‘ఆయన్ని అందుకే పెళ్లి చేసుకున్నా’ | Rani Mukerji Reveals Secrets About Her Marriage | Sakshi
Sakshi News home page

ఆయన్ని అందుకే పెళ్లి చేసుకున్నా: రాణీముఖర్జీ

Published Fri, Mar 30 2018 3:58 PM | Last Updated on Fri, Mar 30 2018 5:31 PM

Rani Mukerji Reveals Secrets About Her Marriage - Sakshi

రాణీ ముఖర్జీ (తాజా చిత్రం)

బాలీవుడ్‌ నటి రాణీ ముఖర్జీ హిచ్‌కి సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తోంది. కెమెరా కంటికి దూరంగా ఎక్కడో ఇటలీలో దర్శక నిర్మాత ఆదిత్య చోప్రాను  వివాహం చేసుకున్న ఆమె ఇక సినిమాలకు గుడ్‌ బై చెప్పినట్లేనని అంతా భావించారు. అయితే నాలుగేళ్ల తర్వాత హిచ్‌కితో రీఎంట్రీ ఇచ్చిన ఆమె అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.‘ఆదిత్యా చోప్రాను వివాహం ఎందుకు చేసుకున్నానని చాలా మందికి అనుమానాలు ఉండేవి. ఆయన నుంచి నాకు కావాల్సిన ముఖ్యమైంది దక్కింది. అదే గౌరవం. ఏ మహిళ అయినా తన గౌరవాన్ని కాపాడి, ప్రేమను పంచే వ్యక్తి జీవిత భాగస్వామి కావాలని కోరుకుంటుంది. ఆదిత్యలో అది నేను పొందాను. అందుకే ఆయన్ని వివాహం చేసుకున్నానని అని రాణీ తెలిపింది. ఇక ప్రస్తుతం ఆనందంగా ఉండటానికి కారణం సినిమా సక్సెస్‌ ఒక్కటే కాదని.. తన కూతురు ఆదిరా కూడా ఓ కారణమని ఆమె చెప్పుకొచ్చారు.

ఓ గృహిణిగా, ఓ బిడ్డకు తల్లిగా మాత్రమే తనలో మార్పు వచ్చిందని.. నటిగా తనలో ఎలాంటి మార్పు రాలేదని ఆమె పేర్కొన్నారు. హిచ్‌కి ఇచ్చిన జోష్‌తో కెరీర్‌ను ముందుకు సాగిస్తానని రాణీ ప్రకటించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement