుంది. స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించిన రాణీ, నిర్మాత ఆదిత్య చోప్రాను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. కొద్ది రోజులుగా ఫ్యామిలీ బాద్యతలతో బిజీగా ఉన్న రాణీ, ఇటీవలే తన భర్తతో కలిసి ఫారిన్ టూర్ ముగించుకొని ఇండియాకు తిరిగొచ్చింది. అయితే ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న రాణీ ముఖర్జీ తమ్ముడి భార్య, రాణీ తల్లీ కాబొతుంది అన్న విషయాన్ని వెల్లడించింది. ఈ జనవరిలో రాణీముఖర్జీ బిడ్డకు జన్మనివ్వబోతుందని తెలిపింది. అయితే ఈ విషయంపై రాణీ ముఖర్జీ దంపతులు మాత్రం ఇంత వరకు స్పందించలేదు. -
లండన్ లో కైలాశ్, రాణి
-
ఇటలీలో రాణి ముఖర్జీ, ఆదిత్య చోప్రాల వివాహం!
ఇటలీలో బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ, ప్రముఖ దర్శకుడు, యష్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రాల వివాహం నిరాడంబరంగా జరిగింది. రాణి, ఆదిత్యల వివాహానికి స్నేహితులు, కుటుంబ సభ్యులు కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. గత కొద్దికాలంగా తమ మధ్య ఉన్న సంబంధాన్ని రాణీ, ఆదిత్యలు గోప్యంగా ఉంచారు. 'ఈ రోజు చాలా సంతోషంగా ఉంది అని రాణీ ముఖర్జీ అన్నారు. అయితే ఇలాంటి ఆనంద సమయంలో తన మామ యాష్ చోప్రా లేకపోవడం విచారంగా ఉందన్నారు. ఐనా తమకు యష్ అంకుల్ దీవెనలుంటాయి' రాణి ఓ ప్రకటనలో తెలిపారు. వివాహం తన జీవితంలో మరిచిపోలేనటువంటి సంఘటన అని రాణి అన్నారు. రాజ్ కి ఆయేగి బరాత్ తో బాలీవుడ్ లో ప్రవేశించిన రాణి ముఖర్జీ గులాం, కుచ్ కుచ్ హోతా హై, బంటీ ఔర్ బబ్లీ, కభీ అల్విదా నా కెహ్నా చిత్రాల్లో నటించింది. -
కింగ్ ఆఫ్ రొమాన్స్‌కి క్వీన్స్ నీరాజనం
‘దిల్ తో పాగల్ హై’ తీసినప్పుడు యశ్ చోప్రా వయసు 65 ఏళ్లు. కృష్ణా రామా అనుకునే ఆ వయసులో ఓ టీనేజర్లా మారిపోయి అద్భుతంగా ఆ సినిమాలో ప్రణయ రసాన్ని ఆవిష్కరించారు. గత ఏడాది అక్టోబర్ 21న ఆయన పరమపదించారు. సెప్టెంబర్ 27 ఆయన 81వ పుట్టిన్రోజు. ఈ సందర్భంగా ఆయన జయంతి వేడుకలను ముంబైలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. యశ్ సినిమాల్లో నటించిన పలువురు నటీనటులు, ఇతర తారలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. షారుక్ ఖాన్, మాధురీ దీక్షిత్ , జూహి చావ్లాషారుక్ ఖాన్, మాధురీ దీక్షిత్ రేఖశ్రీదేవి , రాణి ముఖర్జీకత్రినా కైఫ్మాధురీ దీక్షిత్ప్రీతి జింతా , జూహి చావ్లాఅనుష్కశర్మపరిణీతి చోప్రా , షారుక్ ఖాన్